Posts

Showing posts from January, 2022

మారిన సమాజ పరిస్థితుల అనుగుణంగా భారత విప్లవ పం ధా స్థూలంగా. ప్రతిపాదన– కార్మిక వర్గ నాయకత్వం లో అసంఘటిత రంగ కార్మికుల ఉద్యమం ఇరుసుగా రైతాంగ పోరాట సహాయం తో సోషలిస్ట్ విప్లవాన్నివిజయవంతం చేయాలి. విద్యార్థి మేధావులారా   కార్మిక ,శ్రామిక వాడలకు తరలండి. అసంఘటిత  రంగ కార్మికుల మరియు రైతుల గిట్టుబాటు ధరల కొరకు పోరాడండి. ప్రతి బస్తీలో అసంఘటిత రంగ కార్మికుల యూనియన్ ఏర్పాటు చెద్దా మ్.అవి ముందు ఉన్నత దశకు  తీసుకపోయి సోవియెట్ లు గా మార్చే లక్ష్యం తో. ప్రతి గ్రామంలో  రైతాంగ సమితులను ఏర్పాటు చేసి రైతుల పంటలకు గిట్టుబాటు ధర, మరియు మార్కెట్ మోసాలకు ఇతర సమస్యల పై పోరాటం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ పడ్డతి,ఇతర విషయాలు  (రహస్య,బహిరంగ),విప్లవ "సన్నాహక" కార్యక్రమాలు  ,విప్లవాన్ని చేసే ప్రతి పార్టీఎలా చేస్తుందో అలాగే వుంటాయి. బూటకపు పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొన దు.

పెట్టుబడిదారీ దేశంలో కార్మిక వర్గం యొక్క శక్తి కేవలం దాని సంఖ్యలో ఉండదు... ‘ఏ పెట్టుబడిదారీ దేశంలోనైనా కార్మిక వర్గం యొక్క బలం, మొత్తం జనాభాలో ఆ వర్గం ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క నాడీ కేంద్రాలన్నింటిలోనూ కార్మిక వర్గం ఆధిపత్యంలో ఉంటుంది. అంతే కాకుండా, పెట్టుబడిదారీ విధానంలో అణగిపోతున్న శ్రామిక జనాభాలో అత్యధిక మెజారిటీ యొక్క వాస్తవ ప్రయోజనాలను రాజకీయంగానూ, ఆర్థికంగానూ కార్మిక వర్గం వ్యక్తీకరిస్తుంది.’ - లెనిన్ మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది.. అబ్దుల్ కరీం. 7_6_2020