వర్గపోరాటం లొ నిజాయతీ

వర్గ పోరాటం లో నిజాయితీ, ఆదర్శాలు ఎక్కువ సమయం నిలబడవు.ఆదాయం పెరిగినపుడు వర్గం మారుతుంది,దానితో పాటు పోరాటం మారుతుంది. గతంలో సింగరేణి కార్మికులు పోరాటాలు చేసినారు అంటే అప్పటి వారి ఆర్థి క పరిస్థితి సగటు దేశ కార్మికుల స్థాయిలో ఉంది కాబట్టి. గత పోరాటాల పలితాంగా, మారిన ప్రాపంచిక పరిస్థితు లలో బూర్జువా పాలకవర్గం వారికి అధిక, సౌకర్యవంతమైన వేతనాలు ఇచ్చి,వారిని అదుపులోకి తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి వి సాధారణంగా జారిగేవే. బ్రిటన్ కార్మిక వర్గాన్ని,వలసలతో కొల్లగొట్టిన డబ్బుతో వారికి అధిక సౌకర్యవంతమైన జీతాలను ఇచ్చి,కార్మిక వర్గాన్ని విప్లోద్యమాన్ని చి దూరం చేయలేదా?.

ఇప్పుడు ఉద్యమ కారులు,ప్రభుత్వ రంగ సంస్థలలోని కార్మికుల ను వదిలి,ప్రయివేటు సంస్థల మరియు అసంఘటిత రంగ పరిశ్రమ ల,కార్మికుల సమస్యలు, పోరాటాలపై వారిని చైతన్య పరచాలి. ఇటీవల జరిగిన ఉబర్ డ్రైవర్ ల సమ్మె ను ఎవరూ పట్టించుకోలేదు,50 వేల కార్మికులు సమ్మె చేశారు. గత సం.రము బెంగుళూరులో వేలాది మంది గార్మెంట్ కార్మికులు pf సమస్యపై ,దాదాపు రెండు రోజుల సిటీని స్తంభింపజేసి, ఒక పోలీసు స్టేషన్ ను కూడా ధ్వంసం చేశారు మరియు కేంద్ర ప్రభుత్వ మెదలువంచి తమ సమస్యలను పరిష్క్ రించుకొన్నారు.అసలైన కార్మికుల సమస్యలను గుర్తించి, వారిని చైతన్య పరచాలి. గతాన్ని గుర్తు చేసి కొని బాధపడే కంటే,ముందు న్న విశాల కార్మిక వర్గ,శ్రామికవర్గ సమూహం లో దూసుకుపోవడం అవసరం. మనముందు న్న కర్తవ్యం.


                

Abdul karem

1-10-2017.

Comments

Popular posts from this blog

మోజేస్