Fb లో అమానవీయ శ్రమ పై చర్చ

 Fb లో అమానవీయ శ్రమ పై చర్చ


Abdul Kareem .20 ఏళ్ల క్రితం వరకు రిక్షా బల్లు మనషులు లాగే వాల్లు ఒక మనిషి ఇతరులను లాగడం మానవత్వం లేని అమానవీయ శ్రమ.ఎక్కువగా ,st లు,క్రింది కులాల వాళ్ళు గ్రామాల నుండి వలస పోయిన వారు రిక్షాలు నడిపే వారు.

ఆటో లు వచ్చిన తర్వాత ఇది కనుమరుగు అయింది.

ఆటో ను అన్ని సెక్షన్ ల ,కులాల,మతాల కతీతంగా

దిగ్నిటిగా నడుపు కుంటున్నారు.ఇక్కడ కుల మతాలు ప్రాంతాలు కూడా లేవు కేవలం ఆటో డ్రైవర్ . technology మార్పు,పెట్టుబడి దారీ విధానం వృద్ది చెందడం వల్ల జరిగింది.ఇక్కడ ఏ వర్గ పోరాటం,కుల పోరాటం జరగ లేదు.

అలానే ఇతర అమానవీయ వృత్తులు పోవాలంటే పారిశ్రామీకరణ జరగాలి.వ్యవసాయం లో కూడా.పారిశ్రామీకరణ ,పెట్టుబడి దారీ విధానం నుండి సోషలిస్ట్ విప్లవ ము ద్వారా సాధ్యం.

కుల మత ప్రాంతీయ నిర్మూలన పూర్తిగా జరిగి ,ప్రజల సమానత్వం రావాలంటే సోషలిస్ట్ విప్లవ మే, మార్క్సిజం మే అవసరం.ఇది మాత్రమే ఆచరణాత్మక మార్గం.


Sm.to Sk Abdulkareem ఆటోకి కులం లేదు నడిపే వ్యక్తికి ఉంది కదా??.మెకనైజేషన్ తో కులం పోవడం లేదు.ఆటోనడిపే వ్యక్తికి కులం చూడకుండా ఇల్లు కిరాయికి ఇస్తున్నారా!?. ఒకవేళ కొన్ని డబ్బులు జమ చేసుకుని ఇల్లు కొందాం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందా!?. కోనసీమ పరిణామాలను ఏవిధంగా చూడాలి?!. సోషలిస్టు విప్లవం కోసం ఎదురు చూడ్డమే నా మనకు మిగిలిన ఆప్షన్?!


Abdul Kareem to sm.మధ్యంతరం వుంటే మంచిదే, మరి అది ఏమిటి?.అందరూ గోడు వెళ్ళ బోసు కోవడమే,లేదా వాళ్ళ కష్టాలను వర్ణించి చెప్పడమే కానీ ఎలా మార్చాలి అనేది ప్రశ్న.ఆ solution శాస్త్రీయంగా,gatitaarkikangaa వుండాలి.లేదా వారి సిద్ధాంత పరంగా ఎందుకు అమలు చేయలేక పోయారు,

ఇప్పుడు చేసే వారు ఎలా చేసి సాధిస్తారు చెప్పాలి.

auto నడిపే వారికి కులం,మతం,ప్రాంతం వుంది,కానీ నేను అన్నది ఒరేయ్ రిక్షా నుండి ఆటో బాబు గా మారిన దాని గురించి.ఆటో వృత్తి(డ్రైవర్) చేయడానికి ఏవి అడ్డు లేవని.


Abdul Kareem to sm50 సం.గా వివిధ ml పార్టీ లు,వారి cadre అంతా ఎన్నో బలిదానాల తో , నిబద్ధత తో,వీరోచితంగా పోరాడారు,ప్రాణాలు అర్పించారు ప్రజల తోనే ప్రజల కోసమే.వారు కుల మత నిర్మూలనకు పనిచేసిన వారే, ఈ మాత్రం గ్రామాలలో దళిత ,పీడిత కులాల చైతన్యం కల్పించింది వారు కాదా. సిద్ధాంత,ఆచరణ పొరపాట్ల మూలంగా వెనక పట్టు పట్టినంత నే ,అస్తిత్వ,అంబేడ్కర్,కుల సంఘాల నుఆశ్రయించడా మెనా.అవి కమ్యునిస్ట్ ల ను మరింత వెనక్కి నెడుతున్నారు.బూర్జువా నియంతృత్వ రాజ్యాంగ ను బలోపేతం చేస్తున్నారు,బూర్జువా లు కులాలను,మత ప్రాంతీయ తలను కార్మిక వర్గం కు వ్యతిరేకంగా వాడు కుంటున్నాయి. వాస్తవంగా కుల మత నిర్మూలన ను చాలా వెనక్కు నెడుతున్నారు.

మార్క్సిజం లో కుల మత నిర్మూలన సాధ్యం కాదా.తాత్కాలిక వెనుక పట్టు ఎప్పటికీ వుంటుందా. ముందుకు నెట్టే ,సరిదిద్దే బాధ్యత కొంత మేరకైనా విముక్తి పొందిన వారి పై వుంది.



Sm to Abdul Kareem చర్చ కిందా మీదా చేస్తే ఏ విషయమూ తెగదు మిత్రమా .జంప్ చేస్తూ పోతే ఏం ఉపయోగం.


Abdul Kareem to sm జంప్ చేయడం లేదు ,సమస్యను విడదీసి చర్చించడం వల్ల తప్పు నిర్ణయాలు వస్తాయి.

మన చర్చ లో ,పియ్యి ఎత్తడం,మోరిలు,రోడ్డు వూ దవడం,ఇంట్లో పని వంట,శుభ్రం చేయడం,...ఇవి ఎలా పోవాలి,లేదా కొన్ని కులాలు,జెండర్ లకే ఎందుకు వుండాలి.

ఇవి పోవాలంటే,సమానత్వం రావాలంటే maarxijam ప్రకారం యాంత్రీకరణ జరగాలి,మనుషులు చేసే పనులు యంత్రాల ద్వారా ,

చేయటం వలన ఆ అమానవీయ వృత్తులు నిర్మూలించ బడుతాయి. ఫ్యూడాల్ కాలం లో ,బానిసలు బుజాల పై మోసే వారు. గుర్రపు బళ్లు,ఆతర్వాత కార్లు మోటార్లు రావడం తో మోసే వృత్తి అంతరించింది.అంటే సామాజిక మార్పు లతో మానవులు శాశ్వత విముక్తి pondutaaru.

ఎంత వాపోయినా,ఏమి చేసినా ఫలితం వుండదు.

పెట్టుబడి దారీ సమాజ ,రాజ్యాంగ పరి ధీ లో

కుల నిర్మూలనా, జెండర్ సమానత అసాధ్యం.


అబ్దుల్ కరీం.

6-6-2022.

Fb లొ. జరిగిన చర్చ .


Comments

Popular posts from this blog

మోజేస్