సైదులు గారికి

 Dear సైదులు గారు,

మీరు రెండు యుద్దాల్లను ప్రస్తావించారు .వీటిలో ఒక ముఖ్యమైన విషయం విస్మరించరాని (గమనించ లేదు అని) తెలుస్తోంది.

చైనా యుద్దం వైరుధ్యాల ను గమనిస్తే,, చైనా జాతీయ బూర్జువా, భూస్వామ్య వర్గం,మొత్తం ప్రజలకి × మరియు వలసవాద (జపాన్ ) , సామ్రాజ్య వాద ప్రయోజనాల కు మద్య వైరుధ్యం    

( ఆ సమాజం లో వర్గేతర( కుల విభజన) ఇతర విభజనలు లేవు)


2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో, తెలంగాణ ప్రాంతీయ బూర్జు వా, భూస్వామ్య,ధనిక వర్గాల,ప్రజల అందరి కి × మరియు ఆంధ్రా బూర్జువా వర్గానికి మద్య వైరుధ్యం.


     3. కొరేగాం యుద్ధంలో,బ్రాహ్మణులకు,పిస్వాలకు ప్రజలకు. ×. మరియు మెహర్+ బ్రిటిష్ వలస వాదులకు మద్య వైరుధ్యం.

    ( ఈ సమాజం లో వర్గేతర కుల విభజన వుంది. స్వయం సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ,నిచనమెట్ల కుల విభజన తో,చలనం లేకుండా ఎదుగు బొడుగులేని, గడ్డకట్టిన, మురిగిపోతున్న సమాజం)


చైనా యుద్దం లో న్యాయం( అభివృద్ధి కర ) ప్రయోజనం,జపాన్ వ్యతిరేక, చైనా ప్రజలందరి వైపు వుంది కనుక మావో చైనా జాతీయ బూర్జువా భూస్వామ్య వర్గం, నకు ప్రజల తరఫున పోరాానికి మద్దతిచ్చి నాడు.దేశ ప్రజలందికీ ప్రయోనాలున్నాయి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో ప్రాంతీయ బుర్జూ వా, భూస్వామ్య ధనిక వర్గాల తో పాటు ప్రజలనందరి ప్రయోజనాలున్నై కావునా మద్దతిచ్చి నా ము.

కొరేగం యుద్ధంలో ,మేహర్లకు,బ్రిటిష్ వలస వాదులకు వుమ్మడి ప్రయోజనా లు వున్నాయి. అదనంగా కుల్లి గడ్డకట్టిన మురిగిపోతున్న సమాజం,చలనం లేని సమాజాన్ని, అభివృద్ధి వైపు మరల్చ బడినది,పురోగ మింప చేయబడినది. పిష్వాలు వొడింప బడినందువల్ల సమాజంలోని క్రింది తరగతి,కుల వర్గాలకు ప్రయోజనం వుంది. బ్రాహ్మణ లకు నష్టం కనుక దీనిని కమ్యూనిస్టులు,అభుదయవాడులు అందరూ బలపరచాలి.


                దళిత ఉద్యమం నిర్మాణానికి కొరెగం యుద్దం ను ఉయోగించుకోవాలా

                వద్దా అనే విషయం లో.

అసలు కులం సమస్య, దళిత సమస్యలు ఏవైనా పూర్తిగా, అంబెడ్కరిజం ద్వారా గాని,అస్తిత్వ ఉద్యమాల ద్వారా గాని,కొరెగాం ను ఉయోగించుకోవడం ద్వరాకాని పరిష్కారం కాలేవు. మార్క్సిజం ద్వారానే,కమ్యునిజం ద్వారానే అంతిమ పరిష్కారం జరుగుతుంది. కమ్యునిస్ట్ పార్టీ ల అసమర్థత వల్లనే, అ వకాశ వాదం వల్లనే,సరైన సిద్ధాంత అవగాహన ేకపోవటం వల్లనే, మారుతున్న వివిధ దశలకు అనుగునంగా తమను తాము అప్ డేట్ చేసుకోక పోవడం,ప్రక్షాళన చేసి కొక పోవడం వలననే, విప్లవ మార్గం నుండి అస్తిత్వ వాద,దళిత ఉద్యమం లుగా వేరు చేయ బడినాయి. లక్ష్మయ్య , డా. గోపినాథ్,కళ్యాణ రావు తదితరులు కొరేగాంను సమర్దించవచ్చు కానీ,దాని ద్వారానే దళిత విముక్తి,కుల నిర్మలనా సాధ్యం కాదు.

వారు చేయవలసినది కమ్యునిస్ట్ పార్టీలలో, విప్లవ మార్గంలో తామే ముందు నడిచి,పార్టీ నాయకత్వం ను తామే వహించి! ( దళిత బహజనులు) నదిపించ గలిగితెనే అంతిమంగా సమసమాజం,కులనిర్మూలన సాధ్యమవుతుంది.

         ఇక మావోయిస్టు విషయానికి వస్తే అది పెట్టిబుర్జువా అవకాశవాదం లో వుంది.విరసం యొక్క నేటి పరిస్తితి మావోయిస్టు పార్టీ యొక్క ప్రతిబింబమే.

అది తెగించి స్పష్టతను ఇవ్వలేదు.

                            

                                           అబ్దుల్ కరీం. ,

                                         6_2_2018.


Comments

Popular posts from this blog

మోజేస్