Posts

Showing posts from May, 2024

ఎందుకు? సోషలిస్టు విప్లవం రచయిత: షేక్ అబ్దుల్ కరీం ఫోన్ నెంబర్: 9396813091 ప్రచురణ: కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (CUC) అడ్రస్: ఇంటి నెంబర్: 2-7-96/13/A, సైనిక్ పురి కాలనీ, సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం. ప్రతుల సంఖ్య: 300 పేజీలు: వెల: మొదటి ముద్రణ: జూన్ 2024. కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ ముందుమాట నామాట ఇలాంటి వ్యాసాలు రాస్తానని అనుకోలేదు. అలాంటి అవసరం వస్తుందని అనుకోలేదు. మొదట రాడికల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1984 లో ఒకటో రెండో రాడికల్ వాయిస్ లు రాసినట్టు గుర్తు. పూర్తికాలం కార్యకర్తగా పీపుల్స్ వార్ పార్టీలో ఉన్న కాలంలో కూడా రాయలేదు. ఇలాంటి రాజకీయ రచనలు రాయాల్సిన అవసరం రాలేదు. కేవలం ఇంజనీరింగ్ కు సంబంధించిన రచనలు రాయాలి అనుకునేవాన్ని. పది సంవత్సరాల పూర్తికాలం తర్వాత ఆనాడు పార్టీలో కొండపల్లి సీతారామయ్య సంక్షోభం సందర్భంగా నేను పార్టీ నుంచి బయటికి వచ్చే సందర్భంలో ఎందుకు వెళ్లాల్సి వస్తుందో., విమర్శ ఆత్మవిమర్శ పార్టీకి లేఖ రాసి 1994 లో బయటకు వచ్చాను. ఆ తర్వాత సుదీర్ఘకాలం కేవలం ఇంజనీరింగ్ కు సంబంధించిన రెండు మూడు ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసిన అనుభవం ఉంది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ ను కాబట్టి. పార్టీ నుంచి విడిపోయిన తర్వాత సాధారణ జీవితం కోసం (బూర్జువా సర్టిఫికెట్ గుర్తింపు) ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి ప్రైవేటుగా ఇంజనీరింగ్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వలన కేవలం డిప్లొమా లెవల్ సర్టిఫికెట్ కు మాత్రమే నా ఆర్థిక పరిస్థితి సరిపోయింది. ఆ తర్వాత డిగ్రీ లెవల్ కొన్ని పరీక్షలు రాశాను. జీవనం కోసం స్కూల్ టీచర్ గా.., తర్వాత ఐటిఐ ఇన్ స్ట్రక్టర్ గా స్వల్ప కాలం పనిచేసాను. సరిపోని జీతం వలన, ఇతర కారణాల వలన స్వయం ఉపాధి కొరకు స్వంతంగా చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేసుకుని, జీవనం కొనసాగిస్తున్నాను. ఆనాటి నిర్భంధ కాలం మరియు పార్టీకి నాకు ఎంతో కొంత సంధానకర్తగా ఉన్న ఆజం అలీ హత్య తర్వాత పార్టీతో కొద్ది పాటి లింక్ కూడా తెగిపోయింది. దీంతో 2012, 2013 వరకు ఒంటరిగానే మిగిలిపోయాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చర్చల సందర్భంగా పార్టీపై ఆసక్తి కలిగింది. కొండపల్లి సీతారామయ్య (కేఎస్) సంక్షోభం మూలంగా బయటికి రావాల్సి వచ్చినప్పటికీ., మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తో విలీనం అయినందుకు, దేశవ్యాప్తంగా ఒకే పార్టీ ఏర్పడడం మంచి పరిణామంగా భావించాను. సరే, వారయినా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుక వెళ్తున్నారని సంతోషపడేవాడిని. ఎప్పటికైనా మరల నాకు పార్టీ కలవక పోతుందా అనే ఆశ వుండేది. కానీ, వైఎస్సార్ ప్రభుత్వం చర్చల ద్రోహంతో పార్టీని అణచివేయడం చాలా మనస్తాపానికి లోనయ్యాను. పార్టీ కార్యకలాపాలు పత్రికల ద్వారా వచ్చే వార్తలు తప్ప ఎలాంటి విషయాలు తెలిసేవి కావు. ఈ కాలంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం గద్దర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటైంది. ప్రజా సంఘాల ద్వారా పరిచయంతో పాత మిత్రుడు, జర్నలిస్ట్ మట్టన్న ద్వారా పరిచయాలు లభించడంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం తోపాటు ప్రజా సంఘాలతో కలిసే అవకాశం వచ్చింది. ఈ కాలంలోనే తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో పనిచేయాలని చేరడం జరిగింది. ‌వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చల కాలం నుంచే రాజకీయాలపై పునః ఆసక్తి కలిగింది. దీంతో మార్క్సిస్టు, లెనినిస్టు ఇతర మూల గ్రంధాల అధ్యయనం ప్రారంభించాను. పార్టీ సాహిత్యం మాత్రం దొరక లేదు. ఒక నాడు లైబ్రరీలో పేపర్లు చూస్తుండగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం భూస్వాములు కావలెను అని.., భూస్వాములను వెతుక్కుంటూ నక్సల్స్ దండకారణ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్వాములు లేరు కాబట్టి ఉద్యమం చేయాల్సిన అవసరం లేక వలస వెళ్లారని అందులో ఉంది. గ్రామాల్లో భూస్వామ్య సంబంధాలు సన్నగిల్లాయి అని.., అదే కాలంలో గోరటి వెంకన్న రాసిన "పల్లె కన్నీరు పెడుతుందో..." అనే పాట జోరుగా మార్మోగిపోతోంది. ఉద్యమం వెనుక పట్టు పడటం, ఇవన్నీ ఆలోచనల ప్రభావంతో ఏదో మారిందనే భావనతో నిశితంగా పరిశీలించడం., సాహిత్యాన్ని పోల్చి చూస్తూ పునరాలోచనలో పడ్డాను. నాకు పార్టీకి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు కాకుండా ఇతర సిద్ధాంత సమస్య ఉన్నట్లు స్పష్టమవుతూ వచ్చింది. నేను అధ్యయనం చేయడానికి మూల కారణం నేను ఎందుకు ఉద్యమం నుంచి బయటికి రావాల్సి వచ్చింది. కేఎస్ సంక్షోభానికి మూల కారణం ఏమిటి? అంత పెద్ద నాయకుడు తనకు ఒక వర్గం కూడా లేకుండా అంత చిత్తుగా ఎలా ఓడింపబడ్డాడు.!? సరైన జవాబు కోసం అన్వేషణ. 2014 లో నల్లగొండకు వెళ్లి వచ్చేటపుడు నవ తెలంగాణ బుక్ స్టాల్ లో కొంత సమయం గడిపి పుస్తకాలు కొనేవాడిని. ఆ సందర్భంగా “మేం మళ్ళీ వస్తాం" తోలేటి జగన్మోహన్ రావు గారి పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో నా అన్వేషణకు మన పరిమిత సాహిత్యం కంటే తెలియని విశాలమైన సాహిత్యం ఉందని తెలిసింది. అంతే కాదు, కేఎస్ సంక్షోభానికి శాస్త్రీయ మార్క్సిస్టు సమాధానం దొరికింది. 20 సంవత్సరాల అన్వేషణకు సమాధానం దొరికింది. కారణం అది నూతన ప్రజాస్వామిక విప్లవ సిద్ధాంతం లోనే ఉంది. కేఎస్ విప్లవ వారసత్వం అంటే నేడు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ మార్గమే. ఆ మార్గంలో నడిచే వారే నిజమైన కేఎస్ విప్లవ వారసులని ఒక నిర్ధారణకు రాగలిగాను. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) లో సభ్యుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ దగ్గర నుంచి ప్రజా సంఘాల ఆచరణను, విప్లవోద్యమాన్ని, ఇతర ఎంఎల్ పార్టీల ఉద్యమాలను అధ్యయనం చేయడానికి వీలుపడింది. 2012 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న క్రమంలో సూర్యాపేటలో కేసీఆర్ భారీ బహిరంగ సభ మా కాలనీ పక్కనే జరిగింది. ఆ సందర్భంగా బుక్ స్టాల్ పెట్టారు. అందులో చూస్తుండగా సాహు (శనిగరము వెంకటేశ్వర్లు) పై ఒకరు రీసెర్చ్ చేసిన పుస్తకం దొరికింది. తెచ్చి ఆసక్తిగా చదివి భారంగా అలానే పడుకున్నాను. లేచిన తర్వాత ముఖంలో మార్పులు ఏర్పడ్డాయి. ఒక వారం తర్వాత ముఖం ఒక పక్క వంకర పోయింది. డాక్టర్ పెరాలసిస్ చిన్న భాగంలో వచ్చింది. యు లక్కీ అన్నాడు. బిపి, షుగర్ లు పెరగడం వల్ల వచ్చిందని. పుస్తకం చదువుతూ చాలా బాధకు, ఉద్వేగానికి లోనయ్యాను. కారణం సాహు పై ఏర్పడిన మొదటి అనుబంధం. నేను పుట్టిన ఊరు తెలంగాణ సాయుధ పోరాటల గడ్డ (పోలుమల్ల గ్రామం, నూతన్ కల్ మండలం, సూర్యాపేట జిల్లా) కుటుంబం, గ్రామ నేపథ్యం అంతా కమ్యునిస్ట్ నే. మిర్యాలగూడలో ఇంటర్ ప్రారంభం నుంచే రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్ యు) తో పరిచయం. తోటి స్నేహితులందరూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) లో ఉండగా నేను మాత్రం ఆర్ఎస్ యు కు అట్రాక్ట్ అయ్యాను. నన్ను పరిచయం చేసింది ఆజం అలీ. అతను కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. నేను ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్. ఇంటర్ తర్వాత నేను ఇంజనీరింగ్ కోసం, తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కోసం హైదరాబాద్ వెళ్ళాము. ఉస్మానియా యూనివర్సిటీలో అతనికి సీట్ లభించలేదు. అలానే సైఫాబాద్ హాస్టల్ లో ఆర్ఎస్ యు తో పరిచయం చేసుకున్నాము. హాస్టల్ సి1 రూం ఆర్ఎస్ యు కు కేంద్రం. జన్ను (జనార్థన్), చిన్న వెంకట్, పెద్ద ప్రసాద్ (NGDC)… దామోదర్, మల్లారెడ్డి… అంతా అక్కడే పరిచయం అయ్యారు. ఒక నెల రోజులు బయట రూం లో ఉన్నాం. తర్వాత పూర్తిగా ఈ సెంటర్ లోనే ఉండి పోయాను. జన్ను సైఫాబాద్ కేంద్రంలో మాకందరికీ సీనియర్. అతని నాయకత్వం లోనే మేమంతా పని చేసే వాళ్లం. మొదటి పరిచయం నుంచి పూర్తి కాలం వెళ్లే వరకు జన్ను ను విడిచి ఏనాడూ ఉండలేదు. ఆ హాస్టల్ లోనే అప్పుడు సాహు మాతో కొద్దికాలం ఉన్నాడు. మాతో కలిసి ఉండేవాడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అతని సమక్షంలోనే తొలిసారి చదివాము. కొమురం భీమ్ నవల, చెంఘీజ్ ఖాన్ నవలలు చదవడం చర్చ కూడా చేసాము. సి1 రూం పూర్తిగా ఆర్ఎస్ యు ఆఫీసుగా ఉండేది. పాటలు, సాహిత్యం అన్నిరకాల చర్చలు జన్ను, చిన్న వెంకట్, ప్రసాద్, నేను… ఇంకా కొందరు మిత్రులు, దాదాపు 3 నెలలు (కళాశాల ఎన్నికలు) వరకు ఉన్నాడు. తర్వాత కొంత కాలానికి ఏఐఆర్ఎస్ఎఫ్ మహా సభలు తర్వాత పూర్తి కాలం పార్టీలోకి వెళ్లే టైంలో ఇంటికి వెళ్ళి పోయాడని సుచాయగా విన్నాను. అతను రచించిన "నీ కన్నీరు నా కన్నీరు", నా చిన్ని తమ్ముల్లారా..! శంకరన్న వారసులారా…! అనే పాటలు విరివిగా పాడేవాళ్లం. చివరికి గుండెపోటుతో మరణించాడు. అది చదివిన తర్వాత నా పరిస్థితి కూడా అలానే ఉంది. పార్టీకి దూరమై బాధపడుతూ ఎలా ముగుస్తుందోనని. ఏమి చేయలేని నిస్సహాయత. అలా కాకూడదు. నిస్సహాయంగా ఓటమిని అంగీకరించ కూడదు. “జీనా హైతో మర్నా సిఖో ఖదం ఖదం పర్ లడనా సిఖో" ఎన్ని సార్లు నినదించలేదు. అప్పటి నుంచి కనీసం నా భావాలను రాయాలని అనుకున్నాను. ఏదో రాయాలని మొదలు పెడితే సరైన క్రమంలో రాలేదు. అయినా రెండు మూడు పేజీలు రాసి దానిని ఒక క్రమంలో పేర్చడం ఇలా కొంతకాలం పాటు ప్రయత్నం చేశాను. మొదట రెండు వ్యాసాలు రాశాను. కానీ, ఎవరికి పంపాలో తెలియదు. మూడోది “దక్కన్ ల్యాండ్" మాస పత్రికకు ఇచ్చాను. వెంటనే పత్రికలో వేశారు. వేద కుమార్ గారిది. అప్పుడు అతను టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి సూర్యాపేట చుట్టుపక్కల టీపీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఆ సందర్భంగా రాసిన వ్యాసం నడుస్తున్న తెలంగాణ పత్రికకు పంపాను. అచ్చు వేయలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్నపుడు 2017 లో “నిర్వాసిత సమస్య పెట్టుబడిదారీ విధానం - కమ్యూనిస్టుల దృక్పథం" ను వీక్షణం పత్రికకు పంపించగా నా గురించి విచారించి, వేస్తామని వేయలేదు. అలాగే విప్లవోద్యమంలో కుల సమస్యపై కుల నిర్మూలన సంఘం పత్రికకు పంపాను. అది అంతే. నాకు తెలిసింది ఏమిటంటే విభిన్న ఆలోచనలతో ఉన్న వాటిని సంప్రదాయ పత్రికలు వేయవని. ఈ కాలంలోనే జియో ఫ్రీ డేటా సౌకర్యంతో స్మార్ట్ ఫోన్ కొనడం జరిగింది. ఫేస్ బుక్, వాట్సాప్లు అందుబాటులోకి రావడంతో నా ఆలోచనలు పంచుకోవడం సులభమే కాకుండా విస్తృతంగా ఇతర ప్రాంత వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఇంటర్నెట్ సౌకర్యం వలన ప్రపంచ సాహిత్యం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు విప్లవ పార్టీల సమాచారం ఇలా సమస్తం అందుబాటులోకి రావడం జరిగింది. క్షణాల్లో మన అభిప్రాయాలు మిగతా ప్రపంచానికి చేరే విధంగా ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణల వలన సాధ్యమైంది. ఫేస్ బుక్ లో రంగనాయకమ్మ సాహిత్యం గ్రూప్ పరిచయంతో నా రచనలు పోస్ట్ చేయడం వాటిపై మిత్రులు కామెంట్ రూపంలో చర్చ విస్తృతంగా జరిపారు. బత్తిన శ్రీనివాసరావు, నరేంద్ర మోహన్, యుహెచ్ ప్రీతం..., బాజా సైదులు, శ్రీనివాస్ ప్రతివాడ, విద్యాసాగర్... చాలా మంది మిత్రులు పరిచయమయ్యారు. ఆ క్రమంలోనే ఒకే ఆలోచనలు గల కొద్ది మందితో పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం కొరకు నూతన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో భాగంగా కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ ఏర్పాటైంది. ప్రస్తుతం అర్థ వలస అర్థ భూస్వామ్యం లేదు అని. ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థ అని దున్నేవారికే భూమి నినాదంగా నూతన ప్రజాస్వామిక విప్లవం కాకుండా సంఘటిత, అసంఘటిత, వ్యవసాయ కార్మిక పోరాటాల ద్వారా పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవం పూర్తి చేయాలని చెబుతూ వివిధ సందర్భాలలో ఫేస్ బుక్, వాట్సాప్ లలో రాసిన రచనలను, కామెంట్ రూపంలో రాసిన వాటిని కూర్చి ఒకే పుస్తక రూపంలో తీసుక వచ్చినదే ఈ పుస్తకం. వివిధ రూపాల్లో సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. షేక్ అబ్దుల్ కరీం సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం. ప్రతి విప్లవం యొక్క సమస్య రాజ్యాధికార సమస్యే "ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్యే". ఏ వర్గాల చేతిలో అధికారం కేంద్రీకరించబడి ఉంది.!? లేక ఏ వర్గాలను అధికారం నుండి కూల తోయాలి? ఏ వర్గం లేక ఏ వర్గాలు అధికారాన్ని చేపట్టాలి? ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య ఇదే — లెనిన్. *కామ్రేడ్స్!* మనదేశంలో విప్లవ పోరాట శక్తులకు కొదవలేదు. చరిత్ర అంతా విప్లవ పోరాటాల చరిత్రే. జాతీయ ఉద్యమంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తిరుగుబాటు, గదర్ వీరులు, భగత్ సింగ్, ఆజాద్, బిర్సాముండా, కొమరం భీమ్ మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల నుండి నేటి వరకు వీరోచిత పోరాట చరిత్రే. ఇందులో వంద సంవత్సరముల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర... బలిదానాలతో తెగించి పోరాడుతున్న చరిత్రే. తెగించి పోరాడే వీరులకు ప్రజలకు కొదవలేదు. విరామం లేదు. వేలాది వీరులు అమరులైన చరిత్ర. అయితే, "విప్లవంలో ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్య" అని లెనిన్ అన్నారు. మన విప్లవం ఎటువంటిది.!? ఇది మన ప్రధాన సమస్య. "మన శత్రువు ఎవరు, మిత్రులు ఎవరు? సరిగ్గా గుర్తించామన్నారు." - మావో మనదేశ కమ్యూనిస్టు పార్టీ పుట్టుక నుండి కూడా పై రెండు సమస్యలను గుర్తించడంలో మాటిమాటికి ప్రతి దశలో విఫలం అవుతూ వచ్చింది. జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో గానీ, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట విషయంలో గానీ, ఈ సందిగ్దత మూలంగా పోరాటాలను మధ్యలోనే అనుచితంగా విరమించడం జరిగింది. అటు తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చీలికలు సిపిఐ, సిపిఎం విడిపోవడం. ఈ విడిపోవడంలో కూడా సరైన సిద్ధాంత స్పష్టత మనకు కనబడదు. అటు తర్వాత ఏర్పడిన నక్సల్బరీ ఎమ్.ఎల్. పార్టీల ఆవిర్భావం పోరాటాన్ని ఉన్నత దశకు తీసుకువెళ్లారు. కానీ, అందులో సిద్ధాంత లోపాల మూలంగా ఎన్నో చీలికలు పీలికలు అయిపోయింది. చైనా చైర్మన్ మన చైర్మన్ అతివాద దుందుడుకు వాదం ఒకవైపు, పార్లమెంటరీ మితవాదం రెండోవైపు. ఇక్కడ పూర్తిగా కూలంకషంగా చర్చించడం నా ఉద్దేశం కాదు. ఎన్ని చీలికలు ఏర్పడ్డప్పటికీ మన పోరాట విప్లవ దశను నిర్ధారించడంలో విఫలమైనారు అని చెప్పడం నా ఉద్దేశం. తిరిగి జగిత్యాల పోరాటంతో ఉవ్వెత్తున లేచిన పీపుల్స్ వార్ రాడికల్స్ దండకారణ్యం వరకు విస్తరించారు. కానీ, ఇప్పటి పరిస్థితి రోజురోజుకూ అరణ్యంలోని గిరిజనులకు మాత్రమే పరిమితమవుతుంది ఉనికిని కోల్పోతుంది. ఇప్పటికీ దేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్యం అంటూ నూతన ప్రజాస్వామిక విప్లవం దశలోనే ఉన్నామంటూ దాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఇది అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ కాదు. పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందింది. కాబట్టి సోషలిస్టు విప్లవం కావాలి అనేవారు పెద్ద సంఖ్యలోనే కోరుతున్నారు. చర్చ ఉన్నత దశలో సాగుతుంది. ఎంగెల్స్ జర్మన్ విప్లవ పరాజయం గురించి చెబుతూ "ఈ విప్లవానికి, పరాజయానికి కారణాలు తప్పులు ద్రోహులలో అన్వేషించ కూడదని. ఈ అల్లకల్లోలంలో చిక్కుకున్న ప్రతి దేశంలోని సహజ స్థితి, దేశ పరిస్థితులు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవాలి." (From revolution and counter revolution in Germany) - Angels. వంద సంవత్సరముల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు ఉద్యమం, విప్లవం విజయవంతం కాకపోవడానికి మన దేశ సామాజిక పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే కారణం. మనది పెట్టుబడిదారీ సమాజంగా గుర్తించకపోవడమే కారణం. చాలా మందికి సందేహం ఏమిటంటే? నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం అటు తర్వాత తిరిగి జగిత్యాల నుండి దండకారణ్యం వరకు జరిగింది విప్లవపోరాటం కాదా!? పరిస్థితులు లేకుండా ఎలా జరిగింది.? అవును. భూస్వామ్య అవశేషాలున్న కారణంగానే భౌతిక పరిస్థితులున్న కారణంగానే రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఉద్యమం వల్ల అది పరిష్కారం అయిన వెంటనే తర్వాత దశకు పోరాటం కార్యక్రమం లేదు. కనుక, ఉద్యమం చల్లారింది. అదే సోషలిస్టు విప్లవ కార్యాచరణయితే ఆ ఉద్యమం ఇప్పటికీ నిలిచి ఉండేది. ఈ విషయం కొట్టొచ్చినట్లు కనబడడం లేదా? ప్రధాన లోపం ఇదే ఫ్యూడల్ భూస్వామి పోయిన తర్వాత ప్రజలు ఏమి చేయాలి యుద్ధం ఎవరిపై చేయాలి? నూతన ప్రజాస్వామ్య విప్లవానికి - సోషలిస్టు విప్లవానికి తేడాలు ఏమిటి? నూతన ప్రజాస్వామిక విప్లవంలో జరిగిన లోపం ఏమిటంటే గ్రామాలలో ఫ్యూడల్ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వైరుధ్యం ఫ్యూడల్ భూస్వామ్య విధానానికి అశేష ప్రజానీకానికి మధ్య వైరుధ్యం ఉంటుంది. జాతీయ బూర్జువా, ధనిక మధ్యతరగతి కూడా మిత్ర వర్గమే. ధనిక వర్గం, మధ్యతరగతి అంటే మన దేశంలో ఎక్కువగా అగ్రకులాలకు చెందినవారే. వీళ్ల చొరవ ఆధిపత్యం ఫలితంగా సంఘ నాయకత్వం వీళ్ల చేతిలోనే ఉంటుంది. మొదటి పోరాటంలోనే ఫ్యూడల్ భూస్వాములు ఓడిపోతే,(పట్టణాలకు పారిపోయారు) తర్వాత పోరాటం ఏమి ఉంటుంది. తర్వాత అగ్రకుల ధనిక మధ్యతరగతికి, పేద రైతాంగం దళిత బహుజన వర్గాలకు చెందిన రైతు కూలీలకు మధ్య ఉంటుంది. కానీ, నూతన ప్రజాస్వామిక విప్లవంలో జాతీయ బూర్జువా ధనిక మధ్యతరగతి పేద రైతాంగం రైతు కూలీల మధ్య ఐక్య సంఘటన ఉండాలి. కాబట్టి సంఘ నాయకత్వంలో జాతీయ బూర్జువా ధనిక మధ్యతరగతి వర్గాలు ఆధిక్యంలో ఉంటాయి. వీరు పేద రైతాంగ దళిత బహుజన రైతుకూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటారు. వైరుధ్యం ఇక్కడే మొదలవుతుంది. జరిగింది కూడా అదే. అందుకే నక్సల్బరి పోరాటం, జగిత్యాల ఉద్యమంలో దొరలు పట్టణాలకు పారిపోయిన తర్వాత గ్రామాలలో, వైరుధ్యం పరిష్కారం చేయలేని స్థితిలో నిరాశ చెందిన పేద దళిత బహుజన రైతు కూలీలు క్రమంగా పార్టీకి దూరమై, అస్తిత్వవాద అంబేద్కర్ ఉద్యమం వైపు వెళ్లారు. ఇలా తరలి పోవడం మూలంగా గ్రామాలలో పార్టీ తన పట్టును కోల్పోయింది. అందుకే మైదాన ప్రాంతాలలో పార్టీ బలహీనపడి అడవికి పరిమితమై పోవాల్సి వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే? ఫ్యూడల్ భూస్వాములు పట్టణాలకు పారిపోయిన తర్వాత ధనిక, మధ్యతరగతి వర్గాలకు మరియు పేద రైతు, దళిత బహుజన కూలీలకు మధ్య వేతన, సామాజిక పెత్తనం, సంఘ నాయకత్వ మొదలగు సమస్యలను ఎందుకు పరిష్కరించ లేదు. కారణం దళాలు, పార్టీ, గెరిల్లా జోన్లు, విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి. కనుక, ముందుగా అందరి ఐక్య సంఘటనతో మాత్రమే ఇది సాధ్యం. విప్లవం విజయం సాధించే వరకు ఇది చేయలేము. ఇదేకారణం. మితవాద పార్లమెంటరీ ఎంఎల్ పార్టీలు బలంగా వున్న దగ్గర వారే ధనిక వర్గ స్థానాన్ని పొంది, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలుగా, పాలక బూర్జువా పార్టీల స్థానాన్ని భర్తీ చేసి మనుగడ సాగిస్తున్నారు. క్రూర నిర్భంధం మూలంగా పీపుల్స్ వార్, రాడికల్స్ కు చెందిన గ్రామాలలో సంఘం నాయకత్వం నుండి తప్పుకుని రద్దు అయిపోయి, బూర్జువా పార్టీలకు స్థానం కల్పించారు. ఇక జాతీయ స్థాయిలో జాతీయ బూర్జువా వర్గంతో ఐక్య సంఘటన కొరకు బూర్జువా ప్రాంతీయ పార్టీలతో ఐక్య సంఘటన కొరకు ప్రయత్నించి ఘోరంగా విఫలం అయ్యారు. ఉదాహరణకు ఎన్టీఆర్, మమతా బెనర్జీ, కెసిఆర్ లు... చర్చల పేరుతో చాలా నష్టపోయారు. ఇక పట్టణ కార్మిక వర్గంలో పార్టీ ఉనికే లేదు. అదే సోషలిస్టు దశ అయితే ఎలాంటి ఐక్య సంఘటనలు, బూర్జువాలతో గానీ, గ్రామీణ బూర్జువాలయిన అగ్రకుల ధనిక వర్గాలతో ఉండవు. ఫ్యూడల్ భూస్వాములు పట్టణాలకు పారిపోయిన వెంటనే కార్మిక రైతు కూలీల రైతాంగం మధ్య మాత్రమే ఐక్య సంఘటన ఉంటుంది. గ్రామాలలో నాయకత్వం పేద దళిత బహుజన రైతుకూలీ శ్రామిక, కార్మిక వర్గాల నాయకత్వంలో ఉంటుంది. గ్రామీణ బూర్జువా వర్గంపై పోరాటంలో దళిత బహుజనుల మధ్య కార్మిక వర్గ సామరస్యం అనివార్యంగా ఏర్పడుతుంది. ఇది కుల వివక్షకు గల పునాది తొలగించి, వివక్ష , అసమానతలు తొలగిపోతాయి. ఇక పట్టణాలలో కార్మికవర్గం మరియు అసంఘటిత కార్మిక వర్గం మధ్య ఐక్యత ఏర్పడి బూర్జువా వర్గంపై నిర్ణయాత్మక పోరాటానికి దారి ఏర్పడుతుంది. ఫ్యూడల్ భూస్వాములు పోయిన తర్వాత లేని భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఎవరిపై? అలాగే అర్ధ వలస కాదు. కాబట్టి, లేని దళారీ బూర్జువాపై పోరాటం ఏం చేస్తాం. ఐక్య సంఘటన పేరుతో గ్రామాలలో అగ్రకుల ధనిక మధ్యతరగతికి పట్టణాలలో దళారీ బూర్జువాలకు వ్యతిరేకంగా, జాతీయ బూర్జువాతో మైత్రి పేరుతో కార్మిక వర్గానికి, అసంఘటిత కార్మిక వర్గాలకు పోరాట కార్యక్రమం లేకుండా చేసింది. లేని అర్ధ భూస్వామ్యం అర్ధ వలస వ్యతిరేక పోరాటాల పేరుతో "గ్రామాలలో ధనిక వర్గాన్ని (గ్రామీణ బూర్జువాను)" పట్టణాలలో జాతీయ బూర్జువాల (పెట్టుబడిదారీ వర్గం) ను పటిష్టం చేయడమే నూతన ప్రజాస్వామిక విప్లవ కార్యక్రమం." ఆదివాసీలలో వర్గాలు లేవు. కనుక, వాటికి రాజ్యంతో ప్రత్యక్ష వైరుధ్యం మూలంగా ఉద్యమం దండకారణ్యంలో ఇంకా కొనసాగుతుంది. దేశంలో పట్టణీకరణ విపరీతంగా పెరిగి కార్మిక అసంఘటిత కార్మిక వర్గం గణనీయంగా పెరిగింది. వీరిని ఏ విధంగా విప్లవ పోరాటంలో కలుపుకోవాలి? విప్లవ దశను సరిగ్గా నిర్ధారించుకుంటే దేశంలో పోరాడే శక్తులకు కొదవలేదు. మనకున్న సమస్యలల్లా సరైన విప్లవ దశ, మరియు సిద్ధాంత సమస్య. ప్రస్తుతం ఒక సరైన సైద్ధాంతిక రాజకీయ పంథా కలిగిన బోల్షెవిక్ తరహా నూతన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తక్షణ అవసరం. దానికొరకు మార్క్సిజం-లెనినిజం వెలుగులో విస్తృత సిద్ధాంత అధ్యయనం చేద్దాం. కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందించే నిరంతరం అధ్యయనాన్ని కొనసాగిద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఉద్యమకారులకు సైద్ధాంతిక పరిజ్ఞానం లేనితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. పడికట్టు పదాలు ఎంత కాలం నిలుస్తాయి. పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి? ఫ్యూడల్ భూస్వామ్య విధానం అంటే ఏమిటి? దళారీ బూర్జువా వర్గం అంటే ఏమిటి? కార్మికవర్గం రైతాంగం రైతుకూలీలు కార్మికులు అంటే ఏమిటి? సరైన డెఫినిషన్ కూడా ఇవ్వలేని బలహీనతలో ఉన్నాం. సిద్ధాంత పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగా విప్లవ దశను సరిగ్గా ఎలా నిర్ధారించాలి?విప్లవ దశ ఏమిటి? దీని కొరకు బత్తిని శ్రీనివాసరావు గారి "నూతన ప్రజాతంత్ర విప్లవమా - సోషలిస్టు విప్లవమా" అనే ఈ పుస్తకం తిరిగి ముద్రణ చేయవలసిన అవసరం ఏర్పడింది. మిత్రులు, మేధావి మరియు విద్యార్ధి లోకం అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. మన విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్యే. దేశంలో అధికారంలో ఉన్నది పెట్టుబడిదారీ వర్గం. కూల దోయాల్సింది పెట్టుబడిదారీ వర్గాన్ని. అధికారంలోకి రావాల్సింది కార్మిక వర్గమే. ‌‌ *సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి* షేక్ అబ్దుల్ కరీం తేది:14-8-2021 సూచిక ముందు మాట నామాట 1. ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య అధికార సమస్యే 2. కమ్యూనిస్టుల యూనిటీకి ప్రాతిపదిక ఏమిటి?. 3. నిర్వాసిత సమస్య పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిష్టుల పాత్ర. 4. ఈవీఎం వివాదం - మార్క్సిస్టు దృక్పథం 5. ప్రభుత్వరంగ సంస్థలు ఏవైనా ప్రభుత్వం కార్మికవర్గ చేతుల్లో ఉన్నపుడే ప్రజలకు ప్రయోజనం 6. గద్దర్ తండ్లాటకు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవమే పరిష్కారం. 7. ఆర్టీసీ సమ్మె 8. సంఘటిత రంగం - అసంఘటిత రంగం 9. ఎందుకు ఇది రిహార్సల్ 10. సోషలిస్టు విప్లవంలో కుల మత వివక్ష నిర్మూలన పోరాటాలు 11. భావ దారిద్య్రంలో విప్లవ ప్రజా సంఘాలు 12. అర్థ భూసామ్యం ఉందనేవాళ్లు 13. ఎఫ్. బి. లో అమానవీయ శ్రమపై చర్చ 14. కేసీఆర్ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం 15. నేటి ఆధునిక కార్మిక వర్గం 16. ఉన్నత ఉత్పత్తి విధానం 17. పంథాలు సరైన దిశలో ఉన్నప్పుడు 18. యు.సి.సి. పై 19. అనుబంధం A. సి.యు.సి. తీర్మానాలు. B. కేఎస్ సైద్ధాంతిక చారిత్రక తప్పిదం. కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి? ఎందుకు ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. పార్టీల మధ్య ఐక్యతనా!? లేక పార్టీలలో ఉన్న వ్యక్తుల మధ్య ఐక్యతనా.!? వ్యక్తుల మధ్య ఐక్యత అవసరం ఏమి వచ్చింది. ఆయా పార్టీలలోనే పార్టీల మధ్య ఐక్యతకు ఎందుకు ప్రయత్నించడం లేదు. విడిగా ఐక్యత అవసరం ఏమిటి? కొంతకాలం నుండి ఆయా పార్టీలలో వున్న వ్యక్తులు ప్రస్తుతం సమాజం మారిన సమాజానికి అనుకూలంగా ఆయా పార్టీలు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని, సిద్ధాంతపరంగా అప్డేట్ కావడం లేదని, ఒకవేళ పార్టీలలో ప్రయత్నం చేసినా.., పై నాయకత్వం దానిని అంగీకరించడం లేదని, వారి వాదనను నొక్కి పెడుతుందని, వారు మార్పుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఇంకా ప్రస్తుత దేశ పరిస్థితి అర్థవలస అర్థ భూస్వామ్యంగా లేదని, ఇంకా దున్నే వానికే భూమి, వ్యవసాయక విప్లవం అవసరం లేదని, భూస్వామ్య విధానం అంతమైందని ప్రస్తుతం పెట్టుబడిదారీ సంబంధాలు మారుమూల పల్లెలకు కూడా వ్యాపించాయని.., ఇప్పుడు చేయవలసింది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవమని కొంతమంది విడివిడి వ్యక్తులు సోషల్ మీడియాలో గానీ ఇతరత్రా మార్గాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఆయా పార్టీలలో అసంతృప్తిగా ఉండి, మరియు ఆయా పార్టీలు ప్రజల సమస్యలకు అనుగుణంగా పనిచేయడం లేదని, ప్రజలకు దూరమై క్షీణించి పోతున్నవని ఏదో తప్పు జరుగుతుందని అస్పష్ట సిద్ధాంత అవగాహనతో ఏదో మార్పు రావాలి..! తేవాలి..! అనుకునేవారు అన్ని పార్టీలలో ఉన్నారు. ఇలాంటి వారు పార్టీలకు దూరంగా ఒంటరిగా తమ ప్రయత్నాలు అధ్యయనాలు చేస్తున్నారు. ఇంకా కొంత మేధావి వర్గం, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు, విప్లవం కోరుకునే వారు ప్రస్తుత వామపక్ష పరిస్థితిని బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నవారు రకరకాల చర్చలలో పాల్గొంటున్నారు. ఒక స్పష్టమైన సైద్ధాంతిక నిర్ధారణ కొరకు చర్చోపచర్చలు నడుస్తున్నాయి. "విప్లవ సిద్ధాంతం లేనిదే విప్లవోద్యమం ఉండజాలదు" - లెనిన్ ఈ నేపథ్యంలో వీరందరినీ ఒకే ఐక్యవేదిక మీదికి తెచ్చి సిద్ధాంత చర్చలను కొనసాగించి ఒక సరైన సిద్ధాంతాన్ని ఒక ఆచరణను శాస్త్రీయ మార్క్సిజం వెలుగులో ఒక సరైన మార్గం రూపొందించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. స్వతంత్ర వామపక్ష మేధావులు, అధ్యయనకారులు, తమ పరిశోధనలను, కొద్దిగానైనా కొంత సమగ్రంగానే తీసుక వచ్చారు. పెట్టుబడిదారీ సంబంధాలు విస్తృతంగానే పల్లెల్లో చొచ్చుకు పోయాయని, ప్రతి పల్లెను పెట్టుబడి మింగేసిందని.., పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదని.., అసంఘటిత రంగంలో కార్మిక వర్గం పెరిగిందని అనేక రుజువులు, అధ్యయనాలు మనముందు ఉంచారు. కరోనా మహమ్మారి కాలంలో వలస కార్మిక వర్గం కళ్లముందే ఉంది. వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో, 50 సంవత్సరాలు దాటిన నక్సల్బరీ ఇంతవరకు దేశంలో విప్లవం సాధించలేదు. కారణాలను వెతకాలి. విశ్లేషించాలి. నూతన మార్గాన్ని అన్వేషించాలి. "ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్యే". ఏ వర్గాల చేతిలో అధికారం కేంద్రీకరించబడి ఉంది? లేక ఏ వర్గాలను అధికారం నుండి కూలదోయాలి? ఏ వర్గం లేక ఏ వర్గాలు అధికారం చేపట్టాలి? ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య ఇదే - లెనిన్ దీనిని బట్టి ఏ వర్గాల చేతిలో రాజ్యాధికారం ఉంది? శత్రువు ఎవరు దీనిని నిర్వచించాలి. దీనిపై ఏకాభిప్రాయానికి రాగలగాలి. శత్రువును గుర్తించ గలిగితే, మిత్రులు ఎవరు అనేది సులభమే. అయితే, దేశంలో చీలి ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత, సమిష్టి కార్యాచరణ అసలే లేవా? ఉంటే కొత్తగా వచ్చిన అవసరం ఏమిటి..? కొన్ని విప్లవ ఎంఎల్ పార్టీలు ఐక్యమై ఐక్య పార్టీలుగా ఏర్పడినాయి. అందులో గతంలోని పీపుల్స్ వార్, పీపుల్స్ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్... లు ఐక్యమై మావోయిస్టు పార్టీగా, ఇంకా ఇతర ఎంఎల్ గ్రూపులు కలిసి న్యూ డెమోక్రసీ, ఇలానే... ఇంకా కొన్ని పార్టీలు కలిసినవి కూడా ఉన్నాయి. కలిసిన పార్టీలు కూడా మరలా విడిపోతూ ఉన్నాయి. ఇంకా సీపీఐ, సీపీఎం, పార్లమెంటరీ ఎంఎల్ పార్టీలు కొన్ని విషయాలపై ఐక్య ఉద్యమాలు, మరియు ఎన్నికలలో కలిసి పోటీ చేయడం చేస్తూనే ఉన్నారు. అనేక పార్టీలుగా ఉన్నప్పటికీ వీరి అభిప్రాయం దళారీ నిరంకుశ బూర్జువా బడా భూస్వామ్య వర్గాలు అధికారంలో ఉన్నాయని.., ఇంకా అర్థ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ ఉందని. కావలసింది నూతన ప్రజాస్వామిక లేదా జనతా ప్రజాస్వామిక విప్లవం అంటూ, పార్లమెంటరీ పంథా, సెమీ పార్లమెంటరీ సాయుధ పోరాటం, పూర్తిగా దీర్ఘకాలిక సాయుధ పోరాటమనే దానిలో విభజించబడి ఉన్నాయి. వారి దృష్టిలో శత్రువులో భిన్నాభిప్రాయం లేదు. కానీ, ఓడించే విధానంలో, కార్యాచరణలో విభేదం ఉన్నది. కాబట్టి ఉమ్మడిగా కొన్ని చోట్ల కలిసి పనిచేసే ప్రాతిపదిక ఉంది. "అత్యంత పురోగామి సిద్ధాంత మార్గదర్శకత్వంలో పనిచేసే పార్టీ మాత్రమే అగ్రగామి పోరాట యోధుని పాత్ర వహించగలదు." - లెనిన్ ఏం చేయాలి? అలాగే నూతన సిద్ధాంతం కావాలి అనే వారిలో విభిన్న రకాల నేపథ్యం నుండి వచ్చిన వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. వాటన్నింటినీ చర్చించి సమన్వయం సాధించాలి. శాస్త్రీయ కమ్యూనిజం వెలుగులో వాటిని పరిష్కరించుకోవాలి. సూత్రబద్ధమైన ఐక్యత ప్రాతిపదిక కావాలి. "కమ్యూనిస్టుల ఐక్యత అంటే ఒక ఉన్నతమైన రాజకీయ శాస్త్రీయ దృక్పథం గల కార్మిక వర్గ చైతన్యం గల అగ్రగామి శక్తుల కలయిక." ఆ విలువలను కొనసాగిస్తూ దేశ ప్రజలు, కార్మికవర్గ విముక్తినీ, సోషలిస్టు విప్లవం నిర్వహించే మహత్తర రాజకీయ పోరాట మార్గం వేసే విధంగా ఉండాలి. ఈ పరిష్కారం కొంత సమయం పట్టవచ్చు. మౌలికంగా "దేశం పెట్టుబడిదారీ విధానంలో ఉందని, కర్తవ్యం సోషలిస్టు విప్లవమే అంతిమ మార్గమని" అందరికీ కనీస ఏకాభిప్రాయం ఉండాలి. లేదా రావాలి. కాబట్టి, మిగతా విషయాలను చర్చల ద్వారా కలిసి ముందుకు పోయే క్రమంలో పరిష్కారం లభించవచ్చు. "కమ్యూనిస్టుల మధ్య ఐక్యతకు, ప్రజాస్వామిక ఐక్య సంఘటనకు మధ్య మౌలికమైన తేడాను గమనించాలి." ప్రస్తుత తక్షణ అవసరం కమ్యూనిస్టులు ఐక్యమై ఒక సరైన రాజకీయ శాస్త్రీయ కమ్యూనిజం వెలుగులో ఒక విప్లవ సిద్ధాంత పంథాను కమ్యునిస్టు పార్టీని నిర్మించడమే. అప్పటివరకు ఒక ఐక్య నిర్మాణంలో కలిసి ఉండి ఐక్య కార్యాచరణతో ఉద్యమాలను నిర్మించాలనే ఉద్దేశంతో వివిధ పార్టీల వ్యక్తుల మరియు మేధావుల అభ్యుదయవాదుల కలయికతో ముందుకు పోవాలని ఆశిద్దాం... *ప్రపంచ సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి* షేక్ అబ్దుల్ కరీం తేది: 18-7-2022 నిర్వాసితుల సమస్య... పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిస్టుల పాత్ర గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో నిర్వాసితుల సమస్యలు దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టులు, నదులపై డ్యాంలు నిర్మాణం చేపట్టడం ద్వారా ముంపునకు గురయ్యే నిర్వాసితులు, మైనింగ్ ద్వారా అయ్యే నిర్వాసితులు, రోడ్ల వెడల్పు కోసం అయ్యే నిర్వాసితులు, ప్రత్యేక ఆర్థిక 9మండళ్లు ఏర్పాటు ద్వారా అయ్యే నిర్వాసితులు. నిర్వాసితులలో ఎక్కువగా గిరిజనులు, గ్రామీణ ప్రాంత రైతులు మరియు గ్రామీణ ప్రాంతమై ఉంటుంది. దీని వలన పెద్ద ఎత్తున అటవీ భూములు మరియు సాగు భూములు బదలాయింప బడుతున్నాయి. భూములు కోల్పోయి నిర్వాసితులైన ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్వాసితుల పక్షాన మద్ధతు తెలుపుతున్నాయి. కొంత మంది మేధావులు, రచయితలు, పౌరహక్కుల సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు కూడా ప్రజలకు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఈ ఉద్యమాల ద్వారా కొత్త కొత్త మేధావులు, నాయకులు పుట్టుకొస్తున్నారు. అయినప్పటికీ, రోజురోజుకూ నిర్వాసితుల సమస్యల పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, మైనింగ్ లు, రోడ్లు, రోడ్డు వెడల్పులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, దీనికి పరిష్కారం ఏమిటి? ప్రతి పక్షం అంటున్నది ఏమంటే? అధికార పక్షం సరిగ్గా అంచనా వేయలేదని.., అదే మేమైతే అతి తక్కువ మంది నిర్వాసితులు అయ్యేటట్లు చూసేవారమని, నష్టరిహారం ఎక్కువగా అవినీతి లేకుండా ఇప్పించే వారమని, అధికార పక్షానికి చెందిన కాంట్రాక్టర్లకు, వారి అనుకూలస్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రాజెక్టులు కడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. కానీ, వీరికి నిజంగా ప్రాజెక్టులు కట్టడంపైన గానీ, మైనింగ్ లు పైన గానీ, ఫ్యాక్టరీలు కట్టడం, రోడ్లు, రోడ్డు వెడల్పుపై గానీ అభ్యంతరం లేదు. ఈ రాజకీయాలు అందరికీ తెలిసినవే... మరి మేధావులు, హక్కుల సంఘం వారు ఏమంటారంటే..? పర్యావరణం దెబ్బతింటుంది. అడవులు నాశనం అవుతున్నాయి. గిరిజనుల సంస్కృతి నాశనం అవుతుంది. భూములు తరిగిపోతాయి. ప్రజలు నిర్వాసితులవుతారు. అభివృద్ధి మాటున ఇవన్నీ అనర్థాలు జరిగిపోతాయి. కాబట్టి గిరిజన సంస్కృతిని కాపాడి మరియు గ్రామీణ ప్రాంత రైతులను కాపాడి వారి సంస్కృతిని కాపాడాలని ఉద్యమాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు (పార్లమెంటరీ) ఏమంటున్నారంటే.., వీరు కూడా దాదాపు ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరితోపాటుగా మేధావుల మరియు హక్కుల సంఘాల వైఖరిని మిళితం చేసి మాట్లాడుతూ అంతిమంగా ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరితో మిళితం అయిపోతారు. మరి విప్లవ కమ్యూనిస్టు పార్టీలు (ఎంఎల్, మావోయిస్టు) మరియు వారి అనుకూల ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, హక్కుల సంఘాలు ఏమంటున్నాయి? అంటే సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమే గిరిజనుల భూములను లాక్కొని, అందులోని ఖనిజ సంపదను కొల్లగొట్టుకుపోతున్నాయి. అభివృద్ధి మాటున వారిని అడవి నుండి నిర్వాసితులను చేస్తున్నారు. గ్రామాలలో రైతుల నుండి భూములను లాక్కొని, సెజ్ లకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు. రైతులను పట్టణాలకు వలస పోయే విధంగా చేస్తున్నారు. సరైన నష్టపరిహారం ఇవ్వడంలేదు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అడవిని, అటవి సంపదను రక్షించడానికి, వ్యవసాయ భూములను, వ్యవసాయాన్ని, రైతులను రక్షించుకోవడానికి పోరాటం చేయాలంటున్నారు. ‌ అధికారంలో ఉన్నవారు, పాలకులు ఏమంటున్నారంటే , అభివృద్ధి కావాలంటే కొత్త ఉద్యోగాలు అవకాశాలు రావాలంటే ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, రోడ్లు, రోడ్డు వెడల్పు తప్పనిసరి. కొంత త్యాగం అవసరం. అభివృద్ధి జరగాలంటే కొంతమందికి ఇబ్బందులు తప్పవు. వీరికి పునరావాసం కల్పిస్తాం. నష్టపరిహారం చెల్లిస్తాం. ఇవి స్థూలంగా ప్రస్తుత వివిధ పార్టీలు చేస్తున్న వాదనలు. పై వాదనలలో ఏది నిజమైనది? ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతిమ మార్గమేమిటి? పరిష్కారం ఏమిటి? దేశంలో అభివృద్ధి లేక పారిశ్రామీకరణ జరగకుండా నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుంది. మైనింగ్ ద్వార ఖనిజ సంపదను వెలికి తీయకుండా, పెద్ద ప్రాజెక్టులు కట్టకుండా, రోడ్లు వేయకుండా, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా, ఉద్యోగ అవకాశాలు ఎలా ఏర్పరచగలరు? అని ప్రతి పెట్టుబడిదారుడు అనే మాట. అయితే, ఈ పరిణామాలపై మార్క్సిస్టు దృక్పథం ఏమిటి? మార్క్సిజం కమ్యూనిజం ఏం చెపుతుంది. నిజమైన కమ్యునిస్టులు ఏం చేయాలి. ప్రస్తుత కమ్యునిస్టులు (పార్లమెంటరీ, ఎంఎల్, మావోయిస్టు) దాదాపుగా ప్రతి ప్రాజెక్టును లేక నిర్వాసితులతో కూడుకున్న ప్రతి అభివృద్ధిని వ్యతిరేకించడమే చేస్తున్నారు. ప్రధాన పోరాటాలలో ఈ పోరాటాలే అగ్రభాగాన ఉంటున్నాయి. వర్గ పోరాటాలను దాదాపుగా మర్చిపోయారు. కార్మిక వర్గ పోరాటాలను పూర్తిగా మరచి పోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఏ పోరాటంలోనైనా పాల్గొంటున్నారు. అభివృద్ధికరమైనదా లేదా అనే విచక్షణ లేకుండా.., వర్గ దృక్పథంతో వర్గ పోరాటానికి, కార్మిక వర్గానికి ఉపయోగ పడుతుందా లేదా ఆలోచించటం లేదు. ఏదైనా ఒక పరిశ్రమను స్థాపిస్తున్నపుడు దాని వలన కొంత భూమి, సాగు భూమి, కాలుష్యం, సామాజిక మార్పు, జీవన విధానంలో మార్పు వస్తుంది. పల్లె వాతావరణంగానీ, అడవి వాతావరణం గానీ మార్పు చెందుతుంది. ఈ మార్పు అభివృద్ధి కరమైనదా..! లేక అభివృద్ధి నిరోధకమైనదా..! అనే ఆలోచన అవసరం. గిరిజన సంస్కృతి శాశ్వతం, ఆదర్శవంతం కాదు. అంతిమంగా వారు నాగరిక సమాజంలో విలీనం కావలసిందే. పల్లెలు పట్టణాలుగా మారవలసిందే. వ్యవసాయంలో కూడా పారిశ్రామీకరణ చెందవలసినదే. మనవాళ్ళు గ్రామీణ ప్రాంతాన్ని తప్పుగా ఆదర్శవంతం చేస్తున్నారు. పెట్టుబడిదారీ అభివృద్ధి కంటే స్తబ్ధత మేలు అని భావిస్తున్నారు. గిరిజన సంస్కృతిని కాపాడడం కమ్యూనిస్టులకు ఆదర్శం కాదు. గిరిజన సామ్రాజ్యాన్ని నిర్మించ లేరు. సమాజాలు దాని అభివృద్ధి క్రమంలో పయనించాలి. దానికి విరుద్ధంగా వ్యతిరేక దిశలో ఆదర్శవంతం చేసి, తాత్కాలికంగా స్తబ్ధతకు గురిచేయకూడదు. ప్రతిగా కమ్యూనిస్టులు సమాజం ముందుకు పోయే విధంగా, ఫ్యూడలిజం నుండి పెట్టుబడిదారీ సమాజం దాని నుండి సోషలిస్టు సమాజం అంతిమంగా వర్గాలు లేని కమ్యూనిస్టు సమాజం దిశగా పురోగమింప చేయాలి. మనతో సంబంధం లేకుండానే అనగా మన ఇష్టాలతో పని లేకుండానే సమాజం పరిణామం చెందుతుంది. దానిని మనం వేగవంతం చేయాలి. స్తబ్ధతకు గురిచేయడం, తిరోగమింప చేయడం కమ్యూనిస్టుల కార్యాచరణ కాదు. రష్యాలో నరోద్నిక్కులు పెట్టుబడిదారీ అభివృద్ధి విధానాన్ని వ్యతిరేకిస్తే వారిని ఖండిస్తూ లెనిన్ చెప్పిన మాటలు. “తన కాల్పనిక ఊహల్లో కల్పితమైన, అస్తిత్వం లేని పెట్టుబడిదారీయేతర అభివృద్ధిలో కుదుర్చుకోవాలని మొండిగా వుంటాడు. నరోద్నిక్కు కాబట్టి... ప్రస్తుతం పెట్టుబడిదారీ పంథాలో క్రమిస్తున్న అభివృద్ధిని మందగింప చేయడానికి సన్నద్ధం అవుతాడు.”– లెనిన్ (మనం పరిత్యజించే వారసత్వం ఏమిటీ – లెనిన్ రచనలు) అదే వ్యాసంలో "మన వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం విపత్కరమైందని, ప్రమాదకరమైందనీ, ఏమంటే స్వతంత్ర రైతు స్థానంలో పెట్టుబడిదారీ విధానం మరి వ్యసాయ కార్మికుడిని పెడుతుందని ప్రతి నరోద్నిక్కూ అంటాడు. పెట్టుబడిదారీ అభివృద్ధి కంటే స్తబ్ధత మేలు”– ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికీ సంబంధించిన ప్రతి నరోద్నిక్కు దృష్టి – లెనిన్ గిరిజన సంస్కృతిని, ప్రకృతి సౌందర్యాన్ని కాపాడాలని మరియు గ్రామీణ ప్రాంతాన్ని, పచ్చదనాన్ని కాపాడాలని, పర్యావరణం దెబ్బతింటుందన్న భావాలన్నీ పెట్టీ బూర్జువా మేధావుల భావోద్వేగాలు మాత్రమే. గతితార్కికంగా, వాస్తవంగా ఆలోచించటం లేదు. పోని పూర్తిగా పోరాటం చేసి ఈ పర్యావరణ విధ్వంసాన్ని, గ్రామీణ ప్రాంత విధ్వంసాన్ని ఆపగలరా.!? అదీలేదు. కేవలం పత్రికా వ్యాసాలకు, డాక్యుమెంటరీలకు, శుష్క ప్రసంగాలకు తమ మేధావితనాన్ని ప్రదర్శించటానికి ఉపయోగించుకుంటున్నారు. కమ్యూనిస్టులు (పార్లమెంటరీ, ఎంఎల్, మావోయిస్టు) వర్గ పోరాటాలను, కార్మికవర్గ సిద్ధాంతాలను మరచి, పెట్టీ బూర్జువా ఆదర్శవాదంలో కూరుకుపోయారు. గ్రామీణ వ్యవస్థను ఆదర్శీకరించడం ద్వారా మరల ఫ్యూడలిస్టు భావజాలానికి పరోక్షంగా దోహద పడుతున్నారు. ఉదాహరణ... ఒక అభ్యుదయ జానపద కవి గ్రామాలను వర్ణిస్తూ, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం గ్రామాలను, గ్రామ ఉత్పత్తిని, కుల వృత్తులను ఎలా కనిపించని కుట్రల ద్వారా తరతరాలుగా ఆనందంగా బ్రతుకుతున్న పల్లెలకు, పల్లె సంస్కృతిని, పల్లె ఉత్పత్తులను ధ్వంసం చేసినందు వలన కన్నీరు పెడుతున్నాయి అని భావోద్వేగంగా వర్ణిస్తూ మనలందరిని కంటతడి పెట్టించాడు. కమ్యూనిస్టులను, మేధావులను, మావోయిస్టులను కూడా కంటతడి పెట్టించాడు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడీదారులు కనిపించకుండా ఏమీ కుట్రలు చేయలేదు. కళ్ళముందే ప్రత్యక్షంగా దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారీ విధానం పల్లెలను, ఫ్యూడల్ సంబంధాలను, కుల వృత్తులను ప్రత్యక్షంగానే ధ్వంసం చేస్తుంది. ఇది సామాజిక అనివార్య పరిణామ క్రమం. ఇక్కడ కవి వర్ణించినట్లుగా గ్రామాలు శతాబ్ధాల తరబడి ఫ్యూడలిజంలో ఉన్న కారణంగా ప్రజలు సంతోషంగా లేరు. దొరలు, గ్రామ పెత్తందార్ల , జమీందార్ల దోపిడీ హింస కింద నలిగి బానిస బతుకులు బ్రతుకుతున్నారు. పెట్టుబడిదారీ విధానం ఈ దోపిడీ సంబంధాలను బానిస కుల వృత్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రజలు విముక్తి పొందారు. దొరలు, పెత్తందార్లు, జమీందార్లకు, ధనిక రైతులకు మాత్రమే పల్లెలు అందంగా ఉన్నాయి. పల్లెలు నిజంగా ఈ విధ్వంసం తర్వాత సంతోషంగా ఉన్నాయి. దొరలు మాత్రమే కన్నీరు పెడుతున్నారు. వాస్తవంగా కవి మాత్రమే కనిపించని కుట్రల ద్వారా మనలో ఫ్యూడల్ భావజాలాన్ని ప్రవేశింపజేసి వర్గ చైతన్యాన్ని నిర్వీర్యం చేసినాడు. లెనిన్ నరోదిజపు భావజాలం గురించి చెపుతూ ”తరతరాల పునాదుల్ని పెట్టుబడిదారీ విధానం భగ్నం చేయకుండా మందగింపజేసి ఆపేయాలనే తమ కోరికతో తలమునకలైపోయి చారిత్రక ఔచిత్యపు ఆశ్చర్యకరమైన లుప్తతని వెల్లడించుకుంటున్నారు.” మరియు “గ్రామీణ ప్రాంతాన్ని తప్పుడుగా ఆదర్శవంతం చేయడం.” సమష్టి తత్వం గురించిన కాల్పనిక స్వప్నాలు, ప్రస్తుత ఆర్థికాభివృద్ధి మార్గంలో నుంచి ఉత్పన్నం అయ్యే రైతుల వాస్తవ అవసరాల పట్ల నరోద్నిక్కులు పరమ అల్పమైన దృష్టిని ప్రదర్శించేట్టు చేసింది” - లెనిన్ (మనం పరిత్యజించే వారసత్వం ఏమిటి) అనేక రకాల ఉద్యమాల ఫలితంగా ముఖ్యంగా కమ్యూనిస్టుల ఫ్యూడల్ వ్యతిరేక రైతాంగ ఉద్యమాల ఫలితంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల ఫలితంగా, నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా, జగిత్యాల జైత్రయాత్ర ఫలితంగా ఇప్పుడు ఇప్పుడే ఫ్యూడల్ భూస్వామ్య బంధనాల నుండి విముక్తి పొందుతున్న గ్రామీణ ప్రాంతములో, పెట్టుబడిదారీ వ్యవస్థ గ్రామాలలో చొచ్చుకు పోయి, ఫ్యూడల్ వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ విధానం వేళ్ళూనుకుంటుంది. దీనిని మనం స్వాగతించాలి. “రష్యా, రష్యాయే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక పురోగతి, ఫ్యూడలిజం నుండి క్యాపిటలిజం వైపుగా కొనసాగుతోంది. క్యాపిటలిజం అభివృద్ధి చెందడం ద్వారా, భారీ పరిశ్రమలు, యంత్రాలు, క్యాప్టలిస్టు ఉత్పత్తి మార్గం ద్వారానే సోషలిజానికి ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ మార్గంకాక మరోమార్గం గురించి కలలుకనడం… ఉదారవాద, చిన్న ఉత్పత్తిదారుల స్వభావం. ఈ కలలు కేవలం పెట్టీబూర్జువా వెనుకబాటుతనాన్ని (అభివృద్ధి నిరోధక స్వభావాన్ని) బలహీనతను ప్రతిఫలిస్తాయి – లెనిన్ ఫ్యూడల్ వ్యవస్థ వందల సంవత్సరాలుగా రైతును భూమికే బానిసను చేసింది. క్యాపిటలిజం రైతును భూమి నుంచీ విముక్తిని చేసి స్వేచ్ఛా జీవిగా మారుస్తుంది. రెండు వ్యవస్థలు దోపిడీ వ్యవస్థలే... కానీ, ఫ్యూడలిజం ప్రజలను బయటి ప్రపంచంతో సంబంధం లేని జడులుగా, సంకుచిత స్వభావులుగా చేస్తోంది. క్యాపిటలిజం ప్రజలను తమ సంపద శ్రమశక్తిని అమ్ముకునే ప్రయత్నంలో పుట్టిన ఊరు, దేశం విడిచేలా చేసి విశాల ప్రపంచంతో అనుసంధానిస్తుంది. ఈ విధంగా భూస్వామ్య వెనుకబాటుతనం నుంచి భూస్వామ్య పీడన నుంచి విముక్తి చేస్తుంది. కాబట్టి పెట్టీ బూర్జువా మేధావి, ఫ్యూడల్ భావజాల పునరుద్ధరణ శక్తులకు కమ్యూనిస్టులు వారికి తోకలుగా మారరాదు. మళ్ళీ అసలు విషయానికి వద్దాం... ఒక ముంపు లేదా నిర్వాసిత గ్రామం విషయాన్ని పరిశీలిద్దాం... ఒక గ్రామంలో ఉన్న గణాంకాలను బట్టి గ్రామంలో దాదాపు సగం మందికి నామమాత్రం లేదా అసలు భూమి లేదు. వీరు వ్యవసాయ కూలీలు. 13.5 శాతంగా ఉన్న కుటుంబాలకు 44 శాతం భూమి 86.5 శాతంగా ఉన్న కుటుంబాలకు 56 శాతం భూమి (ఉన్న సాగు భూమిలో) గ్రామీణ జనాభాలో అసలు భూమి లేని, నామమాత్రం ఉన్న రైతు కూలీలు 42 శాతం. గ్రామంలో 13.5 శాతం మందికి మాత్రమే అధిక మొత్తంలో భూమి ఉంది. వీరంతా ధనిక వర్గాలకు చెందిన వారే. మిగతా 87 శాతం చిన్న సన్నకారు రైతులు. అసలు వ్యవసాయం గిట్టుబాటు గాక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. వ్యవసాయం పారిశ్రామికీకరణ చెందక పోవటం మూలాన మరియు దేశంలో పారిశ్రామిక అభివృద్ధి విస్తృతంగా జరగని మూలంగా నిరుద్యోగం అధికమవుతుంది. నిరుద్యోగ సమస్య తీరాలంటే దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగవలసిందే. అసలు సమస్య ఏమిటంటే నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం సరైన రీతిలో జరుగక పోవడం. ఇప్పటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సరైన సమయంలో సరైన నష్ట పరిహారాన్ని, పునరావాసాన్ని కల్పించవు. దానిలో కూడా అవినీతి, పక్షపాతంతో పేద చిన్న సన్నకారు రైతులకు, భూమి లేని రైతు కూలీలకు అసలే అందవు. ఎక్కువగా నష్టపోయేది చిన్న సన్నకారు రైతు కూలీలే. ధనిక రైతాంగం పెద్దగా నష్ట పోయేది ఏమీ లేదు. ఎందుకంటే? వీరికి గల రాజకీయ పలుకుబడితో వచ్చే నష్ట పరిహారంలో అధిక వాటా వీరే పొందుతారు. మార్క్స్ పెట్టుబడి గ్రంథంలో తను చెప్పినట్లు ”వ్యవసాయ రంగం జనాభాలో కొంతభాగం, పట్టణం లేక పారిశ్రామిక (వ్యవసాయేతర) శ్రామికులుగా మారిపోయే స్థితిలో నిరంతరం ఉంటుంది. సాపేక్షమైన అదనపు జనాభా యొక్క ఈ మూలాధారం ఈ విధంగా నిరంతరం సాగుతూనే ఉంటుంది. దీని ఫలితంగా వ్యవసాయ శ్రామికుడు కనీస వేతన కార్మికుని స్థితికి దిగజార్చబడి ఎల్లప్పుడూ పరమ దరిద్రం అనే ఊబిలో ఒక కాలు దిగబడే ఉంటాడు.” నిర్వాసితులైన జనాభా (రైతు) పట్టణాలకు వలస పోయి కార్మికుడి స్థాయికి చేరుకుంటున్నాడు. పరిశ్రమలో లాగానే వ్యవసాయంలో కూడా పెట్టుబడిదారీ విధానం “ఉత్పతిదారుని బలి చేస్తేనే” గాని ఉత్పత్తి క్రమంలో మార్పు తీసుకు రాలేదు. ఇంతకు ముందే వ్యవసాయం గిట్టుబాటు గాక, జనాభా పట్టణాలకు వలసలు ఎక్కువైనాయి. దీనికి తోడు నిర్వాసిత జనాభా తోడై పట్టణ కార్మిక జనాభా ఎక్కువ అవుతుంది. “ఒకే చోట కేంద్రీకృతం కావడం మూలంగా పట్టణ కార్మికుల ప్రతిఘటనా శక్తి అధికమవుతూ ఉండగా, గ్రామీణ శ్రామిక జనం విస్తృత ప్రాంతాలలో చెల్లాచెదురు కావడం వలన వారి ప్రతిఘటనా శక్తి నీరసించిపోతూ ఉంటుంది.”– మార్క్స్ పెట్టుబడి కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలను మళ్లీ నెమరు వేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. వర్గ మూలాలను, వర్గ సిద్ధాంతాలను మరల ఒకసారి తొంగి చూసుకోవాలి. పెట్టీ బూర్జువా ఆదర్శవాదాన్ని, భావ వాదాన్నీ వదిలి గతి తార్కికంగా ఆలోచించాలి. కార్మిక వర్గ అగ్రగామి దళ పాత్రను సరిగ్గా నిర్వహించాలి. గణనీయంగా కార్మిక వర్గం పెరుగుతున్న నేటి పరిస్థితులలో కార్మిక వర్గ పోరాటాలను మరుగు పరిచి, పెట్టీ బూర్జువా ఆదర్శాలను ఫ్యూడల్ భావజాల సంరక్షణ, పునరుద్ధరించే అభివృద్ధి నిరోధక ఉద్యమాల వెనుక నడవడం ఆపాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటాలు, నక్సల్బరీ నుండి శ్రీకాకుళం, జగిత్యాల జైత్రయాత్ర నుండి అత్యున్నత పోరాటాలుగా సాగిన ఉద్యమం గత కొన్ని సంవత్సరాలుగా వెనుక పట్టు పట్టుటకు గల కారణాలను విశ్లేషించుకోవాలి. ఈ అత్యున్నతమైన పోరాట రూపం నుండి వనరుల సంరక్షణ, పర్యావరణ సంరక్షణ, గిరిజన సంస్కృతి పరిరక్షణలాంటి అభివృద్ధి నిరోధక పోరాటాల స్థాయికి దిగబడడం ఆలోచించాలి. వనరులను సంరక్షించడం కాదు.., వనరులను వెలికి తీసి అవి అందరికీ సమానంగా పంపణీ చేయడం.., వెలికి తీసిన సంపదను వినియోగించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.., వెనుకబాటుతనాన్ని పోగొట్టడం, పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, పారిశ్రామికాభివృద్దిని సాధించడం మరియు శ్రామిక వర్గ సంస్కృతిని పెంపొందించాలి. పరిశ్రమలు అభివృద్ధి చెందడం మూలంగా కార్మిక వర్గం కూడా అభివృద్ధి చెంది సంఘటితం కాబడుతుంది. అసలు కమ్యునిస్టులు ఏం చేస్తారు..? కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలి? కమ్యూనిస్టులు కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి వర్గ పోరాటాల ద్వారా పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోసి, కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా సోషలిజాన్ని స్థాపించడం.., సమ సమాజాన్ని స్థాపించడం. ఇంకా ఫ్యూడలిజం ఉన్న దేశాలలో మొదట రైతాంగాన్ని ఫ్యూడల్ భూస్వామ్య బంధనాల నుండి విముక్తి చేస్తుంది. ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థను బూర్జువా వర్గమే ప్రజాస్వామిక విప్లవం ద్వారా విముక్తి చేస్తుంది. కానీ, బూర్జువా వర్గం ఫ్యూడలిజంతో రాజీపడిన సందర్భంలో కమ్యూనిస్టులే కార్మికవర్గ నాయకత్వం వహించి ఫ్యూడలిజం నుండి రైతాంగాన్ని విముక్తం చేసి (దీనిని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారు) తద్వారా అదే నాయకత్వం వహించి సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సరళంగా వైరుధ్యాలు ఇలా ఉండాలి... ఫ్యూడల్ భూస్వామ్య విధానానికి – రైతాంగానికి.., పెట్టుబడిదారీ విధానానికి – కార్మిక వర్గానికి నిర్వాసిత సమస్యలో ఉన్న వైరుధ్యాలను పరిశీలిద్దాం... ఇక్కడ వైరుధ్యం భూస్వాములకు, రైతులకు గాని, రైతు కూలీలకు గాని వైరుధ్యం లేదు. ప్రత్యక్షంగా ప్రభుత్వాలకు మొత్తం ప్రజలకు మధ్య వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం. ధనిక రైతులకు మధ్యతరగతి రైతులకు (వీరికి నిర్వాసిత భూమి అధికంగా ఉంటుంది కాబట్టి). ప్రభుత్వానికి వైరుధ్యం ప్రధానమైందని. ఈ ఉద్యమంలో ఎక్కువగా బేరసారాలు ఆడి అధిక వాటా లాభం పొందేది ధనిక మధ్యతరగతి రైతుల కుటుంబాలే. వీరు మొత్తం 15 శాతానికి మించి లేరు. కార్మిక వర్గ పోరాటాలను మరిచిపోయిన కమ్యూనిస్టు విప్లవ పార్టీలు (ఎంఎల్, మావోయిస్టు). దాదాపుగా కార్మిక వర్గ పోరాటాలను, ఉద్యమాలను మరిచి పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగ పోరాటాలకు, గిరిజన ఉద్యమాలకు పరిమితమై పోయారు. ప్రజాసంఘాలు కూడా కార్మికుల పోరాటాలలో నామమాత్రంగానే పాల్గొంటున్నాయి. వారి దృష్టి అంతా దండకారణ్యం లోని ఆదివాసీ పోరాటాల మీద (గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు లేవు కాబట్టి). రైతుల ఆత్మహత్యల మీద, ప్రత్యేకంగా భూ నిర్వాసితుల మీద మాత్రమే కేంద్రీకరిస్తున్నారు. కార్మిక సమస్యల గురించి, రైతు కూలీల, పేదల మౌలిక సమస్యల గురించి, దారిద్య్రం, నిరుద్యోగం, అధిక ధరలు, నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ప్రభుత్వ అధికారుల అవినీతి, లంచగొండితనం, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వివక్ష, ట్రాఫికింగ్, కనీస వేతన చెల్లింపులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ఇలా అనేక ప్రజల మౌలిక సమస్యల గురించి పోరాడుతూ కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మిస్తూ ప్రజలలో చైతన్యం తీసుక వచ్చేందుకు కృషి చేయాలి. కానీ, పర్యావరణం పేరుతో, ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా, సెజ్ లకు వ్యతిరేకంగా, పరిశ్రమలకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాల లోనే మునిగి తేలుతున్నారు. వీటి వలన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు (విప్లవోద్యమానికి కూడా). పాలక వర్గాల (బూర్జువా) ముఠాల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి. ఇకనైనా కమ్యూనిస్టులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతికంగా చైతన్యమవుతూ.., సమాజంలో జరుగుతున్న పరిణామాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ వర్గ పోరాటాలను నడిపించి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని ముందుకు తీసుకు పోవాలి. షేక్ అబ్దుల్ కరీం తేది: 19–08–2017 ప్రభుత్వరంగ సంస్థలు ఏవైనా... ప్రభుత్వం కార్మికవర్గం చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు ఉపయోగం బూర్జువా ప్రభుత్వంలోని ప్రభుత్వరంగం బూర్జువాలకే ఉపయోగం ప్రస్తుతం ప్రైవేటీకరణపై దేశ వ్యాప్తంగా వామపక్షవాదులలోనే కాకుండా సాధారణ ప్రజల వరకూ వాడి వేడి చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం ఖరాఖండిగా ప్రైవేటు చేస్తామని చెపుతుంది. చేస్తుంది. అయితే, దీనిపై కమ్యూనిస్టు దృక్పధం ఏమిటి?మూల అంశాలు ఏమిటి? బ్యాంకింగ్ రంగం గురించి తీసుకుందాం... "ప్రభుత్వ బాంకుల వల్ల పెట్టుబడిదార్లకే లాభం అని మేము కొత్తగా కనిపెట్టేసాం. అందువల్ల బాంకులన్నీ ప్రైవేట్ పెట్టుబడిదార్లకే ఇచ్చేయండి. ప్రజలకు లాభం" అని సూత్రీకరిస్తున్నారు కొందరు. వాళ్ళ మోకాళ్ళకు త్వరగా రోకళ్ళు చుట్టేస్తే ఊళ్ళకు వెళ్ళిపోతారట. పబ్లిక్ రంగం పేరుతో పెట్టుబడి ఆడే ఆటలను ఎక్స్ పోజ్ చేసే ఆత్రంలో... ప్రైవేటీకరణను గుడ్డిగా సమర్థించే నియోలిబరల్స్ గా మారకండి. --- ఒక విమర్శ సరే.., పై విమర్శల నేపథ్యంలో మనం ఒక ప్రశ్న వేద్దాం... ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల ప్రస్తుతం ప్రజలకు అనగా కార్మిక అసంఘటిత కార్మిక రైతు కార్మికులకు కింది పేద ప్రజలకు జరుగుతున్న మేలు ఏమిటి? జవాబుగా పై విమర్శకుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ రెండు ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన ప్రయోజనాలు, ఉపాధి కల్పన. ఇక బ్యాంకింగ్ రంగం ప్రత్యేకమైన పని ప్రజల నుండి పొదుపులు స్వీకరించి, ఇన్వెస్టర్లకు పెట్టుబడి అందుబాటులో ఉంచడం. అదేవిధంగా దేశ స్థూల ఆర్థిక విధానాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచడం., తగ్గించడం అనే పద్ధతుల ద్వారా సేవింగ్స్, ఇన్వెస్టుమెంట్లను నియంత్రించడం కొరకు సెంట్రల్ బాంకు బ్యాంకింగ్ వ్యవస్థను ఒక సాధనంగా వాడుకుంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రుణ సదుపాయాన్ని కల్పించే పని కూడా పబ్లిక్ రంగ బ్యాంకులకు అప్పచెప్పిన విధుల్లో ఒకటి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతిఒక్క రంగం మౌళికంగా వ్యవస్థ కొరకే ఓరియెంట్ చేయబడి ఉంటుంది. విద్యారంగం కూడా నిపుణులైన కార్మికులను తయారు చేయడం కొరకే పనిచేస్తుంటుంది. ఇందులో వింత గానీ, గొప్ప రహస్యం గానీ లేవు. 1990 తరువాత అమలైన నయా కన్సర్వేటివ్ విధానాలు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని పద్ధతి ప్రకారం విచ్ఛినం చేసుకుంటూ వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రైవేట్ బ్యాంకులను సృష్టించి బడా కార్పోరేట్ల ఆధీనంలోకి వాటిని తీసుకొచ్చే నిర్ణయాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఉద్యోగుల కథ అటుంచి, బ్యాంకింగ్ రంగం పూర్తిగా ప్రైవేటీకరణ జరిగితే సామాన్యులకూ, చిన్న ఉత్పత్తిదారులకూ, మధ్య తరగతులకూ లభిస్తున్న అరకొర రుణసదుపాయాలు కూడా ఎండిపోతాయి. అతను చెప్పిన విషయాలను ఒక్కొక్కటి పరిశీలిద్దాం... పై లక్ష్యాలలో అమలు జరిగినది ఏదైనా ఉంటే కార్పోరేట్లకు మాత్రమే రుణాలు అంద చేయబడ్డాయి. వారే భారీ మొత్తంలో అప్పులు తీసుకుని పారిపోయిన వారు దివాళ తీసినట్టు నటించి ఎగ్గొట్టిన వారు ఉన్నారు కదా. ప్రజల నుండి పొదుపులు స్వీకరించిన మాట వాస్తవమే. కానీ, సామాన్య ప్రజలకు ఏనాడైనా రుణాలు ఇచ్చారా?గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చారా? ఇంకా ఈ క్రింది ప్రచారం కూడా జరుగుతున్నది... 1. గ్రామీణ బ్యాంకులు మూతపడతాయి. 2. ప్రజల పొదుపు ప్రమాదంలో పడుతుంది. పొదుపుల మీద వడ్డీ తగ్గిపోతుంది. 3. వ్యవసాయ రుణాలు పోతాయి. ప్రత్యేకించి చిన్న, సన్నకారు రుణాలు ఇవ్వడం వుండదు. 4. చిన్న, మధ్య తరగతికి వ్యాపారాలకు రుణాలు అందకుండా పోతాయి. 5. విద్యార్థుల పై చదువుల కోసం రుణాలు లభించవు. 6. కార్పోరేట్ వ్యక్తులకు తక్కువ వడ్డీకి, సులభంగా రుణాలు దొరుకుతాయి. వీళ్ల పోటీకీ స్థానిక వ్యాపారాలు, ఉత్పత్తులు మునిగిపోతాయి. 7. యువతకి ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయి. 8. యాంత్రికీకరణతో ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా అవి కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. 9. ఇప్పటిలాగా కాకుండా అనేక రెట్లు రేపటి బ్యాంకుల్లో సర్వీసు ఛార్జీలు పెరుగుతాయి. 10. గృహరుణాలు, ప్రభుత్వ పథకాలకు మధ్యవర్తిత్వం వంటి పనులు బ్యాంకులు చేపట్టవు. ఇందులో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేవే తప్ప సామాన్య ప్రజల, కార్మిక, అసంఘటిత కార్మికులకు, చిన్న సన్నకారు రైతులకు, వ్యవసాయ కార్మికులకు మరియు చిన్న వ్యాపారులకు, పేద ప్రజలకు మేలు చేసే ఒక అంశమైనా ఉన్నదా..? పోనీ గతంలో ఎన్నడైనా ఏ చిన్నపాటి లబ్ధి పొందగలిగారా? ప్రజలకు ఏదైన చిన్న రుణం (ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా) ఇవ్వాలంటె... నానా తిప్పలు పెట్టి లంచాలు మింగి, సబ్సిడీ మొత్తం వాళ్లే మింగేసేవారు. చివరకి అప్పు నెత్తిన పెట్టే వారు. వడ్డీల మీద ఫైన్ ల మీద ఫైన్ లు గుంజుకోవడం, ప్రతి రైతుకు, ఉపాధి పథకాల కొరకు తీసుకున్న విషయాలు ప్రతి నిరుద్యోగికి తెలియవా.!? సంపన్న వర్గాల విద్యార్థులకు తప్ప విద్యా రుణాలు ఎవరికి ఇచ్చారు? పేద రైతు, కార్మిక, అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామికులు జమానతులు ఎక్కడి నుండి తేగలరు.? ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనడంలో నిజం లేదు. పెద్ద ఎత్తున పెరిగిన ప్రైవేటు బ్యాంకులు సిబ్బంది లేకుండా నడుస్తాయా.? ఇంతకు ముందు కొద్దిపాటి జాతీయ బ్యాంక్ శాఖలతోపాటు నేడు అనేక బ్యాంకులు వచ్చాయి. కాకపోతే చాలా సౌకర్యాలు గల ఉద్యోగ భద్రతను ఇచ్చే విధంగా ఉండవు. గ్రామీణ బ్యాంకులు మూతబడతాయి... అనేది కూడా ఉత్తమాటే. ప్రైవేట్ బ్యాంకులే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి. తక్షణ రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ప్రభుత్వరంగలో వచ్చిన లాభాలన్నీ ప్రజలకు ఏమాత్రం చేరలేదు. పెట్టుబడిదారులకు అప్పులు ఇవ్వడం, పన్ను రాయితీలు ఇవ్వడం, మౌలిక సదుపాయాల కొరకు అప్పుల ఎగవేతకు మాత్రమే అధికారులు, మేనేజర్ కొద్దిగా ఉద్యోగులకు మాత్రమే. బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉంటే పెద్ద పెట్టుబడిదార్లు రుణాలు ఎగ్గొట్టడానికి సహాయం చేయటమే ఇంత వరకు జరిగింది. ఏ బ్యాంకు యూనియన్ లెక్కలు తీసిన పెద్ద పెట్టుబడిదార్ల విరాళాలు బయటపడతాయి. బ్యాంకు యూనియన్లు చేసే సమ్మె ప్రజల సొమ్ముతో ఎగవేసిన రుణాలను భర్తీ చేసే కుట్ర మాత్రమే ప్రాక్టికల్ గా జరిగింది. జరుగుతున్నది కూడా అదే. కానీ, ఉద్యోగస్తులు నష్టపోతారని వామపక్షాలు, విప్లవ పక్షాల వారు తెగ బాధపడుతున్నారు. వారినే కార్మిక వర్గమని, వారి హక్కుల కొరకే పోరాటం అంటున్నారు. హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ముంచుకొస్తున్న ఈ తరుణంలో, అన్ని రకాల ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలను సమర్దించాలి అంటున్నారు. ఫాసిజాన్ని ఎదుర్కోవాలనే సాకు కు వీరు ఏమాత్రం ఉపయోగ పడరు. నిజమైన ప్రజలు, అసంఘటిత రంగ కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, రైతులు, మేధావి వర్గం సంఘటితం ద్వారానే ఎదుర్కోగ లరు. రండి బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ బ్యాంకులయితేనే మన మిత్రులకు లగడపాటి, సుజనాలకు, నీరవ్ మోడీకి తేలికగా అప్పులు ఇప్పించగలం. ఒకరి ఫేస్ బుక్ కామెంట్. ఇది నిజమే కదా. ప్రైవేటీకరణ చేయడంపై మీకున్న ప్రేమ ఏమిటి? ప్రైవేటీకరణపై మాకు ప్రేమ లేదు. ఇప్పుడున్నది వాస్తవంగా ప్రైవేటే. కానీ, మీరు అది ప్రభుత్వ రంగం అని పొరబడుతున్నారు. ప్రజలను భ్రమింపచేస్తున్నారు. మీరే ప్రైవేటును మోయాలంటున్నారు. ప్రైవేటికరణ కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు. మొదటి నుండి కూడా అది ప్రైవేటు రంగమే ప్రజల డబ్బుతో ప్రభుత్వం రంగమంటూ ప్రజలను మోసం చేస్తూ, ఇంతకాలం కార్మిక వర్గంలో కొంతమందిని కొనివేయడం ద్వారా అదనపు సౌకర్యాలను కల్పించి, కార్మిక వర్గంలో అంతరాలను సృష్టించి, వారిని అవినీతి పరులను చేశారు. దీర్ఘకాలంగా కార్మికుల మధ్య అంతరాలను సృష్టించారు. ఐక్యతను దెబ్బతీశారు. పెట్టుబడిదారీ వర్గం కొంతమంది కార్మిక సెక్షన్లను కొని వేయడం ద్వారా కార్మికులలోనే అధిక సౌకర్యాలు కలిగిన ఉన్నత పొరను తయారు చేస్తారని మార్క్స్ ఆ కాలంలోనే గుర్తించి హెచ్చరించాడు. ప్రభుత్వ రంగంలో ఎంత శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మహా అయితే 1 లేదా 2 శాతం మందికి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా నిజంగా ప్రభుత్వరంగాన్ని కాపాడేవాళ్ళు, ప్రైవేటు రంగాన్ని కాపాడినట్లే... పెట్టుబడిదారీ వర్గాన్ని కాపాడినట్లే. ప్రజలను మభ్య పెడుతున్నట్లే.., ప్రభుత్వ రంగంలో వచ్చిన లాభాలు అంటే అదనపు విలువ ఎక్కడి నుండి వచ్చింది. అది ఎవరికి పోతుంది. పారిస్ కమ్యూన్ విఫలమవడానికి ఒక కారణం ఆనాటి బ్యాంకింగ్ రంగం విప్లవకారులకు ఉపయోగపడలేదు. వారు సహకరించలేదు. విప్లవకారులు దానిని స్వాధీనం చేసుకోకపోవడమే. ప్రభుత్వ రంగం ఎప్పుడు ప్రజలది అవుతుందంటే.., ఆ ప్రభుత్వం కార్మిక వర్గ ప్రభుత్వమై ఉండాలి. పై విమర్శకులు లాంటి వాళ్ళు కోరుకునేది బూర్జువా సంక్షేమ రాజ్యాలు. వీటిలోనే చిన్న ఉత్పత్తిదారుల సహకార సంఘాలు విస్తృతంగా ఏర్పరచి, ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా నిర్మించి, అవినీతి లేకుండా ఉండాలని తమ పవిత్ర కోరికలను పెట్టుబడిదారి ప్రభుత్వంలో ఉద్యమాలు చేసి సాధించాలనుకుంటున్నారు. పైగా పెట్టుబడిదారీ దేశాలలో ఇప్పటి వరకు సోషలిస్టు విప్లవాలు విజయవంతం కాలేదని ఈ విషయాన్ని గమనించాలని మార్క్సిస్టు వ్యతిరేక సూత్రీకరణలు చేస్తున్నారు. నా స్వంత అనుభవం.., బతుకు దెరువు ప్రారంభించిన 20 సంవత్సరాల క్రితం ఆంధ్రా బ్యాంకులోగానీ, ఎస్ బి హెచ్, ఎస్ బి ఐ దగ్గర కనీసం సేవింగ్స్ అకౌంట్ తీద్దామన్నా నాకు సాధ్యం కాలేదు. పోస్ట్ ఆఫీస్ మాత్రమే అందుబాటులో ఉండేది. మొదటి బ్యాంకు అకౌంట్ ప్రైవేటు LVB లోనే సులభంగా తెరిచాను. బైక్ కొనుటకు ఫైనాన్స్ లో చెక్ బుక్ అవసరం ఉందని అడిగితే 2 వేల రూపాయలు లంచం అడిగారు. మన జాతీయ బ్యాంకు వారు. అహం అడ్డు వచ్చి చాలా కాలం తర్వాత ప్రైవేట్ బ్యాంకులో తీసుకుంటే వెంటనే ఇచ్చారు. ఇక ఉపాధి రుణం స్కీం కొరకు పోతే సబ్సిడి మొత్తం లంచం అడిగారు. అంతే కాదు కొటేషన్ రూపంలో అసలు ధర కంటే డబల్ రేటులో కొనాల్సిరావడం... అందుకే, ఎన్నడూ రుణం కోసం ప్రయత్నించలేదు. ప్రస్తుత పబ్లిక్ రంగం అంటే సోషలిస్టు నమూనా అని మోసపోవద్దు. ప్రజల డబ్బు శ్రామికులను దోపిడి చేసి పెట్టుబడిని పెంచేదే పబ్లిక్ రంగం. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్య, వైద్య, ప్రజా రవాణా రంగాలు కూడా బూర్జువాలకేనా ఉపయోగం? మన విద్యా విధానం మెకాలే ప్రవేశపెట్టిన పెట్టుబడిదారులకు గుమస్తాలను తయారు చేసే విధానం అని మనం రోజు విమర్శిస్తూనే ఉన్నాం కదా..! శాస్త్రీయ విద్యా విధానంపై డిమాండ్ చేస్తున్నాం కదా..! ప్రభుత్వ ఆధీనంలోనే మొత్తం విద్యా రంగం ఉన్నప్పుడు అది గ్రామాల్లోకి పరిమితంగానే ఉండేది. నిరుద్యోగ యువత ఉపాధి కోసం గ్రామ గ్రామాన బస్తీలలో పాఠశాలలు స్థాపించిన తర్వాతనే కదా విద్య మరింత ప్రజలకు చేరువైంది. ఆ తర్వాతనే కార్పోరేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక వైద్య రంగం చెప్పాల్సిన పని లేదు. "నేను రాను తల్లో సర్కారు దవాఖానకు" అనే పాట ప్రజల అందరి నోట విన్నదే. రవాణా రంగం రైల్వే వ్యవస్థ మొత్తం పెట్టుబడిదారుల ముడి పదార్థాలను, సరుకులను మోసేది ప్రధాన ఆదాయం మొక్కుబడిగా ప్రజా రవాణాకు కొంత మేలు చేస్తుంది. అది కూడా కొద్ది ప్రాంతాలకే., రోడ్డు రవాణా సంస్థ ఇప్పటి అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. పెద్ద ఎత్తున ఆటోలు మారుమూల గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా యువతకు భారీగా ఉపాధి లభిస్తుంది. అందుకే ఆర్టీసీ కూడా సరుకు రవాణా మొదలుపెట్టింది. ఇది బూర్జువాలకే ఉపయోగం కాదా.!? ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు ఎటు వెళ్ళింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, వైద్య సిబ్బంది, రైల్వే ఉద్యోగులు, కార్మికులు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, బీహెచ్ఈఎల్ కార్మికులు గానీ, కనీసం మన సింగరేణి కార్మికులు గానీ నేటి పెట్టుబడిదారులతో ఢీ కొడుతున్న రైతాంగానికి మద్ధతుగా వచ్చారా..? మరి ఎందుకు రావడం లేదు. పోనీ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వారి సంస్థను కాపాడుకోవటానికి, ప్రస్తుతం రైతాంగం చేస్తున్న తరహాలో ఒక వంతయినా పోరాటం చేశారా..? హాయిగా వీఆర్ఎస్ రూపంలో డబ్బు తీసుకుని వెళ్తున్నారు. దేశంలోని కీలక రంగాల్లోనూ సంఘటితం చేయగలిగిన కార్మికవర్గం అంతా బూర్జువా వర్గ ఆధీనంలో ఉంటే, కార్మిక వర్గాన్ని ఎలా సంఘటితం చేయగలము. మన తల అంతా బూర్జువా క్షేత్రంలో ఉంటే.., మన దేహంతో ఏమి చేయగలం.? పబ్లిక్ రంగాన్ని విమర్శించడంలో లేదా ప్రైవేటీకరణ సమర్థించడంలో పెట్టుబడిదారులను, వారి ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నామనే అత్యల్ప ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నామని ఊహించకండి. ఇంతవరకు నడుస్తున్న పబ్లిక్ రంగం సంస్కరణ వాద సంక్షేమ రాజ్యానికి చెందినదైతే ఇప్పటి ప్రైవేటీకరణ విధ్వంసకర మైనది. అది భద్రతగల కొద్దిపాటి కార్మిక వర్గ పైపొరను ధ్వంసం చేస్తుంది. కార్మికులు బూర్జువాలకు మధ్యగల విరుద్ధతను చివరి కొసకు నెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేటీకరణ సామాజిక విప్లవాన్ని, సోషలిస్టు విప్లవాన్ని వేగిర పరుస్తుంది. విమర్శకులారా! కేవలం ఈ విప్లవాత్మకమైన దృష్టిలో నుండి మాత్రమే మేము ఈ ప్రైవేటీకరణను సమర్ధిస్తున్నాము. షేక్ అబ్దుల్ కరీం తేది: 23-3-2021 ఈవీఎంల వివాదం - మార్క్సిస్టు దృక్పథం ఈవీఎం మిషన్ల గురించి మొదటి నుండి కూడా కొన్ని అనుమానాలు, అపోహలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎం ట్యాంపరింగుల గురించి ఆరోపణలు ఎక్కువైనాయి. సహజంగా ఓడిపోయిన పార్టీలు అభ్యర్థుల నుండి ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈవీఎంల గురించి అభ్యుదయ వాదులు ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఇంకా ముందుకు పోయి ఎంఎల్ మరియు మావోయిస్టు పార్టీల అనుబంధ సంఘాలు కూడా ఈవీఎంలు పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిపి అధికారపక్షం ఏకపక్షంగా ఎన్నికలలో మెజారిటీ సాధించిందని గగ్గోలు పెడుతున్నారు. ఇంకా పాత కాలపు బ్యాలెట్ విధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతికంగా దేనినైనా ట్యాంపరింగ్ చేయవచ్చు. దీనిలో సందేహం లేదు. దేనిలోనైనా లొసుగులు ఉంటాయి. బూర్జువా పార్టీల ముఠాలు ఇలాంటి ఆరోపణలతో తమ ఓటమిని అంగీకరించవు. మరియు ఇలాంటి ఆరోపణలతోనే మళ్ళీ ఎన్నికలకు సిద్ధం అవుతాయి. అవి అలా సాగుతూనే ఉంటాయి. కానీ, ప్రగతిశీల అభ్యుదయ శక్తులు చేస్తున్న ఆరోపణపై సరైన మార్క్సిస్టు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారపక్షం ఏక పక్షంగా గెలవడం ఈవీఎం ట్యాంపరింగ్ వలననా..? ఇంకా సామాజిక అంశం ఏదైనా ఉందా? తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష గెలుపును విశ్లేషించే ముందు కొంత చరిత్ర లోనికి పోవలసి ఉంది. దేశంలో స్వాతంత్ర్యం (అధికార మార్పిడి) వచ్చేటప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక ప్రభుత్వంపై కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటం నడుస్తున్నది. తెలంగాణలో నిజాం రాచరిక నిరంకుశ పాలన, గ్రామాలలో ఫ్యూడల్ భూస్వామ్య జమీందారీల గడీల పాలన ఉండేది. ఆనాడు రాజకీయ పార్టీలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రవేశించలేదు. ఒకవైపు గ్రామాలలో భూస్వాముల నిజాం రాచరిక పాలన, ఇంకొకవైపు విశాల గ్రామీణ రైతాంగం ప్రజల వైపు కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిధ్యం వహించాయి. పటేల్ యాక్షన్, భారత్ లో విలీనం, కమ్యూనిస్టు సాయుధ పోరాట విరమణ తర్వాత బూర్జువా వర్గం, అవశేష భూస్వామ్య వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మరియు పీడిత రైతాంగానికి కమ్యూనిస్టు పార్టీ ఇలా రెండు పార్టీలు మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. ఇదే కొనసాగింపు ఎమర్జెన్సీ వరకు పెట్టుబడిదారీ, అవశేష భూస్వామ్య వర్గాలకు కాంగ్రెస్ పార్టీ, కార్మిక, శ్రామిక, రైతాంగం, పీడిత ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ ఉండగా అవశేష భూస్వామ్య, ధనిక వర్గం నుండి ఎదిగిన బూర్జువా పెట్టీ బూర్జువా వర్గాల కొరకు జనతా పార్టీ ఉనికిలోకి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీలో బూర్జువా వర్గంతో రాజీపడని ఇంకా కొంత పోరాట పటిమ కొనసాగించే పెట్టీ బూర్జువా ధనిక వర్గం కొరకు సిపిఐలో చీలిక వచ్చి సిపిఎం ఉనికిలోకి వచ్చింది. తర్వాత సీపీఎం నుండి ధనిక మధ్యతరగతి మేధావి వర్గం రైతాంగానికి శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే క్రియాశీల పోరాట పార్టీగా ఎంఎల్ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత నుండి ఎనభై దశకం వరకు ఎంఎల్ పార్టీలు రాడికల్స్ పీపుల్స్ వార్ పార్టీలు జరిపిన జగిత్యాల పోరాటం నుండి అవశేష ఫ్యూడల్ భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం మూలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లోని ఫ్యూడల్ భూస్వామ్య అవశేషాలు ధ్వంసం కాబడి దొరలు గ్రామాలనుండి పట్టణాలకు పారిపోవడం మూలంగా గ్రామాలలో మిగిలిన ధనిక మధ్యతరగతి వర్గం పెత్తనం నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. బూర్జువా, అవశేష ఫ్యూడల్ భూస్వామ్య వర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం మూలంగా ఫ్యూడల్ భూస్వామ్యం నుండి విముక్తం కాబడిన గ్రామాలలోని ధనిక మధ్యతరగతి వర్గాలకు మరియు విప్లవోద్యమం వైపుకు రానీ వారికి ఒక కొత్త రాజకీయ పార్టీ రూపంలో తెలుగుదేశంపార్టీ వచ్చింది. బూర్జువా, వర్గాలకు నూతనంగా ఎదిగిన పెట్టీ బూర్జువా ధనిక మధ్యతరగతి వర్గాలకు తెలుగుదేశం స్థిరపడి పోయింది. సిపిఐ, సిపిఎం పార్టీలు రోజు రోజుకూ తమ పీడిత ప్రజల మద్దతు కోల్పోయి, ప్రభావం కోల్పోతూ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, తెలుగుదేశం పార్టీకి సిపిఎం తోకలుగా మారిపోయి దిగజారుతూ వచ్చాయి. జనతా పార్టీ విఫలం తర్వాత దానిలో నుండి జాతీయ స్థాయిలో బీజేపీ వచ్చినప్పటికి తెలంగాణ ఆంధ్రలో హైదరాబాద్ పట్టణానికి పరిమితం అయిపోయింది. దానికి సామాజిక వర్గ బేస్ లేదు. కాబట్టి ఎదగలేదు. 1982 నుండి 2014 వరకు అధికారంలో టీడీపి, కాంగ్రెస్ పార్టీలు మారుతుండగా సిపిఐ సిపిఎం లు నిర్వీర్యం అవుతూ పీడిత జనపక్షం వైపు ఎంఎల్ మరియు మావోయిస్టు పార్టీలు ఉనికిలో ఉన్నాయి. తొంభై దశకం వరకు పీడిత ప్రజల పక్షాన ఉన్న ఎంఎల్ మావోయిస్టు పార్టీలు క్రమంగా క్షీణించడం రోజురోజుకూ ప్రభావం తగ్గిపోయి దండకారణ్యంకు కుదించడం వలన గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు సన్నగిల్లడం, గ్రామాలలోని నిరుద్యోగ యువతకు, విప్లవ పార్టీల నుండి వెనుదిరిగిన మాజీలకు రాజకీయ శూన్యత ఏర్పడింది. పర్యవసానంగా గ్రామాల నుండి పట్టణాలకు పోయిన భూస్వామ్య వర్గం క్రమంగా పెట్టుబడిదారులుగా ఎదగడం వలన వారు ఇంకా పైకి ఎదగటానికి ఆంధ్ర పెట్టుబడిదారులు అడ్డంకిగా మారడం వలన మళ్ళీ ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చారు. వీరికి గ్రామాలలోని నిరుద్యోగ యువత విప్లవ మాజీల రిజర్వు మద్దతు వలన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఎదుగుతున్న ప్రాంతీయ పెట్టుబడిదారి, ధనిక పెట్టీ బూర్జువా సెక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. ఆ విధంగా టీఆర్ఎస్ కు సామాజిక వర్గ పునాది ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ సాధనలో విప్లవ శక్తుల బలహీనత వలన రాష్ట్రంలోని ప్రాంతీయ బూర్జువా వర్గం టీఆర్ఎస్ రూపంలో అధికారంలోకి వచ్చింది. క్రమంగా మిగతా పార్టీలలోని బూర్జువా వర్గం వారి ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ అధికార పార్టీలోకి సహజంగా ఆకర్షింపబడ్డారు. బూర్జువా వర్గంలో ముఠాలు సమసిపోతూ ఒకే ముఠాగా ఏర్పడి తమ ఎదుగుదల కోసం జాతీయ స్థాయిలో విస్తరించడం కోసం టీఆర్ఎస్ లో చేరి ఉమ్మడిగా ఉంటేనే సాధ్యం అనే స్థితిలోకి వచ్చాయి. వామపక్ష సిపిఐ సిపిఎం లలోని కొద్దోగొప్పో మిగిలి ఉన్న బూర్జువా ఎలిమెంట్స్ కూడా క్రమంగా అధికారపక్షంలోకి జారుకున్నాయి. అందుకే ఉనికి కోసం బహుజన వాదాన్ని ఎత్తుకొని మరింతగా బలహీనపడ్డాయి. ఇంకా ఎంఎల్ మావోయిస్టు పార్టీలు తమ సంస్థాగత బలహీనతలతో సిద్ధాంత బలహీనతలతో ప్రజలకు దూరమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో వర్గాల పోలరైజేషన్ మరింతగా జరిగింది. ధనిక, అవశేష భూస్వామ్య వర్గం నుండి ఎదిగిన ప్రాంతీయ బూర్జువా దాని మిత్ర పక్షమైన ధనిక ఎగువ మధ్యతరగతి ఒక దోపిడీ శిబిరంగా, మరియు ఇంకొక పక్క కార్మిక, అసంఘటిత రంగ కార్మిక, శ్రామిక, రైతు కూలీ పెట్టీ బూర్జువా నిరుద్యోగులు, నిరుపేదలు ఇంకోవైపు రెండు శిబిరాలుగా పరస్పర శత్రు శిబిరాలుగా సాంద్రీకరణం చెందుతున్నాయి. దీనిని గుర్తించని విప్లవ పార్టీలు ఇంకా అధికార పార్టీని భూస్వామ్య పార్టీగా, ఇంకా గ్రామాలలో అర్ధ భూస్వామ్యమే ఉందంటూ, దోపిడీ వర్గ పార్టీలలో ముఠాల ఉనికిని గుర్తిస్తూ తప్పుడు రాజకీయ అవగాహనతో ప్రజలకు చేరువ కాకుండా దూరం అవుతున్నాయి. ఇదే అవకాశంగా అధికార బూర్జువా వర్గం రాష్ట్రంలో తమ పెట్టుబడిదారీ సంస్కరణలను అమలు చేస్తూ ఉదాహరణకు భూ రికార్డుల ప్రక్షాళన, క్రమబద్ధీకరణ, రైతు బంధు పథకం, రైతు బీమా తదితర ప్రజాకర్షక పథకాల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను పటిష్టం చేస్తుంది. ప్రాంతీయ బూర్జువా వర్గం తమ ఎదుగుదల కోసం జాతీయ బూర్జువా వర్గంతో తమ వాటా కొరకు తలపడుతున్నాయి. శత్రుపూరిత వైరుధ్యం స్థాయికి కాకుండా తమని కూడా వారితో కలుపుకునే విధంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కూడా ఉంది. ఇతర రాష్ట్రాలలోని నూతన ప్రాంతీయ బూర్జువాలు తమ తమ వాటాల కోసం సామ్రాజ్యవాద జాతీయ బూర్జువా ఘర్షణకు దిగుతున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. బీజేపి, కాంగ్రెస్ రెండు కూడా సామ్రాజ్యవాద జాతీయ పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించేవే. కాబట్టి రెంటికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉనికిలో ఉన్నాయి. ఇలా కొంతకాలం ఘర్షణ పడి, సర్దుబాటు జరిగి, దేశవ్యాప్త కూటమి ఏర్పడి అది ఒక జాతీయ పార్టీగా ఏర్పడి స్థిర పడే వరకు ప్రాంతీయ పార్టీల ఉనికి ఉంటుంది. తర్వాత దశలో దేశ వ్యాప్తంగా ఒకే పార్టీ తెలంగాణలో లాగా బలంగా ఉనికిలోకి రావచ్చు. ఈ మధ్యకాలంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీలు విప్లవోద్యమాన్ని నిర్మించి బల పడకపోతే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలలో లాగా (అమెరికా, బ్రిటన్) రెండు బూర్జువా పార్టీల వ్యవస్థ రావచ్చు. కాబట్టి, బూర్జువా పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి వారి మీడియా, ఈవీఎంలు ట్యాంపరింగ్, రిగ్గింగ్ లాంటి వివాదాలను ప్రచారంలో ఉంచుతాయి. ప్రగతిశీల వాదులు, విప్లవ వాదులు ఈ వివాదంలో మునగకుండా, సరైన సామాజిక వర్గ విశ్లేషణతో సరైన మార్గంలో తమ అవగాహన ఏర్పరచుకుని మారుతున్న సమాజానికి అనుకూలంగా అనుగుణంగా తమ సిద్ధాంత సంస్థాగత బలహీనతలను సవరించుకుని బూర్జువా వర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా పీడిత ప్రజల కార్మిక వర్గ పార్టీని నిర్మించి సోషలిస్టు విప్లవం ను పూర్తి చేయాలి. దేశంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ శక్తులు మరింతగా (ఫాసిజం) బలపడుతూ కార్మిక శ్రామిక రైతాంగ ప్రజలను మరింతగా దోపిడీ చేస్తూ వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తున్నాయి. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్మిక శ్రామిక ప్రజల పక్షాన ఉన్నటువంటి విప్లవ పార్టీలు తమ విధానాలను అప్డేట్ చేసుకొని ప్రజలకు నాయకత్వం వహించి విప్లవాన్ని కొనసాగిస్తాయా.!? లేదా తమ గిడసబారిన పాత విధానాలకే కట్టుబడి బలహీనతలను అధిగమించకుండా ప్రజలకు దూరమైపోయి అనివార్యంగా ఒక నూతన విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడానికి అవకాశం కల్పిస్తాయా.!? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. షేక్ అబ్దుల్ కరీం తేది: 31-3-2019 గద్దర్ తండ్లాటకు పరిష్కారం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ పంథానే... గద్దర్ తండ్లాటకు పరిష్కారం సోషలిస్టు విప్లవమే. సోషలిస్టు విప్లవ పంథా ఎందుకు? నాడు గద్దర్ తొలినాళ్లలో ఉన్న భూస్వామ్య, ఫ్యూడల్ విధాన అవశేషాలు నేడు లేవు. సుదీర్ఘ నక్సల్బరీ విప్లవ పోరాటాలు, ప్రజాస్వామిక ఉద్యమాల మూలంగా, సామ్రాజ్యవాద పెట్టుబడి అభివృద్ధి మూలంగా 90 దశకం మధ్యలో గణనీయంగా పెట్టుబడి గ్రామీణ వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారీ సంబంధాలలోకి మార్చివేశాయి. ఉద్యమాల వల్ల భూస్వాములు పట్టణాలకు నగరాలకు పారిపోయారు. అక్కడే పెట్టుబడిదారీ విధానంలో తమ వ్యాపారాలు, పరిశ్రమలు ద్వారా వచ్చే సంపద భూస్వామ్య వ్యవసాయం మించి కొన్ని రెట్లలో ఉండడం, రియల్ ఎస్టేట్లో విపరీత లాభాలు రావడం వల్ల అక్కడే సెటిల్ అయ్యారు. నామమాత్రంగా భూ సంబంధాలు మిగిలాయి. అవి పెట్టుబడి సంబంధాలుగా మారాయి. ఈ కాలంలో గ్రామీణ వృత్తులు నశించి, వృత్తి కారులు పట్టణాలకు వలసలు వెళ్లి పట్టణ కార్మికులుగా మారి పోయారు. "పల్లె కన్నీరు పెడుతుందో..." అనే పాటే సాక్ష్యం. మారుతున్న పెట్టుబడిదారీ విధానానికి అనుగుణంగా పార్టీ తన నూతన ప్రజాస్వామిక విప్లవం విధానాన్ని అప్ డేట్ చేసుకోలేదు. తన కరడు గట్టిన 50 సంవత్సరాల క్రితం నూతన ప్రజాస్వామిక విప్లవం ను ఇంకా అమలు చేయడం., దున్నే వానికే భూమి అని, ఇంకా వ్యవసాయక విప్లవం జరగాలి అంటూ.., లేని ఫ్యూడల్ భూస్వామ్య విధానంపై గాలిలో యుద్ధం చేస్తున్నారు. సుధీర్ఘ విప్లవ పోరాటం వల్ల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంధాలలో గణనీయ మార్పులు జరిగినా అవి "వక్రిక రించబడిన పెట్టుబడిదారి సంబంధాలు" అని మార్క్సిస్టు యేతర సూత్రీకరణ చేసి, ఇంకా భూస్వామ్య వ్యవస్థ ఉందని కాబట్టే వ్యవసాయ విప్లవమే ఇంకా కొనసాగాలి.., భూములు పంచాలి అంటున్నారు. ఇక కళాకారుడు ఏ విధమైన దృష్టితో, తన పాటను మలచాలి..? వ్యవసాయ విప్లవ పాటలు, సాహిత్యం పెట్టుబడిదారీ విధానంలో పనికి రావు. ప్రధాన వైరుధ్యంపై అంటే పెట్టుబడిదారీ దోపిడీపై పోరాడే కార్మిక శ్రామిక వైపు ఉంటేనే ప్రజలు ప్రస్తుతం స్వీకరిస్తారు. వర్గ పోరాటానికి దోహద పడుతుంది. దొర ఏందిరో దొర పీకుడేందిరో పాట ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పాటనే... ఇపుడు పాడినా వింటారు. కానీ, ఒకప్పటిది అని మాత్రమే.., ఇపుడు దొరల మీద యుద్ధం లేదుగా... అలాగే సాహిత్యంలో అల్లం రాజయ్య కథలు, నవలలు 90 ల వరకు నిరాటంకంగా వచ్చేవి. ప్రజలను చైతన్యం చేసేవి. వాటికోసం ఎదురు చూసేవారు. ఆ తర్వాత ఆ సాహిత్యం కొనసాగింపు ఏది? ఊరు నవల ఒకప్పుడు సమకాలీన గ్రామ పోరాట సంఘటనలుగా ఉండేవి. నేడు అది చరిత్ర మాత్రమే. గద్దర్ లో 90 ల తర్వాతనే ఈ సంఘర్షణంతా పార్టీ విధానానికి తనకు స్పష్టత లేకున్నా ఇతర రూపాలతో ముందుకు వచ్చింది. క్రమంగా దూరం పెరుగుతున్న దశలో అస్తిత్వ ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు మొదలు కావడంతో తన దృష్టిని వీటిపై మళ్ళించడంతో తాత్కాలికంగా పాక్షిక సంతృప్తి చెందాడు. నక్సల్బరీ నుండి శ్రీకాకుళం, జగిత్యాల జైత్రయాత్ర నుండి దండకారణ్యం వరకు వ్యాపించిన ఉద్యమం 90 ల నుండి క్రమంగా క్షీణిస్తూ తెలుగు రాష్ట్రాలలో కనుమరుగవుతుంది ఎందుకు? కారణాలు వెతుకుతూ.., అస్తిత్వ ఉద్యమంలో కూడా అతనికి పూర్తి సంతృప్తి గానీ, ప్రజల విముక్తికి మార్గం గానీ దొరకలేదు. అంబేడ్కర్ తో మార్క్సిజం జోడించాలి అనుకున్నాడు. అదీ కూడా సరైన దారి చూపలేదు. అది కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పక్కకు పోయింది. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాకారం అయిన తర్వాత మళ్ళీ అస్తిత్వ, మార్క్సిజం కలయిక ద్వారా ఏమైనా మార్గం దొరుకుతుందని ప్రయత్నాలు చేశాడు. దొరక లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక ఉద్యమంలో ఐక్య కార్యాచరణలో భాగంగా ఇతర బూర్జువా పార్టీలతో సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఉంది. పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే అందరి దగ్గరకి వెళ్ళాడు. దానిలో చేరడానికి కాదు. ఇంకా ప్రజల లోతుల్లోకి, మూలాలలోకి వెళ్ళే ప్రయత్నంలో యాదాద్రి, భద్రాచలం, రామానుజం, ఇంకా... కాంగ్రెస్ వేదికలను ఉపయోగించుకునే దానిలో భాగంగా రాహుల్ కు ముద్దు కూడా పెట్టాడు. గద్దర్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? అంటే పులిని పట్టటానికి పులి గుహలోకి వెళ్ళాలి కదా అన్నాడు. ప్రయోగాలు చేస్తున్నాను అన్నాడు. మనిషన్న వాడు ఉద్యమ కారుడు, ప్రజా కళాకారుడు నిరంతరం చలనంలో ఉండాలి. ప్రజలలో ఉండి, ప్రజల స్థాయికి వెళ్ళి, చైతన్యం చేసి, ఉద్యమ స్థాయికి చేర్చాలి. అదే ప్రజా పంథా. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలతోనే గెలుస్తాం. ఒక్కొక్కప్పుడు మునుగుతాం... అంతిమంగా ప్రజలే గెలుస్తారు. ప్రజలే చరిత్ర నిర్మిస్తారు అన్నాడు. అన్ని రకాల వర్గాల పార్టీలలో, సంస్థలలో వెదికినా సరైన దారి దొరకక సొంత పార్టీ పెట్టాడు. అనారోగ్యం నుండి కోలుకుని మళ్ళీ ప్రజలలోకి వస్తనన్నడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక అంశం గ్రహించ లేక పోయారు. లేదా తన ప్రారంభ దశలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితి నిరంతరం అతని ఆలోచనను ప్రభావితం చేసింది. అర్థ వలస, అర్ద భూస్వామ్య వ్యవస్థ మార్పు చెంది పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దశలోకి మారి పోయిందని గ్రహించ లేక పోయారు. కేవలం దొరల దోపిడీ రూపం మారింది. ఇంకా సామ్రాజ్యవాద దళారీ ప్రభుత్వాలే అనుకున్నాడు. అదానీ, అంబానీ, టాటా... లను అమెరికా, రష్యా, చైనా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు, దేశ వనరులను దోచి పెట్టే దళారీలే అనుకున్నాడు. కేసీఆర్ దొర కాదు., ప్రాంతీయ పెట్టుబడిదారుడు. అలా దొరలు పెట్టుబడిదారులుగా, అదానీ అంబానీ టాటా లు గుత్త పెట్టుబడిదారులుగా అయినారని, ప్రస్తుతం వైరుధ్యాలు మారిపోయి, పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవం దశలోకి వెళ్ళిందని గ్రహించలేక పోయారు. తనకు తన మాతృ సంస్థ మధ్య సఖ్యత చెడడానికి కొంతమంది పార్టీ నాయకులు, సరిగా లేని తప్పుడు విధానాలే, వ్యక్తిగత ద్వేషాలే కారణమని భావించాడు. కులం కూడా కారణం అనుకున్నాడు. వాటితోపాటు సమాజంలో వచ్చిన పెట్టుబడిదారీ విధానంను గుర్తించ లేదు. కులం కూడా ఉద్యమం క్షీణించడానికి కారణం అయ్యిందో ఏమో అనుకున్నాడు. అస్తిత్వ వాదం, అంబేడ్కర్ లను మార్క్సిజంతో సమన్వయం ద్వారా ప్రయోగం చేయాలని, సాయధ పోరాటం కొన సాగాలి... దానితోపాటు అలానే రాజ్యాంగం ఓట్ల ద్వారా ప్రయోగం చేయాలని అనుకున్నారు. కానీ, పూర్తి నమ్మకం కుదిరినట్లు లేదు. "అలజడి సుడిలో అల్లాడిన గద్దరన్న" తీరని తాండ్లాటలో ప్రజల మధ్యకు రావాలి అనుకున్నారు. ఇంతలో అమరత్వం పొందారు. రోజు రోజుకూ పెరుగుతున్న పట్టణీకరణ, సంఘటిత, అసంఘటిత రంగంలో కార్మిక శ్రామిక వర్గాన్ని పెట్టుబడిదారీ వర్గం మరింత శ్రమను దోపిడీ చేసే కార్మిక చట్టాలను తెస్తూ, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు అమలుకు దూకుడుగా ఫాసిస్టు విధానంతో ఉన్న పెట్టుబడిదారీ మోడీ ప్రభుత్వమును, వర్గ చైతన్యంతో కార్మిక వర్గ పోరాటాలను నిర్మించి కార్మిక, అసంఘటిత శ్రామిక వర్గం, రైతు కూలీల మద్ధతుతో సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాల్సి ఉంది. సోషలిస్టు విప్లవం దశను సరిగా గుర్తించినట్లయితే ఈ ప్రయోగాలతో అభాసుపాలు కాకపోయేవాడు. సరైన ఒక విప్లవ పార్టీని నిర్మించేవాడు. నూతన ఉత్తేజంతో పూర్వ విప్లవ స్థాయిని చేరుకునే వాడు. నిరాశ చెందిన (బూర్జువా పార్టీలలో చేరకుండా) యువతను విప్లవ మార్గం పట్టించేవాడు. గద్దర్ అమరత్వం తర్వాత ప్రజాస్వామిక, విప్లవ పార్టీ, విప్లవ ప్రజాసంఘాలు, ఇతరులు గద్దర్ పై విపరీత వ్యాఖ్యానాలు, విమర్శలు, అంచనాలు., జోహార్లు తెలపాలా.!? లేదా, రెడ్ సెల్యూట్ ఎందుకు చేశారు.!? ఇలా చాలా చాలా... బూర్జువా పార్టీలలో కలిశాడు. దగ్గరయ్యాడు. చివరి దశలో తన విప్లవ ఆచరణను అంతా పచ్చలు పచ్చలు చేసుకున్నాడు అంటూ వర్గ శత్రువుపైన కూడా కక్కని విషాన్ని, విద్వేషాన్ని వెదజల్లారు. అయితే, విశాల పీడిత శ్రామిక ప్రజల హృదయాలలో ఉన్న ప్రేమ, నివాళుల హోరులో గాలి బుడగలా తేలిపోయాయి. సరే "నిందలేనిదే బొంద కూడా దిగదు" అని గద్దరన్ననే చివరి రోజులలో ఇంటర్వ్యూలో చెప్పాడు. వివిధ పార్టీల దగ్గరకు వెళ్లింది.., యాదగిరిగుట్ట, భద్రాచలం, రామానుజం.., మోడీ మీటింగు దగ్గరికి పోయినది.., రాహుల్ ను ముద్దు పెట్టడం నిజమే. నిజాలు నిజాలే., ఫాక్ట్ ను కాదనలేము. కానీ, ఫాక్ట్ ల నుండి ఏమి నిర్ధారణ చేసాము? ఇది ముఖ్యమైనది. అసలు ఎందుకు ఇలా చేశాడు.? చేయడంలో ఉద్దేశం ఏమిటి? అతనికి లాభం ఏమిటి.? అంత సుదీర్ఘ అనుభవమున్న ఎన్నో క్లిష్టమైన, తాత్వికమైన, సున్నితమైన భావాలను సైతం సూక్ష్మంగా గ్రహించి సరళ మైన ప్రజా బాణీలో విశాల ప్రజానీకానికి తన పాట ద్వారా ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగిన గద్దర్ అన్న ఈ చర్యల ద్వారా బద్నాం అవుతాను అని తెలియదా.!? తెలిసినా.., అనివార్యత ఏమిటి.? ఆ అనివార్యత ముమ్మాటికీ ప్రజల కొరకే., ప్రజల విముక్తి కొరకే., తను కన్న కలలు, నిరంతరం పోరాడిన సమసమాజం అంటే సోషలిస్టు సమాజం కొరకే. గద్దర్ అన్న ఆశయాలను, పాటను ముందుకు తీసుకెళ్ళడమంటే అది సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేయడమే. కామ్రేడ్ గద్దరన్నకు రెడ్ సెల్యూట్! విప్లవ జోహార్లు!! ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!!! షేక్ అబ్దుల్ కరీం కో-కన్వీనర్, కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (సియుసి) తేది: 14-08-2023 ఆర్టీసీ సమ్మె అవాక్కయ్యారా..! నిజంగానే ఈ రోజు తెలంగాణ ప్రజలు అందరూ అవాక్కయ్యారు. ప్రజల కంటే కూడా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు నిజంగానే అవాక్కయ్యారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీ నజరానా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇన్నాళ్లు తిట్టిపోసిన కార్మికులు సంతోషంగా ఉత్సాహంగా విందు సభ నుండి బయటకు వస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఫేస్ బుక్ లలో ఏం పోస్ట్ చేయాలి? ఏం కామెంట్ చేయాలో..! అర్థంగాక ఆలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు... చాలా పిట్టలని కొట్టారు. కార్మిక యూనియన్లు లేకుండా చేయడం. ప్రతిపక్ష పార్టీల అవకాశవాదాన్ని ప్రజలకు చూపించడం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి చెక్ పెట్టడం, సునాయాసంగా చార్జీలు పెంచడం... ఈ మొత్తం క్రమంలో విప్లవ కమ్యూనిస్టుల దృక్పథం ఏమిటి? ఎలా ఉండాలి..? కమ్యూనిస్టుల దృక్పథం నిర్ణయించుకోవాలంటే ప్రస్తుతం సమాజ స్వభావం నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా దృక్పథం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుగుణంగా చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలనన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తుంది. అలాగే రాష్ట్రాలను కూడా చేయమని ఒత్తిడి తెస్తుంది. దానిలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ నష్టాలలో ఉన్నదని చెప్పి కొన్ని రూట్లను ప్రైవేట్ పరం చేస్తానని, సమ్మె చట్ట విరుద్ధమని మొండికేసి, కార్మికులు చివరకు సమ్మె విరమించిన తర్వాత, న్యాయస్థానం కూడా ప్రైవేటుకు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత చివరికి ఎవరూ ఊహించని విధంగా కార్మికుల డిమాండ్లకు అదనంగా రాయితీలు, నజరానాలతో వెనక్కి ఎందుకు తగ్గినట్లు ఇది విశ్లేషణ జరగాలి. కేంద్రంలో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద అనుకూల వర్గాలు అధికారంలో ఉన్నాయి. వారికి మోడీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. వాటి అవసరాల అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంది. దాని కొనసాగింపుగానే మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను కూడా దానికి అనుగుణంగా, జాతీయ పెట్టుబడిదారి సామ్రాజ్యవాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంను ప్రైవేట్ చేయమని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్రంలో ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గం నుండి విముక్తి పొందిన రాష్ట్ర పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వానికి ఇక్కడి ప్రాంతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా ప్రైవేటీకరణ అవసరం అయినప్పటికీ, జాతీయ పెట్టుబడిదారి వర్గానికి ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గానికి ఉన్న వైరుధ్యం రీత్యా, జాతీయ పెట్టుబడిదారులతో పోటీ మూలంగా రాష్ట్రంలోని జాతీయ పెట్టుబడిదారి అనుకూల వర్గాల ముఠాల పార్టీలను నియంత్రణలలో పెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లు జాతీయ పెట్టుబడిదారుల అనుకూల పార్టీలు కాబట్టి మొదట వారిని ప్రజల ముందు కార్మికవర్గం ముందు నైతికంగా దెబ్బ కొట్టాడు. తన ప్రభుత్వం మాత్రమే దేశంలోకెల్లా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నట్లుగా చెప్పుకొని ప్రజా బలం కూడగట్టుకుని బీజేపీని ఎదుర్కొంటున్నాడు. బీజేపి ద్వంధ వైఖరిని ఎండగట్టాడు. ఇదంతా ఆంధ్ర పెట్టుబడిదారుల నుండి వేరుపడిన తెలంగాణ ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గం, తన అభివృద్ధికి జాతీయ స్థాయిలో వాటా కొరకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో జాతీయ స్థాయి పెట్టుబడితో ఘర్షణ అనివార్యం గనుక దానిని ఎదుర్కొనే ఎదిరించే దానిలో భాగంగానే, తాత్కాలికంగా తన బలాన్ని రాష్ట్రంలో నిలబెట్టుకోవడానికి ప్రజలను, కార్మిక వర్గం, ఉద్యోగ వర్గంతో సహా తాత్కాలిక సంతృప్తి చెందించి, ప్రసన్నం చేసుకోవడం అవసరం అయింది. ఇంతవరకు ఈ పరిణామం మొత్తంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీల పాత్ర ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మన దేశం ఇంకా అర్థ వలస, అర్థ భూస్వామ్య దేశమే అని అంటున్నాయి. సమాజంలో వచ్చిన మార్పులు గమనంలో తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అర్ధ భూస్వామ్య ప్రభుత్వమే అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ని భూస్వామి, దొర అని అంటున్నాయి. దొర అహంకారంతో మాత్రమే సమ్మెను నిరాకరించాడు అంటున్నారు. ఆ కోణంలోనే సమ్మెను సమర్థించాయి. సమ్మెలో జాతీయ బూర్జువా అనుకూల ప్రతిపక్ష పార్టీల అవకాశవాద రాజకీయాలను బహిర్గతం చేసి ఎండగట్టలేదు సరికదా వాటితో కలిసి పని చేశాయి. తమ ప్రత్యేకతను నిలుపుకోలేదు. తమకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని అవలంభించడం లేని కారణంగా మిగతా బూర్జువా ప్రతిపక్షంతో పాటుగా తెల్లబోవలసి వచ్చింది. తమ ప్రత్యేక కార్యాచరణ లేక పోవడానికి కారణం వారి రాజకీయ దృక్పథంలోనే ఉంది. ఇంకా అర్ధ వలస, అర్థ భూస్వామ్య సమాజం అని నిర్వచించడం లోనే ఉంది. దేశం పెట్టుబడిదారి దేశంగా పరివర్తన చెందినది అని గుర్తించకపోవడం ఈ అవాక్కుకు కారణం. షేక్ అబ్దుల్ కరీం తేది: 2-12-2019 సంఘటిత రంగం - అసంఘటిత రంగం మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గం, సాపేక్షికంగా కొంత అధిక సౌకర్యవంతమైన వేతనాలు పొంది, కొంత మధ్య తరగతి జీవన స్థాయిలో ఉండి, కార్మిక వర్గ పార్టీలకు, నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీకి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న, తక్కువ వేతనాలతో దుర్భర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక, కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల, శ్రామికులపై ఆధారపడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతును పొంది, కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గం, సాపేక్షికంగా కొంత అధిక సౌకర్యవంతమైన వేతనాలు పొంది, కొంత మధ్య తరగతి జీవన స్థాయిలో ఉండి, కార్మిక వర్గ పార్టీలకు, నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీకి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న, తక్కువ వేతనాలతో దుర్భర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక, కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇకముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల, శ్రామికులపై ఆధారపడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్ధతు పొంది, కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. షేక్ అబ్దుల్ కరీం 2021 ఎందుకిది రిహార్సల్ ఢిల్లీని ముట్టడించిన ఈ రైతాంగ ఉద్యమం ఎందుకు జరగబోయే సోషలిస్టు విప్లవానికి రిహార్సల్ ఎందుకు అవుతుందో చర్చిద్దాం... గత 50 సంవత్సరాలు క్రితం భారతదేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్యం అని దానికి అనుగుణంగా ఎంఎల్, మావోయిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. అవి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక ఉద్యమంలో భాగంగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధం ద్వారా గ్రామాల నుండి పట్టణాలకు వ్యాపిస్తుందని, గ్రామాలను విముక్తి చేసి, వెనక తట్టు ప్రాంతాలలో విముక్తి ప్రాంతాలను ఏర్పరచి అంచెలంచెలుగా పట్టణాలను విముక్తం చేసి విప్లవాన్ని విజయవంతం చేయాలి. ప్రస్తుత మారిన పెట్టుబడిదారీ సమాజంలో విప్లవం ఎలా వస్తుంది? పట్టణ కార్మిక వర్గం అసంఘటిత శ్రామిక వర్గం రైతాంగ శ్రామికులతో కలిసి ఏవిధంగా విప్లవం చేస్తారు..? రష్యా మాదిరిగా సార్వత్రిక తిరుగుబాటు ద్వారా విశాల భారతదేశంలో విప్లవం సాధ్యమా..? అనే అనుమానం ఉంది. ఇంతకాలం నూతన ప్రజాస్వామిక విప్లవానికి అలవాటుపడ్డ వారికి సార్వత్రిక సాయుధ తిరుగుబాటు ద్వారా సాధ్యమనేది అనుమానమే కాదు... ఊహకు అందని విషయం. అందువలన రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికల ద్వారా సోషలిస్టు విప్లవం వస్తుందని పొరపాటు అవగాహనకు నెట్ట బడుతున్నారు. వర్గ వైరుధ్యాలు ముదిరినప్పుడు సంక్షోభం తీవ్రతరం అయినప్పుడు అతి కొద్ది కాలంలోనే రాజకీయ మార్పులు వేగంగా మారుతాయని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. దానిని ఇప్పుడు రైతాంగ ఉద్యమం నిరూపించింది. కాబట్టి ఇది రిహార్సల్ కాకుండా ఏమౌతుంది..? ఒకసారి ఆలోచించండి. ఈ రైతాంగ ఉద్యమం... ధనిక రైతాంగం యొక్క నాయకత్వంలో జరుగుతుంది. అయినా కొంతవరకు మధ్య, చిన్న రైతు యొక్క ప్రయోజనం కూడా ఉంది. ఈ పోరాటం ప్రత్యక్షంగా పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కార్పోరేట్లకు వ్యతిరేకంగా గురి పెట్టబడింది. రోజుల తరబడి రాజధానికి వెళ్ళే రహదారులను దిగ్భంధం చేయడమంటే సార్వత్రిక తిరుగుబాటు రూపమే. కార్మిక వర్గంలో విప్లవ శక్తుల నిర్మాణాలు బలంగా ఉండి ఉంటే, వారికి మద్ధతుగా ఉద్యమంలో దిగితే అక్టోబర్ విప్లవ దృశ్యం కనిపించక పోయేదా..! ఇది సోషలిస్టు విప్లవంలో కొంత భాగమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతి శీల శక్తులను మరియు అంతర్జతీయ స్థాయిలో కూడా మద్ధతు కూడగట్ట కలిగింది. ఆకర్షించగలిగింది. పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగంలో, సైన్యంలో కూడా ప్రత్యక్ష సానుభూతిని, సహకారాన్ని పొందగలిగింది. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోని రైతాంగం పెద్దగా కదలక పోవడానికి కారణం రైతాంగంలో పనిచేస్తున్న రైతు సంఘాలు, వాటి పార్టీలు వారికి దూరమయిన స్థితిని బహిర్గతం చేసింది. ఈ రైతాంగ ఉద్యమం ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకున్నా లేక పాక్షికంగా సవరణలతో కొంత కాలంలో సద్దుమణగ వచ్చు. ఫలితం ఏదైనా రావచ్చు. అయితే, భారత సమాజానికి కొత్తరకం పోరాటాన్ని రుచి చూపిస్తుంది. దీనినుండి విప్లవ కమ్యూనిస్టులు తీసుకోవలసిన పాఠాలు... తమ కాలం తీరిన అర్ధ వలస, అర్ధ భూస్వామ్యం సరి చేసుకుని, ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజం యొక్క అప్ డేటెడ్ పంథాలోకి మారడం. మారకపోతే వారు ప్రజల నుండి పూర్తిగా దూరం అవుతారు. ఇక కార్మిక వర్గం మరియు అసంఘటిత కార్మిక వర్గం శ్రామిక వర్గం రైతు కూలీ, పేద రైతాంగం ప్రత్యక్షంగా మద్దతుగా ఉద్యమంలోకి రాలేదు. ఆయా సెక్షన్లను కదిలించే విప్లవ శక్తులు బలహీనంగా, నామమాత్రంగా ఉన్న కారణంగా నాయకుల సంఘీభావ సపోర్ట్ మాత్రమే లభిస్తుంది. దీనికి ఆయా పార్టీల పంథానే కారణం. ఇకనైనా మారిన పెట్టుబడిదారీ సమాజం పరిస్థితులకనుగుణంగా తమ పంథాలు మార్చుకుని విస్తృతంగా కార్మిక వర్గంలో, అసంఘటిత కార్మిక వర్గంలో పని చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు గిట్టుబాటు ధర రైతు కూలీల సమస్యలపై పోరాటంల్లోకి సంఘటిత పరచాలి. పట్టణాలలో కార్మిక యూనియన్లలతోపాటుగా బస్తీల స్థాయిలో అసంఘటిత రంగ కార్మికులను, శ్రామికులను ఐక్యం చేసి బస్తీ స్థాయి సంఘాలను ఏర్పరచాలి. అవి ముందు ముందు విప్లవ సోవియెట్ లుగా పరివర్తన చెందే లక్ష్యంతో చైతన్యంతో నిర్మించాలి. మన దేశ పరిస్థితుల దృష్ట్యా అసంఘటిత కార్మిక వర్గం శ్రామిక వర్గం సోషలిస్టు విప్లవంలో ప్రధాన చోదకశక్తిగా ఉంటుంది. వ్యవసాయ సంక్షోభం వల్ల రోజు రోజుకూ పెరుగుతున్న గ్రామీణ రైతాంగ వలసల మూలంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది. దానితోపాటుగా అసంఘటిత రంగం పెరిగి మురికివాడల బస్తీలు పెరుగుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు తమ చిన్న కమతంతో వ్యవసాయం గిట్టుబాటు కాక వాటిని అమ్మేసి, వారి వారసులు పట్టణాలకు ఉపాధికోసం వలస వెళుతున్నారు. వీరిలో నిరుద్యోగులైన యువకులు అధికం. వీరు అసంఘటిత రంగంలోని పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, రవాణా, మార్కెటింగ్, డెలివరీ బాయ్స్, నిర్మాణ రంగంలో మరియు ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా అతి తక్కువ వేతనానికి పనిచేస్తూ, అత్యధిక దోపిడీకి గురవుతున్నారు. ఎంఎల్, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికయినా మారిన సమాజాన్ని పెట్టుబడిదారీ సమాజంగా గుర్తించాలి. అంత సులభంగా ఎంఎల్ విప్లవ పార్టీలు మారుతాయని అనుకోలేము. వాటిలోని విప్లవకర ఎలిమెంట్స్,ఇతర వ్యక్తుల, అభ్యుదయ, మేధావి వర్గాలు సంఘటితమై సోషలిస్టు విప్లవం కొరకు నూతన విప్లవ పార్టీ నిర్మించే ప్రయత్నం చేయాలి. విస్తృతంగా సోషలిస్టు విప్లవ అవసరాన్ని సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్తమాన పరిస్థితుల్లో నూతన విప్లవ క్రమాన్ని డిమాండ్ చేస్తుంది. షేక్ అబ్దుల్ కరీం తేది: 17–12–2020 సోషలిస్టు విప్లవంలో కుల, మత, పితృస్వామ్య వ్యతిరేక పోరాటం పెట్టుబడిదారీ సమాజం వచ్చిందనగానే చాలామంది వివిధ తప్పుడు భావాలను, అనుమానాలను అంటగడుతున్నారు. పెట్టుబడి సమాజంగా మారిందనే వాళ్ళు, కుల, ఇతర మత, పితృస్వామిక అణచివేతలను తక్కువ చేసి చూడరు. వాటిపై పోరాటం చేయవద్దనరు. నిజంగా వారే అధికంగా, సమూలంగా నిర్మూలించడానికి పోరాడుతారు. నిజానికి అర్థ వలస, అర్థ భూస్వామ్యంలోనే అగ్రకుల భూస్వామ్య, కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడకుండా దాటవేయాల్సి ఉంటుంది. దానికి గల కారణం నూతన ప్రజాస్వామిక దశలో జాతీయ బూర్జువా, చిన్న భూస్వామి, అగ్రకుల ధనిక రైతు వర్గాలతో ఐక్య సంఘటన ఉంటుంది. కాబట్టే మొదటి దశలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో దళిత వర్గం అన్నివర్గాల కులాలతో కలిసి పోరాటం చేశాయి. తర్వాత దశలో ధనిక వర్గంతో ఐక్య సంఘటనలో మిత్ర వర్గం అన్నప్పటి నుండీ లేదా అగ్రకుల ధనిక వర్గంపై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని దశలో విప్లవోద్యమం నుండి దళితులు క్రమంగా వేరవుతూ అస్తిత్వ వాదం, అంబేడ్కర్ వైపు వెళ్లారు. దేశంలో ధనిక రైతు అంటే ఎక్కువగా అగ్రకులాల వారే. అర్థ భూస్వామ్య, అర్థ వలస పేరుతో విశాల ఐక్య సంఘటనలో భాగంగా జాతీయ బూర్జువా, చిన్న భూస్వామి, ధనిక రైతు వర్గాలతో ఐక్యత మూలంగా కుల అణచివేతకు, ఫ్యూడల్ అవశేషాలు పితృస్వామికకు ఉపయోగపడుతున్నాయి. సోషలిస్టు విప్లవ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడిదారీ వర్గంతోపాటు సకల భూస్వామ్య అవశేషాల నిర్మూలన పోరాటం చేస్తారు. షేక్ అబ్దుల్ కరీం తేది: 02-02-2022 భావ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న విప్లవ ప్రజా సంఘాలు ఒక సరైన సిద్ధాంత భూమిక లేకుండా ఈ బూర్జువా రాజ్యాంగాన్ని కాపాడాలని, మార్పుకు అతీతమని, మార్పు చేయడం అంటే ప్రజా ద్రోహమని అంటున్నారు. అంబేద్కర్ రచించాడు కాబట్టి... దళితులకు రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి... ఈ రాజ్యాంగం అత్యుత్తమమైనదని అమలు చేయడంలోనే లోపం ఉందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే? మన దేశానికి స్వాతంత్రమే రాలేదు. అధికార మార్పిడి మాత్రమే జరిగింది. దళారి బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం ఉన్నదని అంటూనే నూతన ప్రజాస్వామ్య విప్లవం కావాలని కోరుకునేవారు విచిత్రంగా ఈ రాజ్యాంగాన్ని ఉన్నతమైనదిగా యధాతధంగా ఉంచాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం. ఒక దళారీ భూస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడాలనడం ఏ విలువలకు సరిపోతుంది. పోనీ, వీరు ప్రస్తుత రాజ్యాన్ని బూర్జువా రాజ్యంగా గుర్తిస్తున్నారా.!? కనీసం బూర్జువా రాజ్యంగా గుర్తించకుండా, ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలంటారు. అది ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది సైద్ధాంతిక దివాళాకోరుతనం. కమ్యూనిస్టులకు ఉండాల్సిన కనీస సైద్ధాంతిక పరిజ్ఞానం లేదనిపిస్తుంది. లేదా ఇది పచ్చి అవకాశవాదం. భూస్వామ్య, ఫ్యూడల్ మతవాదులు నుండి ప్రమాదం ఉందని అంటున్నారు. వారు మళ్ళీ ఫ్యూడలిజంలోకి తీసుక వెళ్తారు అంటున్నారు. అంటే, ఇది బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాంగం, అధికారంలో ఉన్నది బూర్జువావర్గం (అంటే జాతీయ పెట్టుబడిదారీ వర్గం) అని అనుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇది బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాంగం అని గుర్తిస్తే, దీనిని కూడా కార్మిక వర్గ నాయకత్వం, కమ్యునిస్టులు సోషలిస్టు విప్లవంలో భాగంగా కూలదోయాల్సి ఉంటుంది. కాబట్టి, కమ్యునిస్టులు నూతన ప్రజాస్వామిక విప్లవం అనేవారైనా, సోషలిస్టు విప్లవం అనే వారైనా అనాల్సింది చేయాల్సింది ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాన్ని కూల దోసి విప్లవం పూర్తి చేయాలి. అర్ధ వలస భూస్వామ్యం.. నూతన ప్రజాస్వామ్య విప్లవం అనే వారికిగానీ ఇది అర్థ వలస, అర్థ భూస్వామ్యం దశ. కావాల్సింది సోషలిస్టు విప్లవం అనే వారికి ప్రస్తుత రాజ్యాంగంతో వైరుధ్యమే ఉంది. ఇక ఏ వైరుధ్యం లేనిది ఎవరికంటే..? బూర్జువా వర్గానికి లేదా పెట్టీ బూర్జువా వర్గానికి ఎంతో కొంత రాయితీలు పొందే ఉద్యోగ మరియు ప్రజలలో ఒక సెక్షన్ కు మాత్రమే. మార్క్సిజం ప్రకారం రాజ్యం అంటేనే ఒక వర్గం ఇంకో వర్గాన్ని అణచివేసే సాధనం. మరి ఈ రాజ్యం, రాజ్యాంగం ఏ వర్గానికి చెందినది. విప్లవ ప్రజా సంఘాలు ఇకనైనా అటు ఇటూ కాని ఈ భావజాలాన్ని వదలి వేయాలి. లేకుంటే అటుఇటుకాని చరిత్ర హీనులుగా, అంతిమంగా విప్లవ ప్రతిఘాతక భావజాల సమర్ధకులుగా మిగిలిపోతారు. షేక్ అబ్దుల్ కరీం తేది: 20-09-2022 అర్థ భూస్వామ్యం ఉందనేవాళ్లు అర్థ భూస్వామ్యం ఉందని వాదించేవాళ్లు పెద్ద ఫ్యూడల్ భూస్వాములు అయితే లేరు... కానీ, చిన్న భూస్వాములు, ధనిక వర్గం చేతిలో అధికారం, అగ్రకులాల దురహంకారం, కుల వివక్షత ఉన్నాయి. కాబట్టి, ఇంకా ఇది అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశమే అని అంటున్నారు. ఇంకా దున్నే వారికే భూమి అమలు జరగాలంటున్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవమే అంటున్నారు. సరే.., మరి వీరు దీనికి సమాధానం చెప్పాలి. ఏమిటంటే? ఎవరి భూమిని ఎవరి దగ్గర నుండి లాక్కొని పంచాలి. ఈ ప్రశ్నను మాటిమాటికి నేను ఎంతోమందికి వేసినాను. కానీ, చాకచక్యంగా సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇలా దాటవేయడానికి కారణం వారి ద్వంద విధానంలో ఉన్నది. దానిని వారు గుర్తించడం లేదు. తెలిసో.., తెలియకో.., లేదా అవకాశవాదంగా వాదన కోసం ఉపయోగిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే? నూతన ప్రజాస్వామిక విప్లవంలో చిన్న భూస్వామి, ధనిక రైతు, కార్మిక వర్గాలకు మిత్రవర్గమే. వాస్తవంగా నూతన ప్రజాశ్వామిక విప్లవ కార్యక్రమంలో బడా భూస్వాముల భూమిని మాత్రమే స్వాధీనం చేసుకోవాలి. ధనికరైతు, చిన్న భూస్వాములపై ఎలాంటి పోరాటం చేయడానికి కుదరదు. విచిత్రంగా ఇప్పుడు వాదించే వారు.., చిన్న భూస్వామి, ధనిక రైతు, పెత్తందారీ వర్గం దగ్గర ఉన్న భూమిని ఉదహరించుతున్నారు. మరి వీరి భూమిని లాక్కుంటారా.!? అని అడిగితే జవాబు చెప్పటానికి ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. వీరిని చూపించి అర్థ భూస్వామ్యం ఉందంటారు. వీరి దగ్గర భూమి ఉందని చూపిస్తారు. నూతనంగా ఎదిగిన ధనిక వర్గం వద్ద ఉన్న భూమినీ చూపిస్తారు. వీరి భూమిని పంచుతారా..? వీరిపై పోరాటం చేస్తారా? ఐక్య సంఘటన ఎలా? భూస్వామ్యం కొత్త రూపంలోకి వచ్చింది అంటారు. కానీ, వారికి వ్యతిరేకంగా పోరాటం సిద్ధాంత రీత్యా చేయలేరు. షేక్ అబ్దుల్ కరీం ఫేస్ బుక్ లో... అమానవీయ శ్రమపై చర్చ --- అబ్దుల్ కరీం ఇరవై ఏళ్ల క్రితం వరకు రిక్షా బండ్లు మనషులు లాగే వాళ్ళు. ఒక మనిషి ఇతరులను లాగడం మానవత్వం లేని అమానవీయ శ్రమ. ఎక్కువగా ఎస్టీ, ఎస్సీ, క్రింది కులాల వాళ్ళు గ్రామాల నుండి వలస పోయిన వారు రిక్షాలు నడిపే వారు. ఆటోలు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోయింది. ఆటోను అన్ని సెక్షన్ల, కులాల, మతాలకతీతంగా డిగ్నిటిగా నడుపు కుంటున్నారు. ఇక్కడ కుల మతాలు ప్రాంతాలు కూడా లేవు. కేవలం ఆటో డ్రైవర్. టెక్నాలజీ మార్పు, పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందడం వల్ల జరిగింది. ఇక్కడ ఏ వర్గ పోరాటం, కుల పోరాటం జరగలేదు. అలానే ఇతర అమానవీయ వృత్తులు పోవాలంటే పారిశ్రామికీకరణ జరగాలి. వ్యవసాయంలో కూడా... పారిశ్రామీకరణ, పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిస్టు విప్లవం ద్వారా సాధ్యం. ‌కుల మత ప్రాంతీయ నిర్మూలన పూర్తిగా జరిగిపోయి, ప్రజలందరికీ సమానత్వం రావాలంటే సోషలిస్టు విప్లవమే.., మార్క్సిజమే అవసరం. ఇది మాత్రమే ఆచరణాత్మక మార్గం. Q. ఆటోకి కులం లేదు... నడిపే వ్యక్తికి ఉంది కదా? మెకనైజేషన్ తో కులం పోవడం లేదు. ఆటో నడిపే వ్యక్తికి సంబంధించి కులం చూడకుండా ఇల్లు కిరాయికి ఇస్తున్నారా!? ఒకవేళ కొన్ని డబ్బులు జమ చేసుకుని ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా!? కోనసీమ పరిణామాలను ఏవిధంగా చూడాలి? సోషలిస్టు విప్లవం కోసం ఎదురు చూడడమేనా మనకు మిగిలిన ఆప్షన్!? A. మధ్యంతరం ఉంటే మంచిదే., మరి అది ఏమిటి? అందరూ గోడు వెళ్ళబోసు కోవడమే., లేదా వాళ్ళ కష్టాలను వర్ణించి చెప్పడమేగానీ ఎలా మార్చాలి అనేది ప్రశ్న. ఆ పరిష్కారం శాస్త్రీయంగా, గతితార్కికంగా ఉండాలి. లేదా వారి సిద్ధాంతపరంగా ఎందుకు అమలు చేయలేక పోయారు. ఇప్పుడు చేసే వారు ఎలా చేసి సాధిస్తారో చెప్పాలి. ఆటో నడిపే వారికి కులం, మతం, ప్రాంతం ఉంది. కానీ, నేను చెప్పిన విషయం ఒరేయ్ రిక్షా నుండి ఆటో బాబుగా మారిన దాని గురించి. ఆటో వృత్తి (డ్రైవర్) చేయడానికి ఏవీ అడ్డు లేవని. యాభై సంవత్సరాలుగా వివిధ ఎంఎల్ పార్టీలు, వారి కేడర్ అంతా ఎన్నో బలిదానాలతో, నిబద్ధతతో, వీరోచితంగా పోరాడారు. ప్రాణాలు అర్పించారు. ప్రజలతోనే ప్రజల కోసమే. వారు కుల మత నిర్మూలనకు పనిచేసిన వారే., ఈ మాత్రం గ్రామాలలో దళిత, పీడిత కులాల చైతన్యం కల్పించింది వారు కాదా.!? సిద్ధాంత, ఆచరణ పొరపాట్ల మూలంగా వెనక పట్టు పట్టినంతనే, అస్తిత్వ, అంబేడ్కర్, కుల సంఘాలను ఆశ్రయించడమేనా..! అవి కమ్యూనిస్టులను మరింత వెనక్కి నెడుతున్నాయి. బూర్జువా నియంతృత్వ రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తున్నారు. బూర్జువాలు కులాలను, మత ప్రాంతీయతలను కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నాయి. వాస్తవంగా కుల మత నిర్మూలనను చాలా వెనక్కు నెడుతున్నారు. మార్క్సిజంలో కుల మత నిర్మూలన సాధ్యం కాదా.! తాత్కాలిక వెనుక పట్టు ఎప్పటికీ ఉంటుందా.! ముందుకు నెట్టే, సరిదిద్దే బాధ్యత కొంత మేరకైనా విముక్తి పొందిన వారిపైనే ఉంది. Q. చర్చ కిందా మీదా చేస్తే ఏ విషయమూ తెగదు మిత్రమా... జంప్ చేస్తూ పోతే ఏం ఉపయోగం. A. జంప్ చేయడం లేదు. సమస్యను విడదీసి చర్చించడం వల్ల తప్పు నిర్ణయాలు వస్తాయి. Q. మన చర్చలో, పియ్యి ఎత్తడం, మోరీలు, రోడ్డు ఊడవడం, ఇంట్లో పని, వంట పని, శుభ్రం చేయడం... ఇవి ఎలా పోవాలి.? లేదా కొన్ని కులాలు, జెండర్ లకే ఎందుకు ఉండాలి? A. ఇవి పోవాలంటే, సమానత్వo రావాలంటే మార్క్సిజం ప్రకారం యాంత్రీకరణ జరగాలి. మనుషులు చేసే పనులు యంత్రాల ద్వారా చేయటం వలన ఆ అమానవీయ వృత్తులు నిర్మూలించ బడుతాయి. ఫ్యూడల్ కాలంలో బానిసలు తమ భుజాలపై మోసే వారు. గుర్రపు బండ్లు, ఆ తర్వాత కార్లు మోటార్లు రావడంతో మోసే వృత్తి అంతరించింది. అంటే సామాజిక మార్పులతో మానవులు శాశ్వత విముక్తి పొందుతారు. ఎంత వాపోయినా, ఏమి చేసినా ఫలితం ఉండదు. పెట్టుబడిదారీ సమాజ రాజ్యాంగ పరిధిలో కుల నిర్మూలన, జెండర్ సమానత అసాధ్యం. షేక్ అబ్దుల్ కరీం తేది: 6-6-2022 ఫేస్ బుక్ లో జరిగిన చర్చ ఆధునిక కార్మిక వర్గం "సిద్ధాంతరీత్యా... కష్ట జీవులంతా కార్మిక వర్గంలోకి రారు. అంటే వ్యవసాయ కార్మికులుంటారు.., పట్టణాల్లో కూలీ చేసుకునే వారు ఉంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు వారంతా కూడా కార్మికుల్లోకి రారు. పరిశ్రమలో పని చేసే వారినే కార్మికులు అంటాము. పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు గనుక, ఒక ఉన్నత స్థాయి టెక్నాలజీ, సాంకేతికపరమైన వాతావరణంలో, పనిముట్లతో వారు పనిచేస్తూ ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కార్మిక వర్గానికి మాత్రమే విప్లవానికి నాయకత్వం వహించే శక్తి ఉంటుంది." ఇది ఇప్పటి ఆధునిక కాలంలో చెల్లుతుందా.!? పెట్టుబడిదారీ అసమాన అభివృద్ధి మరియు విస్తరణ యొక్క సమ్మేళన ఫలితంగా గ్రామాల నుండి వివిధ పట్టణ కేంద్రాలకు, వ్యవసాయ ప్రాంతాలకు, కార్మికుల సామూహిక వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్ళే వారినే మనం వలస కార్మికులు అంటాము. వీరంతా నిర్మాణ రంగంలో వ్యవసాయ రంగాలలో పనిచేసే కార్మికులు. నేడు ఉన్న నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం కూడా పెట్టుబడి - కూలీ సంబంధాలపై నడుపబడే రంగాలే. ఈ రంగాలు కూడా పారిశ్రామిక రంగం వలెనే కార్మికుల శ్రమ శక్తిపై పెట్టుబడి పెట్టి, వారి అదనపు శ్రమను దోపిడి చేసే రంగాలే. తమ శ్రమ శక్తిని పెట్టుబడికి ఒక సరుకు వలె అమ్ముకుని జీవించే వారంతా కూలీలే., కార్మికులే. అయితే, ఈ కార్మికులు వివిధ రంగాలలో పనిచేస్తూ ఉంటారు. కొందరు కార్మికులు పారిశ్రామిక రంగంలో పని చేస్తూ ఉంటే, మరికొందరు వ్యవసాయ నిర్మాణ తదితర రంగాలలో ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే కార్మికులని. మిగిలిన రంగాలలో పని చేసే కార్మికులు, కార్మికులు కాదనే ఒక గుడ్డి నమ్మకం - ఆలోచన కొందరిలో ఉంది. అలాంటి వారంతా శ్రమ శక్తిని పెట్టుబడికి సరుకు వలె అమ్ముకుని జీవించే వారంతా కూలీలే., కార్మికులే అని, వీరంతా కార్మిక వర్గానికి చెందుతారని గుర్తించాలి. పట్టణాలలో జీతాల కోసం తమ శ్రమ శక్తిని అమ్ము కునే వారు భారీ, సంఘటిత రంగంలో ఉన్నవారిని సంఘటిత రంగ కార్మికులు, చిన్న తరహా పరిశ్రమల నిర్మాణ రంగం, ఓలా... లాంటి రవాణా, మాల్స్, ఆన్ లైన్ మార్కెటింగ్, ఫుడ్, గూడ్స్ డెలివరీ, హాస్పిటల్స్ లో నర్సులు, సాంకేతిక సిబ్బంది... ఇలా విశాలమైన నూతన రంగాలు ఈ ఆధునిక కాలంలో సరికొత్త రంగాలలోని వేతన శ్రామికులు వీరిని అసంఘటిత రంగ కార్మికులు అంటారు. శతాబ్దం క్రితం నాటి ఉత్పత్తి విధానాలు నేడు మారిపోయాయి. పడిగట్టు శతాబ్ధం కాలం నాటి అవగాహనను ప్రస్తావించడం శాస్త్రీయ కమ్యూనిజం అనిపించదు. షేక్ అబ్దుల్ కరీం తేది: 28-1-2024 కేసీఆర్ ప్రభుత్వం - పెట్టుబడిదారీ అనుకూలత కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడిదారీ అనుకూలం. కాబట్టి పెట్టుబడిదారీ విధానం వైపు వేగంగా రాష్ట్రాన్ని తీసుక వెళుతున్నాడు. అందులో భాగంగానే, పెట్టుబడిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నడు. కంపెనీలు ఏర్పాటుకు భూములను ఇస్తున్నది. అందులో భాగంగా విద్యను కూడా బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఉన్నత విద్య ఇంతకు ముందు నుండీ ప్రైవేటీకరణలోనే ఉంది. ఇది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పడం ఒట్టి బూటకం. పెట్టుబడిదారీ వ్యవస్థలో, ఉచిత సమాన విద్య, ఆరోగ్యం మిగతా సమానత్వం ను ఆశించలేము. వారు చేయ లేరు. కార్మిక వర్గ నాయకత్వంలో ఏర్పడే కార్మిక వర్గ ప్రభుత్వంలో మాత్రమే నిజంగా సమానత్వం అంటే సోషలిజం సాధ్యం. కాబట్టి విద్యార్థులు యువకులు, మేధావులు, కార్మికులు, రైతులు మరియు ప్రజలు సమసమాజం సోషలిస్టు స్థాపన కొరకు ఏవిధంగా ఉద్యమించాలో, దానిని సాధించుటకు ఏ మార్గంలో వెళ్ళాలో, అటువైపుగా ఆలోచిస్తే మంచిది. 1990 లకు ముందు భూస్వామ్య అనుకూల కాలంలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉండేది. అపుడు అందరికీ సమాన అవకాశాలు ఉన్నా.., అపుడు చదవడానికి విద్యార్థులు రావడం అతి తక్కువ. భూస్వాములు గ్రామాలలో పాఠశాలలను ఏర్పాటు చేయనివ్వ లేదు. నక్సల్బరీ పోరాటాల ఫలితంగా భూస్వామ్య వర్గం పెత్తనం నశించి, విద్య అంటే చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు ఉనికిలోకి వచ్చినాయి. అటు తర్వాత సరళీకరణ, ప్రపంచీకరణలతో విద్య విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయంలో కూడా పెట్టుబడిదారి సంబంధాలు ప్రవేశించాయి. భూస్వామ్య విధానం కంటే పెట్టుబడిదారి, ప్రైవేటీకరణ అభివృద్ధికరమైనదే. ఇపుడు కర్తవ్యం పెట్టుబడిదారి సమాజాన్ని దాటుకుని సోషలిస్టు సమాజం కోసం, దాని వైపు పురోగమించాలి. మార్క్సిజం చెప్పేది సమాజం ఫ్యూడలిజం నుండి క్యాపిటలిజం నుండి సోషలిజం. ఈ పరిణామ క్రమంలో సమాజం ముందుకు పోతుంది. షేక్ అబ్దుల్ కరీం 2021 ఉన్నత ఉత్పత్తి విధానం "ఉన్నత ఉత్పత్తి విధానం అయిన కమ్యూనిస్టు సమాజపు నిమ్న దశ స్థాపనకు (Lower Stage of Communism) ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఒక షరతు. అయితే అభివృద్ధి తగినంతగా జరుగకముందే అధికారంలోకి వచ్చి ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేవాళ్లూ., సోషలిజం (?) స్థాపనకూ ఉత్పత్తి శక్తుల అభివృద్ధికీ లింక్ లేదనేవాళ్లూ సారాంశంలో ఒకే వాదన చేస్తున్నారని అర్థం." ఈ వ్యాఖ్య సరైనదే అయితే రష్యా అక్టోబర్ విప్లవం సరైనది అవుతుందా..? రెండు సరైనవే., కాకపోతే విప్లవం తర్వాత విప్లవ శక్తుల అభివృద్ధి కోసం, దానిని రక్షించు కోవటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇవి చరిత్రలో అనివార్యమైనవే. ఇలాంటి అనుభవాలు, గుణపాఠాలు, ఓటములు లేకుండా సూటిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనడం సరికాదు. అలా జరగదు కూడా. మార్క్స్ కాలంలో 1849 లో కూడా విప్లవానికి ప్రయత్నించి ఓడిపోయారు. ఆతర్వాత ప్యారిస్ కమ్యూన్ విఫలం... దాని నుండి వచ్చిన గుణపాఠం తర్వాత అక్టోబర్ విప్లవం. ఆ తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో సోషలిస్టు ప్రభుత్వాలు, చైనా విప్లవం, కొరియా, వియత్నాం... ఆ తర్వాత క్రమంగా పెట్టుబడిదారీ దేశాలుగా తిరోగమనం చెందాయి. ఇప్పుడు ప్రపంచంలో అధిక భాగంలో ఉత్పత్తి శక్తులు బాగా అభవృద్ధి చెంది ఉన్నాయి. ఆఫ్రికా దేశాలు పేద దేశాలైన కూడా., అక్కడ చిన్న తరహా ఉత్పత్తి స్వయం సంపూర్ణ అవసరాలను తీర్చలేవు. అక్కడ సామ్రాజ్యవాద దేశాల ఫాంహౌస్ లు, పరిశ్రమలు ఉన్నాయి. వారు ఉపయోగించే కొద్దిపాటి వస్తువులు, ఆహార పదార్థాలు కూడా భారీ పరిశ్రమల ఫాంహౌస్ ల ద్వారా ఉత్పత్తి చేయబడినవే. చరిత్ర ఎల్లప్పుడూ అనుకున్న గతితార్కిక పద్ధతిలో ముందుకు సాగదు. మార్క్స్ మొదట బాగా పెట్టుబడిదారీ అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్, యూరోప్ లో విప్లవ వస్తుంది అనుకున్నారు. కానీ, వెనుకబడ్డ రష్యాలో వచ్చింది. జర్మనీ, ఫ్రాన్స్ లలో విప్లవాలు వచ్చి రష్యా విప్లవం కు దన్నుగా ఉంటాయని లెనిన్ అనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో సోషలిస్టు దేశాలు ఏర్పడ్డాయి. కానీ, చైనాలో రష్యా మాదిరి సార్వత్రిక తిరుగుబాటు ద్వారా కాకుండా దీర్ఘ కాలిక సాయుపోరాటం ద్వారా విప్లవం వచ్చింది. పై వాదనలు చేసే వారు సిద్ధాంతం మక్కీకి మక్కీగా అలానే జరగాలి. అలా జరగలేదు. కాబట్టి ఇది తప్పు అంటున్నారు. ఆచరణలో ప్రయత్నం చేస్తున్నపుడు మనకు తెలిసిన సిద్ధాంతం ప్రకారమే జరగదు. అలానే కాకుండా ఇంకో విధంగా జరుగవచ్చు. అలానే జరుగుతాయి. చరిత్ర అదే రుజువు చేసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒక మెరుగైన పద్ధతి తీసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాము. కొంత దూరం వెళ్ళాక మార్పులు జరిగితే మళ్ళీ సరి చేసుకుని ముందుకు వెళ్ళాసిందే., వేరే మార్గం లేదు. ‌కాబట్టి పారిస్ కమ్యూన్ కానీ, రష్యా విప్లవం, చైనా విప్లవం గానీ, ఇంకా నక్సల్బరీ ఎంఎల్ పార్టీలు, అలా జరగలేదనడం సరికాదు. వచ్చిన అనుభవాన్ని బట్టి త్వరగా మార్పు చేసుకుని ముందుకు సాగడమే సరైన ఆచరణాత్మక పద్ధతి. షేక్ అబ్దుల్ కరీం తేది: 04-04-2022 కమ్యూనిస్టు పార్టీల పంథాలు సరిగా ఉన్నంత కాలం కమ్యూనిస్టుల పంథాలు సరైన దిశలో ఉన్న కాలంలో ఈ మనువాద, కుల వాదాలు లేవు. సమాజ మార్పుకు అనుగుణంగా పార్టీలు ప్రక్షాళన కాలేక, ముందుకు పోలేని దశలోనే మనువాద, కుల వాదం ముందుకు వస్తున్నది. రకరకాల వ్యక్తిగత, వర్గ ప్రయోజనం రీత్యా దీనికి మద్ధతు ఇస్తున్నారు. దీని వత్తిడి మూలంగా పార్టీలు కూడా మనువాద, హిందూ, బ్రాహ్మణీయ అనే స్థాయికి అనివార్యంగా నెట్టబడ్డాయి. దీనికి మూలం అర్థ వలస, అర్థ భూస్వామ్యం, నూతన ప్రజాస్వామిక దశలోనే ఉన్నది. దీనిని సరి చేసుకుని, పెట్టుబడిదారీ సమాజంగా గుర్తించి, సోషలిస్టు విప్లవం పంథాలోకి మారితే ఈ వాదాలన్నీ పోయి సోషలిస్టు విప్లవం వాదంలోకి వస్తాయి. వాస్తవంగా సోషలిస్టు విప్లవం కొరకు ప్రయత్నంలోనే వర్గ దృక్పథం పెరిగి, కులం యొక్క అవసరం తీరిపోతుంది. గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో అన్ని కులాలు కలవ లేదా..! ఆ మేరకు దళిత, బహుజన కులాలు విముక్తి పొందలేదా..! ‌ ఆ విధంగానే ఉన్నత సోషలిస్టు విప్లవ క్రమంలో మిగిలిన వివక్షలు కూడా పోతాయి. ఇప్పుడు కుల నిర్మూలన వాదులకైనా, కమ్యునిస్టు విప్లవ వాదులకైనా., ముందుకు వెళ్ళాలంటే అనుసరించాల్సిన పంథా సమాజం పెట్టుబడిదారీగా గుర్తించిన సోషలిస్టు విప్లవం పంధానే. షేక్ అబ్దుల్ కరీం 2021 యూనిఫాం సివిల్ కోడ్ ‌ మత ఛాందసవాదులు యూనిఫాం సివిల్ కోడ్ (యూసిసి)ని వ్యతిరేకిస్తారు. సరే, విప్లవకారులు ఎందుకు వ్యతిరేకించాలి. ఆర్థిక సమానత్వం ఇవ్వలేదు కనుక., హిందుత్వ వాదులు కనుక., చిత్తశుద్ది లేదు కనుక., ఎన్నికల జిమ్మిక్కులు కనుక.., యూసిసిని వ్యతిరేకించాలనడం సరైనది కాదు. యూసిసి వస్తే ఏమవుతుంది? ప్రజలకు నష్టం ఎలా? పెట్టుబడిదారీ పాలక వర్గాలు, పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ప్రజాస్వామిక సంస్కరణలు అనివార్యంగా అవసరమవుతాయి. తెస్తారు. సోషలిజం తేలేదు కాబట్టి ప్రజాస్వామిక సంస్కరణలు వ్యతిరేకించాలా? ఇక మనువాదం తెస్తారనడం. అదీ మార్క్సిస్టులు అనడం హాస్యాస్పదం. మార్క్సిజం గతితార్కిక భౌతికవాదం రీత్యా అసాధ్యం. మార్క్సిజంపై విశ్వాసం సడలిన పెట్టీ బూర్జువా వర్గం మాత్రమే భయపడుతుంది. ప్రజాస్వామిక మేధావి పెట్టీ బూర్జువా వర్గం మైనారిటీల హక్కుల పేరుతో, వైవిధ్యం పేరుతో, మనువాద ప్రమాదం బూచి చూపి యూసిసి ని వ్యతిరేకించి, వాస్తవంగా మైనారిటీ మతాలలోని మృతి ఛాందసవాదులు మనువాదాన్ని యధాతథంగా ఉంచాలి అంటున్నారు. ఇది హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం కంటే ప్రమాదకర ధోరణి. ప్రజల ప్రధాన వైరుధ్యాల వైపు వెళ్ళ కుండా దారి మళ్ళిస్తుంది. మార్క్సిస్టులు చేయాల్సింది... బూర్జువా ప్రజాస్వామిక సంస్కరణలను స్వాగతిస్తూ, వాటిలోని లోపాలను ఎత్తి చూపుతూ, మిగతా సామాజిక ఆర్థిక సమానత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయకూడదు. యూసిసి తోపాటు ఆర్థిక సమానత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ, ప్రజలను చైతన్య వంతం చేయాలి. ఉమ్మడి ఆర్థిక స్మృతిని తెస్తారా.!? అంటూ రంగనాయకమ్మ లాంటి మహిళా మార్క్సిస్టు రచయిత్రి అంటున్నారు. ‌ ఉమ్మడి ఆర్థిక స్మృతిని తేవాల్సింది కమ్యూనిస్టులు. విప్లవం ద్వారా సోషలిజంలో సాధ్యమవుతుంది. పెట్టుబడిదారీ విధానంలో బూర్జువా వర్గం ఆర్థిక సమానత్వం ఇస్తాడా..? విప్లవం ద్వారా సాధించాల్సిన దానికి ప్రజాస్వామిక సంస్కరణల కు పోటీ ఏమిటి. ఒక మహిళ మరియు ఫెమినిస్ట్, కమ్యూనిస్టు ఉద్యమకారిని, మరియు ఐద్వా లాంటి మహిళా సంఘాలు వ్యతిరేకించడం, రాకుమారుడు డ్రాగన్ కోసం కలలుగని, ఉవ్విళ్ళూరుతూ తీరా తన గుమ్మం ముందుకు వచ్చిన డ్రాగన్ ను చూసి జడుసుకుని చచ్చినట్లుగా ఉంది. అనుబంధం 2022 ఫిబ్రవరి 7-9 తేదీలలో కర్నూలు (AP)లో జరిగిన కమ్యూనిస్టు కార్యకర్తల కన్వెన్షన్ ఆమోదించిన కార్యక్రమ తీర్మానాలు ----------------------------------------------------------------------------------------------- గత శతాబ్ది చివరికల్లా సోషలిస్టు ప్రపంచం కూలిపోయి, ఆ దేశాలలో నగ్నంగా పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరింపబడింది. ఈ క్రమంలో కొనసాగిన పెట్టుబడి ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అన్ని రంగాలలో మరింతగా బలపడింది. కార్మిక వర్గం యొక్క జీవితాలను ఆర్థికంగా దుర్భరం చేయడం మాత్రమే కాకుండా వారి మౌళిక ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తూ ఉంది. ఈ అభివృద్ధి వల్ల వచ్చిన అనుకూల ప్రతికూల పరిణామాలను, ముఖ్యంగా కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని, ప్రతికూల ధోరణులను గుర్తించిన పెట్టుబడిదారీ వర్గాలు, తమ పాలనను శాశ్వతం చేసుకొనేందుకు మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఉదారవాద పెట్టుబడిదారీ పాలనా విధానాలను వదిలి, ఫాసిస్టు పాలనా విధానాలను చేబడుతున్నాయి. ఈ పెట్టుబడిదారీ అభివృద్ధి వల్ల ఉత్పన్నమై బలపడుతున్న ఫాసిస్టు పాలనలు, పెంచబడుతున్న కుల మత వర్ణ జాతీయోన్మాదాలు, ప్రజలపై – ప్రజాస్వామిక హక్కులపై సాగుతున్న అణచివేతలు, వివక్షతలు, విధ్వంసాలు, మారణకాండలు పెట్టుబడిదారీ వ్యక్తివాదం యొక్క క్రూరత్వాలు ధరల పెరుగుదల నిరుద్యోగం తదితర సమస్యలన్నీ ప్రజల జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఈ భయానక పరిస్థితులు ఈ.పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రగతిశీల చారిత్రక దశ ముగిసిపోయిందని రుజువు చేస్తున్నాయి. సోషలిస్టు (కమ్యూనిస్టు) సమాజ ఆవిర్భావం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. అందుకు భూములు ఫ్యాక్టరీల లాంటి కీలక ఉత్పత్తి సాధనాలతో సహా ఉత్పత్తి - పంపిణీ వ్యవస్థను నియంత్రిస్తూ కోట్లాది శ్రామికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ ప్రైవేట్ యాజమాన్యాన్ని రద్దు చేసి, వాటిపై సామాజిక యాజమాన్యాన్ని నెలకొల్పే సామాజిక రాజకీయ విప్లవం అవసరం. అయితే, అలాంటి సామాజిక విప్లవాన్ని సాధించాల్సిన కమ్యూనిస్టు ఉద్యమం అత్యంత బలహీనపడి, తీవ్రమైన రుగ్మతలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి కమ్యూనిస్టు శ్రేణులన్ని ఉమ్మడిగా తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.అందులో భాగంగా ఒక సరైన రాజకీయ, నిర్మాణ మరియు సాంఘిక-సాంస్కృతిక విప్లవ కార్యక్రమం ప్రాతిపదికగా ఏకాభిప్రాయ సాధనకు కమ్యూనిస్టు శ్రేణులతో వివిధ రూపాలలో చర్చించడానికి, ఆలోచింపజేయడానికి, ప్రజా రంగాలలో కూడా పనిచేస్తూ నూతన శక్తులను సమీకరించడానికి అవసరమైన కమ్యూనిస్టు ప్రచారోద్యమాన్ని, కార్యకలాపాలను నిర్వహించే ఒక కేంద్రంగా ఏర్పడి పనిచేయాలని ఈ కన్వెన్షన్ నిర్ణయించి, క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కేంద్రానికి ‘కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (సియుసి)‘ అని పేరు పెట్టాలని కన్వెన్షన్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (సియుసి)‘ శాస్త్రీయ కమ్యూనిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా మరియు సిద్ధాంతంగా అంగీకరించింది. శ్రామికవర్గ అంతర్జాతీయతకు కట్టుబడి, దానిని వ్యాప్తి చేయడానికి కృషి చేయాలి. ప్రజాస్వామ్య కేంద్రీకరణ విలువలకు, పద్ధతికి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలి. (ప్రజాస్వామ్య కేంద్రీకరణ అంటే ప్రజాస్వామ్యం మరియు కేంద్రీకరణ అనే రెండు అంశాలను కలిగి వుండే పని చేసే పద్ధతి. ఇది సంస్థ సభ్యుల మధ్య స్వేచ్చాయుత సమగ్ర చర్చకు, మైనారిటీ - మెజారిటీ అభిప్రాయాల సంపూర్ణ వ్యక్తీకరణకు, వివిధ అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు, సమష్టి నిర్ణయాల అమలులో ఐక్యతా సాధనకు అవసరమైన క్రమాన్ని అనుమతిస్తుంది.ఇది నాయకుల నిరంకుశ ధోరణిని, నాయకత్వ పూజా విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్య కేంద్రీకరణ అనే పేరుతొ "ప్రజాస్వామ్య" విలువలను వదిలి చాలా "సెంట్రలిస్ట్"గా ఉండే పని విధానం చాలా ప్రమాదం. దానివల్ల నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు రబ్బర్ స్టాంపింగ్ గా సంస్థలు మారుతాయి. ఇది బూర్జువా సంస్థలు పని చేసే పద్ధతి.) ప్రజాస్వామ్య కేంద్రీకరణ విలువలకు, పద్ధతికి కట్టుబడి నిబద్ధతతో పనిచేయాలని. (ప్రజాస్వామ్య కేంద్రీకరణ అంటే ప్రజాస్వామ్యం మరియు కేంద్రీకరణ అనే రెండు అంశాలను కలిగి వుండే పని చేసే పద్ధతి. ఇది సంస్థ సభ్యుల మధ్య స్వేచ్చాయుత సమగ్ర చర్చకు, మైనారిటీ – మెజారిటీ అభిప్రాయాల సంపూర్ణ వ్యక్తీకరణకు, వివిధ అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు, సమిష్టి నిర్ణయాల అమలులో ఐక్యతా సాధనకు అవసరమైన క్రమాన్ని అనుమతిస్తుంది.ఇది నాయకుల నిరంకుశ ధోరణిని, నాయకత్వ పూజా విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్య కేంద్రీకరణ అనే పేరుతొ “ప్రజాస్వామ్య” విలువలను వదిలి చాలా “సెంట్రలిస్ట్”గా ఉండే పని విధానం చాలా ప్రమాదం; దానివల్ల నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు రబ్బర్ స్టాంపింగ్ గా సంస్థలు మారుతాయి. ఇది బూర్జువా సంస్థలు పని చేసే పద్ధతి.) మన దేశంలోని ప్రధానమైన ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి, కార్మికుల శ్రమ శక్తి ఉత్పత్తికి ప్రధాన వనరుగా మార్కెట్లో ఒక అమ్మకపు సరుకుగా ఉంది; సమస్త ఉత్పత్తులన్నీ పెట్టుబడి – కూలీ సంబంధాలపై ఆధారపడి, అమ్మకం – లాభం కొరకు మార్కెట్లో విక్రయించడానికి సరుకులుగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. పాత అవశేషాలన్నీ పెట్టుబడిదారీ ప్రయోజనాల కనుగుణ్యంగా మలచబడుతూ కలగలసి ఉనికిలో ఉంటున్నాయి. నేడు అన్ని రంగాలలో పెట్టుబడిదారీ విధానం ఆధిపత్య విధానంగా ఉంది; ప్రత్యేకించి దేశీయ పెట్టుబడిదారీ వర్గం రాజ్యాధికారంలో ఉంది; రాజ్య విధానాలన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ సంరక్షణకు, అభివృద్ధికి అంకితమై ఉన్నాయి. వీటన్నింటి కారణంగా ఇండియాను ఒక పెట్టుబడిదారీ దేశంగా నిర్ధారించి,ఈ దేశం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవం యొక్క చారిత్రాత్మక దశలో ఉందని సియూసి ఏకగ్రీవంగా తీర్మానించింది. భారతదేశంలో శ్రామిక వర్గ ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు సమాజ సాధనను తక్షణ లక్ష్యంగా, కమ్యూనిజం సాధనను తన అంతిమ లక్ష్యంగా స్వీకరిస్తుందని. శాస్త్రీయ కమ్యూనిజం పట్ల నిబద్ధత, భారతదేశంలో సోషలిస్ట్ విప్లవ కార్యక్రమం, శ్రామికవర్గ అంతర్జాతీయత మరియు నిర్మాణ రంగంలో ప్రజాస్వామ్య కేంద్రీకృత విధానం ప్రాతిపదికగా – వీటిపై ఏకాభిప్రాయ సాధనకు కమ్యూనిస్ట్ శ్రేణులతో వివిధ రూపాలలో చర్చించడానికి, ఆలోచింపజేయడానికి, ప్రజా రంగాలలో పనిచేస్తూ నూతన శక్తులను సమీకరించడానికి అవసరమైన కార్యకలాపాలను, కమ్యూనిస్టు ప్రచారోద్యమాన్ని అన్ని రూపాలలో నిర్వహించాలని. మన దేశంలో శ్రామిక ప్రజలు వర్గ దోపిడీకి గురవ్వడంతోపాటు, వారిలో మెజారిటీ -కుల మత జాతి భాష ప్రాంత లింగ తదితర గుర్తింపుల ఆధారంగా అణచివేత విధానాలకు, వివక్షతలకు కూడా గురవుతున్నారు. వివిధ ప్రజా సమూహాల మధ్య ఈ కారణంగా, తలెత్తుతున్న వైషమ్యాలను సొమ్ము చేసుకుని, ఆ సమూహాలను తమ ఓటు బ్యాంకులుగా తయారు చేసుకుంటున్నారు. ఈ లక్ష్యంతో బూర్జువా - పెటీ బూర్జువా శక్తులు అస్తిత్వవాద రాజకీయాలను ప్రాబల్యంలోకి తెస్తున్నారు. కుల మత జాతి భాష ప్రాంత లింగ తదితర గుర్తింపుల ఆధారంగా ప్రజలను అనేక సమూహాలుగా విభజించి, గుర్తింపు రాజకీయాల ద్వారా వివిధ రంగాలలో వాటాల పంపిణీపై పరస్పరం పోటీని, వైషమ్యాలను, ఉన్మాదాలను నిరంతరాయంగా పెంచుతున్నారు. వర్గ ఐక్యతా సాధనను కష్టతరం చేస్తున్నారు. అస్తిత్వవాద రాజకీయాలకు స్పష్టమైన శాస్త్రీయ దృష్టి కోణం లేదు; లేదా సామజిక సంబంధాల 'మూలాలను', వాటి ‘సత్యాన్ని’ చూడగల సమర్థతను ఇచ్చే శాస్త్రీయ సిద్ధాంతం లేదా పద్దతిని కలిగిలేదు. ఐడెంటిటీ పాలిటిక్స్ వర్గ దృక్పథాన్ని తిరస్కరిస్తాయి. ఇవి వివిధ రంగాలలో ఆయా సమూహాల వాటాలు ఎక్కువా లేక తక్కువా అనే తగాదాలకు, సమస్యలకు చెందిన బూర్జువా రాజకీయాలు; ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ లక్ష్యం పెట్టుబడిదారీ విధానాన్ని కొద్దిగా సహించదగినదిగా మార్చడం; కానీ, దానిని పాతిపెట్టడం కాదు. ఇవి సమస్యకు కొంత ఉపశమనాన్ని కలిగించగలుగుతాయే, కానీ సంపూర్ణ పరిష్కారాన్ని చూపలేవు. వర్గ రాజకీయాలను అణగదొక్కడానికి, మరుగు పరచడానికి ఇవి ఒక సాధనంగా ఉపయోగింపబడుతున్నాయి. ఇవి యధాతథ స్థితిని కాపాడే సంకుచిత బూర్జువా - పెటీ బూర్జువా రాజకీయాలు . ఈ అస్తిత్వ వాద రాజకీయాలకు భిన్నంగా, సోషలిస్ట్ ఉద్యమ ప్రయోజనాలకు అనుగుణంగా వివక్షతలకు - అణచివేతలకు గురవుతున్న ప్రజా సమూహాలలో అన్ని రకాల వివక్షతలకు - అణచివేతలకు వ్యతిరేకంగా, కుల మత భాష జాతి ప్రాంతీయ ఉన్మాదాలకు వ్యతిరేకంగా, వర్గ ఐక్యతను పెంచే లక్ష్యంతో నిబద్ధతతో పనిచేయాలని CUC ఏకగ్రీవంగా తీర్మానించింది. మన దేశంలో శ్రామిక ప్రజలు వర్గ దోపిడీకి గురవ్వడంతోపాటు, వారిలో మెజారిటీ -కుల మత జాతి భాష ప్రాంత లింగ తదితర గుర్తింపుల ఆధారంగా అణచివేత విధానాలకు, వివక్షతలకు కూడా గురవుతున్నారు. వివిధ ప్రజా సమూహాల మధ్య ఈ కారణంగా, తలెత్తుతున్న వైషమ్యాలను సొమ్ము చేసుకుని, ఆ సమూహాలను తమ ఓటు బ్యాంకులుగా తయారు చేసుకుంటున్నారు. ఈ లక్ష్యంతో బూర్జువా – పెటీ బూర్జువా శక్తులు అస్తిత్వవాద రాజకీయాలను ప్రాబల్యంలోకి తెస్తున్నారు. కుల మత జాతి భాష ప్రాంత లింగ తదితర గుర్తింపుల ఆధారంగా ప్రజలను అనేక సమూహాలుగా విభజించి, గుర్తింపు రాజకీయాల ద్వారా వివిధ రంగాలలో వాటాల పంపిణీపై పరస్పరం పోటీని, వైషమ్యాలను, ఉన్మాదాలను నిరంతరాయంగా పెంచుతున్నారు. వర్గ ఐక్యతా సాధనను కష్టతరం చేస్తున్నారు. అస్తిత్వవాద రాజకీయాలకు స్పష్టమైన శాస్త్రీయ దృష్టి కోణం లేదు; లేదా సామజిక సంబంధాల ‘మూలాలను’, వాటి ‘సత్యాన్ని’ చూడగల సమర్థతను ఇచ్చే శాస్త్రీయ సిద్ధాంతం లేదా పద్దతిని కలిగిలేదు. ఐడెంటిటీ పాలిటిక్స్ వర్గ దృక్పథాన్ని తిరస్కరిస్తాయి. ఇవి వివిధ రంగాలలో ఆయా సమూహాల వాటాలు ఎక్కువా లేక తక్కువా అనే తగాదాలకు, సమస్యలకు చెందిన బూర్జువా రాజకీయాలు; ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ లక్ష్యం పెట్టుబడిదారీ విధానాన్ని కొద్దిగా సహించదగినదిగా మార్చడం; కానీ, దానిని పాతిపెట్టడం కాదు. ఇవి సమస్యకు కొంత ఉపశమనాన్ని కలిగించగలుగుతాయే, కానీ సంపూర్ణ పరిష్కారాన్ని చూపలేవు. వర్గ రాజకీయాలను అణగదొక్కడానికి, మరుగు పరచడానికి ఇవి ఒక సాధనంగా ఉపయోగింపబడుతున్నాయి. ఇవి యధాతథ స్థితిని కాపాడే సంకుచిత బూర్జువా – పెటీ బూర్జువా రాజకీయాలు . ఈ అస్తిత్వ వాద రాజకీయాలకు భిన్నంగా, సోషలిస్ట్ ఉద్యమ ప్రయోజనాలకు అనుగుణంగా వివక్షతలకు – అణచివేతలకు గురవుతున్న ప్రజా సమూహాలలో అన్ని రకాల వివక్షతలకు – అణచివేతలకు వ్యతిరేకంగా, కుల మత భాష జాతి ప్రాంతీయ ఉన్మాదాలకు వ్యతిరేకంగా, వర్గ ఐక్యతను పెంచే లక్ష్యంతో నిబద్ధతతో పనిచేయాలని CUC ఏకగ్రీవంగా తీర్మానించింది. అన్ని రంగాలలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో బూర్జువా భావజాలం సంపూర్ణ ఆధిఖ్యత సాధించడం వల్ల, నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత సుస్థిరంగా వున్నది. బూర్జువా భావజాలం ఉనికిలో ఉన్న సామాజిక సంబంధాలను, సామాజిక పరిస్థితులను సహజమైనవిగా భావింపజేస్తుంది; సామాజిక వైరుధ్యాలను, వాటి మూలలను అది కప్పివేస్తుంది, ఈ సంబంధాలను, స్థితిగతులను అనివార్యమైనవిగా, శాశ్వతమైనవిగా చూపి, ఆ పరిస్థితులకు మనిషిని స్వచ్చంద బానిసగా చేస్తుంది. ఈ కారణంగానే కార్మిక వర్గం, సామాన్య ప్రజలు దోపిడీ,పీడనలతో, హచ్చు తగ్గులతో కొనసాగుతున్న పెట్టుబడిదారీ జీవన విధానాన్ని న్యాయ సమ్మతమే అని నమ్ముతున్నారు. పీడిత వర్గాల భావజాల బానిసత్వమే పాలక వర్గాల బలంగా మారుతున్నది. కావున, ఈ దోపిడీ భావజాలానికి వ్యతిరేకంగా మౌలిక సమస్యలపై పెద్ద ఎత్తున సోషలిస్టు ప్రచార ఉద్యమం చేపట్టాలని . పారిశ్రామిక వ్యవసాయక సేవా రంగాలలోని కార్మికులను ప్రధానంగా అసంఘటిత రంగాల్లోని పట్టణ – గ్రామీణ కార్మికులను సోవియట్ల వంటి సంస్థల్లో, పేద రైతులు - దిగువ తరగతి రైతులను సహకార సంఘాలలోమరియు విద్యార్థి, యువత, మేధావి మరియు మహిళా శ్రేణులను తగిన నిర్మాణ రూపాల్లో పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ కార్యక్రమం ఆధారంగా సమీకరించాలని. దేశవ్యాప్తంగా పట్టణ -గ్రామీణ శ్రామికులను మరియు పేద రైతాంగాన్ని, ఇతర మిత్ర పక్షాలను పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాల ద్వారా సోవియట్ తరహా సంస్థలలో సోషలిస్టు చైతన్య పునాదిపై సంఘటితంచేయాలి; వర్గపోరాటం యొక్క పరిపక్వ దశలో తగిన శక్తితో సార్వత్రిక తిరుగుబాటు ద్వారా బూర్జువా వర్గాన్ని కూలదోయాలి; కార్మిక వర్గ అధికారాన్ని నెలకొల్పాలి; ఈ లక్ష్యంతో సోషలిస్ట్ విప్లవ ఉద్యమ నిర్మాణానికి కృషి చేసేందుకు కమ్యూనిస్టు శక్తుల, కార్మిక శ్రేణుల సమీకరణకు పూనుకోవాలని CUC తీర్మానించింది. ~ బత్తిని శ్రీనివాస రావు, కన్వీనర్ కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (సి యు సి) ఆర్గనైజింగ్ కమిటి ‌ మత ఛాందసవాదులు యూనిఫాం సివిల్ కోడ్ (యూసిసి)ని వ్యతిరేకిస్తారు. సరే, విప్లవకారులు ఎందుకు వ్యతిరేకించాలి. ఆర్థిక సమానత్వం ఇవ్వలేదు కనుక., హిందుత్వ వాదులు కనుక., చిత్తశుద్ది లేదు కనుక., ఎన్నికల జిమ్మిక్కులు కనుక.., యూసిసిని వ్యతిరేకించాలనడం సరైనది కాదు. యూసిసి వస్తే ఏమవుతుంది? ప్రజలకు నష్టం ఎలా? పెట్టుబడిదారీ పాలక వర్గాలు, పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ప్రజాస్వామిక సంస్కరణలు అనివార్యంగా అవసరమవుతాయి. తెస్తారు. సోషలిజం తేలేదు కాబట్టి ప్రజాస్వామిక సంస్కరణలు వ్యతిరేకించాలా? ఇక మనువాదం తెస్తారనడం. అదీ మార్క్సిస్టులు అనడం హాస్యాస్పదం. మార్క్సిజం గతితార్కిక భౌతికవాదం రీత్యా అసాధ్యం. మార్క్సిజంపై విశ్వాసం సడలిన పెట్టీ బూర్జువా వర్గం మాత్రమే భయపడుతుంది. ప్రజాస్వామిక మేధావి పెట్టీ బూర్జువా వర్గం మైనారిటీల హక్కుల పేరుతో, వైవిధ్యం పేరుతో, మనువాద ప్రమాదం బూచి చూపి యూసిసి ని వ్యతిరేకించి, వాస్తవంగా మైనారిటీ మతాలలోని మృతి ఛాందసవాదులు మనువాదాన్ని యధాతథంగా ఉంచాలి అంటున్నారు. ఇది హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం కంటే ప్రమాదకర ధోరణి. ప్రజల ప్రధాన వైరుధ్యాల వైపు వెళ్ళ కుండా దారి మళ్ళిస్తుంది. మార్క్సిస్టులు చేయాల్సింది... బూర్జువా ప్రజాస్వామిక సంస్కరణలను స్వాగతిస్తూ, వాటిలోని లోపాలను ఎత్తి చూపుతూ, మిగతా సామాజిక ఆర్థిక సమానత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయకూడదు. యూసిసి తోపాటు ఆర్థిక సమానత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ, ప్రజలను చైతన్య వంతం చేయాలి. ఉమ్మడి ఆర్థిక స్మృతిని తెస్తారా.!? అంటూ రంగనాయకమ్మ లాంటి మహిళా మార్క్సిస్టు రచయిత్రి అంటున్నారు. ‌ ఉమ్మడి ఆర్థిక స్మృతిని తేవాల్సింది కమ్యూనిస్టులు. విప్లవం ద్వారా సోషలిజంలో సాధ్యమవుతుంది. పెట్టుబడిదారీ విధానంలో బూర్జువా వర్గం ఆర్థిక సమానత్వం ఇస్తాడా..? విప్లవం ద్వారా సాధించాల్సిన దానికి ప్రజాస్వామిక సంస్కరణల కు పోటీ ఏమిటి. ఒక మహిళ మరియు ఫెమినిస్ట్, కమ్యూనిస్టు ఉద్యమకారిని, మరియు ఐద్వా లాంటి మహిళా సంఘాలు వ్యతిరేకించడం, రాకుమారుడు డ్రాగన్ కోసం కలలుగని, ఉవ్విళ్ళూరుతూ తీరా తన గుమ్మం ముందుకు వచ్చిన డ్రాగన్ ను చూసి జడుసుకుని చచ్చినట్లుగా ఉంది. కేఎస్ సైద్ధాంతిక చారిత్రక తప్పిదం కొండపల్లి సీతారామయ్య (కేఎస్) భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ తర్వాత అంతటి వాడు. నక్సల్బరీ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఒక సరైన పంథాలో నడిపించి సరైన నిర్మాణాన్ని పార్టీని పటిష్టం చేసిన మహా నాయకుడు. అదే పార్టీలో తాను తీర్చిదిద్దిన, తయారుచేసిన, ఉద్యమ పాఠాలు నేర్పిన తన శిష్యులతోనే బహిష్కరించబడటం చాలా అరుదైన ఆశ్చర్యపడే విషయం. చాలా పార్టీలలో సంస్థల్లో చీలికలు కొట్లాటలు సాధారణమే. కానీ, ఇంత చిత్తుగా తాను స్థాపించిన తనతో సమానులు కూడా లేని పార్టీలో, తనతో ఎవరు రాకుండా, కనీసం తన వర్గం లేకుండానే దాదాపు ఒంటరిగా బయటికి వెళ్ళగొట్టబడడం అసాధారణం. అంతకు ముందు వరకు గొప్ప నాయకుడు, సిద్ధాంత మార్గదర్శకుడిగా పెద్దదిక్కుగా చారుమజుందార్ తర్వాత అంతటి ఆదరణ పొందిన నాయకుడిగా, ఉన్నటువంటి వాడిని ఎటువంటి సిద్ధాంత విభేదాలు లేకుండా వ్యక్తిగత కారణాలు ఆరోపిస్తూ, పైగా ముసలితనంలో పార్టీ నుండి బహిష్కరించడం ద్వారా ఆ పార్టీకి కలిగిన లాభం ఏమిటి ? అతను ఉంటే నష్టం ఏమిటో? ఆలోచించాలి. పార్టీ నుండి బహిష్కరించిన కొంతకాలానికి మరణించాడు. వందలాది మంది కార్యకర్తలకు అభిమాన గురువు. అతని అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు అతడిని ఇప్పటికీ తమ ఉత్తమ గురువుగా, నాయకుడిగా చెప్పుకునే వాళ్ళు వందలు వేలల్లో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. అతను రచించిన వ్యవసాయ విప్లవం రిపోర్టు నూతన ప్రజాస్వామిక విప్లవం వివరించడానికి అతి ఉత్తమ పుస్తకం. ఆనాటి గ్రామాల్లోని వర్గాలన్నీ విశ్లేషించి వ్యవసాయ విప్లవం అవసరాన్ని విశదీకరించి జగిత్యాల పోరాటానికి పునాదులు వేశాడు. ఇటు రివిజనిజాన్ని మరియు అటు అతివాద దుందుడుకు వాదాన్ని, అవకాశవాదాన్ని చాలా పట్టుదలతో ఎదిరించి ఒక నూతన సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని నిర్మించి, దూరదృష్టితో దండకారణ్యంలో మరియు భారతదేశం మొత్తంలో ఉద్యమం వ్యాపింప జేయడానికి పునాదులు వేసిన వాడు. 1987లో ఉమర్ ముక్తార్ సినిమా వస్తే సినిమా హాల్లో పోలీసులు కాపలా కాశారు. కేఎస్ ను ఉమర్ ముక్తార్ తో పోల్చిన వాళ్లు, సినిమా కూడా ఏపీలో విప్లవ అభిమానులంతా ఎగబడి చూసినవాళ్లు. ఒక పత్రికలో ఇంటర్వ్యూ వస్తే ఆంధ్రప్రదేశ్ అంతటనే కాకుండా దేశం మొత్తంలో కూడా సంచలనం కలిగించ గలిగిన మహానేత. విప్లవకారుడు. 1992 లో అతన్ని బహిష్కరించడానికి ముందు వరకు కూడా ఏలాంటి ఆరోపణలు లేవు. హఠాత్తుగా అంతలోనే అతని విప్లవ జీవితమంతా దాదాపు 70 సంవత్సరాలు విప్లవ జీవితం పనికిరాకుండా పోతుందా? ముసలితనంలోని వ్యక్తిగత బలహీనతల వల్ల , అతనికి పార్కిన్సన్ వ్యాధి ఉంది. తన జీవితాంతం కమ్యూనిస్టుగా ఉండి, విప్లవోద్యమాన్ని నిర్మించినవాడు. సాధారణంగా పార్టీలో పని చేయడంవేరు., సిపిఐ సిపిఎం రివిజనిజంపై పోరాటం, నక్సల్బరి ఉద్యమంలో అతివాద అవకాశవాదులతో పోరాడి నిరంతరం విప్లవోద్యమ నిర్మాణం చేసినవాడు. ముసలితనంలో బహిష్కరణకు ఆరు నెలలకు ముందుగా వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు (ఇంతకుముందు వరకు పార్టీలో సిద్ధాంత విభేదాలు పార్టీలో లేవు) విప్లవ జీవితాన్ని అంతం చేయడం చాలా అసాధారణం. తన యవ్వన దశ నుండి పూర్తిగా కమ్యూనిస్టుగా జీవించి, జీవితాంతం కమ్యూనిజం కొరకు బ్రతికిన తన వివాహం కూడా వితంతువుతో ఆనాటి సిపిఐ పార్టీలో జరిగింది. తన తనయుడు కూడా ఎమర్జెన్సీలో ఎన్ కౌంటర్ గావింపపడ్డాడు. సిపిఐ నుండి బహిష్కరించబడ్డాడు. ఆనాటి రివిజనిస్టు పంథాను వ్యతిరేకించిన కారణంగా సిపిఐ నుండి బహిష్కరింపబడిన తర్వాతనే గుంటూరు నుండి తన కొద్దిపాటి పొలం అమ్ముకుని కరీంనగర్ జిల్లాలో తన తల్లిదండ్రులతో వలస వచ్చినాడు. ఆ క్రమంలోనే ఫాతిమా స్కూల్ లో చిన్నప్పుడు హిందీ పరీక్షలో పాస్ అయిన సర్టిఫికెట్ తో హిందీ టీచర్ గా పని చేశాడు. వరంగల్ జిల్లాలో ఫ్యూడల్ భూస్వామ్య విధానం సరిగ్గా అర్థం చేసుకున్నాడు. తన వ్యవసాయ విప్లవం పుస్తకానికి ఆనాటి కరీంనగర్, వరంగల్ జిల్లాలే ప్రాతిపదిక. వరంగల్ లో హిందీ టీచర్ గా పని చేస్తూనే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థులను రాజకీయంగా చైతన్యం గావించి, జగిత్యాల పోరాటాలకు సిద్ధంగావించాడు. సిపిఐ, సిపిఎం రివిజనిస్టు విధానాలతో ఏనాడు రాజీపడని వ్యక్తి. తన చిన్ననాటి నుండి రాజేశ్వరరావు, సుందరయ్య లాంటి వాళ్ల సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వారి రివిజనిస్టు పోకడలతో రాజీ పడలేదు. కావున ఆ పార్టీల నుండి బహిష్కరణకు గురికావలసి వచ్చింది. ఆ తర్వాత ఎంఎల్ పార్టీలో కూడా ఎన్నో చీలికలు జరుగుతున్నప్పుడు, చండ్ర పుల్లారెడ్డి, టిఎన్, డివి లాంటి వారి అవకాశవాద మితవాద రాజకీయాలను గాని, అతివాద రవూఫ్ లాంటి వారితో గానీ ఇంకా రకరకాల అడ్డంకులు ఏర్పరిచే వారితో రాజీ పడలేదు. సూత్రబద్ధంగా నక్సల్బరీ బోల్షివిక్స్ స్పిరిట్ తో నూతన దృఢమైన పార్టీని నిర్మించి నిలబెట్టినవాడు. తాను నిర్మించిన పార్టీ తప్పటడుగులు వేస్తున్నదని జైలు గోడలు బద్ధలు కొట్టి బయటకు వచ్చి తన పార్టీని సరిదిద్దినవాడు. చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో పార్టీలో వచ్చిన ఆరు చెడులు (Six Deviations) కు వ్యతిరేకంగా పార్టీని సరిదిద్దడానికి పూనుకున్నప్పుడు దాని నుండి తప్పించుకొనుట కేజీ సత్యమూర్తి మరియు తమిళనాడు సభ్యులు సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొని పార్టీని పటిష్టంగా నిలిపినవాడు. 1984 ఎన్టీఆర్ ప్రభుత్వం యొక్క నిర్బంధం నుండి ఉద్యమాన్ని, పార్టీని కాపాడి సరైన పంథాలో నడిపించి తీవ్ర నిర్బంధంలో సైతం పార్టీని బలోపేతం చేసినవాడు. ఎన్టీఆర్ ప్రభుత్వం అత్యంత పాశవిక నిర్బంధాన్ని చాకచక్యంగా తిప్పి కొట్టి, అంతటి నిర్బంధంలో కూడా పార్టీ బలపడడానికి, ఉద్యమం బలపడటానికి కేఎస్ నాయకత్వం, సైద్ధాంతిక అవగాహన అతని పాఠాలు రాజకీయ శిక్షణలు తోడ్పడ్డాయి. ఎన్టీఆర్ పాలన పోయి, కాంగ్రెస్ చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత వెసులుబాటుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఒక విప్లవ వెల్లువ రావడం... నిర్బంధ కాలంలో జరిగిన పార్టీ నిర్మాణమే కారణం. కేఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత పార్టీ బలపడిందా!? లేక బలహీనపడిందా!? అనేది చాలా ముఖ్యం. సిద్ధాంతపరమైన విభేదాలతో సంక్షోభం రాలేదు. కనుక సిద్ధాంతంలో మార్పులేదు. నిర్మాణంలో పరిశీలించాలి... ఇప్పుడు మావోయిస్టు పార్టీ చెబుతున్న దాని ప్రకారం అయితే 25 సంవత్సరాల తర్వాత ఉద్యమం బాగా విస్తరించిందని, చాలా రాష్ట్రాలకు వ్యాపించిందనీ.., దండకారణ్యంలో విముక్తి ప్రాంతం ఏర్పడి బీజరూపంలో జనతన సర్కార్ పనిచేస్తుందని చెబుతున్నారు. సైనికంగా రాశి వాసిలో అభివృద్ధిని చూపెడుతున్నారు. పార్టీ బోల్షెవికీకరణ చెందినట్లుగా చెబుతున్నారు. కానీ, రాజకీయ చైతన్యం, సిద్ధాంతపరంగా క్యాడర్ ఎదగలేక పోతున్నారని వారి అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కొంత పార్టీ, ఉద్యమం వెనుకంజ వేసినప్పటికీ మొత్తం మీద దేశవ్యాప్తంగా వ్యాపించినట్లుగా వారి అభిప్రాయం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. 1 ఆంధ్ర తెలంగాణలో పార్టీ ఉద్యమం వెనక పట్టుకు కారణాలు ఏమిటి? 2 ఇతర పార్టీలను విలీనం చేసుకుని పార్టీ బోల్షెవికరణ చెందినట్లుగా భావించవచ్చా? 3 నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని సరిగా నెరవేర్చుతున్నారా? 4 ఉద్యమంలో కార్మికుల పాత్ర ఏమిటి (కార్మికుల పోరాటాలు)? 5 ఒక వ్యక్తిని అంచనా వేసేందుకు అతని తప్పులు ఎక్కువా.., ఒప్పులు ఎక్కువా అని అంచనా వేసి చూడండి అనే మావో సూత్రం కేఎస్ కు వర్తించదా? “రాజకీయాలలో చేసిన తప్పుల సంగతి అటుంచి అసలు ఏ తప్పు గురించి అయినా ఆ తప్పు చేసిన వ్యక్తి సైద్ధాంతిక మూలాల్లోకి వెళ్లకుండా ఆ తప్పు గురించి మనకు సరైన అవగాహన ఏర్పడదు” -- లెనిన్. లెనిన్ చెప్పిన పై వ్యాఖ్యలను బట్టి కేఎస్ తప్పులను అతని సైద్ధాంతిక మూలాలలోకి పోయి చూడాలి. అంతేకాకుండా ఆనాటి పార్టీ యొక్క సైద్దాంతిక వర్గ మూలాలలోకి పోయి పరిశీలించాలి. పార్టీలో ప్రారంభంలో ఎక్కువగా విద్యార్థులు, మేధావులు ఎక్కువగా ధనిక మధ్యతరగతి వర్గాల నుండి వచ్చిన వారే. ఉద్యమం ముందుకు పోతున్న క్రమంలో దళిత, బహుజన, మైనార్టీల, కార్మిక వర్గాల నుండి అధిక సంఖ్యలో పార్టీలో చేరినారు. పార్టీ ఎక్కువగా విద్యార్థుల నుండి అభివృద్ధి చెందింది. కొంత మేధావి వర్గం నుంచి అతి తక్కువగా కార్మిక వర్గం నుండి చేరారు. మొదట్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు. మధ్యతరగతి వర్గాలకు ఉన్నత కులాలకు చెందినవారే. ఉన్నత చదువులు చదివే అవకాశం వారికే ఉంది. సహజంగానే మొదట వచ్చిన ధనిక మధ్యతరగతి విద్యార్థి మేధావి వర్గానికి చెందిన వారు వారి చొరవ ఫలితంగా మొదటి శ్రేణి నాయకత్వం వారితో నిండిపోయింది. తర్వాత ఉద్యమం అభివృద్ధి చెందుతున్న దశలో దళిత బహుజన మైనారిటీలు, కార్మికులు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు . వారిలోఉన్నత విద్యావంతులు తక్కువే. సామాజికంగా కూడా వెనుకబడిన వారే. అయితే ఉద్యమం ముందుకు పోతున్న దశలో వీరిలో కూడా చైతన్యం పొంది, నాయకత్వ స్థానాలకు ఎదిగే క్రమంలో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే క్రమంలో మొదటి శ్రేణిలో ఉన్న మధ్యతరగతి ఉన్నత కులాలకు చెందిన వారికి, తర్వాత శ్రేణిలోని దళిత బహుజన మైనార్టీలకు చెందిన వారికి మధ్య వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఈ వైరుధ్యం వివిధ రూపాలుగా వ్యక్తీకరించబడి Six Deviations గా పార్టీలో ముందుకు వచ్చింది. మొదటి నుండి కూడా పార్టీలో కార్మిక వర్గ సంస్కృతి ఏర్పడలేదు. కార్మికుల పాత్ర పరిమితంగా ఉండటం వలన అన్య వర్గాల నుండి వచ్చిన వారి సంస్కృతి అలాగే కొనసాగుతూ వస్తోంది. ఉద్యమం పెరుగుతున్న క్రమంలో పార్టీ పెరుగుతున్న క్రమంలో లీడింగ్ లో ఉన్న ధనిక మధ్యతరగతి అగ్రకుల నాయకత్వానికి అప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత బహుజన మైనారిటీ పేద కార్మిక వర్గాలకు చెందిన వారికి మధ్య వైరుధ్యం పెరుగుతూ వచ్చింది. దీనిని నివారించేందుకు అన్య వర్గ లక్షణాలను పార్టీలో రెక్టిఫై చేయడానికి, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో పార్టీని సరిచేయడానికి కేఎస్ నాయకత్వంలో ఆరు చెడులపై దిద్దుబాటు కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రారంభంలోనే దీని నుండి తప్పించుకొనుటకు కేజీ సత్యమూర్తి తదితర తమిళనాడుకు చెందిన సభ్యులు రెండు పంథాల మధ్య పోరాటంగా డైవర్ట్ చేసి సృష్టించిన సంక్షోభం, దీనిని పరిష్కరించడం కొరకు కొంతకాలం కాలయాపన జరిగింది. సరైన సమయంలో సరిగా దిద్దుబాటు కార్యక్రమం నిర్వహించలేక పోయారు. ఫలితంగా కొంతమంది ధనిక మధ్యతరగతి అగ్రకులాలకు చెందిన వారు అప్రమత్తమై చైనా లో జరిగినటువంటి శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో జరగాల్సిన దిద్దుబాటు కార్యక్రమం జరగనీయకుండా నీరుగార్చారు. పార్టీలో అన్య వర్గ లక్షణాలు చాలా బలంగా ఉన్న కారణంగా, దిద్దుబాటు కార్యక్రమం జరగనీయకుండా చేయగలిగారు. ఎప్పుడైతే కేఎస్ నాయకత్వంలో దిద్దుబాటు కార్యక్రమాన్ని పట్టుదలగా అమలు చేయడానికి ప్రయత్నం చేయగా, అతనికి వ్యతిరేకంగా ఒక ముఠా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసే రకరకాల వ్యాఖ్యలను చేయడం మొదలుపెట్టారు. అలాగే పార్టీలో వివిధ స్థాయిలలో దళిత బహుజన మైనారిటీలకు చెందిన సభ్యులను ఎదగనీయకుండా చేయడం, అప్పటికే నాయకత్వ స్థాయిలో ఉన్న కొంతమందిని రకరకాలుగా వేధించి వారిని పార్టీ నుండి వెళ్ళగొట్టడం, పైనుంచి క్రింది స్థాయి వరకు క్రింది నుంచి పై స్థాయి వరకు అన్య వర్గ లక్షణాలను ప్రోత్సహించి వారిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మొత్తం పార్టీని తమ అధీనంలోకి తీసుకున్నారు. బూర్జువా పార్టీలలో ఉండే ఎత్తుగడలు తప్పుడు పద్ధతులు ఉన్న వారిని ప్రోత్సహించడం వారి బలహీనత (వీక్ నెస్) లను వాడుకుని, వారిని అదుపులో ఉంచుకోవడం, మొత్తం మీద పార్టీ పైన ఆధిపత్యం నెలకొల్పుకున్నారు. ఇలాంటి గొప్ప నాయకునికి వ్యతిరేకంగా మొత్తం పార్టీని నిలబెట్టగలిగారంటే పార్టీ మీద ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్రమంగా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో క్షీణించడం లేదా సెట్ బ్యాక్ కు గురైంది. మొత్తానికి ఏపీలో 20 సంవత్సరాల కాలంలో దాదాపు క్షీణదశకు చేరుకుంది. ఎంగేల్స్ జర్మనీ విప్లవ పరాజయం గురించి చెప్తూ ”ఈ విప్లవానికి పరాజయానికి కారణాలు, తప్పులు ద్రోహులలో అన్వేషించ కూడదని, ఈ అల్లకల్లోలంలో చిక్కుకున్న ప్రతి దేశంలోని సహజ స్థితి, దేశ పరిస్థితులు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవాలి”( from Revolution and Counter Revolution in Germany ) - Angels. ఆనాడు పార్టీ అవగాహన ఏమిటంటే? ఉపరితలం పునాదిని కదిలిస్తుంది అని అంటే ఆరు చెడులు పార్టీని సిద్ధాంతాన్ని ప్రభావితం చేస్తుందని. “చరిత్ర సాధారణాభివృద్ధిల, భౌతిక విషయాలను, సామాజిక ఉనికి సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తాయని ఒప్పుకుంటునే మనం భావాల ప్రభావం భౌతిక విషయాల మీదా, సామాజిక చైతన్య ప్రభావం సామాజిక ఉనికి మీద, ఉపరితల నిర్మాణం ప్రభావం ఆర్థిక పునాది మీద ఉంటుందని కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకొని తీరాలి. ఇది భౌతిక వాదానికి విరుద్ధం కాకపోగా అందుకు మారుగా యాంత్రిక భౌతికవాదాన్ని పక్కకునెట్టి గతితార్కిక భౌతికవాదం నీ దృఢంగా బలపరుస్తుంది" -- మావో వైరుధ్యాలు. కేఎస్ తప్పిదానికి గురయింది సరిగ్గా ఈ సూత్రం మీదనే. ఉపరితలాన్ని సరిదిద్దినట్లయితే పార్టీలోని చెడిపోతుంది అని అనుకున్నాడు. చైనాలో లాగా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో, పార్టీలో కూడా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో సరిదిద్దాలి అనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే పొరపాటు జరిగింది. ఈ తప్పుడు అవగాహన వల్ల సులభంగా ఏకాకి అయిపోయాడు. పార్టీలో “ఆరు చెడులకు” మూలం ఉపరితలంలో లేదు. వర్గ మూలాలలో ఉంది. వర్గ మూలాలు సరి చేయకుండా ఉపరితలంలో సరిదిద్దలేము. వర్గమూలాలు సరి చేయకుండా తాత్కాలికంగా బలవంతంగా నిర్వహించినా, స్వల్పకాలం తాత్కాలికంగా అణిచివేయబడినా, అతి వేగంగా తిరిగి మళ్ళీ ముందుకు వస్తాయి. పార్టీలోని క్రియాశీలక సభ్యులు కూడా ఇదే ఆలోచనలతో కొట్టుకుపోయారు. ఉపరితలంలో, సాంస్కృతిక రంగంలోనే ప్రయత్నించారు. పునాది గురించి పట్టించుకోలేదు. చైనాలో కూడా ఈ సూత్రం ఆధారంగానే మహత్తర కార్మికవర్గ సాంస్కృతిక విప్లవం జరిగింది. అది తాత్కాలికంగా విజయం సాధించింది. వర్గ మూలంలో, భౌతిక పునాదిలో మార్పు జరగని కారణంగా అనతికాలంలోనే మావో మరణించిన వెంటనే డెంగ్ ముఠా నాయకత్వంలో పెట్టుబడిదారీ పునరుద్ధరణ వేగంగా జరిగిపోయింది. “అవకాశవాద శక్తులను పార్టీలో సైద్ధాంతిక పోరాటాల ద్వారా ఓడించ వచ్చునని, పార్టీ చట్రంలో ఈ శక్తులపై పైచేయి సంపాదించవచ్చు ననే సిద్ధాంతం పనికిమాలిన ప్రమాదకర సిద్ధాంతం” -- స్టాలిన్ “అన్ని విధాలైన చైతన్య రూపాలు భావజాలాలు కేవలం విమర్శ ద్వారా మాయమవ్వవని, అటువంటి భావజాలానికి జన్మనిస్తున్న వాస్తవ సామాజిక సంబంధాలను కూల దోయడం ద్వారా మాత్రమే, భావజాలాన్ని కూలదోయ గలమని చారిత్రక భౌతికవాదం చెబుతుంది" (Marx and Angels the German ideology) పై వ్యాఖ్యలలో మార్క్స్, ఎంగేల్స్, స్టాలిన్ లు చెప్పిన విధంగా పునాదిలో మార్పులు తీసుకరాకుండా ఉపరితలంలో మార్పులు జరగవు. ఆనాటి పార్టీలో ఉన్న ధనిక వర్గం యొక్క ప్రభావాన్ని దాని మూలాలను లోతుగా అధ్యయనం చేసి దాని స్థానంలో కార్మిక వర్గ నాయకత్వాన్ని పేద ప్రజల నాయకత్వాన్ని (ఇంకా దళిత బహుజన నాయకత్వాన్ని) ముందుకు తీసుకుని రాలేకపోయిన మూలంగా, వారు ఏకాకులు కావడమే కాకుండా అటు తర్వాత ఏపీ లోని పార్టీ క్రమంగా నిర్వీర్యం లేదా ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైంది. కేఎస్ చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక వర్ధంతి vసభ పెట్టలేదు. లేదా సమీక్ష అయినా విమర్శ అయినా రాయలేదు. అంతగా మరచిపోయిన వ్యక్తి (మహా నాయకుడు) చరిత్రలో దాదాపుగా ఎవరు ఉండకపోవచ్చు. చరిత్రలో పచ్చి అభివృద్ధి నిరోధకులను కూడా మంచికో చెడుకో గుర్తుపెట్టుకుంటాం. ఒక వ్యక్తి తన జీవితాన్ని అంతా ప్రజల కొరకు, తన కుటుంబాన్ని కూడా ప్రజల కొరకే అంకితం చేసిన విప్లవకారుడిని గుర్తు చేసుకోకపోవడం అసాధారణమే. విజేతలకే చరిత్ర ఉందనుకుంటే పొరపాటు ఓడిపోయిన వారికి కూడా చరిత్ర ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కొందరికి మంచి, మరికొందరికి చెడు ఉండడం సహజమే. ‌చరిత్రను కనుమరుగు చేయడం అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఉన్న ఉద్యమకారులకు, కమ్యూనిస్టులకు, మేధావులకు మరియు చరిత్రకారులకు ఉచితం కాదు. –సాహు. 31 మార్చి 2016 (ఏప్రిల్ 12, 2016 - 14 వ వర్ధంతి) *(ఇక్కడ పునాదిలో అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం నుండి సోషలిస్టు విప్లవ పంథాకు మార్పు) కామ్రేడ్‌ కొండపల్లి సీతారామయ్య " నేను ఎవరి ప్రాపునో ఆశించి లేదా పార్టీ ఆంతరంగిక పోరాటంలో అవకాశవాద ధోరణులను అవలంభించి పైకి రాలేదు. సెల్‌ కార్యదర్శి నుంచి పనిచేస్తూ వచ్చాను. నాకు మనశ్శాంతి ఏర్పడితే ఎక్కడున్నా తిరిగి ప్రజలతో పనిచేయగలను. కమ్యూనిస్టు పార్టీ నుంచి కొంతకాలం దూరం చేయగలరేమోగానీ కమ్యూనిజం నుంచి ఎవరూ దూరం చేయలేరు కదా.." మొదటి సారి సీపీఐ నుంచి బహిష్కరించబడిన సందర్భంగా కొండపల్లి సీతారామయ్య. "విప్లవం ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదు పొమ్మనడానికి, రమ్మనడానికి. బహిష్కరణలు, సస్పెన్షన్లు ఇవన్నీ టెక్నికల్‌ పాయింట్స్‌. విప్లవోద్యమాన్ని నడపదలచిన వాడికి ఇవి హార్డిల్స్ (అడ్డంకులు) కావు. తప్పుడు పంథా తాత్కాలికంగా ఆధిపత్యం సంపాదించినా నెమ్మదిగా సరైన పంథా విజయం సాధిస్తుంది. దాన్ని ఇలాంటి ఇంటర్వ్యూతోనో లేదా ఒక పెనుకేక వల్లనో సాధించేస్తామని నేను భావించడం లేదు. అది ప్రజలను ఎడ్యుకేట్‌ చేయడం ద్వారానే సాధ్యం. దానికి ఎంత కాలమైనా పట్టొచ్చు. ఇదే నా ప్రస్తుత కార్యక్రమం. ఇక నా భవిష్యత్తు అంటారా? విప్లవం కోసం పని చేయడమే. నేను వృత్తి విప్లవకారుడిని" --- రెండవసారి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌ వార్‌ పార్టీ నుంచి బహిష్కరించబడిన సందర్భంగా కొండపల్లి సీతారామయ్య.