ఆర్టీసీ సమ్మె – దృక్పథం

 ఆర్టీసీ సమ్మె – దృక్పథం  


అవాక్కయ్యారా, నిజంగానే ఈ రోజు తెలంగాణ ప్రజలు అందరూ అవాక్కయ్యారు. ప్రజల కంటే కూడా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదులు నిజంగానే అవాక్కయ్యారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రవాణా సంస్థ కు భారీ నజరానా ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇన్నాళ్లు తిట్టిపోసిన కార్మికులు సంతోషంగా ఉత్సాహంగా విందు సభనుండి బయటకు వస్స్తూతమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా ఫేస్ బుక్కు లలో ఏం పోస్ట్ చేయాలి ఏం కామెంట్ చేయాలో అర్థం కాక

ఆలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు చాలా 

పిట్టలని కొట్టారు.

  1. కార్మిక యూనియన్ లు లేకుండా చేయడం 

  2. . ప్రతిపక్ష పార్టీల అవకాశవాదాన్ని ప్రజలకు చూపించడం 

  3. కేంద్ర ప్రభుత్వం,బీజేపీ కి చెక్ పెట్టడం

  4. సునాయాసంగా చార్జీలు పెంచడం.

ఈ మొత్తం క్రమంలో లో విప్లవ కమ్యూనిస్టుల దృక్పథం ఏమిటి ఎలా ఉండాలి,

కమ్యూనిస్టుల దృక్పధము నిర్ణయించు కోవాలంటే ప్రస్తుతం సమాజ స్వభావం నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా దృక్పథం ఏర్పడుతుంది.

కేంద్ర ప్రభుత్వం  ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉండి చట్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థల నన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నది. అలాగే రాష్ట్రాలను కూడా చేయమని ఒత్తిడి తెస్తున్నది .దానిలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ  నష్టాలలోఉన్న దని చెప్పి  కొన్ని రూట్లను ప్రైవేట్ పరం చేస్తానని ,సమ్మె చట్ట విరుద్ధమని మొండికేసి ,కార్మికులు  చివరకు సమ్మె విరమించిన తర్వాత, న్యాయస్థానం కూడా ప్రైవేటు కనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత చివరికి ఎవరూ ఊహించని విధంగా గా కార్మికుల డిమాండ్లకు అదనంగా రాయితీలు , నజరానా లతో వెనక్కి ఎందుకు తగ్గినట్లు ఇది విశ్లేషణ జరగాలి.

కేంద్రంలో బడా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద అనుకూల వర్గాలు అధికారంలో ఉన్నాయి వారికి మోడీ ప్రభుత్వం పూర్తి గా సహకరిస్తుంది. వాటి అవసరాల అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తున్నది .దాని కొనసాగింపు గానే మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను కూడా దానికి అనుగుణంగా, జాతీయ  పెట్టుబడిదారి సామ్రాజ్యవాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని  ప్రభుత్వ రంగంను ప్రైవేట్ చేయమని ఒత్తిడి తెస్తున్నది.

రాష్ట్రంలో లో ఆంధ్ర పెట్టుబడిదారి వర్గం నుండి విముక్తి పొందిన రాష్ట్ర పెట్టుబడిదారి వర్గ ప్రభుత్వం కు ఇక్కడి ప్రాంతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా ప్రైవేటీకరణ అవసరం అయినప్పటికీ ,జాతీయ పెట్టుబడిదారి వర్గానికి ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గానికి ఉన్న వైరుద్యం  రీత్యా ,జాతీయ పెట్టుబడిదారులతో పోటి మూలంగా రాష్ట్రంలోని ని జాతీయ పెట్టుబడిదారి అనుకూల వర్గాల ముఠాల పార్టీలను నియంత్రణలలో పెట్టుకోవాల్సి వచ్చింది. బిజెపి ,కాంగ్రెస్ ,సిపిఐ, సిపిఎం లు జాతీయ పెట్టుబడిదారుల అనుకూల  పార్టీలు కాబట్టి మొదట వారిని ప్రజల ముందు కార్మికవర్గం ముందు నైతికంగా దెబ్బ కొట్టాడు.

తన ప్రభుత్వం మాత్రమే దేశంలోకెల్లా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నట్లుగా చెప్పుకొని ప్రజాబలం కూడగట్టుకొని బీజేపీని ఎదుర్కొంటున్నాడు. మరియు బిజెపి ద్వంద్వ వైఖరిని ఎండగట్టా డు. ఇదంతా ఆంధ్ర పెట్టుబడిదారుల నుండి వేరుపడిన తెలంగాణ ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గం, తన అభివృద్ధికి ,జాతీయ స్థాయిలో వా టా  కొరకు ప్రయత్నిస్తున్నది .ఈ ప్రయత్నంలో లో జాతీయ స్థాయి పెట్టుబడితో ఘర్శన అనివార్యం గనుక దానిని ఎదుర్కొనే ఎదిరించే  దానిలో భాగంగానే, తాత్కాలికంగా తన బలం ను రాష్ట్రంలో నిలబెట్టుకోవడానికి ప్రజలను ,కార్మిక వర్గం ,ఉద్యోగ వర్గం తో సహా తాత్కాలిక సంతృప్తి చెందించి , ప్రసన్నం చేసుకోవడం అవసరం అయింది.

ఇంతవరకు  ఈ పరిణామం మొత్తంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీల పాత్ర ఏమిటి ఇది చాలా ముఖ్యమైనది. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మన దేశం ఇంకా అర్ధ వలస అర్థ భూస్వామ్య దేశమే అని అంటున్నాయి .సమాజంలో వచ్చిన మార్పులు గమనంలో తీసుకోవడం లేదు . రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అర్ధ భూస్వామ్య ప్రభుత్వమే అంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ని భూస్వామి, దొర అని అంటున్నాయి. దోర ఆహంకారం తో మాత్రమే సమ్మెను నిరాకరించాడు  అంటున్నారు.  ఆ కోణంలోనే సమ్మెను సమర్థించాయి .సమ్మెలో జాతీయ బూర్జువా అనుకూల ప్రతిపక్ష పార్టీల అవకాశవాద రాజకీయాలను బహిర్గతం చేసి  ఎండ గట్ట లేదు సరికదా వాటితో కలిసి పని చేశాయి.  తమ ప్రత్యేకతను నిలుపుకోలేదు, తమకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించడం లేని కారణంగా మిగతా బూర్జువా ప్రతిపక్షంతో పాటు గా తెల్లబోవలసి  వలసి వచ్చింది.

 తమ ప్రత్యేక కార్యాచరణ లేక పోవడానికి కారణం వారి రాజకీయ దృక్పథం లోనే ఉంది  ఇంకా అర్ధ వలస అర్థ భూస్వామ్య సమాజం అని నిర్వచించడం లోనే ఉంది. దేశం పెట్టుబడిదారి దేశంగా పరివర్తన చెందినది అని గుర్తించకపోవడం ఈ అవాక్కుకు కారణం.

                                                  అబ్దుల్ కరీం

                                              2_12_2019.





Comments

Popular posts from this blog

మోజేస్