రైతు ఆత్మహత్యలు లేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలి

 



రైతు ఆత్మహత్యలు లేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలి

ప్రత్యేకతెలంగాణ సాధించినతర్వాత,తెలంగాణప్రభుత్వం ఏర్పడ్డాక కూడా, ఇటీవల కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు,ఆ క్రమంలో నల్గొండజిల్లా సూర్యాపేట చుట్టూ జరిగిన ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలను,పరామర్శించడానికి,వారి స్థితిగతులను తెలుసుకోవడానికి Nov 30 2014 న తెలంగాణా ప్రజా ఫ్రంట్,తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో,tpfఅధ్యక్షుడు మద్దిలేటి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.ఆర్.చౌదరి,రైతాంగ సమితి అధ్యక్షుడు మచ్చ విద్యాసాగర్,tpf ఉపాధ్యక్షుడు రమణా చారి,నల్గొండ జిల్లా tpf అధ్యక్షుడు చింతా నర్సింహా,కార్యదర్శి సుధాకర్ రెడ్డి మరియు పుల్లన్న,నిమ్మల రాఘవులు,అబ్దుల్ కరీం (నేను) వెళ్లడం జరిగింది.

వు 10గం. లకు సూర్యాపేట నుండి మొదటగా పెంపహాద్ మండలం లోని ఆత్మహత్య చేసికొన్న రైతు కుటుంభం దగ్గరకి వెళ్లినాము, అతనికి అర ఎకరం చెను ఉంది. మిగతా కౌలుకు చేసినాడు.3నుండి}4 లక్షల అప్పు(ప్రయివేటు)ఉన్నది.భార్య},కూతురు, కుమారుడు ఉన్నాడు.తరువాత మాచారం గ్రామంలోని అగ్రకులముకి చెందిన రైతుకుటుంబం దగ్గరికి వెళ్లినము.అతను కూడా పత్తి రైతు.అప్పు మాత్రం 1 లక్ష మాత్రమే.ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నంచి దాదాపు10సం. లు ఎదురు చూసాడు.లక్ష వరకు ఖర్చు చేసి విసిగిపోయ వ్యవసాయము చేయసాగాడు.

ఆ తరువాతతిరిగిసూర్యాపేటచేరుకొని,నకిరేకల్ దగ్గర నోముల గ్రామంలోనీరైతు ఇంటికి వెళ్లినాము. అతను కౌలు రైతు,రైతుకూలి.4లక్షలకు పైన అప్పులు చేసినాడు. భార్య,ఇద్దరు 5,7సం. ల పిల్లలు ఉన్నరు. యాదవ కులస్తులు,భూమి లేదు.

ఇక్కడ ఇంకో విషయం సరిగ్గా నెల రోజుల క్రింద ఇక్కడికిదగ్గర్లోని మరో యువ రైతు ఆత్మహత్య చేసుకుంటె పరామర్శించదానికి వెళ్లినాము. అప్పుడు కూడా కె.ఆర్.చౌదరి,మచ్చా విద్యాసాగర్లను మినహా అందరమూ వెళ్లినము.అక్కడి రైతు యువకుడు పైగా మంచి విద్యాభ్యాసం గడిచినవాడు.1 ఎకరం స్వంత భూమి వుంది,మిగతా కౌలుకు చేసినాడు.5 లక్షలవరకు ప్రయివేటు అప్పు ఉంది..ఇతను పత్తి రైతు యాదవకులస్తుడు,భార్య, సం. లోపు పసిబిడ్డ గలదు.

1నెల లొనే సూర్యాపేట చుట్టుపక్కల నాలుగు ఆత్మహత్యలు జరిగాయి.”చుట్టుముట్టు సూర్యాపేట,నట్ట నడు మ నల్లగొండ నూవుండే ది హైదరాబాదు……………..గోల్కొండ గుట్ట కింద ని గోరి గడుతం కోడుకో నైజాం సర్కారోడా” అన్న నా నల్లగొండ జిల్లాలోనిసూర్యాపేట చుట్టూముట్టు, వీరోచితసాయుధ} పోరాటం చేసిన వారసత్వము గల నా రైతన్నలు ఈనాడు మూడు నాలుగు లక్షల అప్పుల కోసం గుండె జారీ ఉరితల్లు వేసుకుని,విషపు మందు తాగి ప్రాణాలు వదిలే మానసిక స్థాయి వచ్చిననందుకు మా లాంటి వాల్లుబాధపడలో, సిగ్గుతో తలవంచుకోవలో తెలియని} పరిస్థితి.

రైతాంగ సమితి,తెలంగాణ ప్రజా ఫ్రంట్ తరుపున ప్రభుత్వానికి ఒకకుటుంబానికి10 లక్షలు అక్షగ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసినాము.సూర్యాపేట లో ఆర్.డి.ఓ.ఆఫీస్ ముందు ధర్నా చేసినము.తరువాత హైదరాబాదు} ఇందిరా పార్కు వద్దధర్నాచేసినము.మేమే కాదు ప్రతిపక్ష పార్టీల నాయకులు,CPi ,CPM,vamaపక్షల సంఘాలు కూడా పరామర్శ యాత్రలు,ధర్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు.

ఈ ఆత్మహత్యలు(రైతుల) పరంపర గత10,15 సం. లుగా తెలంగాణ జిల్లాలలో సాగుతూనే వస్తోంది.ప్రభుత్వాలు మా రినాయి, రాష్ట్ర విభజన కూడా జరిగింది,అయినా కూడా ఈ పరంపర ఆగడం లేదు.వీటికి గల కారణాలను శాస్త్రవేత్త కె.ఆర్.చౌదరిగారు చాలా విశ్లేషణాత్మకంగా రైతులకు వివరించిప్రయత్నం చేశారు.తనరచనల ,వ్యాసాల ద్వారా వివరించిఉన్నారు.”అయితే ,ఈ ఉద్యమాలు,పోరాటాలు భూసంస్కరణలను అమలు చేయించలేక పోయినాయి.1940దశకంలోజరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,సిరిసిల్లరైతాంగ పోరాటాలు,గోదావరిలోయ ప్రజా ప్రతిఘటనా పోరాటాలు,నక్సల్బరీ విప్లవపార్టీల పోరాటాలు పాక్షికవిజయలనే సాధించాయి..ఉత్పత్తి సంబందాలలో మార్పులు వచ్చిన మాట వాస్తవం.ఏది ఏమై నప్పటికి భూ సమస్య చలా కీలకంగా,ప్రధానంగా తెలంగాణలో కొనసాగుతోంది}.భూమిలేని నిరుపేద రైతులు అత్యధిక సంఖ్యలో వున్నారు”(నడుస్తున్నతెలంగాణ ప్రత్యేక సంచికలోని వ్యాసం లో) కె.ఆర్.చౌదరి గారి పి వ్యాఖ్యలను బట్టి,తెలంగాణలో అన్నిరకాల ఉద్యమాలు, పోరాటాలు జరిగినప్పటికి రైతాంగానికి స్వంత భూమి దక్కలేదు.ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో అక్కువమండికి ఆర ఎకరం భూమివుండి మిగతావి కౌలుకు చేసి,అప్పుల పాలైన వారే అధికం.

తెలంగాణలా రైతు ఆత్మహత్యలు తగ్గా లంటే మరొక పోరాటం తప్పనిసరి.గత పోరాటల నుండి వచ్చినఅనుభవం,గుణపాఠాలను,తప్పులను అధిగమించి నూతన ఉద్యమలకు సమాయత్తం కావలసిన సమయం. ఏ దారి లేనప్పుడుమాత్రమే ఆత్మహత్యలు చేసుకుంటారు.దోపిడి దారుల ప్రభుత్వంలు,పార్టీ లు ఏ దారిని చూపించలేవు.

యాత్ర తర్వాత రాత్రికి ఇంటికి చేరిన తర్వాత న కుమారుడు ఎక్కడికి వెళ్లినరు అని అడిగాడు.రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే పరామర్శించడానికి అని చెప్పినాను. తర్వాత సెల్ల్ఫోన్లో నేను చేసిన రికార్డులను చూసి,ఫోటోలను చూసి,పొడవు లావుగా ఉన్న కె.ఆర్.చౌదరి గారిని చూపించి,ఇతను ఎవరు అని అడిగాడు..అతను కె.ఆర్.చౌదరి గారు వ్యవసాయ శాస్త్రవేత్త అని అన్నాను.అతను వెంటనే ఒక ప్రశ్న వేసినడు.వ్యవసాయ సయింటి స్ట్ గదా,గోల్డెన్ రైస్ ,గోల్డెన్ పత్తి కనిపెట్టి రైతుల ఆత్మహత్యలు లేకుండా చేయవచ్చు గదా? అని అన్నాడు. అతని వయస్సు 10 సం. లు,4వ తరగతి చదువుతున్నాడు.మహేష్ బాబు సినిమాలో అతని తండ్రి సైటిస్ట్ ,గోల్డెన్ రైన్ కనిపెట్టాడు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి ఆత్మహత్యలు జరిగిన పెంపహాడ్ మండలం లోని గ్రామాలకు 10 కి.మీ.లోపులోనే గడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది}.

ఎన్ని పరిశోధనలు,ఉత్పత్తి పెంచినప్పటికి నానాటికి రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. ఉత్పత్తి సమస్య వల్ల ఈ పరిస్థితి రాలేదు.పంపిణీ} వ్యవస్థ సరిగా లేనంత వరకు,పేద రైతులకు భూమి దక్కనంత వరకు పరిస్థితి మారదు. రైతాంగానికి,ఋణ భారం,ప్రయివేటు అప్పుల సమస్య,మర్కెటింగ్ మోసాల సమస్య,ఉత్పాదకల సరఫరా,నకిలీ మందుల సమస్యలు,భూ పంపిణీ సమస్యలను} ఈ దోపిడి దారుల ప్రభుత్వాలు సాధారణంగా తీరుస్తా యని అనుకోవడం పొరపాటు.ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు.దీని కొరకు మేధావులు,కవులు,కళాకారులు,ఉద్యమకారులు,విద్యార్థులు సమాయత్తం} కావాల్సిన అవసరం ఉంది.మనకు కావలసినడి బంగారు తెలంగాణా కాదు,రైతుల ఆత్మహత్యలు లేని,పేదరికం లేని, నిరుద్యోగములేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలి.




అబ్దుల్ కరీం

తెలంగాణ ప్రజా ఫ్రంట్

సూర్యాపేట

25-12-2014.

మద్దిలేటి అన్న యాదిలో , ఆతనితో యాత్రసందర్బంగా రెండు రోజుల అనుభవం మరువలేనిది.నిరాడంబరత,కలుపు గోలు తనం,త్యాగనిరత ,మనందరికీ ఆచరనియం

అతనితో యాత్ర సందర్భంగా రాసిన పాత రచన



Comments

Popular posts from this blog

మోజేస్