ప్రజాసంఘాల భావ దారిద్ర్యం
భావ దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్న విప్లవ ప్రజా సంఘాలు. ఒక సరైన సిద్ధాంత భూమిక లేకుండా ఈ బూర్జువా రాజ్యాంగాన్ని కాపాడాలని మార్పుకు అతీతమని మార్పు చేయడం అంటే ప్రజా ద్రోహం అని అంటున్నారు. అంబేద్కర్ రచించాడు కాబట్టి మరియు దళితులకు రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి ఈ రాజ్యాంగం అత్యుత్తమమైనదని అమలు చేయడంలోనే లోపం ఉందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రమే రాలేదు అధికార మార్పిడి మాత్రమే జరిగింది ,దళారి బుర్జు వ ,భూస్వామ్య ప్రభుత్వం ఉన్నది,అంటూ నూతన ప్రజాస్వామ్య విప్లవం కావాలని కోరుకునేవారు విచిత్రంగా ఈ రాజ్యాంగాన్ని ఉన్నతమైనదిగా యధాతధంగా ఉంచాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం. ఒక దళారీ భూస్వామ్య రాజ్యాంగం ను కాపాడాలి అనడం ఏ విలువలకు సరిపోతుంది. పోనీ వీరు ప్రస్తుత రాజ్యాన్ని బూర్జువా రాజ్యంగా గుర్తిస్తున్నారా .కనీసం బూర్జువా రాజ్యంగా గుర్తించకుండా , ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలంటారు. అది ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది సైదాంతిక దివాలా కొరు తనము. కమ్యూనిస్టులకు ఉండాల్సిన కనీస సైద్ధాంతిక పరిజ్ఞానం లేదనిపిస్తుంది లేదా ఇది పచ్చి అవకాశవాదం. భూస్వామ్య ,fuedal...