Posts

Showing posts from July, 2026

రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా

 రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా ?. ఇటీవల మావోయిస్టు సీసీ సభ్యుడు అనారోగ్యం తో ప్రభుత్వానికి లొంగిపోతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుంది అన్నారు.  నిజంగా మావోయిజం బలపడుతుందా? గతి తార్కికంగా మార్క్సిజం ప్రకారంగా మావోయిజం బలపడటానికి ఆస్కారం ఉందా?. ముందుగా మావోయిజం అంటే ఏమిటో తెలుసుకుందాం.  మావోయిజం అంటే వెనుకబడిన ఫ్యూడల్, అర్ధ ఫ్యూడల్ సమాజాలలో సామ్రాజ్యవాద యుగంలో వలస దేశాలలో వలసలకు ,సామ్రాజ్యవాద ఆక్రమనకు వ్యతిరేకంగా పోరాటంలో కార్మిక వర్గం జాతీయ బూర్జువా వర్గం తో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది.  మొదట గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో ప్రజా సైన్యాన్ని నిర్మించి , విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, క్రమంగా పట్టణాలను ఆక్రమించుకోవాలి. ఆ విధంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలి. దీనిలో పార్టీ ,ప్రజా సైన్యం, ఐక్య సంఘటన ముఖ్య మంత్ర దండాలు గా ఉంటాయి. చైనాలో ఫ్యూడలిజం బలంగా ఉండి జపాన్ సామ్రాజ్యవాద ఆక్రమణలో ఉన్న కాలంలో ఒక కేంద్రీకృత జాతీయ ప్రభుత్వం లేని చైనాలో కార్మిక వర్గం అంతగా లేని సందర్భంలో ఫ...

నూతన ప్రజాస్వామిక విప్లవం లోఉన్న సౌకర్యాలు

   నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఉన్న సౌకర్యాలు ఏమిటి?. నూతన ప్రజాస్వామ్య విప్లవంలో ఉన్న సౌకర్యం జాతీయ బూర్జువా , చిన్న భూస్వామి, ధనిక వర్గంతో కలిసి ఐక్యసంఘటన పేరుతో కలిసి పోవచ్చు. ఎన్నికల మార్గంలోనీ వారు బూర్జవా పార్టీలతో ఎన్నికల పొత్తు సర్దుబాట్లు చేసుకోవచ్చు, సాయుధ పోరాట వాదులు కూడా జాతీయ బూర్జువా తో ఐక్య సంఘటన పేరుతో కలవవచ్చు, లోపాయి కారి సపోర్ట్ చేయవచ్చు. గత చరిత్ర అంతా అదే.  సోషలిస్ట్ విప్లవంలో శత్రువు పెట్టుబడిదారీ వర్గమే కనుక చిన్న భూస్వామి ధనిక వర్గాలతో ఎలాంటి పొత్తు ఉండదు సరి కదా వారిపై పేదల, రైతు కూలీల పోరాటం ఉంటుంది. జాతీయ బూర్జువా పేరుతో వారితో బేరసారాలు పొత్తులు ఐక్యత ఉండదు.  దీనినీ మభ్యపెట్టడానికి సాయుధ పోరాటమా ఎన్నికల పోరాటమానే డిస్కషన్ ముందుకు నెడుతారు. గత 100 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు, 50 సంవత్సరాలుగా నక్సల్ బరి పోరాటవాదులు నూతన ప్రజాస్వామిక విప్లవం చేస్తూనే ఉన్నారు.  ఈ తప్పుడు విధానం ఫలితంగా దేశంలో వునికిలో లేని భూస్వామ్య విధానం మరియు దళారీ బూర్జువా వర్గం తో యుద్ధం చేస్తున్నట్లుగా భావిస్తూ, తమ వర్గ శత్రువులైన పెట్టుబడిదారీ వర్గం తోటే జాతీయ ...

మేం ఎంతో మాకు అంత వాట

 *మే మెంతో మాకంత వాట* వర్గ పరంగా ప్రపంచ కార్మికుడిగా  నీవు అత్యంత బలవంతుడివి 90%. దేశ కార్మికుడిగా  నీ బలం  స్వల్పం (20% aprox) , ఇక మతం లో నీ బలం  ,దేశ కార్మికుడి  బలం కంటే తక్కువ. ఇక అస్తిత్వ బహుజన,దళిత  కులంలో నిబల మెంత? నీ వాటా ఎంత?. స్వంత కులం లో నీ బలం ఎంత? ఉప కులం లో నీ బలం చివరికి 1% మిగులు తుందా?. నీరాజకీయ విముక్తి రాజ్యాంగం ద్వారానే లభించింది,సాధించాల్సింది ఆర్థిక విముక్తి మాత్రమే. ఆర్థిక విముక్తి లేని రాజకీయ విముక్తి  ఒక మిథ్య. నిజమైన రాజ్యాధికారం కార్మిక వర్గ రాజ్యాధికారమే. నీ బలమంతా కార్మిక వర్గం లో వుంది. నీ విముక్తికి కార్మిక వర్గ  సోషలిస్ట్ విప్లవం మే పరిష్కారం. అబ్దుల్ కరీం. 8-7-2026