KS సైద్ధాంతిక చారిత్రక తప్పిదం

 కె ఎస్ సైద్ధాంతిక చారిత్రక తప్పిదం


కొండపల్లి సీతారామయ్య భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ తర్వాత అంతటి వాడు .నక్సల్బరీ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఒక సరైన పంథాలో నడిపించి సరైన నిర్మాణాన్ని పార్టీని పటిష్టం చేసిన మహా నాయకుడు. అదే పార్టీలో తాను తీర్చిదిద్దిన ,తయారుచేసిన, ఉద్యమ పాఠాలు నేర్పిన తన శిష్యులతో నే బహిష్కరించడం చాలా అరుదైన ఆశ్చర్య పడే విషయం .చాలా పార్టీలలో సంస్థల్లో లో చీలికలు కొట్లాటలు సాధారణమే కానీ ఇంత చిత్తుగా తాను స్థాపించిన తనతో సమానులు కూడా లేని పార్టీలో ,తనతో ఎవరు రు రాకుండా ,కనీసం తన వర్గం లేకుండానే దాదాపు ఒంటరిగా బయటికి వెళ్ళగొట్టబడడం అసాధారణం. అంతకు ముందు వరకు గొప్ప నాయకుడు ,సిద్ధాంత మార్గదర్శకుడిగా పెద్దదిక్కుగా చారుమజుందార్ తర్వాత అంతటి ఆదరణ పొందిన నాయకుడిగా ,ఉన్నటువంటి వాడిని ఎటువంటి సిద్ధాంత విభేదాలు లేకుండా వ్యక్తిగత కారణాలు ఆరోపిస్తూ, పైగా ముసలితనంలో పార్టీ నుండి  బహిష్కరించడం ద్వారా ఆ పార్టీకి కలిగిన లాభం ఏమిటి ?.ఉంచుకుంటే గల నష్టం ఏమిటో ?  ఆలోచించాలి .

పార్టీ నుండి బహిష్కరించిన కొంతకాలానికి మరణించాడు. వందలాది మంది కార్యకర్తలకు అభిమాన గురువు ,అతని అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు అతడిని ఇప్పటి కి తమ ఉత్తమ గురువు గా, నాయకుడిగా చెప్పుకునే వాళ్ళు వందలు వేలల్లో ఉన్నారు , అతిశయోక్తి కాదు. అతను రచించిన వ్యవసాయ విప్లవం రిపోర్టు నూతన ప్రజాస్వామిక విప్లవం వివరించడానికి అతి ఉత్తమ పుస్తకం. ఆనాటి గ్రామాల్లోని వర్గాలనీ  విశ్లేషించి వ్యవసాయ విప్లవం అవసరాన్ని   విశదీకరించి జగిత్యాల పోరాటానికి పునాదులు వేశాడు.  ఇటు రివిజనిజాన్ని మరియు అటు అతివాద దుందుడుకు వాదాన్ని ,అవకాశవాదాన్ని చాలా పట్టుదలతో ఎదిరించి ఒక నూతన సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని నిర్మించి ,దూరదృష్టి తో దండకారణ్యం లో మరియు భారతదేశం మొత్తంలో ఉద్యమం వ్యాపింప జేయడానికి పునాదులు వేసిన వాడు .1987లో ఉమర్ ముక్తార్ సినిమా వస్తే సినిమా హాల్లో పోలీసులు కాపలా కాశారు.ks ను ఉమర్ ముక్తార్ తో పోల్చిన వాళ్లు, సినిమా కూడా ఏపీలో విప్లవ అభిమానులంతా ఎగబడి చూసినవాళ్లు. ఒక పత్రికలో ఇంటర్వ్యూ వస్తే ఆంధ్ర ప్రదేశ్ అంత నే కాకుండా దేశం మొత్తంలో కూడా సంచలనం కలిగించ గలిగిన మహానేత, విప్లవకారుడు .


.1992లో అతన్ని బహిష్కరించడానికి ముందు వరకు కూడా ఏలాంటి ఆరోపణలు లేవు. హఠాత్తుగా అంతలోనే అతని  విప్లవజీవితమంతా దాదాపు 70 సంవత్సరాలు విప్లవ జీవితం  పనికిరాకుండా పోతుందా?.  ముసలి తనంలోని వ్యక్తిగత బలహీనతల వల్ల ,అతనికి పార్కిన్సన్ వ్యాధి ఉంది .తన జీవితాంతం కమ్యూనిస్టు గా ఉండి , విప్లవోద్యమాన్ని నిర్మించినవాడు .సాధారణంగా పార్టీలో పని చేయడంవేరు , సిపిఐ సిపిఎం రివిజనిజం పై పోరాటం ,నక్సల్ బరి ఉద్యమంలో అతివాద అవకాశ వాదులతో పోరాడి నిరంతరం విప్లవోద్యమ నిర్మాణం చేసిన వాడు .ముసలితనంలో బహిష్కరణ కు ఆరు నెలలకు ముందుగా వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు (ఇంతకుముందు వరకు పార్టీలో సిద్ధాంత విభేదాలు  పార్టీలో లేవు) విప్లవ జీవితాన్ని అంతం చేయడం చాలా అసాధారణం.  తన యవ్వన దశ నుండి పూర్తిగా కమ్యూనిస్టుగా జీవించి, జీవితాంతం కమ్యూనిజం కొరకు బ్రతికిన తన వివాహం కూడా వితంతు వివాహంఆనాటి సిపిఐ పార్టీ లో జరిగింది. తన తనయుడు కూడా ఎమర్జెన్సీ లో ఎన్కౌంటర్ కావింప పడ్డాడు. సిపిఐ నుండి  బహిష్కరించబడ్డాడు ,కారణం ఆనాటి రివిజనిస్టు పంధాను వ్యతిరేకించిన కారణంగా సిపిఐ నుండి బహిష్కరింపబడిన తర్వాతనే గుంటూరు నుండి తన కొద్దిపాటి పొలం అమ్ముకొని కరీంనగర్ జిల్లాలో తన తల్లిదండ్రులతో వలస వచ్చినాడు .ఆ క్రమంలోనే ఫాతిమా స్కూల్ లో చిన్నప్పుడు హిందీ పరీక్షలో పాస్ అయిన సర్టిఫికెట్ తో హిందీ టీచర్ గా పని చేశాడు .వరంగల్ జిల్లాలో ఫ్యూడల్ భూస్వామ్య విధానం సరిగా అర్థం చేసుకున్నాడు .తన వ్యవసాయ విప్లవం పుస్తకానికి ఆనాటి కరీంనగర్ వరంగల్ జిల్లాలే ప్రాతిపదిక .వరంగల్ లో హిందీ టీచర్ గా పని చేస్తూనే  REC,కాకతీయ యూనివర్సిటీ లోని విద్యార్థులను రాజకీయంగా చైతన్యం గావించి జగిత్యాల పోరాటాలకు సిద్ధంగావించాడు .

సిపిఐ, సిపిఎం రివిజనిస్టు విధానాలతో ఏనాడు రాజీపడని వ్యక్తి తన చిన్ననాటి నుండి రాజేశ్వరరావు ,సుందరయ్య లాంటి వాళ్ల సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వారి రివిజనిస్టు పోకడలతో రాజీ పడలేదు కావున ఆ పార్టీల నుండి బహిష్కరణకు గురికావలసి వచ్చింది. ఆ తర్వాత MLపార్టీలో కూడా ఎన్నో చిలికలు జరుగుతున్నప్పుడు, చంద్రపుల్లా రెడ్డి ,టి ఎన్ ,డి వి లాంటి వారి అవకాశవాద మితవాద రాజకీయాలను గాని ,అతివాద  రవూఫ్  లాంటి వారితో గాని ఇంకా రకరకాల అడ్డంకులు ఏర్పరిచే ఏర్పరిచే వారితో రాజీ పడలేదు. సూత్రబద్ధం గా  నక్సల్బరీ బోల్షివిక్ స్ స్పిరిట్ తో నూతన దృఢమైన పార్టీని నిర్మించి నిలబెట్టిన వాడు .తాను నిర్మించిన పార్టీ తప్పటడుగులు వేస్తున్న దని జైలు గోడలు బద్ధలు కొట్టి బయటకు వచ్చి తన పార్టీని సరిదిద్దిన వాడు. 

చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో పార్టీలో వచ్చిన ఆరు చెడులు (six deviations )కు వ్యతిరేకంగా పార్టీని  సరిదిద్దటానికి పూనుకున్నప్పుడు దాని నుండి తప్పించుకొనుట కేజీ సత్యమూర్తి తమిళనాడు సభ్యులు సృష్టించిన సంక్షోభం ని ఎదుర్కొని పార్టీని పటిష్టంగా నిలిపినవాడు. 1984 ఎన్టీఆర్ ప్రభుత్వం యొక్క నిర్బంధం నుండి ఉద్యమాన్ని ,పార్టీని కాపాడి సరైన పందాలో నడిపించి తీవ్ర నిర్బంధంలో సహితం పార్టీని బలోపేతం చేసినవాడు .ఎన్టీఆర్ ప్రభుత్వం అత్యంత పాశవిక నిర్బంధాన్ని  చాకచక్యంగా తిప్పి కొట్టి ,అంతటి నిర్బంధంలో లో కూడా పార్టీ బలపడడానికి ,ఉద్యమం బలపడటానికి కె ఎస్ నాయకత్వం ,సైద్ధాంతిక అవగాహన అతని పాఠాలు రాజకీయ శిక్షణ లు తోడ్పడ్డాయి. ఎన్టీఆర్ పాలన పోయి కాంగ్రెస్ చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత వెసులుబాటు తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా  ఒక విప్లవ వెల్లువ రావడం నిర్బంధ కాలంలో జరిగిన పార్టీ నిర్మాణమే కారణం.


 కె ఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత పార్టీ బలపడిందా లేక బలహీనపడిందా అనేది చాలా ముఖ్యం .

సిద్ధాంతపరమైన విభేదాలతో సంక్షోభం రాలేదు కనుక సిద్ధాంతంలో మార్పులేదు నిర్మాణంలో పరిశీలించాలి .

ఇప్పుడు మావోయిస్టు పార్టీ చెబుతున్న దాని ప్రకారం అయితే 25 సంవత్సరాల తర్వాత ఉద్యమం బాగా విస్తరించింది అని చాలా రాష్ట్రాలకు వ్యాపించిందనీ. దండకారణ్యంలో విముక్తి  ప్రాంతం ఏర్పడి  బీజరూపంలో జనతన సర్కార్ పనిచేస్తుంది అని చెబుతున్నారు. సైనికంగా రాశి వాసి లో అభివృద్ధిని చూపెడుతున్నారు .పార్టీ bolshevise  చెందినట్లుగా చెబుతున్నారు.

కానీ రాజకీయ చైతన్యం ,సిద్ధాంతపరంగా క్యాడర్ ఎదగలేక పోతున్నారు అని వారి అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది.

 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కొంత పార్టీ ,ఉద్యమం వెనుకంజ వేసినప్పటికీ మొత్తం మీద దేశవ్యాప్తంగా వ్యాపించినట్లుగా వారి అభిప్రాయం .

ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి .

1 ఆంధ్ర తెలంగాణలో పార్టీ ఉద్యమం వెనక పట్టు కు  కారణాలు ఏమిటి .

2 ఇతర పార్టీలను విలీనం చేసుకుని పార్టీ bolshevise  చెందినట్లుగా భావించవచ్చా .


3 నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాన్ని  సరిగానెరవేర్చుతున్నారా. 


4 ఉద్యమంలో కార్మికుల పాత్ర ఏమిటి (కార్మికుల పోరాటాలు .)


5 ఒక వ్యక్తిని అంచనా వేసేందుకు అతని తప్పులు ఎక్కువా, ఒప్పు లు ఎక్కువ అని అంచనా వేసి చూడండి అనే మావో సూత్రం  కె ఎస్ కు వర్తించదా.




"రాజకీయాలలో చేసిన తప్పుల సంగతి అటుంచి అసలు ఏ తప్పు గురించి అయినా ఆ తప్పు చేసిన వ్యక్తి సైద్ధాంతిక మూలాల్లోకి వెళ్లకుండా ఆ తప్పు గురించి మనకు సరైన అవగాహన ఏర్పడదు"   లెనిన్.

లెనిన్ చెప్పిన పై వ్యాఖ్యలను బట్టి కె ఎస్ తప్పులను అతని సైద్ధాంతిక మూలాలలోకి పోయి చూడాలి. అంతేకాకుండా ఆనాటి పార్టీ యొక్క సైద్దాంతిక వర్గమూలాల లోకి పోయి పరిశీలించాలి .

పార్టీలో ప్రారంభంలో ఎక్కువగా విద్యార్థులు మేధావులు ఎక్కువగా ధనిక మధ్యతరగతి  వర్గాల నుండి వచ్చిన వారే .ఉద్యమం ముందుకు పోతున్న క్రమంలో దళిత, బహుజన ,మైనార్టీల ,కార్మిక వర్గాల నుండి అధిక సంఖ్యలో పార్టీలో చేరినారు. పార్టీ ఎక్కువగా విద్యార్థుల నుండి అభివృద్ధి చెందినది .కొంత మేధావి వర్గం నుంచి అతి తక్కువగా కార్మిక వర్గం నుండి చేరారు. మొదట్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు మధ్యతరగతి వర్గాలకు ఉన్నత కులాలకు చెందినవారే ,ఉన్నత చదువులు చదివే అవకాశం వారికే ఉంది. సహజంగానే మొదట వచ్చిన ధనిక మధ్యతరగతి విద్యార్థి మేధావి వర్గానికి చెందిన వారు  వారి చొరవ ఫలితంగా మొదటి శ్రేణి నాయకత్వం వారితో నిండిపోయింది. తర్వాత ఉద్యమం అభివృద్ధి చెందుతున్న దశలో దళిత బహుజన మైనారిటీ లు కార్మికులు అధిక సంఖ్యలో పార్టీలో చేరారు .

వారిలోఉన్నత విద్యావంతులు తక్కువే ,సామాజికంగా కూడా వెనుకబడిన వారే. అయితే ఉద్యమం ముందుకు పోతున్న దశలో వీరిలో కూడా చైతన్యం పొంది , నాయకత్వ స్థానాలకు ఎదిగే క్రమంలో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే క్రమంలో, మొదటి శ్రేణిలో వున్న  మధ్యతరగతి ఉన్నత కులాలకు చెందిన వారికి ,తర్వాత శ్రేణి లోని దళిత బహుజన మైనార్టీలకు చెందిన వారికి మధ్య వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఈ వైరుధ్యం వివిధ రూపాలుగా వ్యక్తీకరించబడి six deviations గా  పార్టీలో ముందుకు వచ్చింది .మొదటి నుండి కూడా పార్టీలో కార్మిక వర్గ సంస్కృతి ఏర్పడలేదు .

కార్మికుల పాత్ర పరిమితంగా ఉండటం వలన అన్య  వర్గాల నుండి వచ్చిన వారి సంస్కృతి అలాగే కొనసాగుతూ వస్తోంది. ఉద్యమం పెరుగుతున్న క్రమంలో పార్టీ పెరుగుతున్న క్రమంలో లీడింగ్లో ఉన్న ధనిక మధ్యతరగతి అగ్రకుల నాయకత్వం కు అప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత బహుజన మైనారిటీ పేద కార్మిక వర్గాలకు చెందిన వారికి మధ్య వైరుధ్యం పెరుగుతూ వచ్చింది . దీనిని నివారించేందుకు అణ్యవర్గా  లక్షణాలను పార్టీలో రెక్టిఫై చేయడానికి, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో పార్టీని సరిచేయడానికి ks నాయకత్వంలో ఆరు చెడుల పై  దిద్దుడు కార్యక్రమం మొదలుపెట్టారు .ప్రారంభంలోనే దీనీ  నుండి తప్పించుకొనుటకు కేజీ సత్యమూర్తి తదితర తమిళనాడుకు చెందిన సభ్యులు రెండు పందాల మధ్య పోరాటంగా డైవర్ట్ చేసి సృష్టించిన సంక్షోభం, దీనిని పరిష్కరించడం కొరకు కొంతకాలం కాలయాపన జరిగింది .సరైన సమయంలో సరిగా దిద్దుబాటు కార్యక్రమం నిర్వహించలేక పోయారు .

ఫలితంగా కొంతమంది ధనిక  మధ్యతరగతి అగ్రకులాలకు చెందిన వారు అప్రమత్తమై చైనా లో జరిగినటువంటి శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో జరగాల్సిన దిద్దుబాటు కార్యక్రమం జరగనీయకుండా నీరుగార్చారు. పార్టీలో అన్య వర్గ లక్షణాలు చాలా బలంగా ఉన్న కారణంగా,దిదూబాటు  కార్యక్రమం జరగనీయకుండా చేయగలిగారు .ఎప్పుడైతే ks నాయకత్వంలో దిద్దుబాటు కార్యక్రమాన్ని పట్టుదలగా  అమలు చేయడానికి ప్రయత్నం చేయగా ,అతనికి వ్యతిరేకంగా ఒక ముఠా వ్యక్తిగతంగా అ ప్రతిష్ట పాలు చేసే రకరకాల వ్యాఖ్యలను చేయడం మొదలుపెట్టారు .అలాగే పార్టీలో వివిధ స్థాయిలలో దళిత బహుజన మైనారిటీ లకు చెందిన సభ్యులను ఎదగనీయకుండా చేయడం , అప్పటికే నాయకత్వ స్థాయిలో ఉన్న కొంతమందిని రకరకాలుగా వేధించి వారిని పార్టీ నుండి వెళ్ళగొట్టడం, పైనుంచి క్రింది స్థాయి వరకు క్రింది నుంచి పై స్థాయి వరకు అన్య వర్గ లక్షణాలను ప్రోత్సహించి వారిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు .మొత్తం పార్టీని తమ అధీనంలోకి తీసుకున్నారు. బూర్జువా పార్టీల లో ఉండే ఎత్తుగడలు, తప్పుడు పద్ధతులు కల వారిని ప్రోత్సహించడం వారి బలహీనత(వీక్ నెస్) లను వాడుకొని వారిని అదుపులో ఉంచుకోవడం, మొత్తం మీద పార్టీ పైన ఆధిపత్యం నెలకొల్పుకున్నారు .ఇలాంటి గొప్ప నాయకునికి వ్యతిరేకంగా మొత్తం పార్టీని నిలబెట్టగలిగా రంటే  పార్టీ మీద ఎంత పట్టు సాధించారు అర్థం చేసుకోవచ్చు .  తర్వాత క్రమంగా పార్టీ  AP లొ  క్షీణించడం  లేదా సెట్ బ్యాక్ కు గురైంది.  . మొత్తానికి ఏపీలో 20 సంవత్సరాల కాలంలో దాదాపు క్షీణదశకు చేరుకుంది.

ఎంగేల్స్ జర్మనీ విప్లవ పరాజయం గురించి చెప్తూ" ఈ విప్లవానికి పరాజయానికి కారణాలు, తప్పులు ద్రోహుల లో అన్వేషించ కూడదని ,ఈ అల్లకల్లోలం లో చిక్కుకున్న ప్రతి దేశంలోని సహజ స్థితి ,దేశ పరిస్థితులు అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవాలి"( from  revolution and counter revolution in Germany ) Engels.


ఆనాడు పార్టీ అవగాహన ఏమిటంటే ఉపరితలం పునాదిని కదిలిస్తుంది అని అంటే ఆరు చెడులు పార్టీని సిద్ధాంతాన్ని ప్రభావితం  చేస్తుందని.

"చరిత్ర సాధారణభివృద్ధిలో ,భౌతిక విషయాలను సామాజిక ఉనికి సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తాయని ఒప్పుకుంటునే మనం భావాల ప్రభావం భౌతిక విషయాల మీదా ,సామాజిక చైతన్య ప్రభావం సామాజిక ఉనికి మీద ,ఉపరితల నిర్మాణం ప్రభావం ఆర్థిక పునాది మీద ఉంటుందని కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకొని తీరాలి .ఇది భౌతిక వాదానికి విరుద్ధం కాకపోగా అందుకు మారుగా యాంత్రిక భౌతికవాదాన్ని పక్కకునెట్టి గతితార్కిక భౌతికవాదం నీ దృఢంగా  బలపరుస్తుంది " మావో వైరుధ్యాలు.


కె ఎస్ తప్పిదానికి గురయింది సరిగ్గా ఈ సూత్రం మీదనే ఉపరితలాన్ని సరిదిద్దిన ట్లయితే పార్టీలోని చెడు పోతుంది అని అనుకున్నాడు .చైనాలో లాగా సాంస్కృతిక విప్లవం స్ఫూర్తి తో , పార్టీలో కూడా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో సరిదిద్దాలి అనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే పొరపాటు జరిగింది. ఈ తప్పుడు అవగాహన వల్ల సులభంగా ఏకాకి అయిపోయాడు .పార్టీలో "ఆరు చెడులకు" మూలం ఉపరితలంలో లేదు వర్గమూలాలలో ఉంది. వర్గమూలాలు సరి చేయకుండా ఉపరితలంలో సరిదిద్ద లేము .పార్టీ

లొవర్గమూలాలు సరి చేయకుండా తాత్కాలికంగా బలవంతంగా నిర్వహించినా , స్వల్ప కాలం తాత్కాలికంగా అణిచివేయబడినా,అతి వేగంగా తిరిగి  మరల ముందుకు వస్తాయి .


పార్టీలోని క్రియాశీలక సభ్యులు కూడా ఇదే ఆలోచనల తో కొట్టుకుపోయారు. ఉపరితలంలో ,సాంస్కృతిక రంగం లోనే ప్రయత్నించారు , పునాది గురించి పట్టించుకోలేదు .చైనాలో కూడా ఈ సూత్రం ఆధారంగానే మహత్తర కార్మికవర్గ సాంస్కృతిక విప్లవం జరిగింది .అది తాత్కాలికంగా విజయం సాధించింది .వర్గమూలం లో ,భౌతిక పునాదిలో మార్పు జరగని కారణంగా అనతికాలంలోనే మావో మరణించిన వెంటనే  డెంగ్ ముఠా నాయకత్వంలో పెట్టుబడిదారీ పునరుద్ధరణ వేగంగా జరిగిపోయింది.

"అవకాశవాద శక్తులను పార్టీలో సైద్ధాంతిక పోరాటాల ద్వారా ఓడించ వచ్చునని ,పార్టీ చట్రంలో ఈ శక్తులపై పైచేయి సంపాదించవచ్చు ననే సిద్ధాంతం పనికిమాలిన ప్రమాదకర సిద్ధాంతం "  స్టాలిన్


"అన్ని విధాలైన చైతన్య రూపాలు భావజాలాలు కేవలం విమర్శ ద్వారా మా య మవ వని  ,అటువంటి భావజాలానికి జన్మనిస్తు న్న  వాస్తవ సామాజిక సంబంధాలను కూ ల దోయాడం  ద్వారా మాత్రమే ,భావజాలాన్ని కూల దొయ గలమని చారిత్రక భౌతికవాదం చెబుతుంది "(Marx and engels the German ideology)

పై వ్యాఖ్యల లో ,Marx, Engels, Stalin లు  చెప్పిన విధంగా పునాది లో మార్పులు తీసుకు రాకుండా ఉపరితలంలో మార్పులు జరగవు. ఆనాటి పార్టీ లో ఉన్న ధనిక వర్గం యొక్క ప్రభావాన్ని దాని మూలాలను లోతుగా అధ్యయనం చేసి దాని స్థానంలో కార్మిక వర్గ నాయకత్వాన్ని పేద ప్రజల నాయకత్వాన్ని ఇంకా దళిత బహుజన నాయకత్వాన్ని ముందుకు తీసుకుని రా లేకపోయినా మూలంగా , వారు ఏ కాకులు కావడమే కాకుండా అటు తర్వాత ఏపీ లోని పార్టీ క్రమంగా నిర్వీర్యం లేదా ఉద్యమం సెట్బ్యాక్ గురైంది .

ks చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది కనీసం ఒక వర్ధంతి సభ అయినా లేదా సమీక్ష అయినా విమర్శ అయినా రాయడం లేదు. అంతగా మర్చిపోయిన వ్యక్తి (మహా నాయకుడు) చరిత్రలో దాదాపుగా ఎవరు ఉండకపోవచ్చు .చరిత్రలో  పచ్చిఅభివృద్ధి నిరోధకులను కూడా మంచికో చెడుకో గుర్తుపెట్టుకుంటాం. ఒక వ్యక్తి తన జీవితాన్ని అంతా ప్రజల కొరకు ,తన కుటుంబాన్ని కూడా ప్రజల కొరకే అంకితం చేసిన విప్లవకారుడు నీ గుర్తు చేసుకోకపోవడం అసాధారణమే .విజేతల కే చరిత్ర ఉందనుకుంటే పొరపాటు ఓడిపోయిన వారికి కూడా చరిత్ర ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కొందరికి మంచి మరికొందరికి చెడు ఉండడం సహజమే.

 చరిత్ర ను కనుమరుగు చేయడం అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఉన్న ఉద్యమకారులకు, కమ్యూనిస్టులకు ,మేధావులకు మరియు చరిత్రకారులకు ఉచితం కాదు

          --సాహు

31st March 2016

(April 12 2016 14 వ వర్ధంతి)


*(ఇక్కడ పునాదిలో అంటే ఉత్పత్తి శక్తుల లో మార్పు రాలేదు . భారీ పారిశ్రామిక ప్రగతి ,భారీ ఉత్పత్తి సాధించకుండా, చిన్న తరహా ఉత్పత్తి తో ,పెట్టీ బూర్జువా లను ఉత్పత్తి చేసే  ఉత్పత్తి విధానంలో.)

Comments

Popular posts from this blog

మోజేస్