మారాజు వీరన్న పై fb చర్చలో
మారోజు వీరన్న పై fb చర్చలో
మీరు అంటున్నది పాక్షికం అయినది విప్లవాన్ని ఒక్కడే పక్కదోవ పట్టించ లేదు.
ఆనాడు పార్టీలు లు అన్య వర్గ ప్రభావానికి గురై ధనిక వర్గ ప్రభావంలో చిక్కుకొనీ పార్టీ ఉద్యమం సంక్షోభంలో లో ఉన్నప్పుడు ఏమైందో సరిగా అర్థం కానప్పుడు శ్రామిక జనం నుండి వచ్చిన క్యాడర్ అణచివేతకు గురై నిరాశతో వెనక్కి వెళ్తున్నప్పుడు దానికి కారణం అగ్రకుల నాయకత్వం అని పొరపాటు పడి ఏదో చేయాలని ఒక వైపుకు కొట్టుకుపోయాడు.
సరే మిగతా పార్టీ ,పార్టీలు ఏమైనట్టు ఎందుకు ప్రభావం కోల్పోయినట్లు. మిగతా పార్టీలు ఎదగాలి కదా కానీ అవి ధనిక వర్గ ప్రభావానికి గురై సిద్ధాంతాన్ని అప్డేట్ చేసుకోలేక తమ అన్య వర్గ బలహీనతలను సరి చేసుకో లేక ధనిక వర్గ నాయకత్వం తమ నాయకత్వాన్ని కాపాడుకొనుటలో భాగంగా పార్టీని విప్లవ ఉద్యమాన్ని మరింతగా దిగజార్చి చివరకు మనుగడ కొరకు మరల మారోజు ప్రతిపాదించిన కులం అంబేద్కర్ లను ఆశ్రయించవలసి వచ్చింది ఇది అన్ని పార్టీలకు మావోయిస్టు తో సహా వర్తిస్తుంది.
అసలు ఉద్యమం సన్నగిల్లిన డానికి పక్కదారి పట్టడానికి కారణాలు పార్టీలోని సిద్ధాంతం లోనే ఉన్నాయి. 90లో దాకా ఉన్న విప్లవ విలువను పార్టీలు విప్లవం గా మార్చక పోవడం మూలాన, అప్పుడు ఉన్న అర్థ భూస్వామ్య సమాజం పెట్టుబడిదారి సమాజంలో కి మారిపోయింది.
ఇప్పటికి అన్ని విప్లవ పార్టీలు ఇంకా సమాజం పెట్టుబడిదారీ సమాజం గా మారిన దానికి జీర్ణించుకోలేక ఇంకా దేశం అర్థ భూస్వామ్య మే అనే భ్రమలను అలాగే ఉంచుకుంటున్నారు. కావున న పార్టీలు ప్రజలకు దూరమవుతున్నాయి. దానిని పు డ్చుకొనుటఉకు బహుజన వాదం అంబేద్కరిజం కుల సంఘాలను తప్పని పరిస్థితిలో ఆశ్రయిస్తున్నారు.
అబ్దుల్ కరీం.
2021.
Comments
Post a Comment