ప్రభుత్వ రంగం.
ప్రభుత్వ రంగ సంస్థలు ఎవైనా ప్రభుత్వం కార్మిక వర్గ చెతుల్లొ వున్నప్పుడు మాత్రమే ప్రజలకు ఉపయోగం. బూర్జువా ప్రభుత్వం లోని ప్రభుత్వ రంగం బూర్జువాల కె ఉపయోగం
ప్రస్తుతం ప్రైవేటీకరణ పై దేశ వ్యాప్తంగా వామ పక్స వాదుల లోనే కాకుండా సాధారణ ప్రజల వరకూ వాడి వేడి చర్చ జరుగుతున్నది .మోడీ ప్రభుత్వం ఖరాఖండిగా ప్రైవేటు చేస్తామని చెపుతున్నది,చేస్తున్నది.
అయితే దీనిపై కమ్యూనిస్ట్ దృక్పధం ఏమిటి.మూల అంశాలు ఏమిటి.
బ్యాంకింగ్ రంగం గురించి తీసుకుందాం
"ప్రభుత్వ బాంకుల వల్ల పెట్టుబడిదార్ల కే లాభం అని మేము కొత్తగా కనిపెట్టేసాం.
అందువల్ల బాంకులన్నీ ప్రైవేట్ పెట్టుబడిదార్లకే ఇచ్చేయండి. ప్రజలకు లాభం "
అని సూత్రీకరిస్తున్నారు కొందరు.
వాళ్ళ మోకాళ్ళకు
త్వరగా రోకళ్ళు చుట్టేస్తే
ఊళ్ళ కు వెళ్ళిపోతారట.
పబ్లిక్ రంగం పేరుతో పెట్టుబడి ఆడే ఆటలను
ఎక్స్ పోజ్ చేసే ఆత్రంలో ...
ప్రైవేటీకరణను గుడ్డిగా సమర్థించే
నియోలిబరల్స్ గా మారకండి.
-------------ఒక విమర్శ
సరే పై విమర్శల నేపథ్యంలో మనం ఒక ప్రశ్న వేద్దాం ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల ప్రస్తుతం ప్రజలకు అనగా కార్మిక అసంఘటిత కార్మిక రైతు కార్మికులకు కింది పేద ప్రజలకు జరుగుతున్నమేలు ఏమిటి?.
జవాబుగా పై విమర్శకుడు
ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ రెండు ప్రయోజనాలుంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించిన ప్రయోజనాలు , ఉపాధి కల్పన. ఇక బాంకింగ్ రంగం ప్రత్యేకమైన పని ప్రజలనుండీ పొదుపులు స్వీకరించి ,ఇన్వెస్టర్లకు పెట్టుబడి అందుబాటులో ఉంచడం. అదేవిధంగా దేశ స్థూల ఆర్థిక విధానాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచడం ,తగ్గించడం అనే పద్ధతుల ద్వారా సేవింగ్స్ ,ఇన్వెస్టుమెంట్లను నియంత్రించడం కొరకు సెంట్రల్ బాంకు బాంకింగ్ వ్యవస్థను ఒక సాధనంగా వాడుకుంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఋణసదుపాయాన్ని కల్పించే పని కూడా పబ్లిక్ రంగ బాంకులకు అప్పచెప్పిన విధుల్లో ఒకటి. పెట్టుబడిదారీ వ్యవస్థలోప్రతి ఒక్క రంగమూ మోలికంగా వ్యవస్థ కోరకే ఓరియెంట్ చేయబడి ఉంటుంది. విద్యారంగం కూడా నిపుణులైన కార్మికులను తయారు చేయడం కొరకే పనిచేస్తుంటుంది. ఇందులో వింత కానీ ,గొప్ప రహస్యం కానీ లేవు. 1990 తరువాత అమలైన నయా కన్సర్వేటివ్ విధానాలు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని పద్ధతి ప్రకారం విచ్ఛినం చేసుకుంటూ వచ్చాయి. పెద్దయెత్తున ప్రైవేట్ బాంకులను సృష్టించి బడా కార్పోరేట్ల ఆధీనం లోకి వాటిని తీసుకొచ్చే నిర్ణయాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఉద్యోగుల కథ అటుంచి ,బ్యాంకింగ్ రంగం పూర్తిగా ప్రైవెటీకరణ జరిగితే సామాన్యులకూ ,చిన్న ఉత్పత్తిదారులకూ ,మధ్యతరగతులకూ లభీస్తున్న అరకొర ఋణసదుపాయాలు కూడా ఎండిపోతాయి.
అతను చెప్పిన విషయాలను ఒక్కొక్కటి పరిశీలిద్దాం. పై లక్ష్యాలలో లో అమలు జరిగినది ఏదైనా ఉంటే కార్పోరేట్ లకు మాత్రమే రుణాలు అంద చేయబడ్డాయి. వారే భారీ మొత్తంలో అప్పులు తీసుకుని పారిపోయిన వారు దివాళ తీసినట్టు నటించి ఎగ్గొట్టిన వారు ఉన్నారు కదా.
ప్రజల నుండి పొదుపులు స్వీకరించిన మాట వాస్తవమే కానీ సామాన్య ప్రజలకు ఏనాడైనా రుణాలు ఇచ్చారా,గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చారా.
ఇంకా ఈ క్రింది ప్రచారం కూడా జరుగుతున్నది
1.గ్రామీణ బ్యాంకులు మూతపడతాయి.
2.ప్రజల పొదుపు ప్రమాదంలో పడుతుంది, పొదుపులమీద వడ్డీ తగ్గిపోతుంది.
3.వ్యవసాయ రుణాలు పోతాయి, ప్రత్యేకిమంచి చిన్న, సన్నకారు రుణాలు ఇవ్వడం వుండదు.
4.చిన్న, మధ్యతరగతికి వ్యాపారాలకు రుణాలు అందకుండా పోతాయి.
5.చదువుకోసం లోన్లు దొరకవు.
6.కార్పొరేట్ వ్యక్తులకు తక్కువ వడ్డీకి, సులభంగా రుణాలు దొరుకుతార్యి. వీళ్లపోటీకీ స్థానిక వ్యాపారాలు, ఉత్పత్తులు మునిగిపోతాయి.
7.యువతకి ఉద్యోగావకాశాలౌ తగ్గిపోతాయి.
8.యాంత్రికీకరణతో, ఒకవేళ ఉద్యోగాలు వున్న అవి కాంట్రాక్టు పద్దతి ఉద్యోగాలు వుంటాయి. ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది.
9.ఇప్పట్లాగా కాకుండా అనేకరెట్లు రేపటి బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు పెరుగుతాయి.
10.గృహరుణాలు, ప్రభుత్వ పధకాలకు మధ్యవర్తిత్వం వంటి పనులు బ్యాంకులు చేపట్టవు.
ఇందులో సంపన్న,ఎగువ మధ్యతరగతి వర్గాల కు వుపయోగ పడెవె తప్ప
సామాన్య ప్రజల,కార్మిక,అసంఘటిత కార్మికులకు,చిన్న సన్నకారు రైతుల కు,వ్యవసాయ కార్మికులకు మరియు చిన్న వ్యాపారు లకు,పెద ప్రజలు కు మేలు చెసే ఒక అంసమైనా వున్నదా.పోని గతం లో ఎన్నడైనా ఎ చిన్న పాటి లబ్ది పొంద గలిగారా.
ప్రజల కు ఏదైన చిన్న లోన్ (ప్రభుత్వ పథ కాలలొ భాగంగా) ఇవాలంటె నానా తిప్పలు పెట్టి లంచాలు మింగి ,సబ్సిడి మొత్తం వాళ్లే మింగెడి వారు.చివరకి అప్పు నెత్తిన పెట్టె వారు.వడ్డీల మీద ఫైన్ ల మీద ఫైన్ లు గుంజు కోవడం,ప్రతి రైతుకు ,వుపాదీ పథకాల కొరకు తీసుకున్న ప్రతి నిరుద్యోగి కి తెలియదా.
సంపన్న వర్గాల పిల్లలకు తప్ప విద్యా రుణాలు ఎవరికి ఇచ్చారు.పేద రైతు,కార్మిక , అసంగటి త శ్రామికులు ,సురిటిలు ( జమానతు ఆస్తి) ఎక్కడి నుండి తెగలరు.
ఉద్యోగ అవకాశాలు తగ్గి పోతాయి అనడం లో
నిజం లేదు,పెద్ద ఎత్తున పెరిగిన ప్రైవేటు బ్యాంక్ లు సిబ్బంది లేకుండా నడుస్తాయా. ఇంతకు ముందు కొద్ది పాటి జాతీయ బ్యాంక్ శాఖల,తో పాటు ఈ నాడు అనేక బ్యాంక్ లు వచ్చాయి.
కాక పోతే చాలా సౌకర్యాలు గల ఉద్యోగ భద్రత కల విగా వుండవు.
గ్రామీణ బ్యాంక్ లు మూత బడుతాయి,
ఇది కూడా వుట్టడే.ప్రైవేట్ బ్యాంక్ లే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల కు సేవలంది స్తున్నాయి.తక్షణ రుణ సదుపాయం కల్పిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ లో వచ్చిన లాభాలన్ని,ప్రజల కు ఏమాత్రం చేరలేదు,పెట్టుబడి దారులకు,అప్పులు,tax రాయితీలు,మౌలిక సదుపాయాల కొరకు,అప్పుల ఎగవెటకు మాత్రమే, అధికారులు,maneger కొద్దిగా
వుద్యోగులకు మాత్రమే.
బ్యాంకులను ప్రభుత్వ రంగం లోవుంటే పెద్ద పెట్టుబడి దార్లు రుణాలు ఎగ్గొట్టడానికి సహాయం చేయటమే ఇంత వరకు జరిగింది.
ఏ బ్యాంకు యూనియన్ లెక్కలు తీసిన పెద్ద పెట్టుబడి దార్ల విరాళాలు బయటపడతాయి
బ్యాంకు యూనియన్లు చేసే సమ్మె ప్రజల సొమ్ముతో . ఎగవేసిన లోన్ల . ను భర్తీ చేసే కుట్ర మాత్రమే
ప్రాక్టికల్ గా జరిగినది జరుగుతున్నది అదే,కాని వుద్యోగస్టులు నష్టపోతారని వామ పక్షాల ,విప్లవ పక్షాల వారు తెగ బాధపడుతున్నారు,వారినే కార్మిక వర్గం అని వారి హక్కుల కొరకు పోరాటం అంటున్నారు. హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ముంచుకొస్తున్న ఈ తరుణంలో, అన్ని రకాల ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలి కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలను సమర్దించాలి అంటున్నారు.
ఫాసిజం ను ఎదుర్కోవాలి అనే సాకు కు వీరు ఏమాత్రం వుపయోగ పడరు,నిజమైన ప్రజలు,అసంఘ టితా రంగ కార్మిక వర్గం,వ్యవసాయ కార్మికులు,రైతులు,మేధావి వర్గం సంఘ టిటం ద్వారానే ఎదుర్కొ గ లరు.
రండి బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి . ప్రభుత్వ రంగ బ్యాంకులయితేనే మన మిత్రులకు . లగడపాటి . స్రుజనాలకు ,నిరవ్ మోడీకి తేలికగా అప్పులిప్పించగలం ….ఒకరి fb coment. ఇది నిజమే కదా..
ప్రైవేటీకరణ చేయడంపై మీకు ఏమిటి ప్రేమ?.
ప్రైవేటీకరణపై మాకు ప్రేమ లేదు,
ఇప్పుడున్నది వాస్తవంగా ప్రైవేటే ,కాని మీరు అది ప్రభుత్వ రంగం అని పొరబడుతున్నారు,ప్రజలను భ్రమింప చేస్తున్నారు.మీరే
ప్రైవెటును మొయాలంటున్నారు
ప్రైవేటికరణ కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు మొదటి నుండి కూడా అది ప్రైవేటు రంగ మే ప్రజల డబ్బుతో ప్రభుత్వం రంగమంటూ ప్రజలను మోసం చేస్తూ, ఇంతకాలం కార్మిక వర్గంలో కొంతమందిని కొనివేయడం ద్వారా అదనపు సౌకర్యాలను కల్పించి కార్మిక వర్గంలో అంతరాలను సృష్టించి వారిని కరప్ట్ చేశారు . దీర్ఘకాలంగా కార్మికుల మధ్య అంతరాలను సృష్టించారు ఐక్యతను దెబ్బతీశారు
పెట్టుబడిదారీ వర్గం కొంతమంది కార్మిక సెక్షన్ను కొన్ని వేయడం ద్వారా కార్మికుల లోనే అధిక అధిక సౌకర్యాలు కలిగిన ఉన్నత పొరను తయారు చేస్తారనిమార్క్స్ ఆ కాలంలోనే గుర్తించి హెచ్చరించాడు. ప్రభుత్వ రంగంలో ఎంత శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ,మహా అయితే 1 ,2 శాతం మందికి.
ఈ వాస్తవాన్ని గుర్తించకుండా నిజంగా ప్రభుత్వరంగం కాపాడే వాళ్ళు ,ప్రైవేటు రంగాన్ని కాపాడినట్లే ,పెట్టుబడిదారీ వర్గా న్ని కాపాడి నట్లే ,ప్రజలను మభ్య పెడుతున్నట్లే.
ప్రభుత్వ రంగంలో వచ్చిన లాభాలు అంటే అదనపు విలువ ఎక్కడి నుండి వచ్చింది అది ఎవరికి పోతుంది.
పారిస్ కమ్యూన్ విఫలమవడానికి ఒక కారణం ఆనాటి బ్యాంకింగ్ రంగం విప్లవకారులకు ఉపయోగపడలేదు వారు సహకరించలేదు, విప్లవకారులు దానిని స్వాధీనం చేసుకోకపోవడమే.
ప్రభుత్వ రంగం ఎప్పుడు ప్రజలది అవుతుందంటే ఆ ప్రభుత్వం కార్మిక వర్గ ప్రభుత్వం అ యి వుండాలి.పై విమర్శకులు లాంటి వాల్లు కోరుకునెడిది బూర్జువ సంక్షేమ రాజ్యాలు,వీటి లొనె చిన్న వుత్పత్తి దారుల సహకార సంఘాలు విస్తృతంగా ఏర్పరచి,ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా నిర్మించి అవి,అవినీతి లేకుండా వుండాలి అని తమ పవిత్ర కోరిక లను పెట్టుబడి దారి ప్రభుత్వం లో వుద్యమాలు చేసి సాధించాలి అనుకొంటున్నారు.పైగా పెట్టుబడి దారీ దేశాలలో ఇప్పటి వరకు సోషలిస్టు విప్లవం లు విజయవంతం కాలేదని ,ఈ విశయాన్ని గమనించాలి అని,మార్క్సిస్ట్ వ్యతిరేక సూత్రీకరణలు చేస్తున్నారు.
నా స్వంత అనుభవం, ,బతుకు తెరువు ప్రారంభించిన 20 సం. క్రితం ఆంద్రా బాన్కలొ,గాని,sbh ,sbi దగ్గర కనీసం ఎకౌంట్ టిద్దా మన్నా నాకు సాడ్యం కాలెదు. పోస్ట్ ఆఫీస్ మాత్రమై అందుబాటులొ వుండేది.మొదటి బ్యాంకు అకౌంట్ ప్రైవేటు lvb లొనె సులభంగా తెరిచాను.బండి కొనుటకు finance లో చెక్ అవసరం వుండి అడిగితే 2 వేలు లంచం అడిగారు మన జాతీయ బ్యాంకు వారు.
అహం అడ్డు వచ్చి చాలా కాలం తర్వాత ప్రైవేట్ బ్యాంకు లో తీసుకుంటే వెంటనె ఇచ్చారు.ఇక వుపాదీ లోన్ schem కొరకు పోతే సబ్సిడి మొత్తం లంచం అడిగారు, అంతే కాదు కొటేషన్ రూపం లో అసలు ధర కంటె డబల్ రేట్ట్ లో కొనాల్సి రావడం ,...అందుకే ఎన్నడూ లోన్ కోసం ప్రయత్నించ లేదు.
ప్రస్తుత పబ్లిక్ రంగం అంటే సోషలిస్టు నమూనా అని మోసపోవద్దు. ప్రజల డబ్బు శ్రామికులను దోపిడి చేసి పెట్టుబడిని పెంచేదే పబ్లిక్ రంగం.
ప్రభుత్వ యాజమాన్యంలోని విద్య ,వైద్య ,ప్రజా రవాణా రంగాలు కూడా బూర్జువాలకేనా ఉపయోగం ?
మన విద్యా విధానం మెకాలే ప్రవేశపెట్టిన పెట్టుబడిదారులకు గుమస్తా లను తయారు చేసే విధానం అని మనం రోజు విమర్శిస్తూనే ఉన్నాము కదా, శాస్త్రీయ విద్యా విధానం పై డిమాండ్ చేస్తున్నాం కదా
ప్రభుత్వ ఆ దినం లోనే మొత్తం విద్యా రంగం ఉన్నప్పుడు అది గ్రామాల్లోకి పరిమితంగానే ఉండేది, నిరుద్యోగ యువత ఉపాధి కోసం గ్రామ గ్రామాన బస్తీలలో పాఠశాలలు స్థాపించిన తర్వాతనే కదా విద్య మరింత ప్రజలకు చేరువైంది, ఆ తర్వాతనే కార్పొరేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి.
ఇక వైద్య రంగం చెప్పాల్సిన పని లేదు "నేను రాను తల్లో సర్కారు దవాఖానకు "అనే పాట ప్రజల అందరి నోట వినేదే.
రవాణా రంగం రైల్వే వ్యవస్థ మొత్తం పెట్టుబడిదారుల ముడి పదార్థాలను,సరుకులను మోసేది ప్రధాన ఆదాయం మొక్కుబడిగా ప్రజా రవాణాకు కొంత మేలు చేస్తుంది అది కూడా కొద్ది ప్రాంతాలకే, రోడ్డు రవాణా సంస్థ ఇప్పటి అవసరాలను తీర్చే స్థాయిలో లేదు పెద్ద ఎత్తున ఆటోలు మారు మూల గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా యువతకు భారీగా ఉపాధి కల్పిస్తున్నది. అందుకే ఆర్టీసీ కూడా సరుకు రవాణా మొదలుపెట్టింది. ఇది బూర్జువాల కు ఉపయోగం కాదా.ఆర్టీసీ కార్మికుల సమ్మె చివరకు ఎటు వెళ్ళింది.ప్రభుత్వ ఉపాధ్యాయులు,ఆర్టీసీ కార్మికులు,వైద్య సిబ్బంది,రైల్వే ఉద్యోగులు,కార్మికులు,bsnl ఉద్యోగులు,bhel…….. కానీ,కనీసం మన సింగరేణి కార్మికులు కానీ నేటి పెట్టుబడి దారులతో డి కొడుతున్న రైతాంగానికి మద్దతుగా వచ్చారా?, మరి ఎందుకు రావడం లేదు.పోని bsnl ఉద్యోగులు వారి సంస్థ ను కాపాడు కోవటానికి , ప్రస్తుతం రైతాంగం చేస్తున్న తరహాలో ఒక వంతయినా పోరాటం చేశారా,హాయిగా vrs రూపం లో డబ్బు తీసుకుని వెళ్తున్నారు.
దేశంలోని కీలక రంగాలలో నీ , సంఘటితం చేయగలిగిన కార్మికవర్గం అంతా బూర్జువా వర్గ ఆధీనంలో ఉంటే, కార్మిక వర్గాన్ని ఎలా సంఘటితం చేయగలము. మన తల అంతా బూర్జ క్షేత్రం లో ఉంటే మన దేహంతో ఏమి చేయగలం.
పబ్లిక్ రంగం ను విమర్శించడంలో లేదా ప్రైవేటీకరణ సమర్థించడం లో పెట్టుబడిదారులను, వారి ప్రభుత్వాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నా ము అనే అత్యల్ప ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నామని ఊహించకండి.
ఇంతవరకు నడుస్తున్న పబ్లిక్ రంగం సంస్కరణ వాద సంక్షేమ రాజ్యానికి చెందినదైతే ఇప్పటి ప్రైవేటీకరణ విధ్వంసకర మైనది. అది భద్రత కల కొద్దిపాటి కార్మిక వర్గ పైపొరను ధ్వంసం చేస్తుంది కార్మికులు బూర్జువాలకు మధ్యగల విరుద్ధ తను చివరి కోసకు నెడు తుంది .ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేటీకరణ సామాజిక విప్లవాన్ని, సోషలిస్టు విప్లవాన్ని వేగిర పరుస్తుంది.
విమర్శకులారా కేవలం ఈ విప్లవాత్మకమైన దృష్టిలో నుండి మాత్రమే మేము ఈ ప్రైవేటీకరణను సమర్ధిస్తున్నాము.
అబ్దుల్ కరీం.
23-3-2021.
Comments
Post a Comment