నూతన ప్రజాస్వామిక విప్లవం లోఉన్న సౌకర్యాలు
నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఉన్న సౌకర్యాలు ఏమిటి?.
నూతన ప్రజాస్వామ్య విప్లవంలో ఉన్న సౌకర్యం జాతీయ బూర్జువా , చిన్న భూస్వామి, ధనిక వర్గంతో కలిసి ఐక్యసంఘటన పేరుతో కలిసి పోవచ్చు. ఎన్నికల మార్గంలోనీ వారు బూర్జవా పార్టీలతో ఎన్నికల పొత్తు సర్దుబాట్లు చేసుకోవచ్చు, సాయుధ పోరాట వాదులు కూడా జాతీయ బూర్జువా తో ఐక్య సంఘటన పేరుతో కలవవచ్చు, లోపాయి కారి సపోర్ట్ చేయవచ్చు. గత చరిత్ర అంతా అదే.
సోషలిస్ట్ విప్లవంలో శత్రువు పెట్టుబడిదారీ వర్గమే కనుక చిన్న భూస్వామి ధనిక వర్గాలతో ఎలాంటి పొత్తు ఉండదు సరి కదా వారిపై పేదల, రైతు కూలీల పోరాటం ఉంటుంది. జాతీయ బూర్జువా పేరుతో వారితో బేరసారాలు పొత్తులు ఐక్యత ఉండదు.
దీనినీ మభ్యపెట్టడానికి సాయుధ పోరాటమా ఎన్నికల పోరాటమానే డిస్కషన్ ముందుకు నెడుతారు. గత 100 సంవత్సరాలుగా కమ్యూనిస్టులు, 50 సంవత్సరాలుగా నక్సల్ బరి పోరాటవాదులు నూతన ప్రజాస్వామిక విప్లవం చేస్తూనే ఉన్నారు.
ఈ తప్పుడు విధానం ఫలితంగా దేశంలో వునికిలో లేని భూస్వామ్య విధానం మరియు దళారీ బూర్జువా వర్గం తో యుద్ధం చేస్తున్నట్లుగా భావిస్తూ, తమ వర్గ శత్రువులైన పెట్టుబడిదారీ వర్గం తోటే జాతీయ ఐక్య సంఘటన పేరుతో కలిసి పోతున్నారు.
నూతన ప్రజాస్వామిక విప్లవం లోని లొసుగులు వల్ల గ్రామాల్లో పెద్ద భూస్వామి కి వ్యతిరేకంగా చిన్న భూస్వాములు,ధనిక , మధ్యతరగతి ,చిన్న,సన్నకారు ,రైతు కూలీ లు అందరూ కలిసి పోరాటం చేసిఓడిస్తారు. ఆ తర్వాత అసలు విశయం మొదలవుతుంది.
మొదటి పెద్ద భూస్వాములు కు వ్యతరేకంగా పోరాటం లో ముందు నిలబడే ,చిన్న భూస్వామి,ధనిక మధ్యతరగతి వర్గాలు,అంటే వీరు ఎక్కువగా అగ్ర కులాల వారు వుంటారు,వారి చొరవ మూలంగా గ్రామ సంఘాలలో వారు సంఘ నాయకులు కూడా అయ్యారు. క్రింది బహుజన,దళిత పేద శ్రామిక వర్గాలు కు చొరవ కొంత తక్కువ కారణంగా గ్రామ నాయకత్వంలో వుండరు. పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవం సిద్ధాంత పరంగా చిన్న భూస్వామి, ధనిక ,మధ్యతరగతి వర్గాలు ఐక్య సంఘటన లో భాగం కనుక వారిపై గ్రామ బహుజన ,దళిత , పేదలు ప్రశ్నించే అవకాశం వుండదు. పెత్తనం అంతా సంఘం నాయకత్వ ముసుగులో అగ్ర కులాల వారిదే. వారే పార్టీ కి ప్రతినిధులు అయిపోతారు. గ్రామం లో ఇక వర్గ పోరాటం వుండదు,అగ్రకుల సంఘ నాయకత్వంలోని ముఠాలు( అవి పాలోళ్ళ పగలు) రూపం తీసుకొని పార్టీ వ్యతిరేకుల ముద్రలు ,చీలికలు.వీటి నే వర్గ పోరాటం గా చిత్రిక రించారు. బహుజన,దళిత,పేద వర్గాలకు తమ వర్గ పోరాటాలు ఈ చిన్న భూస్వామి, ధనిక వర్గం పై చేయకుండా ముఠాలు తో పోరాటం పై మళ్లించారు. ఈ పెత్తందారీ సంఘనాయకత్వం తో
విసిగిన బహుజన,దళిత పేదలు ,ఎదురు తిరగ లేక అంబేడ్కర్,అస్తిత్వ వాదం వైపు సైలెంట్ గా మారిపోయారు.
బహుజన ,దళిత, చిన్న సన్నకారు, రైతులు,రైతు కూలీలు,వారి పిల్లలు
వ్యవసాయం గిట్టబాటు కాక, ఉపాధి లభించక , దుబాయ్,గల్ఫ్ లకు మరియు సమీప పట్టణాలు కు ,అసంఘటిత రంగంలో
శ్రామికులు గా వలస పోయారు.
ఇక చిన్న భూస్వామి ధనిక మధ్యతరగతి వర్గాలను నమ్ముకున్న పార్టీ లు రోజు రోజుకు సన్నగిల్లి ప్రజలకు దూరం అయ్యారు. ఈ లోగా సిన్సియర్ సంఘ నాయకులను ప్రభుత్వ నిర్బంధంలో చనిపోయారు లేక లొంగిపోయారు. కొందరు నాయకులు క్రమంగా బూర్జువా పార్టీ లు,టీడీపీ,టీఆర్ఎస్........ వైపు వెళ్లారు. మరి కొందరు వారే బూర్జువా పార్టీ ల స్థాయికి దిగజారి పోయారు.
ఇలా మారిన వారు కాల క్రమేణా ,గ్రామీణ బూర్జువాలుగా మారిపోయారు. వీరి పిల్లలు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు,సాప్ట్ వేర్,మెడికల్ , విద్యా రంగాలలో స్థానం సంపాదించి ,అమెరికాలో ఉద్యోగాలు పొంది
బాగా ధనవంతులు అయిపోయారు. ఆ డబ్బుతో గ్రామాల్లో భూములు కొన్నారు.
పట్టణాల్లో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపా రాలు,సారా కాంట్రాక్టులు, రాజకీయ పైరవీలు చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తూవుంటారు. దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొత్తగా పుట్టుకొచ్చే ప్రాంతీయ రాజకీయ పార్టీలకు, అస్తిత్వ ఉద్యమాలకు రెడీమేడ్ నాయకులుగా, పవర్ బ్రోకర్స్ గా ,పారిశ్రామిక భాగస్వాములుగా చేరి పోయారు. దీనినే మావోయిస్ట్ పార్టీ వక్రీకరించి న పెట్టుబడి సంబంధాలు అని అన్నారు.నూతన భూస్వాములు అని మిగతా వారు అంటున్నారు.
ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వీరే ప్రస్తుత కమ్యునిస్ట్,ఎంఎల్,మావోయిస్ట్ పార్టీ లకు పునాది,పార్టీల కు సభ్యులు,సంఘ నాయకులు,సానుభూతి పరులు, వీర విప్లవ సాయుధ పోరాట గళాలు……సర్వస్వం.
వీరినే నూతన భూస్వాములు అని కొత్తగా వాదిస్తున్నారు. మరి ఈ నూతన భూస్వాముల పై సాయుధ పోరాటం చేసి వీరి భూములను పంచుతారా?.
నూతన ప్రజాస్వామిక విప్లవం లో వీరిపై పోరాడి వీరి భూములను పంచే అవకాశం వుందా?.
జవాబు చెప్పరు,దాట వేస్తారు.తమకాల్లని తామే నరుక్కొరు.
దళారీ బూర్జువా గురించి రెండవ భాగం లో.
అబ్దుల్ కరీం
24-6-26
Comments
Post a Comment