Evm వివాదం మార్క్సిస్టు దృక్పథం Evm మిషన్ల గురించి మొదటి నుండి కూడా కొన్ని అనుమానాలు అపోహలు వ్యక్తం అవుతున్నాయి. కానీ మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ ల గురించి ఆరోపణలు ఎక్కువైనాయి. సహజంగా ఓడిపోయిన పార్టీలు అభ్యర్థుల నుండి ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈవీఎంల గురించి అభ్యుదయ వాదులు ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు ఇంకా ముందుకు పోయి mlమరియు మావోయిస్ట్ పార్టీల అనుబంధ సంఘాలు కూడా ఈవీఎంలు పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిపి అధికారపక్షం ఏకపక్షంగా ఎన్నికల లో మెజారిటీ సాధించిందని గగ్గోలు పెడుతున్నారు. ఇంకా పాత కాలపు బ్యాలెట్ విధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు . సాంకేతికంగా దేనినైనా ట్యాంపరింగ్ చేయవచ్చు దీనిలో సందేహం లేదు దేనిలోనైనా లొసుగులు ఉంటాయి. బూర్జువా పార్టీల ముఠాలు ఇలాంటి ఆరోపణలతో తమ ఓటమిని అంగీకరించ వు మరియు ఇలాంటి ఆరోపణల తోనే మరల ఎన్నికలకు సిద్ధం అవుతాయి. అవి అలా సాగుతూనే ఉంటాయి. కానీ ప్రగతిశీల అభ్యుదయ శక్తులు చేస్తున్న ఆరోపణ పై సరైన మార్క్సిస్టు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారపక్షం ఏక పక్షం గా గెలవడం ఈవీఎం ట్యాంపరింగ్ వలన నా ఇంకా సామాజిక అంశం ఏదైనా ఉందా? Telangana లో మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో లో టిఆర్ఎస్ పార్టీ ఏకపక్ష గెలుపును విశ్లేషించే ముందు కొంత చరిత్ర లోనికి పోవలసి ఉంది. దేశంలో స్వాతంత్ర్యం (అధికార మార్పిడి )వచ్చేటప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక ప్రభుత్వంపై కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాటం నడుస్తున్నది. తెలంగాణలో నిజాం రాచరిక నిరంకుశ పాలన, గ్రామాలలో భూస్వామ్య జమీందారీల గడీల పాలన ఉండేది. ఆనాడు రాజకీయ పార్టీలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రవేశించలేదు. ఒకవైపు గ్రామాలలో భూస్వాముల నిజాం రాచరికపాలన ఇంకొకవైపు విశాల గ్రామీణ రైతాంగం ప్రజలు వైపు కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిధ్యం వహించాయి. పటేల్ యాక్షన్ , భారత్లో విలీనం ,కమ్యూనిస్టు సాయుధ పోరాట విరమణ తర్వాత బూర్జువావర్గం , అవశేష భూస్వామ్య వర్గాల లకు కాంగ్రెస్ పార్టీ మరియు పీడిత రైతాంగానికి కమ్యూనిస్టు పార్టీ ఇలా రెండు పార్టీలు మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. ఇదే కొనసాగింపు ఎమర్జెన్సీ వరకు పెట్టుబడి దారి,అవశేష భూస్వామ్య వర్గాల కు కాంగ్రెస్ పార్టీ ,కార్మిక, శ్రామిక, రైతాంగం, పీడిత ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ ఉండగా అవశేష భూస్వామ్య, ధనిక వర్గం నుండి ఎదిగిన బూర్జువా పెట్టి బూర్జువా వర్గాల కొరకు జనతా పార్టీ ఉనికిలోకి వచ్చింది. కమ్యూనిస్ట్పార్టీలో కూడా అవశేష భూస్వామ్య వర్గం తో రాజీపడని ఇంకా కొంత పోరాట పటిమ కొనసాగించే పెట్టీ బూర్జువా ధనిక వర్గం కొరకు సిపిఐ లో చీలిక వచ్చి సిపిఎం ఉనికిలోకి వచ్చింది. తర్వాత సీపీఎం నుండి ధనిక మధ్యతరగతి మేధావి వర్గం రైతాంగానికి శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే క్రియాశీల పోరాట పార్టీగా ఎమ్మెల్ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత నుండి ఎనభై దశకం వరకు ఎమ్మెల్ పార్టీలు రాడికల్స్ పీపుల్స్ వార్ పార్టీలు జరిపిన జగిత్యాల పోరాటం నుండిఅవశేష భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం మూలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లోని భూస్వామ్య అవశేషాలు ధ్వంసం కాబడి దొరలు గ్రామాలనుండి పట్టణాలకు పారిపోవడం మూలంగా గ్రామాలలో మిగిలిన ధనిక మధ్యతరగతి వర్గం పెత్తనం నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. బూర్జువా ,అవశేష భూస్వామ్య వర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం మూలంగా భూస్వామ్యం నుండి విముక్తం కాబడిన గ్రామాలలోని ధనిక మధ్యతరగతి వర్గాలకు మరియు విప్లవోద్యమం వైపుకు రానీ వారికి ఒక కొత్త రాజకీయ పార్టీ రూపంలో లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. బూర్జువా ,అవశేష భూస్వామ్య, ధనిక వర్గాలకు నూతనంగా ఎదిగిన పెట్టీ బూర్జువా ధనిక మధ్యతరగతి వర్గాలకు తెలుగుదేశం స్థిరపడిపోయింది . సిపిఐ సిపిఎం పార్టీలు రోజు రోజుకి తమ పీడిత ప్రజల మద్దతు కోల్పోయి ,ప్రభావం కోల్పోతూ కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, తెలుగుదేశం పార్టీకి సిపిఎం తోకలు గా మారిపోయి దిగజారుతూ వచ్చాయి. జనతా పార్టీ విఫలం తర్వాత దానిలో నుండి జాతీయ స్థాయిలో బీజేపీ వచ్చినప్పటికి తెలంగాణ ఆంధ్ర లో హైదరాబాద్ పట్టణానికి పరిమితం అయిపోయింది. దానికి సామాజిక వర్గ బేస్ లేదు కాబట్టి ఎదగలేదు. 1982 నుండి 2014 వరకు కు అధికారంలో టిడిపి కాంగ్రెస్ లు మారుతుండగా సిపిఐ సిపిఎం లు నిర్వీర్యం అవుతూ పీడితజన పక్షంవైపు ఎమ్మెల్ మరియు మావోయిస్ట్ పార్టీలు ఉనికిలో ఉన్నాయి. తొంభై దశకం వరకు పీడిత ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్ మావోయిస్టు పార్టీ లు క్రమంగా క్షీణించడం రోజురోజుకు ప్రభావం తగ్గిపోయి దండకారణ్యం కు కుదించడం వలన గ్రామాలలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు సన్నగిల్లడం, గ్రామాలలోని నిరుద్యోగ యువతకు , విప్లవ పార్టీల నుండి వెనుదిరిగిన మాజీ లకు రాజకీయ శూన్యత ఏర్పడింది. పర్యవసానంగా గ్రామాల నుండి పట్టణాలకు కు పోయిన భూస్వామ్య వర్గం క్రమంగా పెట్టుబడిదారులుగా ఎదగడం వలన వారు ఇంకా పైకి ఎదగటానికి ఆంధ్ర పెట్టుబడిదారులు అడ్డంకిగా మారడం వలన మరల ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చారు. వీరికి గ్రామాలలోని నిరుద్యోగ యువత విప్లవ మాజీల రిజర్వు మద్దతు వలన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది ఎదుగుతున్న ప్రాంతీయ పెట్టుబడిదారి ,ధనిక పెట్టి బూర్జువా సెక్షన్ లకు టిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది .ఆ విధంగా trs కు సామాజిక వర్గ పునాది ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ సాధన లో విప్లవ శక్తుల బలహీనత వలన రాష్ట్రంలోని ప్రాంతీయ బూర్జువా వర్గం టిఆర్ఎస్ రూపంలో అధికారంలోకి వచ్చింది. క్రమంగా మిగతా పార్టీల లోని బూర్జువా వర్గం వారి ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ అధికార పార్టీలోకి సహజంగా ఆకర్షింపబడ్డారు. బూర్జువా వర్గం లో మూ ఠాలు సమసిపోతూ ఒకే ముఠాగా ఏర్పడి తమ ఎదుగుదల కోసం జాతీయస్థాయిలో విస్తరించడం కోసం టి ఆర్ ఎస్ లో చేరి ఉమ్మడిగా ఉంటేనే సాధ్యం అనే స్థితికి లోకి వచ్చాయి. వామపక్ష సిపిఐ సిపిఎం లలోని కొద్దోగొప్పో మిగిలి ఉన్న బూర్జువా ఎలిమెంట్స్ కూడా క్రమంగా అధికారపక్షం లోకి జారు కున్నాయి. అందుకే ఉనికి కోసం బహుజన వాదం నెత్తుకొని మరింతగా బలహీనపడ్డాయి. ఇంకా ఎమ్మెల్ మావోయిస్టు పార్టీ లు తమ సంస్థ గత బలహీనతలతో సిద్ధాంత బలహీనతలతో ప్రజలకు దూరమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో లో వర్గాల పోలరైజేషన్ మరింతగా జరిగింది. ధనిక ,అవశేష భూస్వామ్య వర్గం నుండి ఎదిగిన ప్రాంతీయ బూర్జువా దాని మిత్ర పక్షమైన ధనిక ఎగువ మధ్యతరగతి ఒక దోపిడీ శిబిరంగా, మరియు ఇంకొక పక్క కార్మిక,అసంఘటిత రంగ కార్మిక, శ్రామిక, రైతు కూలీ పెట్టి బూర్జువానిరుద్యోగులు నిరుపేదలు ఇంకోవైపు పు రెండు శిబిరాలుగా పరస్పర శత్రు శిబిరాలుగా సాంద్రీకరణం చెందుతున్నాయి. దీనిని గుర్తించని విప్లవ పార్టీలు ఇంకా అధికార పార్టీని భూస్వామ్య పార్టీగా ఇంకా గ్రామాలలో అర్ధ భూస్వామ్యం మే ఉందంటూ, దోపిడీ వర్గ పార్టీలలో ముఠాల ఉనికిని గుర్తిస్తూ తప్పుడు రాజకీయ అవగాహనతో ప్రజలకు చేరువ కాకుండా దూరం అవుతున్నాయి. ఇదే అవకాశంగా అధికార బూర్జువా వర్గం రాష్ట్రంలో తమ పెట్టుబడిదారీ సంస్కరణలను అమలు చేస్తూ ఉదాహరణకు భూ రికార్డుల ప్రక్షాళన , క్రమబద్ధీకరణ ,రైతు బంధు పథకం, జలయజ్ఞం ,రైతు బీమా తదితర ప్రజాకర్షక పథకాల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను పటిష్టం చేస్తున్నది. ప్రాంతీయ బూర్జువా వర్గం తమ ఎదుగుదల కోసం జాతీయ బూర్జువా వర్గంతో తమ వాటా కొరకు తలపడుతున్నాయి. శత్రుపూరిత వైరుద్యం స్థాయికి కాకుండా తమని కూడా వారితో కలుపుకునే విధంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కూడా ఉంది. ఇతర రాష్ట్రాలలోని నూతన ప్రాంతీయ బూర్జువా లు తమ తమ వా టాల కోసం సామ్రాజ్యవాద జాతీయ బుర్జ్ వాలతో ఘర్షణకు దిగుతున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. బిజెపి కాంగ్రెస్ రెండు కూడా సామ్రాజ్యవాద జాతీయ పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వే కాబట్టి రెంటికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉనికిలో ఉన్నాయి. ఇలా కొంతకాలం ఘర్శన పడి సర్దుబాటు జరిగి, దేశవ్యాప్త కూటమి ఏర్పడి అది ఒక జాతీయ పార్టీగా ఏర్పడి స్థిర పడే వరకు ప్రాంతీయ పార్టీ ల ఉనికి ఉంటుంది. తర్వాత దశలో దేశవ్యాప్తంగా గా ఒకే పార్టీ తెలంగాణలో లాగా బలంగా ఉనికిలోకి రావచ్చు . ఈ మధ్యకాలంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీలు విప్లవోద్యమాన్ని నిర్మించి బల పడకపోతే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలలో లాగా (అమెరికా బ్రిటన్ ) రెండు బూర్జువా పార్టీల వ్యవస్థ రావచ్చు. కాబట్టి బూర్జువా పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి వారి మీడియా , ఈవీఎంలు ట్యాంపరింగ్ ,రిగ్గింగ్ లాంటి వివాదాలను ప్రచారంలో ఉంచుతాయి. ప్రగతిశీలవాదులు విప్లవ వాదులు ఈ వివాదంలో మునగ కుండా సరైన సామాజిక వర్గ విశ్లేషణతో సరైన మార్గంలో లో తమ అవగాహన ఏర్పరచుకొని మారుతున్న సమాజానికి అనుకూలంగా అనుగుణంగా తమ సిద్ధాంత సంస్థాగత బలహీనతలను సవరించుకుని బూర్జువా వర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గా పీడిత ప్రజల కార్మిక వర్గ పార్టీని ని నిర్మించి సోషలిస్టు విప్లవం ని పూర్తి చేయాలి. దేశంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ శక్తులు మరింతగా( ఫాసిజం) బలపడుతూ కార్మిక శ్రామిక రైతాంగ ప్రజలను మరింతగా దోపిడీ చేస్తూ వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తున్నా యి. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్మిక శ్రామిక ప్రజల పక్షాన ఉన్నటువంటి విప్లవ పార్టీలు తమ విధానాలను అప్డేట్ చేసుకొని ప్రజలకు న్యాయకత్వం వహించి విప్లవాన్ని కొనసాగిస్తాయా లేదా తమ గిడసబారి న పాత విధానాలకే కట్టుబడి బలహీనతలను అధిగమించకుండా ప్రజలకు దూరమై పోయి అనివార్యంగా ఒక నూతన విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ డానికి అవకాశం కల్పిస్తాయా వేచి చూడాలి. Sk. అబ్దుల్ కరీం. 31_3_2019.

Comments

Popular posts from this blog

మోజేస్