గద్దర్ తండ్లాటకు
*గద్దర్ తండ్లాటకు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ పంథానే సరైన మార్గం!!* గద్దర్ తండ్లాటకు పరిష్కారం సోషలిస్టు విప్లవ పంథానే సరియైనది. సోషలిస్టు విప్లవ పంథా ఎందుకు!? నాడు గద్దర్ తొలినాళ్లలో వున్న భూస్వామ్య, ఫ్యూడల్ విధాన అవశేషాలు నేడు లేవు. సుదీర్ఘ నక్సల్బరీ విప్లవ పోరాటాలు, ప్రజాస్వామిక ఉద్యమాల మూలంగా, సామ్రాజ్యవాద పెట్టుబడి అభివృద్ధి మూలంగా 90వ దశకం మధ్యలో గణనీయంగా పెట్టుబడి గ్రామీణ వ్యవసాయ రంగాన్ని పెట్టుబడి దారీ సంబంధాలలోకి మార్చి వేశాయి. ఉద్యమాల వల్ల భూస్వాములు పట్టణాలకు, నగరాలకు పారిపోవడం... అక్కడే పెట్టుబడిదారీ విధానంలో తమ వ్యాపారాలు, పరిశ్రమల ద్వారా వచ్చే సంపద భూస్వామ్య వ్యవసాయానికి మించి కొన్ని రెట్లలో వుండడం, రియల్ ఎస్టేట్ లో విపరీత లాభాలు రావడం వల్ల అక్కడే సెటిల్ అయ్యారు. నామ మాత్ర భూ సంబంధాలు మిగిలాయి. అవి పెట్టుబడి సంబంధాలుగా మారాయి. ఈ కాలంలో గ్రామీణ వృత్తులు నశించి, వృత్తి కారులు పట్టణాలకు వలసలు వెళ్లి పట్టణ కార్మికులుగా మారి పోయారు. "పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటనే సాక్ష్యం". మారుతున్న పెట్టుబడిదారీ...