చదివారా? 📕📕📕📕📕📕📕📕📕 *ఎందుకు సోషలిస్టు విప్లవం?* ( రచన *షేక్ అబ్దుల్ కరీమ్* ) *పరామర్శ : వి. విజయ కుమార్* * పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ కార్యక్రమాన్నీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ విధానాన్నీ, కార్మిక వర్గ అంతర్జాతీయతకు కట్టుబడి పని చేసే ఒక నూతన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ఆవశ్యకతనూ గుర్తించి, దానికై ప్రచార ఉద్యమాన్నీ, నిర్మాణ కార్యకలాపాల్నీ నిర్వహించే ఒక రాజకీయ నిర్మాణ వేదికగా, శాస్త్రీయ కమ్యూనిజపు మార్గదర్శకత్వంలో నడిచే కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ తరపున షేక్ అబ్దుల్ కరీం గారు ఎందుకు సోషలిస్టు విప్లవం? అనే పేరున వేర్వేరు సందర్భాల్లో రాసిన ఇంచుమించు 18 అంశాలను ఒక పుస్తక రూపంగా వెలువరించారు. ఆయా వ్యాసాల్లో వేరువేరు సందర్భాల్లో సోషలిస్టు విప్లవ అంశాలను తడిమారు. సంక్షిప్తంగా కొన్ని విషయాల్ని ఇందులో సమీక్షించాను. 1994 లో పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తానెంత సంఘర్షణకు లోనైందీ, కామ్రేడ్ కె ఎస్ సంక్షోభానికి మూల కారణాలు అన్వేషిస్తూ సాగిన అధ్యయనం ద్వారా తనకు ఒక సమాధానం ఎలా లభించిందీ, దాని పర్యవసనాల ఫలితంగా అది పెట్టుబడిదారీ వ్యతిరేక సో...
Posts
Showing posts from December, 2024