రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా
రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుందా ?. ఇటీవల మావోయిస్టు సీసీ సభ్యుడు అనారోగ్యం తో ప్రభుత్వానికి లొంగిపోతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రపంచవ్యాప్తంగా మావోయిజం బలపడుతుంది అన్నారు. నిజంగా మావోయిజం బలపడుతుందా? గతి తార్కికంగా మార్క్సిజం ప్రకారంగా మావోయిజం బలపడటానికి ఆస్కారం ఉందా?. ముందుగా మావోయిజం అంటే ఏమిటో తెలుసుకుందాం. మావోయిజం అంటే వెనుకబడిన ఫ్యూడల్, అర్ధ ఫ్యూడల్ సమాజాలలో సామ్రాజ్యవాద యుగంలో వలస దేశాలలో వలసలకు ,సామ్రాజ్యవాద ఆక్రమనకు వ్యతిరేకంగా పోరాటంలో కార్మిక వర్గం జాతీయ బూర్జువా వర్గం తో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది. మొదట గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో ప్రజా సైన్యాన్ని నిర్మించి , విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, క్రమంగా పట్టణాలను ఆక్రమించుకోవాలి. ఆ విధంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలి. దీనిలో పార్టీ ,ప్రజా సైన్యం, ఐక్య సంఘటన ముఖ్య మంత్ర దండాలు గా ఉంటాయి. చైనాలో ఫ్యూడలిజం బలంగా ఉండి జపాన్ సామ్రాజ్యవాద ఆక్రమణలో ఉన్న కాలంలో ఒక కేంద్రీకృత జాతీయ ప్రభుత్వం లేని చైనాలో కార్మిక వర్గం అంతగా లేని సందర్భంలో ఫ...