కవుల కరప్ట్ గురించి
కవుల కరప్ట్ గురించి
ఒక్క కవులు రచయితలు మాత్రమే కరప్ట్ అయిపోయారు కాబట్టి ఈ పరిస్థితి అని ఒక కవుల,రచయితల మీద నిండవేయడం మూలం ను వదిలి వేయడమే.కవులు,రచయితలు,సాహిత్యం ఆనాటి సామాజిక ఉద్యమాలకు, రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా నే వుంటాయి.దీనిని పునాది నుండి చూడాలి.చరిత్రలో నక్సల్బరి ముందు తెలంగాణా సాయుధ పోరాట కాలంలో సాహిత్యం,కళా రూపాలు అత్యంత అభివృద్ధి కరంగా వుండేవి,కమ్యూనిస్ట్ పార్టీ ల సిద్దాంతాల కనుగుణంగా.ఆతర్వాత కాలం లో కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిస్త్ గా దిగజారిన కాలం లో వాటి కనుగుణంగా కవులు,రచయితలు ,కళా కారులు ,కళారూపాలు దిగజారి పోయాయి. ఎప్పుడైతే నక్సల్బారి బద్దలై,శ్రీకాకుళ పోరాటం ముందుకు వచ్చిందో అనాడు శ్రి శ్రీ షష్టి పూర్తి , ఆంధ్ర విద్యార్ధుల కరపత్రం,ఆతర్వాత విరసం ఆవిర్భావం తెలిసిందే.నూతన విప్లవ రాజకీయ అనుగుణంగా జననాత్య మండలి ఏర్పడం అది ఆంధ్ర మరియు మొత్తం దేశం లో ప్రభావం అందరికీ తెలిసిందే.
ఏది ఏమైనా ఆ తర్వాత కాలం లో క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుత స్థితిలో ఉన్నాము.
అంటే నక్సల్బరీ , విరసం ల ముందు పరిస్తితి లో ఉన్నాము.
నూతన సిద్ధాంత విప్లవోద్యమం ముందుకు రాగలిగితే ఈ నాటి స్తబ్దత సకల అవలక్షణాలు తుడుచుకు పోయి నూతన తరం అభివృద్ధి కర విప్లవ సాహిత్యము ,కవులు,,కలలు ,కళారూపాలు వస్తాయి.
అబ్దుల్ కరీం
12_3_2020
Comments
Post a Comment