Posts

Showing posts from July, 2021
 ప్రభుత్వరంగం ఉండాలా, ప్రైవేటీకరణ జరగడం మంచిదా ఇది అనవసరమైన సంవాదం.(సరైన విషయ పరిజ్ఞానం లేక జరిగిన చర్చ) రాజ్యం పెట్టుబడిదారీ అభివృద్ధికి దాని అవసరాలకి అనుగుణంగానే ,ఒక్కొక్కసారి ప్రైవేటు రంగాన్ని ,రక్షణ సుంకాలని,స్వేచ్చా వ్యాపారం, జాతీయకరణను, ప్రభుత్వ రంగాన్ని ,మరల ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను , ఇలా పెట్టుబడికి ఏది అవసరమో అది పెట్టుబడిదారి ప్రభుత్వాలు చేస్తాయి. అంతిమంగా నిర్ణఇం చేది పెట్టుబడిదారి వ్యవస్థ అభివృద్ధి ప్రయోజనాలే. ఏ రంగమైనా రాజ్యం శ్రామిక ప్రజల నుండి కార్మిక వర్గం నుండి అదనపు విలువను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు కావలసిన పెట్టుబడిని అందిస్తుంది.  ప్రపంచ చరిత్ర అయినా భారతదేశ చరిత్ర అయినా పెట్టుబడిదారి అభివృద్ధి మార్గం ఇదే. కార్మిక వర్గ నాయకత్వం లో జరిగే సోషలిస్టు విప్లవం మాత్రమే సకల శ్రామిక వర్గ ప్రజల విముక్తి మార్గం.

పెట్టుబడి దారీ సమాజం

 కులం,అంబేడ్కర్ ఇజం వీటి పై విస్తృతంగా , కూలంకషంగా చర్చలు జరిగాయి .దాదాపు అన్నికొనాల నుండి సుదీర్ఘ కాలం చర్చ జరిగింది.ఎవరి వర్గ,స్వంత ప్రయోజనాల దృష్ట్యా వారు మార్క్సిస్ట్ మార్గంలో నా,లేక ఇతర బహుజన,కుల,అంబేడ్కర్ మార్గం లోన  అనేది స్పష్టంగా  తేలి పోయింది. ఇక ఇప్పుడు మార్క్సిస్ట్ లు తేల్చు కోవాల్సింది దేశంలో ప్రస్తుతం ఏ వ్యవస్థ వున్నది.అంటే పెట్టుబడి దారీ సమాజమా లేక ఇంకా అర్ద భూస్వామ్య,అర్దవలస సమాజమా. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు?. ( Cpi,cpm లను వదిలేయండి). మనది అర్డవలస,అర్దభూస్వామ్య సమాజ మని,దున్నేవానికే భూమి నినాదం తో, వ్యవసాయ క విప్లవము ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం చేయాలని,నక్సల్బరి మొదలైంది కదా.సాయుధ గెరిల్లా పోరాట ము ద్వారా ,శ్రీకాకుళం నుండి,జగిత్యాల జైత్రయాత్ర నుండి దండకారణ్య లో జనతన రాజ్యం వునికీలో వుంది కదా.ఇప్పుడెందుకు  మరల ఈ చర్చ. నక్సల్ బరి మొదలై  అర్ద శతాబ్దం దాటింది.ఇంతటి సుదీర్ఘ కాలం లో,సుదీర్ఘ  ఉద్యమంతో సమాజం లో ఎలాంటి మార్పు రాలేదా,వస్తే ఎలాంటి మార్పు వచ్చింది. మన తెలుగు రాష్ట్రాలలో దున్నేవానిక్ భూమి నినాదం తో  భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం...

ప్రభుత్వ రంగం.

 ప్రభుత్వ రంగ సంస్థలు ఎవైనా ప్రభుత్వం కార్మిక వర్గ చెతుల్లొ వున్నప్పుడు మాత్రమే ప్రజలకు ఉపయోగం. బూర్జువా ప్రభుత్వం లోని ప్రభుత్వ రంగం బూర్జువాల కె ఉపయోగం ప్రస్తుతం ప్రైవేటీకరణ పై దేశ వ్యాప్తంగా వామ పక్స వాదుల లోనే కాకుండా సాధారణ ప్రజల వరకూ వాడి వేడి చర్చ జరుగుతున్నది .మోడీ ప్రభుత్వం ఖరాఖండిగా ప్రైవేటు చేస్తామని చెపుతున్నది,చేస్తున్నది. అయితే దీనిపై కమ్యూనిస్ట్ దృక్పధం ఏమిటి.మూల అంశాలు ఏమిటి.  బ్యాంకింగ్ రంగం గురించి తీసుకుందాం "ప్రభుత్వ బాంకుల వల్ల పెట్టుబడిదార్ల కే లాభం అని మేము కొత్తగా కనిపెట్టేసాం.   అందువల్ల బాంకులన్నీ ప్రైవేట్ పెట్టుబడిదార్లకే ఇచ్చేయండి. ప్రజలకు లాభం "  అని సూత్రీకరిస్తున్నారు కొందరు.  వాళ్ళ మోకాళ్ళకు  త్వరగా రోకళ్ళు చుట్టేస్తే ఊళ్ళ కు వెళ్ళిపోతారట. పబ్లిక్ రంగం పేరుతో పెట్టుబడి ఆడే ఆటలను ఎక్స్ పోజ్ చేసే ఆత్రంలో ... ప్రైవేటీకరణను గుడ్డిగా సమర్థించే  నియోలిబరల్స్ గా మారకండి.                     -------------ఒక విమర్శ సరే పై విమర్శల నేపథ్యంలో మనం ఒక ప్రశ్న వేద్దాం ప్రభుత...

KS సైద్ధాంతిక చారిత్రక తప్పిదం

  కె ఎస్ సైద్ధాంతిక చారిత్రక తప్పిదం కొండపల్లి సీతారామయ్య భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ తర్వాత అంతటి వాడు .నక్సల్బరీ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఒక సరైన పంథాలో నడిపించి సరైన నిర్మాణాన్ని పార్టీని పటిష్టం చేసిన మహా నాయకుడు. అదే పార్టీలో తాను తీర్చిదిద్దిన ,తయారుచేసిన, ఉద్యమ పాఠాలు నేర్పిన తన శిష్యులతో నే బహిష్కరించడం చాలా అరుదైన ఆశ్చర్య పడే విషయం .చాలా పార్టీలలో సంస్థల్లో లో చీలికలు కొట్లాటలు సాధారణమే కానీ ఇంత చిత్తుగా తాను స్థాపించిన తనతో సమానులు కూడా లేని పార్టీలో ,తనతో ఎవరు రు రాకుండా ,కనీసం తన వర్గం లేకుండానే దాదాపు ఒంటరిగా బయటికి వెళ్ళగొట్టబడడం అసాధారణం. అంతకు ముందు వరకు గొప్ప నాయకుడు ,సిద్ధాంత మార్గదర్శకుడిగా పెద్దదిక్కుగా చారుమజుందార్ తర్వాత అంతటి ఆదరణ పొందిన నాయకుడిగా ,ఉన్నటువంటి వాడిని ఎటువంటి సిద్ధాంత విభేదాలు లేకుండా వ్యక్తిగత కారణాలు ఆరోపిస్తూ, పైగా ముసలితనంలో పార్టీ నుండి  బహిష్కరించడం ద్వారా ఆ పార్టీకి కలిగిన లాభం ఏమిటి ?.ఉంచుకుంటే గల నష్టం ఏమిటో ?  ఆలోచించాలి . పార్టీ నుండి బహిష్కరించిన కొంతకాలానికి మరణించాడు. వందలాది మంది కార్యకర్తలకు అభిమాన గురువు ,అతని అడు...

వర్గపోరాటం లొ నిజాయతీ

వర్గ పోరాటం లో నిజాయితీ, ఆదర్శాలు ఎక్కువ సమయం నిలబడవు.ఆదాయం పెరిగినపుడు వర్గం మారుతుంది,దానితో పాటు పోరాటం మారుతుంది. గతంలో సింగరేణి కార్మికులు పోరాటాలు చేసినారు అంటే అప్పటి వారి ఆర్థి క పరిస్థితి సగటు దేశ కార్మికుల స్థాయిలో ఉంది కాబట్టి. గత పోరాటాల పలితాంగా, మారిన ప్రాపంచిక పరిస్థితు లలో బూర్జువా పాలకవర్గం వారికి అధిక, సౌకర్యవంతమైన వేతనాలు ఇచ్చి,వారిని అదుపులోకి తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి వి సాధారణంగా జారిగేవే. బ్రిటన్ కార్మిక వర్గాన్ని,వలసలతో కొల్లగొట్టిన డబ్బుతో వారికి అధిక సౌకర్యవంతమైన జీతాలను ఇచ్చి,కార్మిక వర్గాన్ని విప్లోద్యమాన్ని చి దూరం చేయలేదా?. ఇప్పుడు ఉద్యమ కారులు,ప్రభుత్వ రంగ సంస్థలలోని కార్మికుల ను వదిలి,ప్రయివేటు సంస్థల మరియు అసంఘటిత రంగ పరిశ్రమ ల,కార్మికుల సమస్యలు, పోరాటాలపై వారిని చైతన్య పరచాలి. ఇటీవల జరిగిన ఉబర్ డ్రైవర్ ల సమ్మె ను ఎవరూ పట్టించుకోలేదు,50 వేల కార్మికులు సమ్మె చేశారు. గత సం.రము బెంగుళూరులో వేలాది మంది గార్మెంట్ కార్మికులు pf సమస్యపై ,దాదాపు రెండు రోజుల సిటీని స్తంభింపజేసి, ఒక పోలీసు స్టేషన్ ను కూడా ధ్వంసం చేశారు మరియు కేంద్ర ప్రభుత్వ మెదలువంచి తమ సమస్య...

రైతు ఆత్మహత్యలు లేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలి

  రైతు ఆత్మహత్యలు లేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలి ప్రత్యేకతెలంగాణ సాధించినతర్వాత,తెలంగాణప్రభుత్వం ఏర్పడ్డాక కూడా, ఇటీవల కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు,ఆ క్రమంలో నల్గొండజిల్లా సూర్యాపేట చుట్టూ జరిగిన ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలను,పరామర్శించడానికి,వారి స్థితిగతులను తెలుసుకోవడానికి Nov 30 2014 న తెలంగాణా ప్రజా ఫ్రంట్,తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో,tpfఅధ్యక్షుడు మద్దిలేటి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.ఆర్.చౌదరి,రైతాంగ సమితి అధ్యక్షుడు మచ్చ విద్యాసాగర్,tpf ఉపాధ్యక్షుడు రమణా చారి,నల్గొండ జిల్లా tpf అధ్యక్షుడు చింతా నర్సింహా,కార్యదర్శి సుధాకర్ రెడ్డి మరియు పుల్లన్న,నిమ్మల రాఘవులు,అబ్దుల్ కరీం (నేను) వెళ్లడం జరిగింది. వు 10గం. లకు సూర్యాపేట నుండి మొదటగా పెంపహాద్ మండలం లోని ఆత్మహత్య చేసికొన్న రైతు కుటుంభం దగ్గరకి వెళ్లినాము, అతనికి అర ఎకరం చెను ఉంది. మిగతా కౌలుకు చేసినాడు.3నుండి}4 లక్షల అప్పు(ప్రయివేటు)ఉన్నది.భార్య},కూతురు, కుమారుడు ఉన్నాడు.తరువాత మాచారం గ్రామంలోని అగ్రకులముకి చెందిన రైతుకుటుంబం దగ్గరికి వెళ్లినము.అతను కూడా పత్తి రైతు.అప్పు మాత్రం 1 లక్ష మాత్రమే.ప్రభుత్వ ఉద్యోగం కొరకు ...
 పెట్టుబడిదారీ దేశంలో కార్మిక వర్గం యొక్క శక్తి కేవలం దాని సంఖ్యలో ఉండదు... ‘ఏ పెట్టుబడిదారీ దేశంలోనైనా కార్మిక వర్గం యొక్క బలం, మొత్తం జనాభాలో ఆ వర్గం ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క నాడీ కేంద్రాలన్నింటిలోనూ కార్మిక వర్గం ఆధిపత్యంలో ఉంటుంది. అంతే కాకుండా, పెట్టుబడిదారీ విధానంలో అణగిపోతున్న శ్రామిక జనాభాలో అత్యధిక మెజారిటీ యొక్క వాస్తవ ప్రయోజనాలను రాజకీయంగానూ, ఆర్థికంగానూ కార్మిక వర్గం వ్యక్తీకరిస్తుంది.’ - లెనిన్ మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు...

ఆర్టీసీ సమ్మె – దృక్పథం

  ఆర్టీసీ సమ్మె – దృక్పథం   అవాక్కయ్యారా, నిజంగానే ఈ రోజు తెలంగాణ ప్రజలు అందరూ అవాక్కయ్యారు. ప్రజల కంటే కూడా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు నిజంగానే అవాక్కయ్యారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రవాణా సంస్థ కు భారీ నజరానా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇన్నాళ్లు తిట్టిపోసిన కార్మికులు సంతోషంగా ఉత్సాహంగా విందు సభనుండి బయటకు వస్స్తూతమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఫేస్ బుక్కు లలో ఏం పోస్ట్ చేయాలి ఏం కామెంట్ చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు చాలా  పిట్టలని కొట్టారు. కార్మిక యూనియన్ లు లేకుండా చేయడం  . ప్రతిపక్ష పార్టీల అవకాశవాదాన్ని ప్రజలకు చూపించడం  కేంద్ర ప్రభుత్వం,బీజేపీ కి చెక్ పెట్టడం సునాయాసంగా చార్జీలు పెంచడం. ఈ మొత్తం క్రమంలో లో విప్లవ కమ్యూనిస్టుల దృక్పథం ఏమిటి ఎలా ఉండాలి, కమ్యూనిస్టుల దృక్పధము నిర్ణయించు కోవాలంటే ప్రస్తుతం సమాజ స్వభావం నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా దృక్పథం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం  ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉండి చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్...

ఎందుకిది రిహార్సల్

  ఎందుకిది రిహార్సల్. ఢిల్లీని ముట్టడించిన ఈ రైతాంగ ఉద్యమం ఎందుకు జరగబోయే సోషలిస్ట్ విప్లవానికి రిహార్సల్ అవుతుంది. గత 50 సంవత్సరాలుగా భారతదేశం అర్ధ వలస అర్ధ భూస్వామ్యంఅని  దానికి అనుగుణంగా ml, మావోయిస్టు పార్టీ లు ఏర్పడ్డాయి. అవి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక ఉద్యమం లో భాగంగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధం ద్వారా గ్రామాల  నుండి పట్టణాలకు వ్యాపిస్తుందని గ్రామాలను విముక్తి చేసి వెనక తట్టు ప్రాంతాలలో విముక్తి ప్రాంతాలను ఏర్పరిచి అంచెలంచెలుగా పట్టణాలను  విముక్తం  చేసి  విప్లవాన్ని విజయవంతం చేయాలి అన్నారు. ప్రస్తుత మారిన పెట్టుబడిదారీ సమాజంలో విప్లవం ఎలా వస్తుంది, పట్టణ కార్మిక వర్గం అసంఘటిత శ్రామిక వర్గం రైతాంగ శ్రామికుల తో కలిసి  ఏవిధంగా గా విప్లవం చేస్తారు. రష్యా మాదిరిగా సార్వత్రిక తిరుగుబాటుగా ద్వారా విశాల భారతదేశంలో విప్లవం సాధ్యమా అనే అనుమానం ఉంది. ఇంతకాలం నూతన ప్రజాస్వామిక విప్లవానికి అలవాటుపడ్డ వారికి సార్వత్రిక   సాయుధ తిరుగుబాటు ద్వారా సాధ్యం అనేది అనుమానమే కాదు ఊహకు అందని విషయం. అందువలన రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికల ద్వారా సోష...

సైదులు గారికి

 Dear సైదులు గారు, మీరు రెండు యుద్దాల్లను ప్రస్తావించారు .వీటిలో ఒక ముఖ్యమైన విషయం విస్మరించరాని (గమనించ లేదు అని) తెలుస్తోంది. చైనా యుద్దం వైరుధ్యాల ను గమనిస్తే,, చైనా జాతీయ బూర్జువా, భూస్వామ్య వర్గం,మొత్తం ప్రజలకి × మరియు వలసవాద (జపాన్ ) , సామ్రాజ్య వాద ప్రయోజనాల కు మద్య వైరుధ్యం     ( ఆ సమాజం లో వర్గేతర( కుల విభజన) ఇతర విభజనలు లేవు) 2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో, తెలంగాణ ప్రాంతీయ బూర్జు వా, భూస్వామ్య,ధనిక వర్గాల,ప్రజల అందరి కి × మరియు ఆంధ్రా బూర్జువా వర్గానికి మద్య వైరుధ్యం.      3. కొరేగాం యుద్ధంలో,బ్రాహ్మణులకు,పిస్వాలకు ప్రజలకు. ×. మరియు మెహర్+ బ్రిటిష్ వలస వాదులకు మద్య వైరుధ్యం.     ( ఈ సమాజం లో వర్గేతర కుల విభజన వుంది. స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ,నిచనమెట్ల కుల విభజన తో,చలనం లేకుండా ఎదుగు బొడుగులేని, గడ్డకట్టిన, మురిగిపోతున్న సమాజం) చైనా యుద్దం లో న్యాయం( అభివృద్ధి కర ) ప్రయోజనం,జపాన్ వ్యతిరేక, చైనా ప్రజలందరి వైపు వుంది కనుక మావో చైనా జాతీయ బూర్జువా భూస్వామ్య వర్గం, నకు ప్రజల తరఫున పోరాానికి మద్దతిచ్చ...

కులం అంబేడ్కర్ ఇజం

  కులం,అంబేడ్కర్ ఇజం వీటి పై విస్తృతంగా , కూలంకషంగా చర్చలు జరిగాయి .దాదాపు అన్నికొనాల నుండి సుదీర్ఘ కాలం చర్చ జరిగింది.ఎవరి వర్గ,స్వంత ప్రయోజనాల దృష్ట్యా వారు మార్క్సిస్ట్ మార్గంలో నా,లేక ఇతర బహుజన,కుల,అంబేడ్కర్ మార్గం లోన  అనేది స్పష్టంగా  తేలి పోయింది. ఇక ఇప్పుడు మార్క్సిస్ట్ లు తేల్చు కోవాల్సింది దేశంలో ప్రస్తుతం ఏ వ్యవస్థ వున్నది.అంటే పెట్టుబడి దారీ సమాజమా లేక ఇంకా అర్ద భూస్వామ్య,అర్దవలస సమాజమా. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు?. ( Cpi,cpm లను వదిలేయండి). మనది అర్డవలస,అర్దభూస్వామ్య సమాజ మని,దున్నేవానికే భూమి నినాదం తో, వ్యవసాయ క విప్లవము ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం చేయాలని,నక్సల్బరి మొదలైంది కదా.సాయుధ గెరిల్లా పోరాట ము ద్వారా ,శ్రీకాకుళం నుండి,జగిత్యాల జైత్రయాత్ర నుండి దండకారణ్య లో జనతన రాజ్యం వునికీలో వుంది కదా.ఇప్పుడెందుకు  మరల ఈ చర్చ. నక్సల్ బరి మొదలై  అర్ద శతాబ్దం దాటింది.ఇంతటి సుదీర్ఘ కాలం లో,సుదీర్ఘ  ఉద్యమంతో సమాజం లో ఎలాంటి మార్పు రాలేదా,వస్తే ఎలాంటి మార్పు వచ్చింది. మన తెలుగు రాష్ట్రాలలో దున్నేవానిక్ భూమి నినాదం తో  భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం ...

నిర్వాసితుల సమస్య–పెట్టుబడి దారీ విధానం– కమ్యూనిస్టుల పాత్ర.

  నిర్వాసితుల సమస్య– పెట్టుబడి దారీ విధానం– కమ్యూనిస్టుల పాత్ర. గత రెండు దశాబ్దాలుగా భారత దేశం లో  నిర్వాసితుల సమస్యలు దేశ రాజకీయాల్లో ప్రధానభూమిక పోషిస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టులు,నదుల పై ద్యం లు నిర్మాణం ద్వార ముంపు గురి అయ్యే నిర్వాసితులు, మైనింగ్ ద్వార అయ్యే నిర్వాసితులు, రోడ్ల వెడల్పు కోసం అయ్యే నిర్వాసితులు,ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు sez ద్వార అయ్యే నిర్వాసితులు. నిర్వాసితులలో ఎక్కువ గా గిరిజ నులు, గ్రామీణ ప్రాంత రైతులు మరియు గ్రామీణ ప్రాంత ము అయి ఉం టుంది.దీని వలన పెద్ద ఎత్తున అటవి భూములు మరియు సాగు భూములు బదలాయింప బడుతున్నాయి.                 భూములు కోల్పోయిన నిర్వాసితులైన ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.అవసరాల కనుగుణంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్వాసి తుల పక్షాన మద్దతు తెలుపు తున్నా యి.కొంత మంది మేధావులు,రచయితలు, పౌరహక్కుల సంఘలు, స్వచ్చంధ సంస్థలు కూడా ప్రజలకు మద్దతు గా నిలుస్తున్నాయి.ఈ వుడ్యమాల ద్వారా కొత్త కొత్త మేధావులు , నాయకులు పుట్టుకొస్తున్నరు. అయినప్పట...