కమ్యునిస్ట్ ల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి
కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి
ఎందుకు ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల మధ్య ఐక్యత నా లేక పార్టీలలో ఉన్న వ్యక్తుల మధ్య ఐక్యతనా.
వ్యక్తుల మధ్య ఐక్యత అవసరం ఏమి వచ్చింది
ఆయా పార్టీలలో నే పార్టీ ల మధ్య ఐక్యతకు ఎందుకు ప్రయత్నించడం లేదు.విడిగా ఐక్యత అవసరం ఏమిటి.
కొంతకాలం నుండి ఆయా పార్టీలలో వున్న వ్యక్తులు ప్రస్తుతం సమాజం మారిన సమాజానికి అనుకూలంగా ఆయా పార్టీలు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని, సిద్ధాంతపరంగా అప్డేట్ కావడం లేదని ,ఒకవేళ పార్టీలలో ప్రయత్నం చేసిన పై నాయకత్వం దానిని అంగీకరించడం లేదని, వారి వాదనను నొక్కి పెడుతున్నదని, వారు మార్పుకు సిద్ధంగా లేరని అంటున్నారు.
ఇంకా ప్రస్తుత దేశ పరిస్థితి అర్థవలస అర్థ భూస్వామ్యం గా లేదని ,ఇంకా దున్నేవానికే భూమి, వ్యవసాయక విప్లవం అవసరం లేదని ,భూస్వామ్య విధానం అంతమైందని ప్రస్తుతం పెట్టుబడిదారీ సంబంధాలు మారు మూల పల్లెలకు కూడా వ్యాపించాయని ,ఇప్పుడు చేయవలసింది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవమని కొంతమంది విడివిడి వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ ఇతర ఇతర ఇతర మార్గాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా కొంతమంది ఆయా పార్టీలలో అసంతృప్తిగా వుండి, మరియు ఆయా పార్టీలు ప్రజల సమస్యలకు అనుగుణంగా పనిచేయడం లేదని ,ప్రజలకు దూరమై క్షినించి పోతూన్నవని ఏదో తప్పు జరుగుతున్నది అని అస్పష్ట సిద్ధాంత అవగాహనతో ఏదో మార్పు రావాలి తేవాలి అనుకునేవారు అన్ని పార్టీలలో ఉన్నారు.ఇలాంటి వారు పార్టీ లకు దూరంగా
ఒంటరిగా తమ ప్రయత్నాలు,అధ్యయనాలు
చేస్తున్నారు.
ఇంకా కొంత మేధావి వర్గం అభ్యుదయవాదులు కమ్యూనిస్టు సాధభూతిపరులు,విప్లవం కోరుకునే వారు ప్రస్తుత వామపక్ష పరిస్థితిని బాగు చేయాలనే ఉద్దేశం ఉన్నవారు రకరకాల చర్చలలో పాల్గొంటున్నారు. ఒక స్పష్టమైన సైద్ధాంతిక నిర్ధారణ కొరకు చర్చోప చర్చలు నడుస్తున్న్నాయి.
"విప్లవ సిద్ధాంతం లేనిదే విప్లవోద్యమం ఉండజాలదు"- లెనిన్
ఈ నేపథ్యంలో వీరందరినీ ఒక ఐక్యవేదిక మీదికి తెచ్చి సిద్ధాంత చర్చల ను కొనసాగించి ఒక సరైన సిద్ధాంతాన్ని ఒక ఆచరణని శాస్త్రీయ మార్క్సిజం వెలుగులో ఒక సరైన మార్గం రూపొందించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.
స్వతంత్ర వామపక్ష మేధావులు, అధ్యయన కారులు ,తమ పరిశోధనలను ,కొద్దిగా నైనా
కొంత సమగ్రంగా నే తీసుకు వచ్చారు.పెట్టుబడి దారీ సంబంధాలు విస్తృతంగా నే పల్లెలలో చొచ్చుకు పోయాయని ,ప్రతి పల్లేని పెట్టుబడి మింగేసింది అని ,పట్టణీకరణ వేగంగా జరుగుతున్నది అని ,అసంఘటిత రంగం లో
కార్మిక వర్గం పెరిగిందని అనేక ఋజువువులు,అధ్యయనాలు మన ముందు ఉంచారు.కరోనా మహమ్మారి కాలం లో
వలస కార్మిక వర్గం కళ్లముందే వున్నది.
వందేళ్ల కమ్యునిస్ట్ పార్టీ చరిత్రలో,50 సం దాటిన naxalbari ఇంతవరకు దేశంలో విప్లవం సాధించలేదు. కారణాలను వెతకాలి విశ్లేషించాలి నూతన మార్గాన్ని అన్వేషించాలి.
"ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్యే" .ఏ వర్గాల చేతిలో అధికారం కేంద్రీకరించబడి ఉంది? లేక ఏ వర్గాలను అధికారం నుండి కూలదోయాలి ?ఏ వర్గం లేక ఏ వర్గాలు అధికారం చేపట్టాలి? , ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య ఇదే-లెనిన్
దీనిని బట్టి ఏ వర్గాల చేతిలో రాజ్యాధకారం వుంది ,శత్రువు ఎవరు దీనిని నిర్వచించాలి.
దీనిపై ఏకాభిప్రాయం కు రాగలగాలి.శత్రువు ను
గుర్తించ గలిగితే ,మిత్రులు ఎవరు అనేది సులభమే.
అయితే దేశంలో చీలి వున్న కమ్యునిస్ట్ పార్టీ ల మధ్య ఐక్యత ,సమిష్టి కార్యాచరణ అసలే లేవా
వుంటే కొత్తగా వచ్చిన అవసరం ఏమిటి.కొన్ని విప్లవ ml పార్టీ లు ఐక్యం అయి ఐక్య పార్టీలుగా ఏర్పడినాయి,అందులో గతంలోని pw,pu,mcc... లు ఐక్యం అయి మావోయిస్ట్ పార్టీ గా,ఇంకా ఇతర ml group లు కలిసి new democracy,ఇలానే ఇంకా కొన్ని కలిసినవి కూడా వున్నాయి, కలీసినవి మరలా విడిపోతూ కూడా వున్నాయి.ఇంకా cpi,cpm,పార్లమెంటరీ ml పార్టీ లు కొన్ని
విసయాల పై ఐక్య ఉద్యమాలు,మరియు ఎన్నికలలో కలిసి పోటీ చేయడం చేస్తూనే వున్నారు.అనేక పార్టీ లు గా వున్నప్పటికీ వీరి అభిప్రాయం దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలు అధికారం లో వున్నాయని,ఇంకా అర్డవలస అర్థ భూస్వామ్య వ్యవస్థ వుందని, కావలసింది నూతన ప్రజాస్వామిక లేదా జనతా ప్రజాస్వామీక విప్లవం అంటూ,పార్లమెంటరీ పందా,సెమీ పార్లమెంటరీ సాయధ పోరాటం,పూర్తిగా దీర్ఘ కాలిక సాయుధ పోరాట మనే దానిలో విభజించ బడి వున్నాయి.వారి దృష్టిలో శత్రువు లో భిన్నాభిప్రాయం లేదు కానీ ఓడించే విధానం లో ,కార్యాచరణ లో విభేదం వున్నది.కాబట్టి
వుమ్మడి గా కొన్ని చోట్ల కలిసి పని చేసే ప్రాతిపదిక వున్నది.
"అత్యంత పురోగమి సిద్ధాంత మార్గదర్శకత్వంలో పనిచేసే పార్టీ మాత్రమే అగ్రగామి పోరాట యోధుని పాత్ర వహించగలదు." లెనిన్ ,ఎం చేయాలి
అలాగే నూతన సిద్ధాంతం కావాలి అనే వారిలో విభిన్న రకాల నేపథ్యం నుండి వచ్చిన వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి వాటి అన్నిటి నీ చర్చించి సమన్వయం సాధించాలి.
శాస్త్రీయ మార్క్సిజం వెలుగులో వాటిని పరిష్కరించుకోవాలి.సుత్రబద్ద మైన ఐక్యత ప్రాతిపదిక కావాలి."కమ్యునిస్ట్ ల ఐక్యత అంటే ఒక ఉన్నత మైన రాజకీయ శాస్త్రీయ దృక్పదం కల కార్మిక వర్గ చైతన్యం కల అగ్రగామి శక్తుల కలయిక." ఆ విలువలను కొనసాగిస్తూ దేశ ప్రజల ,కార్మికవర్గ విముక్తి నీ,సోషలిస్ట్ విప్లవము నిర్వహించే మహత్తర రాజకీయ పోరాట మార్గం వేసే విధంగా వుండాలి.
ఈ పరిష్కారం కొంత సమయం పట్టవచ్చు మౌలికంగా మాత్రం "దేశం పెట్టుబడిదారీ విధానంలో ఉందని, కర్తవ్యం సోషలిస్టు విప్లవమే అంతిమ మార్గమని" అందరికీ కనీస ఏకాభిప్రాయం వుండాలి లేదా రావాలి ,కాబట్టి మిగతా విషయాలను చర్చల ద్వారా కలిసి ముందుకు పోయే క్రమంలో పరిష్కారం లభించవచ్చు .
"కమ్యునిస్ట్ ల మధ్య ఐక్యతకు,ప్రజాస్వామిక
ఐక్య సంఘటన కు మధ్య మౌలిక మైన తేడాను
గమనించాలి "
ప్రస్తుత తక్షణ అవసరం కమ్యునిస్ట్ లు ఐక్యమై ఒక సరైన రాజకీయ శాస్త్రీయ మార్క్సిజం వెలుగులో ఒక విప్లవ సిద్ధాంత పంథా ను కమ్యునిస్ట్ పార్టీ నీ నిర్మించడమే.
అప్పటివరకు ఒక ఐక్య నిర్మాణంలో కలిసి ఉండి ఐక్య కార్యాచరణతో ఉద్యమాలను నిర్మించాలనే ఉద్దేశంతో వివిధ పార్టీల వ్యక్తుల మరియు మేధావుల అభ్యుదయవాదుల కలయికతో ముందుకు పోవాలని ఆశిద్దాం.
ప్రపంచ సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి.
అబ్దుల్ కరీం.
18-7-2022.
Comments
Post a Comment