పెట్టుబడిదారీ దేశంలో కార్మిక వర్గం యొక్క శక్తి కేవలం దాని సంఖ్యలో ఉండదు...
‘ఏ పెట్టుబడిదారీ దేశంలోనైనా కార్మిక వర్గం యొక్క బలం, మొత్తం జనాభాలో ఆ వర్గం ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క నాడీ కేంద్రాలన్నింటిలోనూ కార్మిక వర్గం ఆధిపత్యంలో ఉంటుంది. అంతే కాకుండా, పెట్టుబడిదారీ విధానంలో అణగిపోతున్న శ్రామిక జనాభాలో అత్యధిక మెజారిటీ యొక్క వాస్తవ ప్రయోజనాలను రాజకీయంగానూ, ఆర్థికంగానూ కార్మిక వర్గం వ్యక్తీకరిస్తుంది.’ - లెనిన్
మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు.
కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది.
ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది..
అబ్దుల్ కరీం.
7_6_2020
Comments
Post a Comment