ఎందుకిది రిహార్సల్
ఎందుకిది రిహార్సల్.
ఢిల్లీని ముట్టడించిన ఈ రైతాంగ ఉద్యమం ఎందుకు జరగబోయే సోషలిస్ట్ విప్లవానికి రిహార్సల్ అవుతుంది.
గత 50 సంవత్సరాలుగా భారతదేశం అర్ధ వలస అర్ధ భూస్వామ్యంఅని దానికి అనుగుణంగా ml, మావోయిస్టు పార్టీ లు ఏర్పడ్డాయి. అవి భారతదేశంలో నూతన ప్రజాస్వామిక ఉద్యమం లో భాగంగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధం ద్వారా గ్రామాల నుండి పట్టణాలకు వ్యాపిస్తుందని గ్రామాలను విముక్తి చేసి వెనక తట్టు ప్రాంతాలలో విముక్తి ప్రాంతాలను ఏర్పరిచి అంచెలంచెలుగా పట్టణాలను విముక్తం చేసి విప్లవాన్ని విజయవంతం చేయాలి అన్నారు.
ప్రస్తుత మారిన పెట్టుబడిదారీ సమాజంలో విప్లవం ఎలా వస్తుంది, పట్టణ కార్మిక వర్గం అసంఘటిత శ్రామిక వర్గం రైతాంగ శ్రామికుల తో కలిసి ఏవిధంగా గా విప్లవం చేస్తారు. రష్యా మాదిరిగా సార్వత్రిక తిరుగుబాటుగా ద్వారా విశాల భారతదేశంలో విప్లవం సాధ్యమా అనే అనుమానం ఉంది. ఇంతకాలం నూతన ప్రజాస్వామిక విప్లవానికి అలవాటుపడ్డ వారికి సార్వత్రిక సాయుధ తిరుగుబాటు ద్వారా సాధ్యం అనేది అనుమానమే కాదు ఊహకు అందని విషయం. అందువలన రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికల ద్వారా సోషలిస్టు విప్లవం వస్తుందని పొరపాటు అవగాహనకు నెట్ట బడుతున్నారు.
వర్గ వైరుధ్యాలు ముదిరినప్పుడు సంక్షోభం తీవ్రతరం అయినప్పుడు అతి కొద్ది కాలంలోనే రాజకీయ మార్పులు వేగంగా మారుతాయని మార్క్సిస్ట్ మహోపాద్యాయులు చెప్పారు. . దానిని ఇప్పుడు రైతాంగ ఉద్యమం నిరూపించింది కాబట్టి ఇది రిహార్సల్ కాకుండా ఏమౌతుంది.
ఈ రైతాంగ ఉద్యమం మధ్యతరగతి రైతాంగం యొక్క నాయకత్వంలో జరుగుతున్నది అయినా కొంతవరకు చిన్న రైతు యొక్క ప్రయోజనం కూడా ఉంది. ఈ పోరాటం ప్రత్యక్షంగా పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కార్పొరేట్లకు వ్యతిరేకంగా గురి పెట్టబడింది.రోజుల తరబడి రాజదాని కి వెళ్ళే రహదారులను దిగ్బంధం చేయడం ,సార్వత్రిక తిరుగుబాటు రూపమే. కార్మిక వర్గం లో విప్లవ శక్తుల నిర్మాణాలు బలంగా వుండి వుంటే ,వారికి మద్దతుగా ఉద్యమం లో దిగితే అక్టోబర్ విప్లవ దృశ్యం కనిపించక పోయేదా. ఇది సోషలిస్టు విప్లవం లో కొంత భాగమే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతి శీల శక్తులను మరియు అంతర్జతీయ స్థాయిలో కూడా మద్దతు కూడగట్ట కలిగింది,ఆకర్షించగలిగింది. పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం లో సైన్యంలో కూడా ప్రత్యక్ష సానుభూతిని సహకారాన్ని పొందగలిగింది. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోని రైతాంగం పెద్దగా కదలకపోవడానికి కారణం రైతాంగం లో పనిచేస్తున్న రైతు సంఘాలు వాటి పార్టీలు వారికి దూరం అయిన స్థితిని బహిర్గతం చేసింది.
ఈ ఉద్యమం ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకున్న లేక పాక్షికంగా సవరణలతో కొంత కాలం లో సద్దుమణగ వచ్చు ఫలితం ఏదైనా రావచ్చు అయితే భారత సమాజానికి కొత్తరకం పోరాటాన్ని రుచి చూపిస్తుంది.
దీనినుండి విప్లవ కమ్యూనిస్టులు తీసుకోవలసిన పాఠాలు తమ కాలం తీరిన అర్ధ వలస అర్ధ భూస్వామ్యం సరి చేసుకో ని ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజం యొక్క అప్డేటెడ్ పొందాలో కి మారడం. మారకపోతే వారు ప్రజల నుండి పూర్తిగా దూరం అవుతారు.
ఇక కార్మిక వర్గం మరియు అసంఘటిత కార్మిక వర్గం శ్రామిక వర్గం రైతు కూలీ , పేద రైతాంగం ప్రత్యక్షంగా మద్దతుగా ఉద్యమం లోకి రాలేదు. ,వాటిని కదిలించే విప్లవ శక్తులు బలహీనంగా నామమాత్రంగా ఉన్న కారణంగా నాయకుల సంఘీభావ సపోర్ట్ మాత్రమే లభిస్తున్నది. దీనికి ఆయా పార్టీల పందా నే కారణం. ఇకనైనా మారిన పెట్టుబడిదారీ సమాజం పరిస్థితులకనుగుణంగా తమ పందాలు మార్చుకొని విస్తృతంగా కార్మిక వర్గంలో అసంఘటిత కార్మిక వర్గంలో పని చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు గిట్టుబాటు ధర రైతు కూలీల సమస్యలపై పోరాటంలో సంఘటిత పరచాలి.
పట్టణాలలో కార్మిక యూనియన్ లతో పాటుగా బస్తీల స్థాయిలో అసంఘటిత రంగ కార్మికుల శ్రామికులను ఐక్యం చేసి బస్తీ స్థాయి సంఘాలను ఏర్పరచాలి. అవి ముందు ముందు విప్లవ సోవియెట్ లుగా పరివర్తన చెందే లక్ష్యంతో చైతన్యంతో నిర్మించాలి. మన దేశ పరిస్థితుల దృష్ట్యా అసంఘటిత కార్మిక వర్గం శ్రామిక వర్గం సోషలిస్టు విప్లవంలో ప్రధాన చోదకశక్తి గా ఉంటుంది. వ్యవసాయ సంక్షోభం వల్ల రోజు రోజుకు పెరుగుతున్న గ్రామీణ రైతాంగ వలసల మూలంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నది, దానితో పాటుగా అసంఘటిత రంగం పెరిగి మురికివాడల బస్తీలు పెరుగుతున్నాయి. చిన్న సన్నకారు రైతలు తమ చిన్న కమతం తో వ్యవసాయం గిట్టుబాటు కాక వాటిని అమ్మేసి వారి వారసులు పట్టణాలకు ఉపాధికోసం చేరుతున్నారు. వీరిలో నిరుద్యోగులైన యువకులు అధికం.విరు అసంఘటిత రంగంలో నీ పరిశ్రమ లు, షాపింగ్ మాల్స్, రవాణా, మార్కెటింగ్, డెలివరీ బాయ్స్ ,నిర్మాణ రంగం లో మరియు ప్రభుత్వ అవుట్సోర్సింగ్ లో కాంట్రాక్ట్ కార్మికులు గా అతి తక్కువ వేతనం కు పనిచేస్తూ ,అత్యధిక దోపిడీకి గురవుతున్నారు.
Ml,విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ లు ఇప్పటికీ అయినా మారిన సమాజాన్ని పెట్టుబడి దారీ సమాజం గా గుర్తించాలి.అంత సులభంగా ml విప్లవ పార్టీ లు మారుతాయి అనుకోలేము.
వాటిలోని విప్లవ కర ఎలిమెంట్స్,ఇతర వ్యక్తుల,అభ్యుదయ,మేధావి వర్గాలు సంఘటిత మయి సోషలిస్ట్ విప్లవం కొరకు నూతన విప్లవ పార్టీ నిర్మించే ప్రయత్నం చేయాలి.విస్తృతంగా సోషలిస్ట్ విప్లవ అవసరాన్ని సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్తమానం నూతన విప్లవ క్రమాన్ని డిమాండ్ చేస్తున్నది.
అబ్దుల్ కరీం,
17–12–2020.
Comments
Post a Comment