ప్రభుత్వరంగం ఉండాలా, ప్రైవేటీకరణ జరగడం మంచిదా ఇది అనవసరమైన సంవాదం.(సరైన విషయ పరిజ్ఞానం లేక జరిగిన చర్చ)
రాజ్యం పెట్టుబడిదారీ అభివృద్ధికి దాని అవసరాలకి అనుగుణంగానే ,ఒక్కొక్కసారి ప్రైవేటు రంగాన్ని ,రక్షణ సుంకాలని,స్వేచ్చా వ్యాపారం, జాతీయకరణను, ప్రభుత్వ రంగాన్ని ,మరల ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను , ఇలా పెట్టుబడికి ఏది అవసరమో అది పెట్టుబడిదారి ప్రభుత్వాలు చేస్తాయి. అంతిమంగా నిర్ణఇం చేది పెట్టుబడిదారి వ్యవస్థ అభివృద్ధి ప్రయోజనాలే.
ఏ రంగమైనా రాజ్యం శ్రామిక ప్రజల నుండి కార్మిక వర్గం నుండి అదనపు విలువను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు కావలసిన పెట్టుబడిని అందిస్తుంది.
ప్రపంచ చరిత్ర అయినా భారతదేశ చరిత్ర అయినా పెట్టుబడిదారి అభివృద్ధి మార్గం ఇదే.
కార్మిక వర్గ నాయకత్వం లో జరిగే సోషలిస్టు విప్లవం మాత్రమే సకల శ్రామిక వర్గ ప్రజల విముక్తి మార్గం.
Comments
Post a Comment