ప్రజాసంఘాల భావ దారిద్ర్యం
భావ దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్న విప్లవ ప్రజా సంఘాలు.
ఒక సరైన సిద్ధాంత భూమిక లేకుండా ఈ బూర్జువా రాజ్యాంగాన్ని కాపాడాలని మార్పుకు అతీతమని మార్పు చేయడం అంటే ప్రజా ద్రోహం అని అంటున్నారు. అంబేద్కర్ రచించాడు కాబట్టి మరియు దళితులకు రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి ఈ రాజ్యాంగం అత్యుత్తమమైనదని అమలు చేయడంలోనే లోపం ఉందని అంటున్నారు.
విచిత్రం ఏమిటంటే మన దేశానికి స్వాతంత్రమే రాలేదు అధికార మార్పిడి మాత్రమే జరిగింది ,దళారి బుర్జు వ ,భూస్వామ్య ప్రభుత్వం ఉన్నది,అంటూ నూతన ప్రజాస్వామ్య విప్లవం కావాలని కోరుకునేవారు విచిత్రంగా ఈ రాజ్యాంగాన్ని ఉన్నతమైనదిగా యధాతధంగా ఉంచాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం.
ఒక దళారీ భూస్వామ్య రాజ్యాంగం ను కాపాడాలి అనడం ఏ విలువలకు సరిపోతుంది.
పోనీ వీరు ప్రస్తుత రాజ్యాన్ని బూర్జువా రాజ్యంగా గుర్తిస్తున్నారా .కనీసం బూర్జువా రాజ్యంగా గుర్తించకుండా , ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలంటారు. అది ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది సైదాంతిక దివాలా కొరు తనము. కమ్యూనిస్టులకు ఉండాల్సిన కనీస సైద్ధాంతిక పరిజ్ఞానం లేదనిపిస్తుంది లేదా ఇది పచ్చి అవకాశవాదం.
భూస్వామ్య ,fuedal మత వాదులు నుండి ప్రమాదం ఉంది అంటున్నారు,వారు మరల fuedalism లోకి తీసుకు వెళ్తారు అంటున్నారు. అంటే ఇది బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాంగం,అధికారం లో వున్నది బూర్జువావర్గం ( అంటే జాతీయ పెట్టుబడి దారీ వర్గం) అని అనుకోవాల్సి వుంటుంది.
ఒక వేళ ఇది బూర్జువా ప్రజాస్వామిక రాజ్యాంగం అని గుర్తిస్తే ,దీనిని కూడా కార్మిక వర్గ నాయకత్వం,కమ్యునిస్ట్ లు సోషలిస్ట్ విప్లవం లో భాగంగా కూల దోయాల్సి వుంటుంది.కాబట్టి కమ్యునిస్ట్ లు నూతన ప్రజాస్వామిక విప్లవం అనేవారైనా,సోషలిస్ట్ విప్లవ ము అనే వారైనా అనేది ,చేయాల్సింది
ఈ రాజ్యాంగాన్ని ,రాజ్యాన్ని కూల దోసి విప్లవం పూర్తి చేయాలి.
అర్ధ వలస భూస్వామ్యం అని నూతన ప్రజాస్వామ్య విప్లవం అనే వారికి కానీ
ఇది పెట్టుబడిదారీ దశ , కావాల్సింది సోషలిస్టు విప్లవం అనే వారికి కానీ ప్రస్తుత రాజ్యాంగంతో వైరుధ్యమే ఉంది.
ఇక ఏ వై రుద్యం లేనిది ఎవరికంటే బూర్జువా వర్గానికి లేదా ( దళారీ బూర్జువా , భూస్వామ్య), పెట్టి బూర్జువా వర్గానికి ఎంతో కొంత రాయితీలు పొందే ఉద్యోగ మరియు ప్రజలలో ఒక సెక్షన్కు మాత్రమే.
Maarxijam ప్రకారం రాజ్యం అంటేనే
ఒక వర్గం ఇంకో వర్గాన్ని అణిచి వేసే సాధనం.
మరి ఈ రాజ్యం రాజ్యాంగం ఏ వర్గానికి చెందిన ది.
విప్లవ ప్రజా సంఘాలు ఇకనైనా అటు ఇటూ కానీ ఈ భావజాలాన్ని వదిలి వేయాలి.లేకుంటే
అటు ఇటూ కానీ చరిత్ర హీనులుగా,అంతిమంగా విప్లవ ప్రతిఘాతక భావజాల సమర్ధకులు గా మిగిలి పోతారు.
Abdul Kareem
20-9-2022.
Comments
Post a Comment