ఉన్నత ఉత్పత్తి విధానం అయిన  కమ్యూనిస్ట్ సమాజపు నిమ్నదశ  స్థాపనకు  (lower stage of communism) ఉత్పత్తి శక్తుల   అభివృద్ధి ఒక షరతు. అయితే అభివృద్ధి తగినంతగా జరగకముందే అధికారంలోకి వచ్చి ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేవాళ్లూ , సోషలిజం (?) స్థాపనకూ  ఉత్పత్తి శక్తుల  అభివృద్ధికీ లింక్ లేదనేవాళ్లూ సారాంశంలో ఒకే వాదన  చేస్తున్నారని  అర్థం.



ఈ వ్యాఖ్య సరైందే అయితే రష్యా అక్టోబర్ విప్లవం సరైంది అవుతుందా?




రెండు సరైనవే,కాక పోతే  విప్లవం తర్వాత విప్లవ శక్తుల అభివృద్ధి కోసం ,దానిని రక్షించు కోవటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇవి చరిత్రలో అనివార్య మైనవే.ఇలాంటి అనుభవాలు,గుణపాఠాలు,ఓటములు  లేకుండా  సూటిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనడం సరికాదు. అలా జరగదు కూడా.మార్క్స్ కాలం లో 1849 లో కూడా విప్లవానికి ప్రయత్నించి ఓడిపోయారు, ఆతర్వాత ప్యారిస్ కమ్యూన్  విఫలం .దాని నుండి వచ్చిన గుణపాటం తర్వాత అక్టోబర్ విప్లవం. ఆ తర్వాత ,రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో  సోషలిస్ట్ ప్రభుత్వాలు,చైనా విప్లవం,కొరియా,వియత్నాం........

ఆ తర్వాత క్రమంగా  పెట్టుబడి దారీ దేశాలుగా తిరోగమనం.

ఇప్పుడు ప్రపంచం లో అధిక భాగం లో వుత్పట్టీ శక్తులు బాగా అభవృద్ధి చెంది వున్నాయి.ఆఫ్రికా దేశాలు పేద దేశాలైన కూడా,అక్కడ 

చిన్న తరహా విత్పట్టి  స్వయం సంపూర్ణ అవసరాలను తీర్చలేవు.అక్కడ సామ్రాజ్య వాద దేశాల ఫాంహౌస్ లు,పరిశ్రమలు ఉన్నాయి.వారు ఉపయో గించే కొద్ది పాటి వస్తువులు,ఆహార పదార్థాలు కూడా భారీ పరిశ్రమల, ఫాంహౌస్ ల ద్వారా విత్పట్టీ చేయబడ్డవే.

చరిత్ర ఎల్లపుడూ అనుకున్న  గతితార్కిక పద్దతిలో ముందుకు సాగదు.మార్క్స్ మొదట బాగా పెట్టుబడి దారీ అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్ ,యూరోప్ లో విప్లవ వస్తుంది అనుకున్నారు,కానీ వెనుక బడ్డ రష్యాలో వచ్చింది,లెనిన్ జర్మనీ,ఫ్రాన్స్ లలో విప్లవాలు వచ్చి రష్యా విప్లవం కు దన్నుగా వుంటాయి అనుకున్నాడు కానీ అలా జరగలేదు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో

సోసలిస్ట్ దేశాలు ఏర్పడ్డాయి,కానీ చైనాలో

రష్యా మాదిరి సార్వత్రిక తిరుగుబాటు ద్వారా కాకుండా  దీర్ఘ కాలిక సాయుపోరాటం ద్వారా

విప్లవం వచ్చింది.


పై వాదన లు చేసే వారు  సిద్దాంతం మక్కీకి మక్కీ గా అలానే జరగాలి, అలా జరగలేదు కాబట్టి ఇది తప్పు అంటున్నారు. ఆచరణ లో

ప్రయత్నం చేస్తున్నపుడు మనకు తెలిసిన సిద్ధాంత ప్రకారమే జరగదు, అలానే కాకుండా

ఇంకో విధంగా జరగొచ్చు. అలానే జరుగుతాయి

చరిత్ర అదే రుజువు చేసింది.

ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి ఒక మెరుగైన పద్దతి తీసుకొని ప్రయత్నం చేస్తూ 

ముందుకు వెళ్తాము,కొంత దూరం వెళ్ళాక మార్పులు జరిగితే మరల సరిచేసుకొని ముందుకు వెల్లాసిందే,వేరే మార్గం లేదు.

కాబట్టి పారిస్ కమ్యూన్ కానీ,రష్యా విప్లవం,చైనా  విప్లవం కానీ ,ఇంకా naxalbari  ml పార్టీ లు  ,అలా జరగలేదు 

అనడం సరికాదు.

వచ్చిన అనుభవాన్ని  బట్టి త్వరగా మార్పు చేసుకొని  ముందుకు సాగడమే సరైన ఆచరణాత్మక పద్దతి.


అబ్దుల్ కరీం.

4-4-2022.


Comments

Popular posts from this blog

మోజేస్