కులం అంబేడ్కర్ ఇజం
కులం,అంబేడ్కర్ ఇజం వీటి పై విస్తృతంగా , కూలంకషంగా చర్చలు జరిగాయి .దాదాపు అన్నికొనాల నుండి సుదీర్ఘ కాలం చర్చ జరిగింది.ఎవరి వర్గ,స్వంత ప్రయోజనాల దృష్ట్యా వారు మార్క్సిస్ట్ మార్గంలో నా,లేక ఇతర బహుజన,కుల,అంబేడ్కర్ మార్గం లోన అనేది స్పష్టంగా తేలి పోయింది.
ఇక ఇప్పుడు మార్క్సిస్ట్ లు తేల్చు కోవాల్సింది దేశంలో ప్రస్తుతం ఏ వ్యవస్థ వున్నది.అంటే పెట్టుబడి దారీ సమాజమా లేక ఇంకా అర్ద భూస్వామ్య,అర్దవలస సమాజమా.
ఇప్పుడు ఈ సమస్య ఎందుకు?. ( Cpi,cpm లను వదిలేయండి). మనది అర్డవలస,అర్దభూస్వామ్య సమాజ మని,దున్నేవానికే భూమి నినాదం తో, వ్యవసాయ క విప్లవము ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం చేయాలని,నక్సల్బరి మొదలైంది కదా.సాయుధ గెరిల్లా పోరాట ము ద్వారా ,శ్రీకాకుళం నుండి,జగిత్యాల జైత్రయాత్ర నుండి దండకారణ్య లో జనతన రాజ్యం వునికీలో వుంది కదా.ఇప్పుడెందుకు మరల ఈ చర్చ.
నక్సల్ బరి మొదలై అర్ద శతాబ్దం దాటింది.ఇంతటి సుదీర్ఘ కాలం లో,సుదీర్ఘ ఉద్యమంతో సమాజం లో ఎలాంటి మార్పు రాలేదా,వస్తే ఎలాంటి మార్పు వచ్చింది.
మన తెలుగు రాష్ట్రాలలో దున్నేవానిక్ భూమి నినాదం తో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం జరిగింది. భూస్వాములు అందరూ పట్టణాలకు పారిపోయారు,భూస్వామ్య వ్యవస్థ ను ద్వంసం చేశారు.ఉద్యమం ఉన్నత స్థాయిలో అభివృధ్ధి చెంది, ప్రస్తుతం క్షినించి న దశలో ఉన్నది.ఫలితంగా ప్రాంతీయ,కుల అంబేడ్కర్
సహాయం తో ఉద్యమం వునికి నిలబెట్టు కునే పరిస్తితి.
పార్టీ సిద్దాంతం,పందా సరిగా వుంటే , పార్టీలో ఎన్ని లోపాలున్నా ఉద్యమం ముందుకు వెళ్తుంది.ఇది naxalbari రుజువు చేసింది.మొదట అతివాద లోపం తో ఎన్నో చీలికలు,నష్టాలు జరిగినా ఉద్యమపందా సరిగా ఉన్నది కాబట్టే ,త్వరగా లోపాలను సరిదిద్ది కొని జగిత్యాల జైత్రయాత్ర నుండి వెల్లువలా దండారణ్యానికి వ్యాపించింది.
ప్రస్తుతం ఉద్యమం పూర్తిగా దండారణ్యానికి
ఆదివాసీ లకు పరిమితం అయింది.
కొన్ని గ్రూప్ లు చట్టబద్ధ ఎన్నికల పోరాటాలకు పరిమిత మైనాయి.మొత్తం మీద మైదాన ప్రాంత, పట్టణ,కార్మిక వర్గ ములకు దూరం అయినాయి. దేశంలో ఎటుచూసినా,కులం,బహుజన , అంబెడ్కర్ వాదం లో లీనమై పోయాయి.
ఇక పాలక వర్గాలు అదే కులం ,మతం ల సహాయం తో,జాతీయ భావం లను రెచ్చగొట్టి
పెట్టుబిదారి, సామ్రాజ్య వాద దోపిడీ నీ సులభం చేసే,,కార్మిక వర్గాన్ని ,ఉద్యమాలను అనిచి వేసే ఫాసిస్ట్ పాలనను సుస్థిరం చేసుకున్నారు.
నా భావన,కారణాలు ఏమైనా సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమం ఫలితంగా,ప్రపంచ పరిస్తితులలో వచ్చిన మార్పుల కారణంగా,వచ్చిన విప్లవ వెల్లువను విప్లవం గా,విజయవంతం చేయని కారణంగా ప్రస్తుతం సమాజం అర్దభుస్వామ్యం నుండి పెట్టుబడి దారీ సమాజం గా మారిపోయింది.
మన సమాజం పెట్టుబడిదారీ సమాజం.
_____ అబ్దుల్ కరీం.
Comments
Post a Comment