నిర్వాసితుల సమస్య–పెట్టుబడి దారీ విధానం– కమ్యూనిస్టుల పాత్ర.
నిర్వాసితుల సమస్య–పెట్టుబడి దారీ విధానం– కమ్యూనిస్టుల పాత్ర.
గత రెండు దశాబ్దాలుగా భారత దేశం లో నిర్వాసితుల సమస్యలు దేశ రాజకీయాల్లో ప్రధానభూమిక పోషిస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టులు,నదుల పై ద్యం లు నిర్మాణం ద్వార ముంపు గురి అయ్యే నిర్వాసితులు, మైనింగ్ ద్వార అయ్యే నిర్వాసితులు, రోడ్ల వెడల్పు కోసం అయ్యే నిర్వాసితులు,ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు sez ద్వార అయ్యే నిర్వాసితులు. నిర్వాసితులలో ఎక్కువ గా గిరిజ నులు, గ్రామీణ ప్రాంత రైతులు మరియు గ్రామీణ ప్రాంత ము అయి ఉం టుంది.దీని వలన పెద్ద ఎత్తున అటవి భూములు మరియు సాగు భూములు బదలాయింప బడుతున్నాయి.
భూములు కోల్పోయిన నిర్వాసితులైన ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.అవసరాల కనుగుణంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్వాసి తుల పక్షాన మద్దతు తెలుపు తున్నా యి.కొంత మంది మేధావులు,రచయితలు, పౌరహక్కుల సంఘలు, స్వచ్చంధ సంస్థలు కూడా ప్రజలకు మద్దతు గా నిలుస్తున్నాయి.ఈ వుడ్యమాల ద్వారా కొత్త కొత్త మేధావులు,నాయకులు పుట్టుకొస్తున్నరు. అయినప్పటికీ రోజు రోజుకు నిర్వాసితుల సమస్యల పెరుగుతూనే ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు,మైనింగ్ లు,రోడ్లు, రోడ్డు వెడల్పు లు పెరుగుతూనే ఉన్నాయి,అయితే దీనికి పరిష్కారం ఏమిటి.
ప్రతి పక్షం అంటున్నది ఏమంటే,అధికార పక్షం సరిగా అంచనా వేయ లేద నీ, అదే మేమైతే అతి తక్కువ మంది నిర్వాసితులు అయ్యేటట్లు చుసేవారమని , నష్టరిహారం ఎక్కువగా అవినీతి లేకుండా ఇప్పించే వారమని,అధికార పక్షానికి చెందిన కాంట్రాక్టర్లకు ,వారి అనుకులురకు లబ్ది చేకూరచే విధంగా ప్రాజెక్టులు కడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు.కానీ వీరికి నిజంగా ప్రాజెక్టులు కట్టడం పైన కానీ,మైనింగ్ లు పైన గాని, ఫ్యాక్టరీలు కట్టడం,రోడ్లు, రోడ్డు వెడల్పు పై కానీ అభ్యంతరం లేదు.ఈ రాజకీయాలు అందరికీ తెలిసినవే.మరి మేధావులు, హక్కుల సంఘం వారు ఏమంటారంటే పర్యావరణం దెబ్బతింటుంది,అడవులు నాశనం అవుతున్నాయి, గిరినుల సంస్కృతి నాశనం అవుతుంది,భూములు తరిగిపోతాయి,ప్రజలు నిర్వాసితులు అవుతారు. అభివృద్ధి మాటున ఇవన్నీ అనర్థాలు జరిగిపోతాయి
కాబట్టి గిరిజన సంస్కృతిని కాపాడి మరియు గ్రామీణ ప్రాంత రైతులను కాపాడి వారి సంస్కృతిని కాపాడాలని ఉద్యమాలు చేస్తున్నా రు
మరి కమ్యూనిస్టులు( పార్లమెంటరీ ) ఏమంటున్నారంటే , వీరు కూడా దాదాపు ఇతర ప్రతిపక్ష పార్టీ ల వైఖరి తో పాటుగా మేధావుల మరియు హక్కుల సంఘం ల వైఖరిని మిళితం చేసి మాట్లాడుతూ అంతిమంగా ఇతర ప్రతిపక్ష పార్టీల వైఖరితో మిళితం అయి పోతారు.
మరి విప్లవ కమ్యూనిస్టు పార్టీలు( ml,maoist) మరియు వారి అనుకూల ప్రజాసంఘాలు,రచయితలు,మేధావులు,హక్కుల సంఘాలు ఏమంటున్న యి అంటే సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమే గిరిజనుల భూములను లాక్కొని,అందులోని ఖనిజ సంపదను కొల్లగొట్టి పోతున్నాయి. అభివృద్ధి మాటున వారిని అడవి నుండి నిర్వాసితులను చేస్తున్నారు.గ్రామాలలో రైతుల నున్డీ భూముల ను లాక్కొని,sezలకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు ఇస్తున్నారు.రైతులను పట్టణాలకు వలస పోయేవిదంగా చేస్తున్నారు.సరైన నష్టపరిహారం ఇవ్వడంలేదు.దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.అడవిని,అటవి సంపదని రక్షించడానికి,వ్యవసాయ భూములను,వ్యవసాయాన్ని,రైతులను రక్షంచుకోవడానికి పోరాటం చేయాలంటున్నారు.
అధికారంలో ఉన్న వారు, పాలకులు ఏమంటున్నరంటే , అభివృద్ధి కావాలంటే కొత్త ఉద్యోగాలు అవకాశాలు రావాలంటే ప్రాజెక్టులు, ఫ్యాక్టరిలు,రోడ్లు, రోడ్డు వెడల్పు తప్పనిసరి.కొంత త్యాగం అవసరం, అభివృద్ధి జరగాలంటే కొంతమందికి ఇబ్బందులు తప్పవు.వీరికి పునరావాసం కల్పిస్తాం,నష్టపరిహారం చెల్లిస్తాం.ఇవి స్థూలంగా ప్రస్తుత వివిధ పార్టీలు చేస్తున్న వాదనలు.
పై వాదనలలో ఎది నిజమైనది,ఎది ప్రజలకు ఉపయోగ పడుతుంది.అంతిమ మార్గమేమిటీ పరిష్కారం ఏమిటి.దేశంలో అభివృద్ధి లేక పారిశ్రామీకరణ జరగకుండా నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుంది.మైనింగ్ ద్వార ఖనిజ సంపదను వెలికి తీయ కుండా,పెద్ద ప్రజేక్టులు కట్టకుండా,రోడ్లు వేయకుండా,ప్రస్తుత జనాబాకనుగునంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా,ఉద్యోగ అవకాశాలు ఎలా ఏర్పర్పరచగలరు,అని ప్రతి పెట్టుబడి దారుడు అనే మాట.
అయితే ఈ పరిణామాల పై మార్క్సిస్ట్ దృక్పథం ఏమిటి…...మార్క్సిజం కమ్యునిజం ఎం చెపుతుంది,నిజమైన కమ్యునిస్ట్ లు ఎం చేయాలి.
ప్రస్తుత కమ్యునిస్ట్ లు (parlamentari,ml,maoist, revolutionary) దాదాపుగా ప్రతి ప్రాజెక్ట్ ను లేక నిర్వాసిత తో కూడుకున్న ప్రతి అభివృద్ధి ని వ్యతిరకించ డమే చేస్తున్నారు.ప్రధాన పోరాటాలలో ఈ పోరాటాలే అగ్రభాగాన వుంటున్నాయి.వర్గ పోరాటాలను దాదాపుగా మర్చిపోయారు .కార్మిక వర్గ పోరాటాలను పూర్తి గా మరిచి పోయారు,ప్రభుత్వానికి వ్యతిరేక మైన ఏ పోరాటం లో నైనా పాల్గొంటున్నారు. అభివృద్ధి కరమైనదా లేదా అనే విచక్షణ లేకుండా,వర్గ దృక్పథం తో,వర్గపోరాటానికి కార్మిక వర్గానికి ఉపయోగ పడుతుందా లేదా ఆలోచించటం లేదు.
ఏ దైనా ఒక పరిశ్రమను స్తాపిస్తున్నపుడు దాని వలన కొంత భూమి ,సాగు భూమి,కాలుష్యం, సామాజిక మార్పు,జీవన విధానం లో మార్పు వస్తుంది.పల్లె వాతావరణం కానీ,అడవి వాతావరణం కానీ మార్పు చెందుతుంది.ఈ మార్పు అభివృద్ధి కరమైన దా. ల్లేక అభివృద్ధి నిరోధక మైనదా..అనే ఆలోచన అవసరం,గిరిజన సంస్కృతి శాశ్వతం, ఆదర్శంతం కాదు.అంతిమంగా వారు నాగరిక సమాజంలో విలీనం కావలసిందే.పల్లెలు పట్టనాలుగా మారవలసిందే.వ్యవసాయంలో కూడా పారిశ్రామీకరణ చెందవలసినదే.మనవాళ్ళు గ్రామీణ ప్రాంతాన్ని తప్పుగా ఆదర్శవంతం చేస్తున్నారు.పెట్టుబడి దారీ అభివృద్ధి కంటే స్తబ్దత మేలు అని భావిస్తున్నారు.గిరిజన సంస్కృతిని సంస్కృతిని కాపాడడం కమ్యూనిస్టులకు ఆదర్శం కాదు.గిరిజన సామ్రాజ్యము ను నిర్మించ లేరు.సమాజాలు దాని అభి వృద్ది క్రమంలో పయనించాలి దానికి విరుద్ధంగా వ్యతిరేక దిశలో ఆదర్శవంతం చేసి ,తాత్కాలికంగా స్తబ్దత కు గురిచేయ కూడదు..ప్రతిగా కమ్యూనిస్టులు సమాజంముందుకు పోయె విధంగా , ఫుడలిసం నుండి పెట్టుబడి దారీ సమాజం దాని నుండి సోషలిస్ట్ సమాజం అంతిమంగా వర్గాలు లేని కమ్యునిస్ట్ సమాజ ం దిశగా పురోగ మింప చేయాలి.మనతో సంబంధం లేకుండా నే అనగా మన ఇస్టాలతో పని లేకుండా నే సమాజం పరిణామం చెందు తుంది.దానిని మనం వేగ వంతం చేయాలి.స్తబ్దత కు గురిచేయడం ,తిరోగమింపా చేయడం కమ్యునిస్ట్ ల కార్యాచరణ కాదు.
రష్యాలో నారొడ్నిక్కులు పెట్టుబడి దారీ అభివృద్ధి విధానాన్ని వ్యతిరేకిస్తే వారిని ఖండిస్తూ లెనిన్ చెప్పిన మాటలు. “ తన కాల్పనిక ఊహల్లో కల్పితమైన , అస్తిత్వం లేని పెట్టుబడి దారీ యేతర అభివృద్ధి లో కుడుర్చు కోవాలని మొండిగా వుంటాడు,నారొడ్నిక్కు కాబట్టి...ప్రస్తుతం పెట్టుబడి దారీ పందాలో క్రమిస్తున్న అభివృద్ధి నీ మండగింప చేయడానికి సన్నద్ధం అవుతాడు.”– లెనిన్.
( మనం పరిత్యజించే వారసత్వం ఏమిటీ _– లెనిన్ రచనలు)
అదే వ్యాసంలో” మన వ్యవసాయంలో పెట్టుబడి దారీ విధానం విపత్కర మైందని,ప్రమాద కరమైన దనీ,ఏమంటే స్వతంత్ర రైతు స్థానంలో పెట్టుబడిదారీ విధానం మరి వ్యసాయ కార్మికుడి నీ పెడుతుందని ప్రతి నరొడ్నిక్కు అంటాడు.పెట్టుబడి దారీ అభివృద్ధి కంటే స్తబ్దత మేలు”– ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా నికీ సంబంధించిన ప్రతి నారోడ్నిక్కు దృష్టి– లెనిన్.
గిరిజన సంస్కృతి నీ,ప్రకృతి సౌదర్యాన్ని కాపాడాలని మరియు గ్రామీణ ప్రాంత న్ని, పచ్చదనాన్ని కాపాడాలని,పర్యావరణం దెబ్బతింటుందన్న భావాలన్నీ పెట్టిబూర్జువా మేధావుల భావొద్యేగాలు మాత్రమే. గతితార్కిక గా,వాస్తవంగా ఆలోచించటం లేదు.పోని పూర్తిగా పోరాటం చేసి ఈ పర్యావరణ విధ్వంసాన్ని,గ్రామీణ ప్రాంత విధ్వంసాన్ని ఆపగలరా...అదీలేదు. కేవలం పత్రికా వ్యాసాలకు, డా క్యుమెంటారిలకు,శుస్కప్రసంగాలకు తమ మేదావితనాన్ని ప్రదర్శించటానికి ఉపయోగించుకొంటున్నారు.
కమ్యూనిస్టులు (parlamentari,ml,maoist,)వర్గ పోరాటాలను,కార్మికవర్గ సిద్ధాంతాలను మరచి,పెట్టిబు ర్జువా అదర్శవా దంలో కూరుకు పోయారు.గ్రామీణ వ్యవస్థను అదర్శిక రించడం చేయడం ద్వారా మరల ఫ్యుడలిస్ట్ భావజాలానికి పరోక్షంగా దోహద పడుతున్నారు. ఉదాహరణ….ఒక అభ్యుదయ జానపద కవి గ్రామాలను వర్ణిస్తూ,పెట్టుబడి దారీ విధానం, సామ్రాజ్య వాద ము గ్రామాలను,గ్రామ ఉ త్పత్తిని,కులవృత్తుల ను ఎలా కనిపించని కుట్రల ద్వారా తరారాలుగా ఆనందంగా బ్రతుకుతున్న...పల్లెలకు,పల్లె సంస్కృతిని ,పల్లె వుత్పట్టులను ద్వంసం చేసినందు వలన కన్నీరు పెడుతున్నాయి అని భవొద్యెగంగా వర్ణిస్తూ మనలందరిని కంటతడి పెట్టించాడు.కమ్యునిస్ట్ లను,మేధావులను,మావోయిస్టులను కూడా కంటతడి పెట్టించాడు.
సామ్రాజ్యవాదులు, పెట్టు బడీదారులు(దళారీ) కనిపించకుండా ఏమీ కుట్రలు చేయలేదు.కళ్ళముందే ప్రత్యక్షంగా దోపిడీ చేస్తున్నారు.పెట్టుబడి దారీ విధానం పల్లెలను,ఫ్యూడల్ సంబంధాలను,కులవృత్తుల నుప్రత్యక్సంగానే ద్వంసం చేస్తుంది. ఇది సామాజిక అనివార్య పరిణామ క్రమం. ఇక్కడ కవి వర్ణించి నట్లుగా గ్రామాలు శతబ్దాల తరబడి ఫ్యూ డలీసంలో వుండి,ప్రజలు సంతోషంగా లేరు,దొరలు,గ్రామ పెట్టెందార్ల ,జమీందార్ల దోపిడీ హింస కింద నలిగి బానిస బతుకులు బ్రతుకుతున్నారు.పెట్టుబడి దారీ విధానం,ఈ దోపిడీ సంబంధాలను,బానిస కుల వృత్తులను ద్వం సం చేయడం ద్వారా ప్రజలు విముక్తి పొందారు.దొరలు ,పెత్తందార్లు,జమీందార్ల కు,దనిక రైతులకు మాత్రమే పల్లెలు అందంగా వుండినై.పల్లెలు నిజంగా ఈ విద్వంసం తర్వాత సంతోషంగా వున్నాయి.దొరలు మాత్రమే కన్నీరు పెడుతున్నారు.వాస్తవంగా కవిమాత్రమే కనిపించని కుట్రల ద్వారా మనలో ఫ్యూడల్ భావజాలాన్ని ప్రవేశింప జెసి వర్గ చైతన్యాన్ని నిర్వీర్యం చేసినాడు.
లెనిన్ నారోదిజపు భావజాలం గురించి చెపుతూ” తరతరాల పునాదుల్ని పెట్టుబడిదారీ విధానం భగ్నం చేయకుండా మందగింపజేసి అపుచేయాలనే తమకొరికతో తలమునకలై పో యి చారిత్రక ఔచిత్యపు ఆశ్చర్యకరమైన లుప్తతని వెళ్ళ డించూ కుంటున్నారు.”మరియు “ గ్రామీణ ప్రాంతాని తప్పుడుగా ఆదర్శవంతం చేయ్యే డం”. సమి ష్టితత్వం గురించిన కాల్పనిక స్వప్నాలు ,ప్రస్తుత ఆర్థికాబివృద్ది మార్గంలో నుంచి వుత్పన్నం అయ్యే రైతుల వాస్తవ అవసరాల పట్ల నరొడ్నిక్కులు పరమ అల్పమైన దృష్టిని ప్రదర్శించే ట్టు చేసింది” ..లెనిన్( మనం పరిత్యజిం చే వారసత్వం ఏమిటి)
అనేక రకాల ఉద్యమాల ఫలితంగా ,ముఖ్యంగా కమ్యూనిస్టుల ఫ్యూడల్ వ్యతిరేక రైతాంగ ఉద్యమాల ఫలితంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల ఫలితంగా,నక్సల్బరి ఉద్యమ ఫలితంగా, జగిత్యాల జైత్రయాత్ర ఫలితంగా ఇప్పుడు ఇప్పుడే ఫ్యూడల్,భూస్వామ్య బందనాల నుండి విమక్తి పొందుతున్న గ్రామీణ
ప్రాంత ములో, పెట్టుబడిదారీ వ్యవస్థ గ్రామాలలో చొచ్చుకు పోయి,ఫ్యూడల్ వ్యవస్థ స్థానంలో పెట్టుబడిదారీ విధానం వేళ్ళునాటు కొంటున్నది,దీనిని మనం స్వాగతించాలి.
“ రష్యా, రష్యా యే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక పురోగతి,ఫ్యూడలిజం నుండి క్యాపిటలిసం వైపుగా కొనసాగుతోంది.క్యాపిటలిజం అభివృద్ధి చెందడం ద్వార ,భారీ పరిశ్రమలు,యంత్రాలు,కాపిటలిస్ట్ వుత్ప త్తి మార్గం ద్వారానే సో షలిజానికి ప్రయాణం సాధ్యమౌతుంది.ఈ మార్గం కాక మరో మార్గం గురించి కలలు కనడం ….ఉదారవాద,చిన్న వుత్ప త్తీ దారుల స్వభావం..ఈ కలలు…
కేవలం పెట్టి బూర్జువా వెనుకబాటు తనాన్ని (అభివృద్ధి నిరోధక స్వభావాన్ని) బలహీనతను ప్రతిఫలిస్తాయి– లెనిన్
ఫ్యూడల్ వ్యవస్థ వందల సం.లుగా రైతును భూమికే బానిసను చేసింది. క్యాపిటిజం రైతును భూమి నుంచీ విముక్తిని చేసి స్వెచ్చాజివి గా మారుస్తుంది.రెండు వ్యవస్థలు దోపిడీ వ్యవస్తలే కానీ ఫ్యూడల్ లిజం ప్రజలను బయటి ప్రపంచంతో సంబంధం లేని జడులుగా ,సంకుచిత స్వభావులు గా చేస్తోంది.క్యాపిటలిజం ప్రజలను తమ సంపద శ్రమశక్తి నీ అమ్ముకునే ప్రయత్నంలో , పుట్టిన ఊరు,దేశం విడిచే లా చేసి విశాల ప్రపంచం తో అనుసందానిస్తుంది.ఈ విధంగా భూస్వామ్య వెనుకబాటు తనం నుంచి,భూస్వామ్య పీడన నుంచి విముక్తి చేస్తుంది. కాబట్టి పెట్టీ బూర్జువా మేధావి,ఫ్యూడల్ భావజాల పునరుద్ధరణ శక్తుల కు కమ్యూనిస్టులు వారికి తోకలుగా మారరా దు.
మరల అసలు విషయానికి వద్దాం.ఒక ముంపు లేదా నిర్వాసిత గ్రామం విషయాన్ని పరిశీలిద్దాం.ఒక గ్రామంలో వున్న గణాంకాలను బట్టి గ్రామంలో దాదాపు సగం మంది కి నామమాత్రం లేదా అసలు భూమి లేదు,వీరు వ్యవసాయ కూలీలు.
13.5% కుటుంబాలకు. 44%
86.5%. “. . 56%
( వున్న సాగు భూమి లో)
అసలు భూమి లేని ,నామమాత్రం వున్న రైతు కూలీలు. 42% .గ్రామ జనాభా లో.
గ్రామంలో 13.5 % మందికి మాత్రమే అధిక మొత్తంలో భూమి వుండి.వీరంతా ధనిక వర్గాల కు చెందిన వారే.మిగతా87% చిన్న సన్నకారు రైతులు.అసలు వ్యవసాయం గిట్టబాటు కాక చాలా మంది రైతులు ఆత్మహత్య లు చేసుకునే పరిస్తితి వుం దీ. వ్యవసాయం పారిశ్రామిక కరణ చెందక పోవటం మూలాన మరియు దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగని మూలంగా నిరుద్యోగము అధికమవుతున్నది.నిరుద్యోగ సమస్య తీరాలంటే దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగ వలసిందే.
అసలు సమస్య ఏమిటంటే నిర్వాసితులకు నష్టపరిహారం,పునరావాసం సరైన రీతిలో జరుగక పోవడం.ఇప్పటి సామ్రాజ్యాద దళారీ పెట్టుబడి దారీ ప్రభుత్వాలు సరైన సమయంలో సరైన నష్టరిహారాన్ని,పునరావాసా న్నీ కల్పించవు.దానిలో కూడా అవినీతి,పక్షపాతం తో పేద చిన్న సన్నకారు రైతులకు,భూమి లేని రైతు కూలీలకు అసలే అందవు.ఎక్కువగా నష్టపోయేది చిన్న సన్నకారు రైతు కూలీలే.ధనిక రైతాంగం పెద్దగా నష్ట పోయేది ఏమీ లేదు,ఎందు కంటే వీరికి గల రాజకీయ పలుకుబడితో,వచ్చే నష్ట పరిహారం లో అధిక వాటా విరే పొందుతారు.
మార్క్స్ తన పెట్టుబడి గ్రందంలో చెప్పినట్లు” వ్యవసాయ రంగ జనాభాలో కొంతభాగం,పట్టణ లేక పారిశ్రామిక (వ్యవసాయేతర ) శ్రామికులు గా మారిపోయే స్థితిలో నిరంతరం వుంటుంది.సాపెక్షమైన అదనపు జనాభా యొక్క ఈ మూలాధారం ,ఈ విధంగా నిరంతరం సాగుతూనే ఉంటుంది.దీని ఫలితంగా వ్యవసాయ శ్రామికుడు కనీస వేతన కార్మికునీ స్థితికి దిగజార్చాబడి ఎల్లపుడు పరమ దరిద్రం అనే ఊబిలో ఒక కాలు దిగబడే వుంటాడు”.
నిర్వాసితులైన జనాభా( రైతు) పట్టణాలకు వలస పోయి కార్మికుడి స్థాయికి చేరుకుం టున్నాడు.పరిశ్రమలో లాగానే వ్యవసాయంలో కూడా పెట్టుబడి దారీ విధానం “ వుత్పతిదారుని బలి చేస్తేనే” గాని వుత్పత్తీ క్రమంలో మార్పు తీసుకు రాలేదు.ఇంతకు ముందే వ్యవసాయం గిట్టబాటు గాక ,జనాభా పట్టణాలకు వలసలు ఎక్కువైనవి.దీనికి తోడు నిర్వాసిత జనాభా తోడై పట్టణ కార్మిక జనాభా ఎక్కువ అవుతున్నది.
“ఒకే చోట కేంద్రీకృతం కావడం మూలంగా పట్టణ కార్మిక ల ప్రతిఘటనా శక్తి అధికం అవుతూ వుండగా,గ్రామీణ శ్రామిక జనం విస్తృత ప్రాంతాలలో చెల్లాచెదురు కావడం వలన వారి ప్రతిఘటనా శక్తి నిరసించి పొతూ వుంటుంది”.– మార్క్స్ పెట్టుబడి.
కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్దాంతాలను మరల నెమరు వేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి.వర్గ మూలాలను,వర్గ సిద్ధాంతాలను మరల ఒక సారి తొంగి చూసి కోవాలి.పెట్టీ బూర్జువా అదర్శవాదన్ని, భావవాదాన్నీ వదిలి,గతి తార్కికంగా ఆలోచించాలి.కార్మిక వర్గ అగ్రగామి దళ పాత్రను సరిగా నిర్వహించాలి.గణనీయంగా కార్మిక వర్గ ము పెరుగుతున్న నేటి పరిస్థితులలో కార్మిక వర్గ పోరాటాలను మరుగు పరిచి,పెట్టీ బూర్జువా ఆదర్శాలను,ఫ్యూడల్ భావజాల సంరక్షణ, పునరుద్ధరించే అభివృద్ధి నిరోధక ఉద్యమాల వెనుక నడవడం ఆపాలి.
తెలంగాణ,అంద్రాలలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటాలు, నక్సల్బరీ నుండి శ్రీకాకులం, జగిత్యాల జైత్రయాత్ర నుండి అత్యున్నత పోరాటాలు గా సాగిన ఉద్యమం గత కొన్ని సంవత్సరాలుగా వెనుక పట్టు పట్టుటకు గల కారణాలను విశ్లేషంచుకోవాలి.
ఈ అత్యున్నతమైన పోరాటరుపం నుండి వనరుల సంరక్షణ,పర్యావరణ సంరక్షణ,గిరిజన సంస్కృతి పరిరక్షణ లాంటి అభివృద్ధి నిరోధక పోరాటాల స్థాయికి దిగబడడం ఆలోచించాలి.
వనరులను సంరక్షించడం కాదు వనరుల ను వెలికి తీసి అవి అందరికీ సమానంగా పంపణీ చేయడం,వెలికితీసిన సంపదను వినియోగించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం,ఎనుకబాటు తానాన్ని పోగొట్టడం,పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, పారిశ్రాికాభివృద్దిని సాధించడం మరియు శ్రామిక వర్గ సంస్కృతి నీ పెంపొందించాలి.పరిశ్రమలు అభివృద్ధి చెందడం మూలంగా కార్మిక వర్గం కూడా అభివృద్ధి చెంది సంఘటితం కాబడుతుంది.
అసలు కమ్యునిస్ట్ లు ఏం చేస్తారు,కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలి.
కమ్యు నిస్టులు కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి వర్గ పోరాటాల ద్వారా పెట్టుబడి దారీ వర్గాన్ని కులదోసి ,కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా సోషలిజాన్ని స్థాపించడం,సమసమాజాన్ని స్థాపించడం,ఇంకా ఫ్యూడలిసమ్ వున్న దేశాలలో మొదట రైతాంగాన్ని భూస్వామ్య.బందనాలనుండి విముక్తి చేస్తుంది .ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ ను బూర్జువా వర్గమే ప్రజాస్వామిక విప్లవం ద్వారా విముక్తి చేస్తుంది.కానీ బూర్జువా వర్గం ఫ్యూదలిజం తో రాజి పడిన సందర్భంలో కమ్యూనిస్టులే కార్మికవర్గ నాయకత్వం వహించి ఫ్యుడలి జం నుండి రైతాంగాన్ని విముక్తం చేసి( దీనిని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారు) తద్వాా అదే నాయకత్వము వహించి సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
సరళంగా వైరుధ్యాలు ఇలా ఉండాలి
భూస్వామ్య విధానం.– రైతాంగానికి
పెట్టుబిదారులకు. – కార్మిక వర్గానికి
నిర్వాసిత సమస్య లో వున్న వైరుధ్యాలను పరిశీలిద్దాం.ఇక్కడ వైరుధ్యం భూస్వాములకు, రైతులకు గాని రైతుకులిలకు గాని వైరుధ్యం లేదు.ప్రత్యక్షంగా ప్రభుత్వాలకు మొత్తం ప్రజలకు మద్య వైరుధ్యం మే ప్రధాన వైరుధ్యం.ధనిక రైతుల
కు, మధ్యతరగతి రైతులకు (వీరికి నిర్వాసిత భూమి అధికంగా ఉం టుంది కాబట్టి). ప్రభుత్వానికి వైరుధ్యం ప్రధాన మైనదని. ఈ ఉద్యమం లో ఎక్కువగా బెరసారాలడి అధిక వాటా లాభం పొందేది భూస్వామ్య లేదా ధనిక మధ్యతరగతి రైతుల కుటుంబాలే.వీరు మొత్తం 15% మించి లేరు.
కార్మిక వర్గ పోరాటాల ను మరిచి పోయిన కమ్యూనిస్టు విప్లవ పార్టీలు( ml,maoist).
దాదాపుగా కార్మిక వర్గ పోరాటాల ను,ఉద్యమాలను మరిచి పోయాయి.గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగ పోరాటాలకు,గిరిజన ఉద్యమాలకు పరిమిత మై పోయారు.ప్రజాసంఘాలు కూడా కార్మికుల పోరాటాలలో నామమాత్రం గానే పాల్గొంటున్నాయి.వారి దృష్టీ అంతా దండకారణ్య ములోని ఆదివాసీ పోరాటాలమీద (గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు లేవు కాబట్టి), రైతుల ఆత్మ హత్యల మీద,ప్రత్యేకంగా భూ నిర్వాసితుల మీద మాత్రమే కేంద్రకరిస్తున్నారు.కార్మిక సమస్యల గురించి,రైతుకులిల,పేదల మౌలిక సమస్యల గురించి,దారిద్య్రం,నిరుద్యోగ,అ ధిక ధరలు,నాణ్యమైన ఉచిత విద్య,ఉచిత ఆరోగ్యం,ప్రభుత్వ అధికారుల అవినీతి,లంచగొండి తనం,మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు,వివక్ష,ట్రాఫికింగ్,కనీస వేతన చెల్లింపు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ఇలా అనేక ప్రజల మౌలిక సమస్యల గురించి పోరాడుతూ,కార్మిక వర్గ ఉద్యమాన్ని,నిర్మిస్తూ ,ప్రజలలో చైతన్యం తీసుకవచ్చేందుకు కృషి చేయాలి.కానీ పర్యావరణం పేరుతో,ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా,sez వ్యతిరేకంగా,పరిశ్రమలకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలలో నే మునిగి తేలుతున్నారు.
వీటి వలన ప్రజలకు జరిగేది ఏమీ లేదు, (విప్లవోద్యమానికి కూడా). పాలక వర్గాల( దళారీ బూర్జువా) ముఠాల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి.
ఇకనైనా కమ్యూనిస్టులు ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా సైద్ధాంతికంగా చై తన్యమవుతు,సమాజం లో జరుగుతున్న పరణామాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ వర్గ పోరాటాలు నడిపించి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి.ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని ముందుకు తీసుకు పోవాలి.
…….అబ్దుల్ కరీం
19–08–2016.
Comments
Post a Comment