రాజకీయం గా సరైన పంథా వుంటే వ్యక్తిగత స్వార్డాలు ను అధిగమించ వచ్చు. ఎంగేల్స్ జర్మనీ విప్లవ పరాజయం గురించి చెప్తూ" ఈ విప్లవానికి పరాజయానికి కారణాలు, తప్పులు ద్రోహుల లో అన్వేషించ కూడదని, ఈ అల్లకల్లోలం లో చిక్కుకున్న ప్రతి దేశంలోని సహజ స్థితి, దేశ పరిస్థితులు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవాలి"( from revolution and counter revolution in Germany ) Engels.ప్రస్తుత దేశ విప్లవ పరిస్తితి కి కారణాలను ఆయా విప్లవ పార్టీ ల నాయకత్వ అవలక్ష నాలే కారణం అంటూ పార్టీ ల నుండి వెనుతిరిగి న చాలా మంది ఆరోపణ.ఇంకా కొంత మంది కులవివక్ష,అగ్రకులాలు నాయకత్వం పై నిండవెస్తూ అంబేడ్కర్ వాదం లో వెదుకుతున్నారు. అగ్రకులాలు,అగ్రనాయకత్వం యొక్క వ్యక్తిగత అవలక్షణాలు కొత్తగా పుట్టుకు వచ్చినవి కావు,వారిలో అంతర్గతంగా వుండి,పార్టీ సిద్ధాంత బలహీనత మూలంగా,update కానీ మూలంగా బహిర్గతం అయి,బలపడి పార్టీలో పైచేయి సాధించి తాయి.క్రమంగా పార్టీ లు బలహీన పడుతాయి. ఒక పార్టీ లో నాయకత్వం అన్యవర్గ అవలక్సా నాలు,పెరుగుతున్నాయి అంటే కారణం ఆనాటి సమాజ పరిస్థితికి పార్టీ సిద్దాంతం సరిపోవడం లేదు అని అర్దం. ప్రస్తుతం నూతన ప్రజాస్వామిక విప్లవం కు కాలం చెల్లిన మూలంగా అవలక్షణాలు తో క్షినించి పోతున్నాయి. పెట్టుబడి దారీ విధానం కు వ్యతిరేకంగా సోషలిస్ట్ విప్లవ మార్గం ద్వారా ముందుకు వెళ్తే ఈ అవలక్షణాలు విప్లవ మార్గం లో తుడుచుకు లేదా పక్కకు నెట్టి మరల పూర్వ స్థితి కి ,విప్లవ విజయానికి వెళ్ళవచ్చు.Naxalbari ప్రారంభం లో 90 ల వరకు ,ml పార్టీ లలో ఎన్ని చీలికలు,ముఠాలు వున్నా,అవలక్షణాలు వున్నా అన్ని రకాల పార్టీ లు అభివృద్ధి చెందాయి.కారణం నూతన ప్రజాస్వామిక విప్లవం కు సంబందించి భూస్వామ్య అవశేషాలు వుండడం వల్ల వాటికి వ్యతిరేకంగా ప్రజలు పార్టీ లకు అనుగుణంగా పోరాటాలు చేశారు.ప్రజల తోడ్పాటు లభించింది. 90 వరకు పోరాటాల ఫలితంగా భూస్వామ్య అవశేషాలు పోవడం తో ,పోరాటాలకు అవకాశం లేదు కనుక ,దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంత అప్డేట్ కాలేదు కనుక క్రమంగా క్షినించడం మొదలు అయింది. నాయకత్వ అవినీతి మూలంగానే క్షీణించడం జరిగితే మావోయిస్ట్ పార్టీ కూడా ఎందుకు బలహీన పడుతున్నది. కారణం నూతన ప్రజాస్వామిక విప్లవం కు కాలం చెల్లి,పెట్టుబడి దారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ దశ వుండడం. Get link Facebook X Pinterest Email Other Apps April 27, 2023 Read more